ప్రమోద్ (ఫైల్), రోదిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు
సాక్షి, కరీంనగర్: చేతిలో డబ్బు లేకపోవడం.. చెల్లికి పెళ్లి చేయలేకపోవడంతో మనస్థానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందుర్తి మండలం ఎన్గల్‌లో విషాదం నింపింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. మండలంలోని ఎన్గల్‌కు చెందిన గసికంటి ప్రమోద్(25) ఉపాధి కోసం మూడేళ్ల క్రితం గల్ఫ్ వెళ్లాడు. అక్కడ కంపెనీలో పని సరిగ్గా లేక రెండేళ్ల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. గ్రామంలోనే కూలీ పనిచేసుకుంటున్నాడు.
ఆదివారం రాత్రి గ్రామంలో పత్తి లోడు(హమాలీ) పనిచేసి ఇంటికొచ్చాడు. తల్లి సత్తవ్వతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. తెల్లవారుజామున తల్లి లేచి చూసే సరికి ప్రమోద్ ఇంట్లో దూలానికి ఉరివేసుకుని కనిపించాడు. తల్లి రోదనలతో చుట్టుపక్కల వారు వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతిచెంది కనిపించాడు. తన చావుకు ఎవరు కారణం కాదని.. ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోతున్నట్లు సూసైడ్‌నోట్‌లో రాశాడు. ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తండ్రి శంకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు. మృతునికి తల్లి సత్తవ్వ, తండ్రి శంకర్, చెల్లె శ్రావణి ఉన్నారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
ఇవి చదవండి: ‘నువ్వు లేకుండా ఎలా బతికేది..’ కువైట్‌లో ఘటన..!
Comments
Please login to add a commentAdd a comment