మణిపూర్‌లో బీజేపీ చారిత్రక విజయం!
మణిపూర్ : మణిపూర్ లో బీజేపీ కాంగ్రెస్‌ల మధ్య పోటీగా హోరాహోరీగా సాగుతోంది. క్షణక్షణానికి ఈ రెండుపార్టీల మధ్య ఆధిక్యత మారుతూ వస్తోంది. అయితే రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని బిజెపి ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ వ్యక్తం చేశారు. ఇక్కడ బీజేపీకి చారిత్రాత్మక విజయం ఖాయమని ధీమాను ప్రదర్శించారు.2 012 ఎన్నికల్లో ఏ సీటును గెలుకోలేకపోయినప్పటికీ ప్రస్తుతం తాము మెజార్టీ సాధిస్తామన్నారు.
మరోవైపు తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి ఉక్కు మహిళ ఇరోం షర్మల ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్ పై తోబల్ నియోజక వర్గంలో మొదట స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించినా ఆ తర్వాత వెనకంజలో ఉన్నారు. అటు మణిపూర్ ఉప ముఖ్యమంత్రి గైఖంగమ్ ఆధిక్యత కొనసాగుతోంద.
కాగా మణిపూర్ లో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు పోలింగ్ జరిగింది. శనివారం మొదలైన ఓట్ల లెక్కింపు సాగుతున్న అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్ విధించివ పరిస్థితిన ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారు.ఈ రాష్ట్రంలో 31 స్థానాల్లో చేజిక్కించుకున్న పార్టీయే అధికారం చేజిక్కించుకుంటుంది.