
హైదరాబాద్: అపోలో ఆస్పత్రి నర్సింగ్ విద్యార్థిని పై ఓ యువకుడు యాసిడ్ దాడి చేసి పరారైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. కేరళలోని ఎర్నాకులంకు చెందిన జీషాషాజీ(22) గత జూలై నుంచి అపోలో నర్సింగ్ స్కూల్‌లో శిక్షణ పొందుతూ కేర్ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తుంది.
ఆమె అపోలో ఆస్పత్రి ఆవరణ లోని నర్స్‌ల వసతి గృహంలో ఉంటుంది. ఆమె గ్రామానికి చెందిన ప్రమోద్(28) అనే యువకుడు గురువారం హాస్టల్‌కు వచ్చి తనతో పాటు తెచ్చుకున్న యాసిడ్‌ను చల్లి పరారయ్యాడు. దీంతో కుడిచేతితోపాటు భుజం వరకు 9 శాతం కాలిపోయింది. వెంటనే ఆమె అపోలో ఆస్పత్రిలో చేరింది. ప్రమోద్‌కు తాను ఇక్కడ ఉన్నట్లు తెలియదని, ఎప్పుడు వచ్చాడో చూడలేదని పేర్కొంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment