Pramod
-
‘25 పతకాలు పక్కా’
న్యూఢిల్లీ: పారా షట్లర్ ప్రమోద్ భగత్‌పై సస్పెన్షన్ వేటు పడడం పారిస్ పారాలింపిక్స్‌లో మన అథ్లెట్ల ప్రదర్శనపై ప్రభావం చూపదని భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) అధ్యక్షుడు దేవేంద్ర ఝఝారియా అన్నాడు. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ 25 పతకాలు సాధించగలదని ఝఝారియా ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, యాంటీ డోపింగ్ నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ గత ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత ప్రమోద్‌పై బీడబ్ల్యూఎఫ్ 18 నెలల నిషేధం విధించింది. ‘పారాలింపిక్స్‌లో పతకం తెచ్చేవారి జాబితాలో ప్రమోద్ భగత్ పేరు ముందుండాల్సింది. కానీ అతడిపై నిషేధం పడింది. అయినా విశ్వ క్రీడల్లో మన అథ్లెట్లు 25 పతకాలు సాధించగలరు. పారాలింపిక్స్ చరిత్రలోనే ఈసారి భారత్ నుంచి అత్యధిక మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో మనవాళ్లు 19 పతకాలు సాధించారు. ఇప్పుడు ఆ మార్క్ దాటడంతో పాటు.. పతకాల జాబితాలో టాప్–20లో నిలుస్తాం’ అని ఝఝారియా అన్నాడు. ఈ నెల 28 నుంచి సెపె్టంబర్ 8 వరకు జరగనున్న ‘పారిస్’ పారా క్రీడల్లో భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు 12 క్రీడాంశాల్లో పోటీపడుతున్నారు. ఇప్పటికే భారత అథ్లెట్ల బృందం క్రీడా గ్రామంలో అడుగుపెట్టింది. -
పారాలింపిక్స్‌కు ముందే భారత్‌కు ఎదురుదెబ్బ
భువనేశ్వర్: పారాలింపిక్స్ ప్రారంభం కాకముందే భారత్‌కు గట్టి దెబ్బ తగిలింది. కచ్చితంగా పతకంతో తిరిగి వస్తాడనుకున్న భారత పారా షట్లర్, టోక్యో పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత ప్రమోద్ భగత్‌పై నిషేధం పడింది. డోపింగ్ నియమావళిని ఉల్లంఘించినందుకు ప్రమోద్‌పై 18 నెలలపాటు సస్పెన్షన్ విధిస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మంగళవారం వెల్లడించింది. దీంతో 2020 టోక్యో పారాలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచిన ప్రమోద్.. ఈ నెల 28న ప్రారంభం కానున్న పారిస్ పారాలింపిక్స్‌కు దూరమయ్యాడు. పోటీలు లేని సమయంలో క్రీడాకారులు డోపింగ్ పరీక్షలకు అందుబాటులో ఉండేందుకు తాము ఎక్కడ ఉన్నామనే వివరాలు అందించాల్సి ఉంటుంది. మూడుసార్లు వివరాలు ఇవ్వని పక్షంలో ఆ క్రీడాకారుడిపై చర్యలు తీసుకుంటారు. ఈ విషయంలో ప్రమోద్ విఫలమయ్యాడు. ఏడాది వ్యవధిలో ఎక్కడెక్కడ ఉన్నారనే వివరాలు ప్రమోద్ అందించని కారణంగా అతడిపై బీడబ్ల్యూఎఫ్ సస్పెన్షన్ విధించింది. ‘టోక్యో పారాలింపిక్స్ చాంపియన్ ప్రమోద్ భగత్‌పై ఏడాదిన్నరపాటు సస్పెన్షన్ విధించాం. బీడబ్ల్యూఎఫ్ డోపింగ్ నిరోధక నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నాం. గత 12 నెలల్లో ఎక్కడ ఉన్నాడనే వివరాలు ఇవ్వకపోవడంతోనే నిషేధం విధించాం’ అని బీడబ్ల్యూఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఇది చాలా కఠిన నిర్ణయం. ఎక్కడున్నానో చెప్పడంలో జరిగిన పొరపాటుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత ఏడాదిలో రెండుసార్లు టెస్టుకు అందుబాటులో లేను. మూడోసారి పూర్తి వివరాలు సమర్పించా. అయినా నా అప్పీల్‌ను స్వీకరించలేదు. పారిస్ పారాలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న సమయంలో ఇలాంటి అనూహ్య ఘటన ఎదురవడం చాలా బాధగా ఉంది. గుండె పగిలినట్లయింది. నా బృందం ఎంతో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (సీఏఎస్) నిర్ణయాన్ని గౌరవిస్తున్నా’ అని ప్రమోద్ వివరించాడు. నిషేధం విషయంలో గత నెలలో సీఏఎస్‌లో ప్రమోద్ అప్పీల్ చేసుకోగా.. సీఏఎస్ డోపింగ్ నిరోధక విభాగం దాన్ని తాజాగా తోసిపుచ్చింది. ఈ ఏడాది మార్చి 1 నుంచే ఈ నిషేధం అమల్లోకి రాగా.. వచ్చే ఏడాది సెపె్టంబర్ ఒకటి వరకు కొనసాగనుంది. ఒడిశాకు చెందిన ప్రమోద్ కేంద్రం నుంచి 2021లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌రత్న’... 2022లో ‘పద్మశ్రీ’ అందుకున్నాడు. టోక్యో పారాలింపిక్స్ సింగిల్స్ ఎస్ఎల్ 3 విభాగంలో స్వర్ణం గెలిచిన ప్రమోద్... పారా ప్రపంచ చాంపియన్íÙప్లలో ఐదుసార్లు టైటిల్స్ గెలిచాడు. -
సీఏఎస్ తీర్పు: భారత స్వర్ణ పతక విజేతపై నిషేధం
ప్యారిస్ పారాలింపిక్స్-2024కు ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టోక్యో పారాలింపిక్ స్వర్ణ పతక విజేత, పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రమోద్ భగత్‌పై వేటు పడింది. పద్దెనిమిది నెలల పాటు అతడు ఏ టోర్నీలో పాల్గొనకుండా బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య(BWF) నిషేధం విధించింది.అందుకే వేటు వేశాండోపింగ్ నిరోధక నిబంధనల నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘పన్నెండు నెలల వ్యవధిలో మూడుసార్లు పరీక్షకు రమ్మని ఆదేశించగా.. ప్రమోద్ భగత్ రాలేదు. అంతేకాదు.. ఆ సమయంలో తాను ఎక్కడ ఉన్నాను, ఎందుకు రాలేకపోయాను అన్న వివరాలు చెప్పడంలోనూ విఫలమయ్యాడు.ఈ నేపథ్యంలో మార్చి 1, 2024.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్(CAS) డోపింగ్ నిరోధక డివిజన్.. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ అతడిని సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో SL3 అథ్లెట్ అయిన భగత్.. CASను సంప్రదించి నిషేధం ఎత్తివేయాలని కోరాడు. అయితే, జూలై 29, 2024లో అతడి పిటిషన్‌ను CAS కొట్టివేసింది. మార్చి 1 నాటి డివిజన్ ఇచ్చిన తీర్పును సమర్థించింది’’ అని బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య తన ప్రకటనలో ఈ మేరకు వివరాలు వెల్లడించింది.భారత్‌కు ఎదురుదెబ్బేకాగా శరీరంలోని ఒక పక్క మొత్తం పాక్షికంగా పనిచేయని లేదా కాలి కింది భాగం పనిచేయని.. అంటే వేగంగా నడవలేని, పరుగెత్తలేని స్థితిలో ఉన్న బ్యాడ్మింటన్ ప్లేయర్ SL3 విభాగంలో పోటీపడతారు. ఇక టోక్యో పారాలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ ఫైనల్లో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన డానియెల్ బెథెల్‌ను ఓడించిన 35 ఏళ్ల ప్రమోద్ భగత్ పసిడి పతకం గెలుచుకున్నాడు. అంతేకాదు.. 2015, 2019, 2022లో వరల్డ్ చాంపియన్‌గానూ నిలిచిన ఘనత ఈ బిహారీ పారా అథ్లెట్ సొంతం. ప్యారిస్ పారాలింపిక్స్‌లోనూ కచ్చితంగా స్వర్ణం గెలుస్తాడనే అంచనాలు ఉండగా.. ఇలా 18 నెలల పాటు అతడిపై వేటు పడటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొనగా కేవలం ఆరు పతకాలే వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: Neeraj Chopra: రూ. 52 లక్షల వాచ్!.. కోట్ల ఆస్తి: కష్టపడి పైకొచ్చిన నీరజ్ చోప్రా -
రూ.46 కోట్లు కట్టు! పీజీ విద్యార్థికి ఐటీ నోటీసు
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రమోద్ దండోతియా(25) అనే పీజీ విద్యార్థి ఏకంగా రూ.46 కోట్ల ఆదాయ పన్ను నోటీసు అందుకున్నాడు! దాంతో షాకై పోలీసులను ఆశ్రయించాడు. తన పాన్ కార్డు వివరాల ద్వారా ఎవరో ఢిల్లీ, ఫుణేల్లో తన పేరిట ఓ కంపెనీని సృష్టించి ఈ లావాదేవీలు జరిపినట్లు ఐటీ, జీఎస్టీ అధికారుల ద్వారా తెలిసిందని బాధితుడు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారతనికి సూచించారు. ఐటీ నోటీసులు, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేయాలని ప్రమోద్‌కు చెప్పినట్టు ఏఎస్పీ షియాజ్ తెలిపారు. దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. -
'నా చావుకు ఎవరు కారణం కాదు.. ఈ కారణంగానే నేనిలా..' సూసైడ్‌నోట్ రాసి..
సాక్షి, కరీంనగర్: చేతిలో డబ్బు లేకపోవడం.. చెల్లికి పెళ్లి చేయలేకపోవడంతో మనస్థానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందుర్తి మండలం ఎన్గల్‌లో విషాదం నింపింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. మండలంలోని ఎన్గల్‌కు చెందిన గసికంటి ప్రమోద్(25) ఉపాధి కోసం మూడేళ్ల క్రితం గల్ఫ్ వెళ్లాడు. అక్కడ కంపెనీలో పని సరిగ్గా లేక రెండేళ్ల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. గ్రామంలోనే కూలీ పనిచేసుకుంటున్నాడు. ఆదివారం రాత్రి గ్రామంలో పత్తి లోడు(హమాలీ) పనిచేసి ఇంటికొచ్చాడు. తల్లి సత్తవ్వతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. తెల్లవారుజామున తల్లి లేచి చూసే సరికి ప్రమోద్ ఇంట్లో దూలానికి ఉరివేసుకుని కనిపించాడు. తల్లి రోదనలతో చుట్టుపక్కల వారు వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతిచెంది కనిపించాడు. తన చావుకు ఎవరు కారణం కాదని.. ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోతున్నట్లు సూసైడ్‌నోట్‌లో రాశాడు. ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తండ్రి శంకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు. మృతునికి తల్లి సత్తవ్వ, తండ్రి శంకర్, చెల్లె శ్రావణి ఉన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: ‘నువ్వు లేకుండా ఎలా బతికేది..’ కువైట్‌లో ఘటన..! -
కులం పేరుతో దూషించారు.. ప్రాణహానీ ఉంది: నిర్మాత ఫిర్యాదు
తాను నిర్మిస్తున్న సినిమాను వివిధ కారణాలతో ఆపేందుకు ప్రయత్నించడమే కాకుండా కులం పేరుతో దూషిస్తూ తనను ఆత్మహత్యకు ఉసిగొల్పుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సిసీ దర్శకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఇద్దరు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వివరాలు.. నల్లకుంటలో నివసించే మంచాల ప్రమోద్(27) సినిమాలు నిర్మించేందకు గాను శ్రీనగర్ కాలనీకి వచ్చి సొంత బ్యానర్‌పై ‘కంటోన్మెట్ పోస్టాఫీస్’ పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే నీకు ఎందుకంటూ బాల సతీష్, రాజేష్ చిలువురి అనే ఇద్దరు వ్యక్తులు మానసికంగా వేధిస్తూ తనను సినీ పరిశ్రమ నుంచి దూరం చేసేందుకు యత్నించడమే కాకుండా తన సినిమా నిర్మాణాన్ని ఎలాగైనా ఆపాలని కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. అలాగే తనను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ తనపై దుష్ప్రచారం చేస్తూ ఆత్మహత్యకు కూడా ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. గణపతి కాంప్లెక్స్ వద్ద తనతో పాటు సహాయ దర్శకుడు బి. రవితేజపై కూడా కులం పేరుతో దుషించారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాల సతీష్, రాజేష్ చిలువూరిలపై బంజారాహిల్స్ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భారత పారిశ్రామికవేత్త అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: భారతకుచెందిన వ్యాపారవేత్త, స్టీల్ మాగ్నేట్ లక్ష్మీ మిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మోసం, అధికార దుర్వినియోగం ఆరోపణలతో బోస్నియాలో బుధవారం అరెస్టు చేసినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈశాన్య పట్టణం లుకావాక్‌లో ఒక కోకింగ్ ప్లాంట్ కేసుకు సంబంధించి ప్రమోద్ మిట్టల్‌ను అదుపులోకి తీసుకున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. వ్యవస్థీకృత నేరం, అధికారం దుర్వినియోగం ద్వారా నేరపూరిత చర్యకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు. ప్రమోద్ మిట్టల్‌తోపాటు, కంపెనీ జనరల్ మేనేజర్ పరమేష్ భట్టాచార్య, పర్యవేక్షక బోర్డు సభ్యుడు రజీబ్ డాష్‌ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తుజ్లా కంటోనల్ ప్రాసిక్యూషన్ విభాగం ప్రాసిక్యూటర్ కాజిమ్ సెర్హాట్లిక్ స్థానిక మీడియాకు తెలిపారు. నిర్వహిస్తోంది. దాదాపు వెయ్యిమందికిపైగా ఉద్యోగులుఉన్నారు. నిందితులను కోర్టుముందు హాజరుపర్చనున్నామని చెప్పారు. ఈ కేసులో దోషులుగా తేలితే 45 సంవత్సరాలదాకా జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే నాలుగవ నిందితుడిపై అరెస్ట్ వారంట్ జారీ చేశామన్నారు. అయితే ఈ పరిణామంపై కంపెనీ ప్రతినిధులు ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా బోస్నియాలో అతిపెద్ద ఎగుమతిదారులలో ఒకటి, మెటలర్జికల్ కోక్ ప్రొడ్యూసర్ గ్లోబల్ ఇస్పాత్ కోక్స్నా ఇండస్ట్రిజా లుకావాక్ (జికిల్) నేతృత్వంలోని 2003 నుంచి ప్రమోద్‌మిట్టలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దాదాపు వెయ్యిమందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. -
అంతా పక్కా ప్లాన్..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి నర్సు జీషా షాజిపై ప్రేమోన్మాది ప్రమోద్ పథకం ప్రకారమే దాడి చేశాడని నగర పోలీస్ కమిషనర్ అంజినీ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగానే కేరళ నుంచి యాసిడ్‌ను తీసుకువచ్చి ఆమెపై పోసినట్లు పేర్కొన్నారు. దాడి అనంతరం పారిపోయిన ప్రమోద్ను బంజారాహిల్స్ పోలీసులు కేరళ లోని మావోయిస్టు ప్రాబల్యం ఉన్న మారుమూల ప్రాంతంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ కె.శ్రీనివాసరావులతో కలిసి మంగళవారం తన కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు చెందిన జీషా తరచూ పాలక్కాడ్ జిల్లాలో ఉంటున్న తన అమ్మమ్మ ఇంటికి వెళ్లేది. ఈ నేపథ్యంలో వారి పక్కింట్లో ఉం డే పెయింటర్ ప్రమోద్‌తో ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. వీరి మధ్య పెరిగిన సాన్నిహిత్యాన్ని ప్రేమగా భావించిన అతను గతేడాది ఆమెకు ప్రతిపాదించాడు. దీనిని జీషా సున్నితంగా తిరస్కరించడంతో ఆమెపై కక్షకట్టిన ప్రమోద్ వేధింపులకు దిగాడు. అతడి వ్యవహారశైలి నచ్చని ఆమె అతడి ని పూర్తిగా దూరం పెట్టింది. తనకు సంబంధించిన ఏ వివరాలూ అతడికి తెలియకుండా జాగ్రత్తపడింది. నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన జీషా గత జూలైలో హైదరాబాద్‌కు వచ్చి జూబ్లీహిల్స్ అపో లో ఆస్పత్రిలో హెల్త్ అసిస్టెంట్‌గా చేరింది. కొన్ని రోజల పాటు ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించిన ప్రమోద్ చివరకు ఫేస్బుక్ ద్వారా జీషా ప్రొఫైల్‌ను గుర్తించాడు. తొలుత ‘అబౌట్’ సహా ఇతర వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఫ్రెండ్ అయితే కానీ ఇది సాధ్యం కాదని తేలడంతో నేరుగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆమె దీనిని యాక్సెప్ట్ చేయకపోవడంతో కొత్త పథకం వేశాడు. ఓ యువతి ఫొటోతో నకిలీ పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసి దాని నుంచి రిక్వెస్ట్ పంపాడు. యువతే అన్న భావనతో జీషా అంగీకరించింది. తద్వారా ఆమె హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో పని చేస్తున్నట్లు గుర్తించాడు. ఇక్కడకు వచ్చి మరోసారి ప్రతిపాదించాలని భావించిన అతగాడు ఆమె తిరస్కరిస్తుందని అనుమానించాడు. అలా జరిగితే ఆమెపై దాడి చేయాలనే ఉద్దేశంతో కేరళలోనే యాసిడ్ ఖరీదు చేశాడు. వాటర్ బాటిల్లో యాసిడ్‌ను తీసుకువచ్చిన ప్రమోద్ గత గురువారం ఆపోలో ఆస్పత్రి వద్ద కాపుకాశాడు. సాయంత్రం ఆస్పత్రి నుంచి హాస్టల్‌కు వెళ్తున్న జీషా వద్దకు వెళ్లిన అతను మరోసారి ప్రతిపాదించడంతో పాటు వెంట పడటం ప్రారంభించాడు. తిరస్కరించిన జీషా వెళ్లిపోతుండగా వెనుక నుంచి ఆమెపై యాసిడ్‌తో దాడి చేశాడు. పది శాతం కాలిన గాయాలతో బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దాడి అనంతరం తన సెల్‌ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ చేసుకు న్న ప్రమోద్ కేరళకు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బంజా రాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇన్స్పెక్టర్ కస్తూరి శ్రీనివాస్ నేతృత్వంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కె.రవికుమార్ తదితరులతో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతికంగా ముందుకు వెళ్లిన ఈ టీమ్స్ కేరళలోని పాలక్కాడ్ జిల్లా కేంద్రానికి 80 కిమీ దూరంలో ఉన్న అత్తిపడి వద్ద ప్రమోద్ తలదాచుకున్నట్లు గుర్తించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడి ఆచూకీ తెలుసుకుని పట్టుకున్నారు. ‘ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్స్ యాక్సెప్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగతంగా తెలిసిన వారి అభ్యర్థనలే అంగీకరించాలి. లేదా కొన్ని సందర్భాల్లో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయడానికి ఈ కేసే ప్రత్యక్ష ఉదాహరణ’ అని పోలీసు కమిషనర్ అంజినీ కుమార్ అన్నారు. ‘యాసిడ్ అమ్మకాలు అధీకృతంగానే జరగాలి. పరిచయస్తులు, దుర్వినియోగం చేయరని రూఢీ అయిన వారికే విక్రయించాలి. ఎవరికి పడితే వారికి విక్రయించినప్పుడు జరగరానికి జరిగితే సదరు వ్యాపారులూ నిందితులుగా మారతారు’ అని డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రమోద్ను బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
అపోలో నర్స్పై యాసిడ్ దాడి
హైదరాబాద్: అపోలో ఆస్పత్రి నర్సింగ్ విద్యార్థిని పై ఓ యువకుడు యాసిడ్ దాడి చేసి పరారైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. కేరళలోని ఎర్నాకులంకు చెందిన జీషాషాజీ(22) గత జూలై నుంచి అపోలో నర్సింగ్ స్కూల్లో శిక్షణ పొందుతూ కేర్ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తుంది. ఆమె అపోలో ఆస్పత్రి ఆవరణ లోని నర్స్‌ల వసతి గృహంలో ఉంటుంది. ఆమె గ్రామానికి చెందిన ప్రమోద్(28) అనే యువకుడు గురువారం హాస్టల్‌కు వచ్చి తనతో పాటు తెచ్చుకున్న యాసిడ్‌ను చల్లి పరారయ్యాడు. దీంతో కుడిచేతితోపాటు భుజం వరకు 9 శాతం కాలిపోయింది. వెంటనే ఆమె అపోలో ఆస్పత్రిలో చేరింది. ప్రమోద్‌కు తాను ఇక్కడ ఉన్నట్లు తెలియదని, ఎప్పుడు వచ్చాడో చూడలేదని పేర్కొంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రన్ ప్రభాస్ రన్
సరిగ్గా నాలుగేళ్లు... ఈ నెల 8వ తేదీకి నాలుగేళ్లు! ప్రేక్షకులు ప్రభాస్ ‘మిర్చి’లో ఘాటెంతో చూసి నాలుగేళ్లు గడిచాయి. అప్పట్నుంచీ ఈ ఆరడుగుల అందగాడు తన టైమంతా ‘బాహుబలి’కి రాసిచ్చేశాడు. దాంతో ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించబోయే కొత్త సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా... అని ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. వాళ్ల ఎదురుచూపులకు తెరపడింది. ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించనున్న సినిమా సోమవారం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ప్రభాస్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు క్లాప్ ఇవ్వగా, నిర్మాత ‘దిల్’ రాజు కెమేరా స్విచ్చాన్ చేశారు. 150 కోట్లతో ఈ సినిమాను నిర్మించనున్నారట. దీని తర్వాత వేగంగా సినిమాలు చేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నారట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్, నృత్యాలు: రాజు సుందరం, కెమేరా: మది, సంగీతం: శంకర్–ఎహసాన్–లాయ్. -
బీజేపీ పెద్దలు ఎందుకు నోరు మెదపడంలేదు
-
నెత్తురోడిన రహదారి
గుల్బర్గా జిల్లాలో బోలెరెను ఢీకొన్న ఫ్లైయాష్ ట్యాంకర్ ఏడుగురి దుర్మరణం నిశ్చితార్థానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన నిశ్చితార్థం జరిగిన యువకుడు కూడా దుర్మరణం యాదగిరి : మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన యువకుడు సహా ఏడుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషాద ఘటన గుల్బర్గా జిల్లాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. యాదగిరి పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన దుర్గయ్య తాండూకర్‌కు గుల్బర్గాలో ఓ యువతితో పెళ్లి సంబంధం ఖాయమైంది. ఈక్రమంలో మంగళవారం ఉదయం నిశ్చితార్థకార్యక్రమానికి దుర్గయ్య, మరో ఆరుగురు బోలెరో వాహనంలో గుల్బర్గాకు వెళ్లారు. కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి వస్తుండగా, రాత్రి 7 గంటల సమయంలో గుల్బర్గా జిల్లా చిత్తాపుర తాలూకా కుంబారహళ్లి గ్రామం వద్ద ఎదురుగా వచ్చిన ఫ్లైయాష్ ట్యాంకర్ ఢీకొంది. ప్రమాదంలో బోలెరో డ్రైవర్ శివు హులినాయక్ (24)తో పాటు అందులో ప్రయాణిస్తున్న కాశీనాథ్ తళకు (34), యల్లయ్య పూజారి(25), దుర్గయ్య తాండూర్‌కర్ (25), ప్రమోద్ సుండల్‌కర్ (22), నాగరాజ్ హణవార్ (24), రాజు నక్కల్ (23) అక్కడికక్కడే మృతి చెందారు. గుల్బర్గా ఎస్పీ అమిత్ సింగ్, వాడీ డీఎస్పీ మహేష్ మేఘణ్ణవర్, సీఐ శంకర్‌గౌడ పాటిల్‌కు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను యాదగిరి ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. మృతుల కుటుంబాలను పరామర్శించలేదని ఆందోళన మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి బాబురావ్ చించనసూర్ రాకపోవడాన్ని ఖండిస్తూ బుధవారం స్థానిక అంబేద్కర్ సర్కిల్లో ఆ సమాజ ప్రజలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. మంత్రి నగరంలో ఉండి కూడా బాధితుల కుటుంబాలను పరామర్శించకపోవడం దళితులను అవమానపరచడమేనన్నారు. తక్షణమే మంత్రి క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. నగరసభ సభ్యుడు స్యామసన్ మాళికెరి మాట్లాడుతూ నగరంలో మంత్రి ఉండి కూడా మృతుల కుటుంబాలకు కనీసం సంతాపం కూడా చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తక్షణం బాబురావ్ చించనసూర్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శివయోగి భండారి, మలినాథ సుంగలకర్, మారెప్ప, ప్రభు, సాబణ్ణ, శరణు, సంతోష్ పాల్గొన్నారు. -
సీఎంది రెండు నాల్కల ధోరణి
తిరుపతి అర్బన్ : ఎస్వీ మెడికల్ కాలేజీ పరిధిలోని 300 పడకల గర్భిణుల ఆస్పత్రి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుది రెండు నాల్కల ధోరణిగా ఉందని జూనియర్ డాక్టర్ల సంఘం పీజీ, యూజీ విభాగాల కార్యదర్శి డాక్టర్ గోపీకృష్ణ, డాక్టర్ కార్తీక్, హౌస్ సర్జన్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ ప్రమోద్ ఆరోపిం చారు. ఆస్పత్రి భవనాలను మెటర్నిటీకే కేటాయించాలన్న డిమాండ్‌తో జూ.డా ల సంఘం నాయకులు చేపట్టిన ఆందోళనలు గురువారం 16వ రోజుకు చేరాయి. వీరికి ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, ప్రభుత్వ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ మునీశ్వర్‌రెడ్డితో పాటు ఐఎన్టీయూసీ, మహిళా, సీఐ టీయూ కార్మిక సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జీ వో ప్రతులను, ప్రభుత్వ దిష్టిబొమ్మను రుయా ఆస్పత్రి నుంచి మెడికల్ కాలేజీ సర్కిల్ వరకు ఊరేగింపుగా తీసుకొచ్చా రు. సీఎంకు, వైద్యశాఖ ముఖ్య కార్యదర్శికి, వైద్యవిద్య డెరైక్టర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వివేకానంద విగ్రహం వద్ద దిష్టిబొమ్మ తలను పగులగొట్టారు. చివరగా జీవో ప్రతు లు, దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జూ.డాల సంఘాల నాయకులు మాట్లాడుతూ మొన్నటి రాష్ట్ర విభజనలో లాగా ఆస్పత్రుల అంశంలోనూ చంద్రబాబు నాయుడు రెండునాల్కల ధోరణి అవలంబిస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో తనను కలిసిన జూ.డాల నాయకులతో సమన్యాయం చేస్తామని చెప్పడం దారుణమన్నారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు లేబూరి రత్నకుమార్ ఆధ్వర్యంలో రుయా ఆవరణలో నిరసన కార్యక్రమాలు చేపట్టి జీవో ప్రతులను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది మంది పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య విద్యార్థులు, మెడికోలు 16 రోజులుగా నిర సన చేస్తున్నారన్నారు. అయితే, జిల్లాలోని కార్పొరేట్ వ్యక్తుల ఫంక్షన్లకు వచ్చిన రాష్ట్ర మంత్రులు విద్యార్థుల ఆందోళనల వద్దకు రాకుండా వెళ్లడం చూస్తే వారికి పేదల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన 300 పడకల భవనాలను మెటర్నిటీకే ఉంచాలని డిమాండ్ చేశారు. ఐఎన్టీయూసీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గుంటూరు రాజేశ్వరి, జూ.డాల సంఘం నాయకులు డాక్టర్ హిమజ, డాక్టర్ సత్యవాణి, డాక్టర్ సాయికిరణ్, డాక్టర్ సహజ్, సీఐటీయూ నాయకులు మురళి, పెంచలయ్య, ఎస్ఎఫ్ఐ నాయకులు రవితేజ, సునీల్, నవీన్‌చంద్ర, భరత్, పలువురు మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు. -
భార్య రెండో భర్త హత్య కేసు.. నిందితుడికి యావజ్జీవం
న్యూఢిల్లీ: విడిపోయి అధికారికంగా విడాకులు తీసుకోకుండానే మరో వ్యక్తిని పెళ్లాడిన భార్య రెండవ భర్తను హత్య చేసిన వ్యక్తికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. హర్యానాకు చెందిన ప్రమోద్ 2007లో పూజా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ప్రమోద్ తన పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నాడని అత డిని విడిచి వేరుగా ఉన్న ఆమె అనిల్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో అక్టోబర్ 3, 2008లో అనిల్ కనిపించకుండా పోయాడు. కుమారుడు కనిపించకుండా పోయాడని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు క్రమంలో పోలీసులు అనిల్ మొబైల్ ఫోన్ శోధించగా చివరిసారిగా ప్రమోద్ మాట్లాడినట్లు తెలిసింది. ప్రమోద్ను అరెస్టు చేసి విచారణ చేయగా అనిల్‌ను హత్య చేసినట్లు అంగీకరించాడు. ఈ కేసును విచారణ జరిపిన అదనపు సెషన్స్ జడ్జి ఉమేద్‌సింగ్ గ్రేవాల్ ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా ప్రమోద్ను దోషిగా ప్రకటించి, యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించారు.