న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారం కోల్పోనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలో ఉన్న హిమాచల్‌లో బీజేపీ విజయబావుటా ఎగరవేయనుందని తేల్చాయి. 68 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 9న జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు మొగ్గుచూపినట్టు తెలిపాయి. బీజేపీకి 50 శాతం, కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్లు వచ్చే అవకాశముందని పేర్కొన్నాయి. ఇతరులు 9 శాతం ఓట్లు దక్కించుకోనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన 35 సీట్లు కంటే ఎక్కువగానే కషాయం పార్టీ కైవసం చేసుకుంటుందని ఖరారు చేశాయి. బీజేపీకి 47 నుంచి 55 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. 13 నుంచి 20 స్థానాలతో అధికార కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదని ఇండియా టుడే-యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే మంచి జరుగుతుందన్న భావన హిమచల్ ప్రజల్లో వ్యక్తమైంది. రాష్ట్రంలో 50 శాతంపైగా ఉన్న బ్రాహ్మణులు, క్షత్రియులు, రాజ్‌పుత్, భనియాలు బీజేపీ వైపు మొగ్గుచూపినట్టు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. మధ్యతరగతి వర్గం బీజేపీకి కొమ్ముకాయగా, పేదలు కాంగ్రెస్ పక్షం వహించారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, వృత్తిదారులు, శ్రామికుల్లో ఎక్కువ మంది కమలం పార్టీకి ఓట్లు వేశారు. పట్టణ, గ్రామీణ ఓటర్లు కూడా బీజేపీకే మద్దతు ప్రకటించారు. ఈ నెల 18న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment