ఉక్కు మహిళకు తప్పని ఓటమి
మణిపూర్: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్ అఖండ విజయం సాధించారు. ప్రత్యర్థి ఇరోం షర్మిలపై భారీ మెజార్టీ తో ఆయన విజయం సాధించారు. అయితే సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల్లో పోటీచేసిన ఆమెకు ఓటమి తప్పలేదు. ఈ శాసనసభ ఎన్నికల్లో పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్ పేరుతో బరిలోకి దిగారు. ముఖ్యమంత్రి వ్యతిరేకంగా తోబల్ నియోజక వర్గం నుంచి పోటీచేశారు.
మరో వైపు 2012 ఎన్నికల్లో విఫలమైనప్పటికీ ఈ సారి బీజేపీ మణిపూర్‌లో చారిత్రక విజయం సాధిస్తుందని బీజీపే ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సంగతి తెలిసిందే. కాగా ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం మణిపూర్ లో కాంగ్రెస్ పుంజుకుంది. బీజేపీ కన్నా స్వల్ప ఆధిక్యలో కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ 12 స్థానాల్లో, బీజేపీ 11 స్థానాల్లో ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.