సాక్షి, అహ్మదాబాద్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల సరళి తీవ్ర ఉత‍్కంఠను రాజేస్తోంది. రెండు రాష్ట్రాల్లో బీజేపీ దూసుకుపోతోంది. ముఖ్యంగా గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన ఆధిక్యతను ప్రదిర్శిస్తోంది. ప్రారంభంలో హోరా హోరీగా సాగిన ఫలితాల సరళి క్రమంగా బీజేపీకి సానుకూలంగా మారింది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ తన ఆధిపత్యాన్నికొనసాగిస్తోంది. మొత్తం 182 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 92 స్థానాలు. కాగా బీజేపీ 60 స్థానాల్లో, కాంగ్రెస్ 36 స్థానాల్లో ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతోంది.
మరోవైపు దళిత, ఓబీసీ నేతలు వెనకంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ముందు అందిన సమాచారం ప్రకారం దళిత నేత జిగ్నేష్ మేవాని, ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్ వెనుకంజలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మేవాని ఆధిక్యంలోకి వచ్చారు.
అటు ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న హిమాచల్ ప్రదేశ్‌లో కూడా బీజేపీ దూసుకుపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment