leads
-
బెడిసికొట్టిన బీజేపీ, బీజేడీ పొత్తు?
ఒడిశాలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), బిజు జనతా దళ్ (బీజేడీ)ల పొత్తు చర్చలు విఫలమయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 147 అసెంబ్లీ, 21 లోక్‌సభ స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించే అవకాశాలున్నాయని బీజేపీ ఒడిశా విభాగం తెలిపింది. ఒడిశాలో ఎన్నికల పొత్తుకు సంబంధించి అధికార బీజేడీతో జరిగిన చర్చలు అసంపూర్తిగా మిగిలాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సామల్ మీడియాకు తెలిపారు. బీజేపీ సీనియర్ నేతలతో పాటు ఢిల్లీకి వెళ్లిన సామల్ రాజధాని భువనేశ్వర్‌కు తిరిగి వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర నేతలతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లాం. ఈ సమావేశంలో ఏ పార్టీతోనూ పొత్తు లేదా సీట్ల పంపకంపై చర్చ జరగలేదు. రాబోయే ఈ రెండు ఎన్నికల్లోనూ ఒడిశాలో బీజేపీ విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం. ఈ రెండు ఎన్నికల్లోనూ బీజేపీ సొంతంగా పోటీ చేస్తుందని’ అన్నారు. బీజేడీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సన్నిహితుడు వీ.కే పాండియన్, ప్రణబ్ ప్రకాష్ దాస్ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. బీజేపీ నాయకత్వంతో మాట్లాడేందుకు వారు దేశ రాజధానికి వెళ్లారు. బీజేడీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పాండియన్, దాస్ హాజరయ్యారు. అయితే ఒడిశాలోని అధికార బీజేడీ, ప్రతిపక్ష బీజేపీల మధ్య సీట్ల పంపకంపై అవగాహన కుదరక చర్చలు నిలిచిపోయాయని సమాచారం. పొత్తుపై ఇరు పార్టీలు పరస్పరం అంగీకరించినా సీట్ల పంపకం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమమవుతున్నాయని తెలుస్తోంది. 147 స్థానాలున్న ఒడిశా అసెంబ్లీలో 100కు పైగా సీట్లలో పోటీ చేసేందుకు బీజేడీ డిమాండ్ చేసింది. ఇది బీజేపీకి ఆమోదయోగ్యం కాలేదు. బీజేడీకి అసెంబ్లీలో 114 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీతో చర్చల సమయంలో తొలుత బీజేడీ 112 సీట్లు డిమాండ్ చేసింది. ‘బీజేడీ దాదాపు 75 శాతం అసెంబ్లీ సీట్లను డిమాండ్ చేస్తోంది. ఇది తమకు ఆమోదయోగ్యం కాదు’ అని బీజేపీ సీనియర్ నేత ఒకరు మీడియాకు తెలిపారు. -
పోలీస్ స్టేషన్ పైనే యువకుల ట్రెండింగ్ వీడియో.. చివరికి..
తిరువనంతపురం: సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసం తెగ పరితపిస్తుంటారు. వినూత్న రీతిలో వీడియోలు పెడుతూ లైకులు, వ్యూస్ చూసుకుని సంబరపడిపోతుంటారు. ఈ మైకంలోపడి ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటారు. ఇలాగే సోషల్ మీడియా పిచ్చి కేరళ యువకులను కటకటాలపాలు చేసింది. ఇంతకూ వారు ఏం చేశారో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..? ఖాలీగా ఉన్న సమయాన్ని ఏం చేయాలో తెలియని ఐదుగురు యువకులు ట్రెండ్ అయ్యే వీడియో చేయాలనుకున్నారు. అందుకు ఏకంగా పోలీసు స్టేషన్‌నే ఎంచుకున్నారు. తమకు తెలిసిన యానిమేషన్ స్కిల్స్ ఉపయోగించి స్టేషన్లో బాంబు పేలుడు సంభవించినట్లు ఓ వీడియో తయారు చేశారు. అంతేకాకుండా సినిమాల్లోని వచ్చే పాపులర్ డైలాగ్‌లను ఉపయోగించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అది కాస్త ఇన్‌స్టా, యూట్యూబ్‌లలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో అది పోలీసుల కంట పడింది. దర్యాప్తు చేపట్టిన స్థానిక మేలట్టూరు పోలీసులు.. మహ్మద్ రియాజ్(25), మహ్మద్ ఫావేజ్(22), మహ్మద్ జాష్మైన్(19), సాలిమ్ జిషాజియాన్(20), సాల్మానుల్ పారిస్(19)లను నిందితులుగా గుర్తించారు. సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసమే ఇదంతా చేశారని పోలీసులు గుర్తించారు. ఐదుగుర్ని అరెస్టు చేశారు. ఇదీ చదవండి: విరిగిపడిన కొండచరియలు.. కుప్పకూలిన ఇళ్లు.. వీడియో వైరల్.. -
Eng Vs IND: 5 వికెట్లతో చెలరేగిన రాబిన్సన్.. వీడియోలు
లీడ్స్: లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పోరాటం ముగిసింది. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్లు ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో భారత్ జట్టుని ఓడించింది. ఓవర్‌నైట్ స్కోరు 215/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 278 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌ని ఇంగ్లండ్ 1-1తో సమం చేసింది. కాగా ఇంగ్లండ్ విజయంలో ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్ కీలక పాత్ర పోషించాడు. టీమిండియా మిడిలార్డర్‌ను కుప్పకూల్చాడు. 5 వికెట్లతో చెలరేగిన రాబిన్సన్ భారత పతనాన్ని శాసించాడు. ఈ సిరీస్‌లో రెండో 5 వికెట్ల హాల్ సాధించాడు. పుజారా వికెట్‌తో కథ మొదలు మ్యాచ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే చతేశ్వర్ పుజారా (91) ఓలి రాబిన్సన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయి శతకం చేజార్చుకున్నాడు. తర్వాత కొద్దిసేపటికే కోహ్లీ ఔట్ అయ్యాడు. ఇక అక్కడినుంచి భారత్ వికెట్ల పతనం మొదలైంది. ఇంగ్లండ్ పేసర్ల ధాటికి ఒక్కరు కూడా క్రీజులో నిలవలేకపోయారు. అజింక్య రహానే (10), రిషబ్ పంత్ (1), మహ్మద్ షమీ (6), ఇషాంత్ శర్మ (2), రవీంద్ర జడేజా (30), మహమ్మద్ సిరాజ్ (0) కనీస పోరాటం చేయకుండా వెనుదిరిగారు. జస్ప్రీత్ బుమ్రా (1) నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో జడేజా (30) కొద్ది సేపు బౌండరీలతో అలరించినా ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్ ఐదు వికెట్లు తీయగా,క్రెయిగ్ ఓవర్టన్ మూడు వికెట్లు తీశాడు. జేమ్స్ అండర్సన్, మొయిన్ అలీ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో మొత్తం 7 వికెట్లు తీసిన రాబిన్సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. లండన్ వేదికగా సెప్టెంబర్ 2 నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. చదవండి: చరిత్ర సృష్టించిన ఆండర్సన్.. ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడు YESSSS Robbo!! Scorecard/Videos: https://t.co/UakxjzUrcE 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/gs7dV73IE3 — England Cricket (@englandcricket) August 28, 2021 COME OOOOON!!! 🦁 Scorecard & Clips: https://t.co/UakxjzUrcE 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/5y1atU7ZhF — England Cricket (@englandcricket) August 28, 2021 The winning moment!! 🙌https://t.co/UakxjzUrcE 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/zHsifDHw7q — England Cricket (@englandcricket) August 28, 2021 For his match haul of 7️⃣ wickets, Ollie Robinson is named Player of the Match 💥#WTC23 | #ENGvIND pic.twitter.com/W2K7AqkX0K — ICC (@ICC) August 28, 2021 A gorgeous delivery from Moeen Ali. #ENGvIND pic.twitter.com/POKvjpxxfc — Wisden (@WisdenCricket) August 28, 2021 -
రోహిత్ శర్మ ఎల్బీపై ఫ్యాన్స్ ఫైర్!
లీడ్స్: లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఔటైన తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రెండో ఇన్నింగ్స్ 48వ ఓవర్లో ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్ బౌలింగ్‌లో బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు రోహిత్ శర్మ ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్‌కి తగలకుండా బంతి నేరుగా వెళ్లి ఫ్యాడ్‌ని తాకింది. వెంటనే ఇంగ్లండ్ టీమ్ ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో ఔటిచ్చాడు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రోహిత్ వెంటనే రివ్యూ తీసుకున్నాడు. రిప్లైలో ఆఫ్ స్టంప్ లైన్‌పై పడిన బంతి లెగ్ స్టంప్‌ని కొద్దిగా తాకుతూ వెళ్లేలా కనిపించింది. దాంతో టీవీ అంపైర్ దానిని అంపైర్స్ కాల్‌గా ప్రకటించాడు. ఫీల్డ్ అంపైర్ తన మునుపటి ఔట్ నిర్ణయానికే కట్టుబడ్డాడు. అంపైర్స్ కాల్ నిర్ణయంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, నియమం ప్రకారం కనీసం 50 శాతం బంతి స్టంప్స్‌ని తాకాలి, కానీ అభిమానులు కేవలం 10-20 శాతం మాత్రమే వికెట్‌ను తాకినట్లు భావిస్తున్నారు. అంపైర్ ఔట్ ఇవ్వకపోయి ఉంటే అది అవుట్ అయ్యేది కాదని .. అంపైర్ కాల్ నియమం వింతగా ఉందని అభిమానులు మండిపడుతున్నారు. ఈ నిర్ణయం పట్ల రోహిత్ అసహనం వ్యక్తం చేస్తూనే మైదానం వీడాడు. తొలి ఇన్నింగ్స్ వైఫల్యాల్ని అధిగమించేందుకు భారత బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదలతో ఆడుతున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ (156 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 59) రాణించగా, చతేశ్వర్ పుజారా(180 బంతుల్లో 15 ఫోర్లతో 91) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. కెప్టెన్ కోహ్లీ (94 బంతుల్లో 6 ఫోర్లతో 45 బ్యాటింగ్) క్రీజులో పాతుకుపోయాడు. ప్రస్తుతం భారత్ ఇంకా 139 పరుగులు వెనుకబడే ఉంది. చదవండి:IND Vs ENG 3rd Test Day 4: అనుకున్నదే జరిగింది.. ఆదిలోనే పుజారా(91) ఔట్ Absolutely ridiculous. Have always believed that DRS has to be decisive, this umpire’s call proves that. Shambolic. #ENGvIND #RohitSharma pic.twitter.com/cmPzrNXPcH — Atharv Warty (@atharvsays) August 27, 2021 -
మ్యాచ్ జరుగుతుండగా విరాట్ కోహ్లి ఫోటో ప్రత్యక్షం
లీడ్స్: సాధారణంగానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అభిమానులు ఎక్కువగానే ఉంటారు. కోహ్లి తన అగ్రెసివ్ ప్రవర్తనతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక మ్యాచ్‌లో ఉన్నాడంటే కోహ్లి చేసే హంగామా మాములుగా ఉండదు. తన హావభావాలతో అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా మూడోటెస్టులో మ్యాచ్ జరుగుతుండగా ఒక అభిమాని తన చేతిలో విరాట్ కోహ్లి పోస్టర్‌ను పట్టుకొని ప్రదర్శించాడు. ఇది చూసిన మిగతా అభిమానులు కూడా ''కోహ్లి.. కోహ్లి'' అని అరుస్తూ అతనికి మద్దతిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: ఇంగ్లండ్ తరపున మూడో బ్యాట్స్‌మన్‌గా.. ఓవరాల్‌గా ఐదో ఆటగాడు ఇక టీమిండియా మూడోటెస్టులో దారుణమైన ఆటతీరు కనబరిచింది. తొలి ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 78 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా ఇంగ్లండ్‌ను ఏ మాత్రం నిలువరించలేకపోయింది. భారత బౌలర్లను ఉతికారేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు రోజుల ఆట ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది. జో రూట్ అద్భుత సెంచరీతో మెరవగా.. డేవిడ్ మలాన్ అర్థ సెంచరీతో రాణించాడు. ఇప్పటికే 345 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. చదవండి: Virat Kohli- James Anderson: రవిశాస్త్రి ఏం జరిగినా పట్టించుకోడు -
ఇంగ్లండ్ తరపున మూడో బ్యాట్స్‌మన్‌గా.. ఓవరాల్‌గా ఐదో ఆటగాడు
లీడ్స్: ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 2021లో అత్యద్భుత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న రూట్ రికార్డులను తిరగరాస్తున్నాడు. 2021లో ఇప్పటి వరకు 11 టెస్టుల్లో 21 ఇన్నింగ్స్‌లు ఆడిన అతను 69.90 సగటుతో 1398 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి. భారత్‌పైనే 875 పరుగులు చేయగా అందులో 4 సెంచరీలు ఉన్నాయి. ఇదే జోరును అతను కొనసాగిస్తే ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగుల మొహమ్మద్ యూసుఫ్ (1788) రికార్డును అతను అధిగమించవచ్చు. ప్రస్తుత సిరీస్‌తో పాటు ఈ ఏడాది ‘యాషెస్’తో కలిపి రూట్ కనీసం మరో ఐదు టెస్టులు ఆడే అవకాశం ఉంది. అతను మరో 391 పరుగులు చేస్తే ఒక క్యాలండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. చదవండి: ఇంగ్లండ్ తరపున మూడో బ్యాట్స్‌మన్‌గా.. ఓవరాల్‌గా ఐదో ఆటగాడిగా ఇక ఇంగ్లండ్ తరపున ఒకే క్యాలండర్ ఇయర్లో ఆరు సెంచరీలు సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా రూట్ నిలిచాడు. ఇంతకముందు వాన్(2002), డెన్నిస్ కాంప్టన్(1947) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక టీమిండియాపై టెస్టుల్లో 8వ సెంచరీ సాధించిన ఐదో ఆటగాడిగా రూట్ నిలిచాడు. ఇంతకముందు గ్యారీ సోబర్స్, వివ్ రిచర్డ్స్, రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్ టీమిండియాపై టెస్టుల్లో ఎనిమిది సెంచరీల మార్క్‌ను అందుకున్నారు. ఇక కెప్టెన్‌గా జో రూట్ టెస్టుల్లో 12 సెంచరీలు సాధించి అలిస్టర్ కుక్ సరసన నిలిచాడు. ఇక హెడింగ్లీ టెస్టుపై ఇంగ్లండ్ పట్టు బిగించింది. తొలి రోజు తమ బౌలింగ్‌తో భారత్‌ను దెబ్బ తీసిన ఆతిథ్య జట్టు రెండో రోజు బ్యాటింగ్ జోరును చూపించింది. ఓపెనర్లు వేసిన బలమైన పునాదిపై వరుసగా మూడో టెస్టులోనూ సారథి రూట్ శతకంతో భారీ స్కోరుకు బాట వేశాడు. దాంతో ఇప్పటికే ఇంగ్లండ్ 345 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ఇలాంటి స్థితిలో భారత్ ఎదురీది ఎంత వరకు ఈ మ్యాచ్‌లో పోరాడగలదో చూడాలి. చదవండి: ఇంగ్లండ్ అభిమానుల ఓవరాక్షన్.. సిరాజ్‌పై బంతితో దాడి -
ENG Vs IND: రెండో విజయమే లక్ష్యంగా కోహ్లి సేన
నాటింగ్‌హామ్, లార్డ్స్... ఈ రెండు వేదికల్లో భారత జట్టే పైచేయి సాధించింది. ఇంగ్లండ్‌ను తొలి టెస్టులో వర్షం గట్టెక్కించినా... రెండో టెస్టులో పరాజయం తప్పలేదు. ముఖ్యంగా భారత పేస్ దళం పదునెక్కి ఉంది. ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌కు వారిసొంత గడ్డపైనే చుక్కలు చూపిస్తోంది. గత టెస్టులో ఆఖరి రోజు అయితే కనీసం 60 ఓవర్లు ఆడనీయలేదు. బ్యాటింగ్‌లో కొంత మెరుగవ్వాల్సివున్నా... బెంగలేదు. ఈ నేపథ్యంలో మూడో టెస్టులో భారతే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. లీడ్స్: ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు ఒక సిరీస్‌లో ఒకే ఒక సారి మాత్రమే రెండు మ్యాచ్‌లు గెలవగలిగింది. ఇప్పుడు దానిని పునరావృతం చేసే అవకాశం జట్టు ముందుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మూడో టెస్టు గెలిస్తే చాలు సిరీస్ చేజారిపోయే పరిస్థితే రాదు. గత రెండు టెస్టుల్లో ఆధిపత్యం దృష్ట్యా కోహ్లి సేనలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అదే జోరుతో మరో విజయంపై భారత్ కన్నేసింది. మరో వైపు ఇంగ్లండ్ సొంతగడ్డపైనే సిరీస్ ఆడుతున్నా జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. ఓపెనింగ్ సమస్య, పేసర్ల గాయాలు, నిలకడ లేని బ్యాటింగ్ రూట్ సేనకు ప్రతికూలంగా మారింది. ఇప్పుడైతే ఈ సిరీస్‌లో నిలబడాలంటే కచి్చతంగా గెలవాల్సిన పరిస్థితిలో నిలిచింది. ఇలాంటి ఒత్తిడిలో జోరు మీదున్న భారత్‌ను ఐదురోజుల పాటు ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి. ఎదురులేని టీమిండియా ఆడుతోంది ఇంగ్లండ్‌లో అయినా... భారత్ ఆటతీరు సొంతగడ్డను తలపిస్తోంది. బహుశా ఎదురే లేని ఈ ప్రదర్శన వల్లేనేమో కోహ్లి జట్టులో మార్పులకు సిద్ధంగా లేడు. ఓపెనింగ్‌లో రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్ బాగానే ఆడుతున్నప్పటికీ భారత సారథి కోహ్లి బ్యాట్ నుంచి భారీ స్కోరు రావాల్సివుంది. వైస్ కెపె్టన్ రహానే కూడా గత మ్యాచ్‌లో అర్ధసెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు కోహ్లి కూడా భారత స్కోరుకు బ్యాట్‌తో జోరు అందిస్తే ప్రత్యర్థి బౌలర్లకు ఇబ్బందులు తప్పవు. పుజారా, రిషభ్ పంత్‌లలో చెప్పుకోదగ్గ వైఫల్యాలైతే లేవు. సీమర్లు షమీ, ఇషాంత్, బుమ్రా, సిరాజ్‌ల గురించి ఎంత చెప్పినా తక్కువే! ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పాలిట సింహస్వప్నాలయ్యారు. పేసర్లపైనే నమ్మకం పెట్టుకోవడంతో సీనియర్ స్పిన్నర్ అశి్వన్ ఈ టెస్టులో కూడా బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇంగ్లండ్ తడబాటు మరోవైపు ఇంగ్లండ్ వరుస వైఫల్యాలతో తడబడుతోంది. ఓపెనింగ్ జోడీ నిరాశ పరచడంతో బర్న్స్‌కు జతగా హసీబ్‌ను దింపుతోంది. డేవిడ్ మలాన్‌కు అవకాశమిచ్చింది. టాపార్డర్ మార్పులతోనైనా పరుగులబాట పట్టాలని ఆశిస్తోంది. బట్లర్, బెయిర్‌స్టో, ఆల్‌రౌండర్ మొయిన్ అలీలు కూడా బ్యాటిం గ్ భారాన్ని మోస్తేనే జట్టు పరిస్థితి మెరుగవుతుంది. పసలేని బౌలింగ్ రూట్ సేనకు కష్టాలను తెచి్చపెడుతోంది. గత టెస్టులో షమీ, బుమ్రా బ్యాటింగ్‌లో అజేయంగా నిలబడిన తీరు వారి బౌలింగ్ లోపాల్ని ఎత్తిచూపుతోంది. అనుభవజు్ఞడైన అండర్సన్, రాబిన్సన్ తమ శక్తి మేరా రాణిస్తేనే పటిష్టమైన భారత బ్యాటింగ్ లైనప్‌ను ఢీకొంటుంది. లేదంటే గత మ్యాచ్ చేదు ఫలితం తప్పకపోవచ్చు. పిచ్–వాతావరణం ఇంగ్లండ్ పిచ్‌లన్నీ సీమర్ ఫ్రెండ్లీ వికెట్లే! అయితే ఇక్కడ మాత్రం పూర్తిగా పేస్కే కాకుండా స్పిన్నర్లకు అవకాశం ఉండొచ్చు. లీడ్స్‌లో వర్షం ముప్పులేదు. దీంతో మ్యాచ్ ఐదు రోజులు అంతరాయాలు లేకుండా సాఫీగా సాగుతుంది. -
మణిపూర్: పుంజుకున్న కాంగ్రెస్
-
మణిపూర్‌లో బీజేపీ చారిత్రక విజయం!
మణిపూర్ : మణిపూర్ లో బీజేపీ కాంగ్రెస్‌ల మధ్య పోటీగా హోరాహోరీగా సాగుతోంది. క్షణక్షణానికి ఈ రెండుపార్టీల మధ్య ఆధిక్యత మారుతూ వస్తోంది. అయితే రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని బిజెపి ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ వ్యక్తం చేశారు. ఇక్కడ బీజేపీకి చారిత్రాత్మక విజయం ఖాయమని ధీమాను ప్రదర్శించారు.2 012 ఎన్నికల్లో ఏ సీటును గెలుకోలేకపోయినప్పటికీ ప్రస్తుతం తాము మెజార్టీ సాధిస్తామన్నారు. మరోవైపు తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి ఉక్కు మహిళ ఇరోం షర్మల ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్ పై తోబల్ నియోజక వర్గంలో మొదట స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించినా ఆ తర్వాత వెనకంజలో ఉన్నారు. అటు మణిపూర్ ఉప ముఖ్యమంత్రి గైఖంగమ్ ఆధిక్యత కొనసాగుతోంద. కాగా మణిపూర్ లో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు పోలింగ్ జరిగింది. శనివారం మొదలైన ఓట్ల లెక్కింపు సాగుతున్న అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్ విధించివ పరిస్థితిన ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారు.ఈ రాష్ట్రంలో 31 స్థానాల్లో చేజిక్కించుకున్న పార్టీయే అధికారం చేజిక్కించుకుంటుంది. -
కోల్‌కతలో మమతా బెనర్జీ నయకత్వంలో ర్యాలీ
-
తణుకు ఆస్పత్రిలో బాలింత మృతి
-
‘వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం’
జిన్నారం: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలో, దేశంలో అధికారంలోకి రావటం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం బొల్లారం గ్రామంలో ‘హమ్ మే హై రాజీవ్’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. దివంగత రాజీవ్‌గాంధీతోనే యువతకు పార్టీలో ప్రాతినిధ్యం లభించిందని గుర్తుచేశారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడుల్‌రెడ్డి, నాయకులు నరేశ్, లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, మహేశ్ యాదవ్ తదితరులున్నారు. -
పంటి నొప్పితో అంత ప్రమాదమా?
నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందని పెద్దలు ఎందుకనేవారో తెలియదు కానీ... నోరు శుభ్రంగా ఉంచుకోపోతే అనారోగ్యాలు మాత్రం తప్పవని ఓ పళ్ళ డాక్టర్ చెప్పిన విషయం ఇప్పుడు 26 ఏళ్ళ మాలా విషయంలో నిజమైంది. పంటినొప్పే కదాని నొప్పి మాత్రలతో సొంతవైద్యం చేసుకొని ప్రాణాలమీదకి తెచ్చుకున్న మాలా... ఆహారం, నీరు సైతం తీసుకోలేని స్థితిలో చివరికి ఐసీయూ లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రిమియర్ బి స్కూల్ ఉద్యోగిగా, జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్న మాలా... ఓ సాధారణ పంటినొప్పి అన్ని అవయవాలకు ప్రమాదం తెస్తుందని (మల్టీ ఆర్గాన్ డిస్ ఫంక్షన్) ఎప్పుడూ ఊహించలేదు. మూడుసార్లు తేలికపాటి కార్డియాక్ అటాక్ లను ఎదుర్కొని, రెండునెల్లపాటు ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉన్న ఆమె... ఎట్టకేలకు చివరికి ప్రాణాలతో బయటపడింది. చిన్నపాటి పంటినొప్పితోపాటు కుడి దవడ వాపుతో ప్రారంభమైన మాలా అనారోగ్యం అశ్రద్ధ కారణంగా ప్రాణాలమీదికి వచ్చింది. నొప్పిమాత్రలతో సమస్య తగ్గకపోగా దవడ వాపు చివరికి గొంతు పూడుకుపోయే పరిస్థితికి చేరింది. రోజురోజుకూ నీరసపడిపోయి, నొప్పిని కూడా తట్టుకోలేని స్థాయికి చేరడంతో ఆమె తల్లి మాలాను ఆస్పత్రిలో చేర్పించింది. పంటితో మొదలైన ఇన్ఫెక్షన్ అన్ని అవయవాలకు పాకిపోయిందని, చివరికి మల్టీ ఆర్గాన్ డిస్ ఫంక్షన్ సిండ్రోమ్ తో ఆమె బాధపడుతున్నట్లు డాక్టర్లు వైద్య పరీక్షలద్వారా తేల్చారు. సిండ్రోమ్ కారణంగా మాలా తీవ్రమైన జ్వరం, లో బీపీ తో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిందని ఆమెకు వ్యైద్యం నిర్వహించిన ఆస్పత్రి కంన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్, ఫోర్టిస్ డాక్టర్ సుధా మెనన్ తెలిపారు. మొదట్లో మాలా డెంగ్యూతో బాధపడుతోందనుకున్నామని, న్యుమోనియాకు గురవ్వడం వల్ల వెంటిలేటర్ పై ఉంచాల్సి వచ్చిందని, ఐసీయు సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తమై చికిత్స నిర్వహించడంతో మాలా చివరికి కోలుకోగలిగినట్లు మెనన్ తెలిపారు. ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియా చేరి... గుండె, తల, మెడ భాగాల్లో వ్యాప్తి చెందడంతో మాలా తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఆమెకు సంక్రమించిన సిండ్రోమ్ వల్ల కనీసం గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది ఎదురైందని, శస్త్ర చికిత్సతో ట్రాకోస్టమీ ట్యూబ్ ద్వారా ఇన్ఫెక్షన్ ను బయటకు తీసినట్లు వైద్యులు తెలిపారు. బ్యాక్టీరియావల్ల ఇతర నాళాలు కూడ బ్లాక్ అవ్వడం, ఇన్ఫెక్షన్ బ్లాక్స్ చిన్న చిన్న ముక్కలై ఊపిరితిత్తుల్లోకి ప్రయాణించే పల్మనరీ ఆర్టరీ నాళాలు మూసుకుపోవడంతో మాలా తీవ్ర ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఊపిరి తీసుకోలేకపోవడం, గుండెనొప్పి, తీవ్ర నిమోనియా సంక్రమించి ఇతర భాగాలకు వ్యాపించడంతో మాలా ఉన్నట్లుండి 20 కేజీల బరువుకూడా తగ్గిపోయింది. వైద్యుల అప్రమత్తతో ఎట్టకేలకు ప్రాణాపాయం నుంచీ బయటపడిన మాలా... చిన్న చిన్న నొప్పులు, కావిటీలేకదాని అశ్రద్ధ చేయొద్దని, నోటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు, అప్రమత్తంగా ఉండటం కూడ ఎంతో అవసరం అని చెప్తోంది. పంటినొప్పి ప్రమాదాలకు దారితీస్తుందనడానికి తానే పెద్ద ఉదాహరణ అని, గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకోవద్దని సూచిస్తోంది. -
ఐస్ క్రీమ్ కోసం పెళ్ళి కాన్సిల్!
మథురః పెళ్ళిలో కట్నకానుకలు అడిగినంత ఇవ్వలేదనో, మర్యాదలు సరిగా చేయలేదనో పెళ్ళికొడుకు, అత్తింటివారు అలగడం చూస్తాం. ఒక్కోసారి కట్నం కోసం పెళ్ళిళ్ళు కాన్సిల్ అయిపోవడం చూస్తాం. కానీ అక్కడ మాత్రం కేవలం ఐస్ క్రీం... పెళ్ళి క్యాన్సిల్ అవ్వడానికి కారణమైంది. ఐస్ క్రీమ్ కోసం వచ్చిన గొడవ చినికి చినికి గాలివానగా మారింది. అడ్డొచ్చిన పోలీసులనూ తీవ్రంగా గాయపడేలా చేసింది. చివరికి పెళ్ళి.. పీటలమీదే ఆగిపోయేలా చేసింది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన మధుర, మహేష్ నగర్ లో జరిగిన ఘటన.. అందర్నీ ఆశ్చర్య పరిచింది. పెళ్ళి వేడుకలో భాగంగా నిర్వహించే జయమాలా కార్యక్రమంలో పెళ్ళికొడుకు తరపున వచ్చిన కొందరు బంధువులు ఐస్ క్రీమ్ అడిగినంత ఇవ్వలేదని గొడవకు దిగారు. దీంతో అక్కడి పరిస్థితి రణరంగంగా మారింది. అడ్డొచ్చిన పోలీసులపై వధువు తరపు మహిళలతో సహా రాళ్ళు రువ్వారు. అక్కడినుంచీ వారిని తరిమి కొట్టారు. రోడ్లు కూడ దిగ్బంధనం చేశారు. గొడవలో ముగ్గురు పోలీసులు కూడ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ప్రత్యేక ఫోర్స్ తో వచ్చిన పోలీసులు రాయసదాబాద్ రోడ్డును క్లియర్ చేసి, అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటన అనంతరం ఇరు వర్గాల వారిపై ఎఫ్ ఐ ఆర్ బుక్ చేసినట్లు పోలీసులు తెలిపారురు. వరుడి తరపు బంధువుల ఫిర్యాదుతో గొడవకు కారణమైన ఏడుగుర్ని అరెస్టు చేసిన్నట్లు స్థానిక ఎస్పీ.. అరుణ్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఐస్ క్రీమ్ కోసం ఇరు కుటుంబాల మధ్య వచ్చిన గొడవతో చివరికి వివాహాన్ని రద్దు చేసుకున్న మగపెళ్ళివారు... అక్కడినుంచీ వెళ్ళిపోయారు. -
రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి అధిక్యం
-
చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ - బీజేపి మధ్య హొరాహొరీ