తిరువనంతపురం: సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసం తెగ పరితపిస్తుంటారు. వినూత్న రీతిలో వీడియోలు పెడుతూ లైకులు, వ్యూస్ చూసుకుని సంబరపడిపోతుంటారు. ఈ మైకంలోపడి ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటారు. ఇలాగే సోషల్ మీడియా పిచ్చి కేరళ యువకులను కటకటాలపాలు చేసింది. ఇంతకూ వారు ఏం చేశారో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..?
ఖాలీగా ఉన్న సమయాన్ని ఏం చేయాలో తెలియని ఐదుగురు యువకులు ట్రెండ్ అయ్యే వీడియో చేయాలనుకున్నారు. అందుకు ఏకంగా పోలీసు స్టేషన్‌నే ఎంచుకున్నారు. తమకు తెలిసిన యానిమేషన్ స్కిల్స్ ఉపయోగించి స్టేషన్‌లో బాంబు పేలుడు సంభవించినట్లు ఓ వీడియో తయారు చేశారు. అంతేకాకుండా సినిమాల్లోని వచ్చే పాపులర్ డైలాగ్‌లను ఉపయోగించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అది కాస్త ఇన్‌స్టా, యూట్యూబ్‌లలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో అది పోలీసుల కంట పడింది.
దర్యాప్తు చేపట్టిన స్థానిక మేలట్టూరు పోలీసులు.. మహ్మద్ రియాజ్(25), మహ్మద్ ఫావేజ్(22), మహ్మద్ జాష్మైన్(19), సాలిమ్ జిషాజియాన్(20), సాల్మానుల్ పారిస్(19)లను నిందితులుగా గుర్తించారు. సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసమే ఇదంతా చేశారని పోలీసులు గుర్తించారు. ఐదుగుర్ని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: విరిగిపడిన కొండచరియలు.. కుప్పకూలిన ఇళ్లు.. వీడియో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment