న్యూయార్క్ : అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ సంపద 10,500 కోట్ల డాలర్లకు పెరగడంతో బిల్ గేట్స్ సంపదను మించిపోయినట్టయింది. అమెజాన్ షేర్లు 12 నెలల గరిష్టస్ధాయికి పెరగడంతో బెజోస్ నికర సంపద భారీగా ఎగిసింది. దీంతో ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ మార్కెట్ విలువ 57 శాతం పెరిగింది. ఈ ఏడాది అమెజాన్ షేర్లు 6.6 శాతం ఎగిశాయి. అమెరికాలో థ్యాంక్స్‌గివింగ్ డే అనంతరం అయిదు వారాల వ్యవధిలో ఆన్‌లైన్ స్పెండింగ్ మార్కెట్‌లో అమెజాన్ ఏకంగా 89 శాతం మార్కెట్ షేర్‌ను దక్కించుకోవడం గమనార్హం.
బెజోస్ సంపద భారీగా పెరగడంతో 1999లో బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ చేరుకున్న గరిష్ట మార్కెట్ విలువను అధిగమించారు. అయితే బిల్ గేట్స్ తన సంపదలో అధిక భాగాన్ని బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్‌కు ఇవ్వకుంటే ఆయన నికర సంపద 15,000 కోట్ల డాలర్లు దాటేదని నిపుణులు పేర్కొంటున్నారు. 19996 నుంచి గేట్స్ 70 కోట్ల మైక్రోసాఫ్ట్ షేర్లు, 300 కోట్ల డాలర్ల నగదు సహా పలు ఇతర ఆస్తులను బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్‌కు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment