
సీఎంది రెండు నాల్కల ధోరణి
తిరుపతి అర్బన్ : ఎస్వీ మెడికల్ కాలేజీ పరిధిలోని 300 పడకల గర్భిణుల ఆస్పత్రి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుది రెండు నాల్కల ధోరణిగా ఉందని జూనియర్ డాక్టర్ల సంఘం పీజీ, యూజీ విభాగాల కార్యదర్శి డాక్టర్ గోపీకృష్ణ, డాక్టర్ కార్తీక్, హౌస్ సర్జన్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ ప్రమోద్ ఆరోపిం చారు. ఆస్పత్రి భవనాలను మెటర్నిటీకే కేటాయించాలన్న డిమాండ్‌తో జూ.డా ల సంఘం నాయకులు చేపట్టిన ఆందోళనలు గురువారం 16వ రోజుకు చేరాయి.
వీరికి ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, ప్రభుత్వ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ మునీశ్వర్‌రెడ్డితో పాటు ఐఎన్‌టీయూసీ, మహిళా, సీఐ టీయూ కార్మిక సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జీ వో ప్రతులను, ప్రభుత్వ దిష్టిబొమ్మను రుయా ఆస్పత్రి నుంచి మెడికల్ కాలేజీ సర్కిల్ వరకు ఊరేగింపుగా తీసుకొచ్చా రు. సీఎంకు, వైద్యశాఖ ముఖ్య కార్యదర్శికి, వైద్యవిద్య డెరైక్టర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వివేకానంద విగ్రహం వద్ద దిష్టిబొమ్మ తలను పగులగొట్టారు. చివరగా జీవో ప్రతు లు, దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా జూ.డాల సంఘాల నాయకులు మాట్లాడుతూ మొన్నటి రాష్ట్ర విభజనలో లాగా ఆస్పత్రుల అంశంలోనూ చంద్రబాబు నాయుడు రెండునాల్కల ధోరణి అవలంబిస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో తనను కలిసిన జూ.డాల నాయకులతో సమన్యాయం చేస్తామని చెప్పడం దారుణమన్నారు. ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు లేబూరి రత్నకుమార్ ఆధ్వర్యంలో రుయా ఆవరణలో నిరసన కార్యక్రమాలు చేపట్టి జీవో ప్రతులను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది మంది పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య విద్యార్థులు, మెడికోలు 16 రోజులుగా నిర సన చేస్తున్నారన్నారు.
అయితే, జిల్లాలోని కార్పొరేట్ వ్యక్తుల ఫంక్షన్లకు వచ్చిన రాష్ట్ర మంత్రులు విద్యార్థుల ఆందోళనల వద్దకు రాకుండా వెళ్లడం చూస్తే వారికి పేదల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన 300 పడకల భవనాలను మెటర్నిటీకే ఉంచాలని డిమాండ్ చేశారు. ఐఎన్‌టీయూసీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గుంటూరు రాజేశ్వరి, జూ.డాల సంఘం నాయకులు డాక్టర్ హిమజ, డాక్టర్ సత్యవాణి, డాక్టర్ సాయికిరణ్, డాక్టర్ సహజ్, సీఐటీయూ నాయకులు మురళి, పెంచలయ్య, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రవితేజ, సునీల్, నవీన్‌చంద్ర, భరత్, పలువురు మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు.