Assembly election 2017
-
హోరా హోరీ: వెనుకంజలో ఓబీసీ నేత
సాక్షి, అహ్మదాబాద్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల సరళి తీవ్ర ఉత్కంఠను రాజేస్తోంది. రెండు రాష్ట్రాల్లో బీజేపీ దూసుకుపోతోంది. ముఖ్యంగా గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన ఆధిక్యతను ప్రదిర్శిస్తోంది. ప్రారంభంలో హోరా హోరీగా సాగిన ఫలితాల సరళి క్రమంగా బీజేపీకి సానుకూలంగా మారింది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ తన ఆధిపత్యాన్నికొనసాగిస్తోంది. మొత్తం 182 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 92 స్థానాలు. కాగా బీజేపీ 60 స్థానాల్లో, కాంగ్రెస్ 36 స్థానాల్లో ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతోంది. మరోవైపు దళిత, ఓబీసీ నేతలు వెనకంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ముందు అందిన సమాచారం ప్రకారం దళిత నేత జిగ్నేష్ మేవాని, ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్ వెనుకంజలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మేవాని ఆధిక్యంలోకి వచ్చారు. అటు ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న హిమాచల్ ప్రదేశ్‌లో కూడా బీజేపీ దూసుకుపోతోంది. -
హిమాచల్‌లో ‘హస్తం’ డీలా!
న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారం కోల్పోనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలో ఉన్న హిమాచల్‌లో బీజేపీ విజయబావుటా ఎగరవేయనుందని తేల్చాయి. 68 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 9న జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు మొగ్గుచూపినట్టు తెలిపాయి. బీజేపీకి 50 శాతం, కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్లు వచ్చే అవకాశముందని పేర్కొన్నాయి. ఇతరులు 9 శాతం ఓట్లు దక్కించుకోనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన 35 సీట్లు కంటే ఎక్కువగానే కషాయం పార్టీ కైవసం చేసుకుంటుందని ఖరారు చేశాయి. బీజేపీకి 47 నుంచి 55 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. 13 నుంచి 20 స్థానాలతో అధికార కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదని ఇండియా టుడే-యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే మంచి జరుగుతుందన్న భావన హిమచల్ ప్రజల్లో వ్యక్తమైంది. రాష్ట్రంలో 50 శాతంపైగా ఉన్న బ్రాహ్మణులు, క్షత్రియులు, రాజ్‌పుత్, భనియాలు బీజేపీ వైపు మొగ్గుచూపినట్టు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. మధ్యతరగతి వర్గం బీజేపీకి కొమ్ముకాయగా, పేదలు కాంగ్రెస్ పక్షం వహించారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, వృత్తిదారులు, శ్రామికుల్లో ఎక్కువ మంది కమలం పార్టీకి ఓట్లు వేశారు. పట్టణ, గ్రామీణ ఓటర్లు కూడా బీజేపీకే మద్దతు ప్రకటించారు. ఈ నెల 18న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
గుజరాత్లో ముగిసిన తొలి విడత పోలింగ్
-
ఉక్కు మహిళకు తప్పని ఓటమి
మణిపూర్: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్ అఖండ విజయం సాధించారు. ప్రత్యర్థి ఇరోం షర్మిలపై భారీ మెజార్టీ తో ఆయన విజయం సాధించారు. అయితే సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల్లో పోటీచేసిన ఆమెకు ఓటమి తప్పలేదు. ఈ శాసనసభ ఎన్నికల్లో పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్ పేరుతో బరిలోకి దిగారు. ముఖ్యమంత్రి వ్యతిరేకంగా తోబల్ నియోజక వర్గం నుంచి పోటీచేశారు. మరో వైపు 2012 ఎన్నికల్లో విఫలమైనప్పటికీ ఈ సారి బీజేపీ మణిపూర్‌లో చారిత్రక విజయం సాధిస్తుందని బీజీపే ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సంగతి తెలిసిందే. కాగా ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం మణిపూర్ లో కాంగ్రెస్ పుంజుకుంది. బీజేపీ కన్నా స్వల్ప ఆధిక్యలో కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ 12 స్థానాల్లో, బీజేపీ 11 స్థానాల్లో ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. -
మణిపూర్‌లో బీజేపీ చారిత్రక విజయం!
మణిపూర్ : మణిపూర్ లో బీజేపీ కాంగ్రెస్‌ల మధ్య పోటీగా హోరాహోరీగా సాగుతోంది. క్షణక్షణానికి ఈ రెండుపార్టీల మధ్య ఆధిక్యత మారుతూ వస్తోంది. అయితే రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని బిజెపి ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ వ్యక్తం చేశారు. ఇక్కడ బీజేపీకి చారిత్రాత్మక విజయం ఖాయమని ధీమాను ప్రదర్శించారు.2 012 ఎన్నికల్లో ఏ సీటును గెలుకోలేకపోయినప్పటికీ ప్రస్తుతం తాము మెజార్టీ సాధిస్తామన్నారు. మరోవైపు తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి ఉక్కు మహిళ ఇరోం షర్మల ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్ పై తోబల్ నియోజక వర్గంలో మొదట స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించినా ఆ తర్వాత వెనకంజలో ఉన్నారు. అటు మణిపూర్ ఉప ముఖ్యమంత్రి గైఖంగమ్ ఆధిక్యత కొనసాగుతోంద. కాగా మణిపూర్ లో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు పోలింగ్ జరిగింది. శనివారం మొదలైన ఓట్ల లెక్కింపు సాగుతున్న అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్ విధించివ పరిస్థితిన ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారు.ఈ రాష్ట్రంలో 31 స్థానాల్లో చేజిక్కించుకున్న పార్టీయే అధికారం చేజిక్కించుకుంటుంది. -
యూపీలో బీజేపీ కాదు.. ఆ పార్టీకి మెజారిటీ?
భిన్నమైన ఫలితాలను ప్రకటించిన ఓపినియన్ పోల్స్ బీజేపీకి ఇండియా టుడే సర్వే.. ఎస్పీకి ఏబీపీ న్యూస్ సర్వే మెజారిటీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వెలువడిన ఒపీనియన్ పోల్స్ ఫలితాలు నిట్టనిలువునా చీలిపోయాయి. రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి సంపూర్ణమైన మెజారిటీ వస్తుందని ఇండియా టుడే-యాక్సిస్ సర్వే అంచనా వేయగా.. ఈ అంచనాతో ఏబీపీ న్యూస్-లోక్‌నీత్-సీఎస్డీఎస్ సర్వే విభేదించింది. యూపీలో పోటీ హోరాహోరీగా ఉంటుందని, ఎస్పీకి మెజారిటీ స్థానాలు రావొచ్చునని పేర్కొంది. ఫిబ్రవరి 11 నుంచి ఏడు దశలుగా ఎన్నికలు జరగనున్న యూపీ (403)లో బీజేపీ 206 నుంచి 216 అసెంబ్లీ స్థానాలు గెలుపొందుతుందని ఇండియా టుడే-యాక్సిస్ సర్వే అంచనా వేసింది. కుటుంబ పోరుతో సతమతమవుతున్న ఎస్పీకి 92-97 స్థానాలు, బీఎస్పీకి 79-85 స్థానాలు రావొచ్చునని పేర్కొంది. కాంగ్రెస్ 5-9 నుంచి స్థానాలతో సరిపెట్టుకుంటుందని తెలిపింది. పెద్దనోట్ల రద్దుకు ముందు బీజేపీకి యూపీలో 31శాతం ఓట్లు వచ్చే అవకాశముండగా.. నోట్లరద్దుతో మరింతగా కలిసివచ్చిందని, ఆ పార్టీకి వచ్చే ఓటుషేర్ డిసెంబర్లో 33శాతం పెరిగిందని ఈ సర్వే పేర్కొంది. ఇక ఏబీపీ న్యూస్-లోక్‌నీత్-సీఎస్డీఎస్ సర్వే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ- ఎస్పీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని అంచనా వేసింది. అయితే, అధికార పార్టీ ఎస్పీకి ఎక్కువ సీట్లు రావొచ్చునని పేర్కొంది. ఎస్పీకి 141-151 సీట్లు, బీజేపీకి 129-139 సీట్లు, బీఎస్పీకి 93-103 సీట్లు, కాంగ్రెస్‌కు 13-9 సీట్లు రావొచ్చునని పేర్కొంది. ఇక పంజాబ్ విషయంలోనూ సర్వేల ఫలితాల్లో పోలిక లేదు. ఏబీపీ న్యూస్-లోక్‌నీత్-సీఎస్డీఎస్ సర్వే పంజాబ్‌లో అధికార శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ)-బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహారీ ఉంటుందని, ఎస్ఏడీ-బీజేపీ మిత్రపక్షాలకు 50-58 సీట్లు, కాంగ్రెస్‌కు 41-49 సీట్లు రావొచ్చునని పేర్కొంది. ఆప్ 12-18 సీట్లు గెలుచుకోవచ్చునని పేర్కొంది. అయితే ఇండియా టుడే యాక్సిస్ సర్వే మాత్రం కాంగ్రెస్-ఆప్ మధ్య పోటీ ఉంటుందని, కాంగ్రెస్‌కు 49-55 సీట్లు, ఆప్‌కు 42-46 సీట్లు వస్తాయని, ఎస్ఏడీ-బీజేపీకి 17-21 సీట్లు వచ్చే అవకాశముందని పేర్కొంది. ఇక ఉత్తరాఖండ్‌లోని 70 స్థానాలలో బీజేపీ 35-45 స్థానాలతో అధికారంలోకి రావొచ్చునని, అధికార కాంగ్రెస్‌కు 22-30 సీట్లు వస్తాయని పేర్కొంది.