కుబేరుల ‘రియల్’ సంపద..!
న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుల సంపదలో ఐదో వంతు రియల్ ఎస్టేట్‌దే. అలాగే ఆసియా కుబేరుల మొత్తం సంపదలో సింహభాగం రియల్టీదేనని అం తర్జాతీయ రియల్ ఎస్టేట్ సలహా సంస్థ, సావిల్స్ తాజా నివేదిక పేర్కొంది. వెల్త్-ఎక్స్ సంస్థతో కలిసి రూపొందించిన నివేదిక ముఖ్యాంశాలు...,
ప్రపంచంలో 2 లక్షల మంది అపర కుబేరులు (ఆల్ట్రా హైనెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్) తమ సం పదలో ఐదో వంతు రియల్టీలో ఇన్వెస్ట్ చేశారు.
ప్రపంచంలో అపర కుబేరుల మొత్తం సంపద 27,77,000 కోట్ల డాలర్లు. దీంట్లో రియల్టీ ఆస్తులు వాటా 19%(5,32,800 కోట్ల డాలర్లు).
యూరోపియన్ కుబేరులకు అత్యధిక రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నాయి. వారి మొత్తం ఆస్తుల్లో రియల్ ఎస్టేట్ వాటా 31%. ఆ తర్వాతి స్థానంలో 27% వాటాతో ఆసియా కుబేరులు, 26% వాటాతో మధ్య ఆసియా కుబేరులున్నారు.
ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ 180 లక్షల కోట్ల డాలర్లు. దీంట్లో 72%యజమానులే నివసిస్తున్న రెసిడెన్షియల్ ప్రొపర్టీయే. ప్రపంచ జనాభాలో అపర కుబేరుల సంఖ్య 0.003 శాతమే. అయితే ప్రపంచవ్యాప్త రియల్టీలో వీరి వాటా 3%. ఒక్కొక్కరి సగటు రియల్టీ సం పద 2.65 కోట్ల డాలర్లు(సుమారుగా రూ.159 కోట్లు)
2018 నాటికి అపర కుబేరుల సంఖ్య 22% పెరుగుతుంది. ప్రస్తుతం 27.8 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న వీరి సంపద 2018 నాటికి 36 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది.