యూపీలో బీజేపీ కాదు.. ఆ పార్టీకి మెజారిటీ? | polls divided on 2017 election outcome | Sakshi
Sakshi News home page

యూపీలో బీజేపీ కాదు.. ఆ పార్టీకి మెజారిటీ?

Published Thu, Jan 5 2017 12:48 PM | Last Updated on Sat, Aug 25 2018 4:30 PM

యూపీలో బీజేపీ కాదు.. ఆ పార్టీకి మెజారిటీ? - Sakshi

యూపీలో బీజేపీ కాదు.. ఆ పార్టీకి మెజారిటీ?

  • భిన్నమైన ఫలితాలను ప్రకటించిన ఓపినియన్‌ పోల్స్‌
  • బీజేపీకి ఇండియా టుడే సర్వే.. ఎస్పీకి ఏబీపీ న్యూస్‌ సర్వే మెజారిటీ
  • ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో వెలువడిన ఒపీనియన్‌ పోల్స్‌ ఫలితాలు నిట్టనిలువునా చీలిపోయాయి. రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి సంపూర్ణమైన మెజారిటీ వస్తుందని ఇండియా టుడే-యాక్సిస్‌ సర్వే అంచనా వేయగా.. ఈ అంచనాతో ఏబీపీ న్యూస్‌-లోక్‌నీత్‌-సీఎస్‌డీఎస్‌ సర్వే విభేదించింది. యూపీలో పోటీ హోరాహోరీగా ఉంటుందని,  ఎస్పీకి మెజారిటీ స్థానాలు రావొచ్చునని పేర్కొంది.

    ఫిబ్రవరి 11 నుంచి ఏడు దశలుగా ఎన్నికలు జరగనున్న యూపీ (403)లో బీజేపీ 206 నుంచి 216 అసెంబ్లీ స్థానాలు గెలుపొందుతుందని ఇండియా టుడే-యాక్సిస్‌ సర్వే అంచనా వేసింది. కుటుంబ పోరుతో సతమతమవుతున్న ఎస్పీకి 92-97 స్థానాలు, బీఎస్పీకి 79-85 స్థానాలు రావొచ్చునని పేర్కొంది. కాంగ్రెస్‌ 5-9 నుంచి స్థానాలతో సరిపెట్టుకుంటుందని తెలిపింది. పెద్దనోట్ల రద్దుకు ముందు బీజేపీకి యూపీలో 31శాతం ఓట్లు వచ్చే అవకాశముండగా.. నోట్లరద్దుతో మరింతగా కలిసివచ్చిందని, ఆ పార్టీకి వచ్చే ఓటుషేర్‌ డిసెంబర్‌లో 33శాతం పెరిగిందని ఈ సర్వే పేర్కొంది.

    ఇక ఏబీపీ న్యూస్‌-లోక్‌నీత్‌-సీఎస్‌డీఎస్‌ సర్వే  ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ- ఎస్పీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని అంచనా వేసింది. అయితే, అధికార పార్టీ ఎస్పీకి ఎక్కువ సీట్లు రావొచ్చునని పేర్కొంది. ఎస్పీకి 141-151 సీట్లు, బీజేపీకి 129-139 సీట్లు, బీఎస్పీకి 93-103 సీట్లు, కాంగ్రెస్‌కు 13-9 సీట్లు రావొచ్చునని పేర్కొంది.

    ఇక పంజాబ్‌ విషయంలోనూ సర్వేల ఫలితాల్లో పోలిక లేదు.  ఏబీపీ న్యూస్‌-లోక్‌నీత్‌-సీఎస్‌డీఎస్‌ సర్వే పంజాబ్‌లో అధికార శిరోమణి అకాలీ దళ్‌ (ఎస్‌ఏడీ)-బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీల మధ్య హోరాహారీ ఉంటుందని, ఎస్‌ఏడీ-బీజేపీ మిత్రపక్షాలకు 50-58 సీట్లు, కాంగ్రెస్‌కు 41-49 సీట్లు రావొచ్చునని పేర్కొంది. ఆప్‌ 12-18 సీట్లు గెలుచుకోవచ్చునని పేర్కొంది. అయితే ఇండియా టుడే యాక్సిస్‌ సర్వే మాత్రం కాంగ్రెస్‌-ఆప్‌ మధ్య పోటీ ఉంటుందని, కాంగ్రెస్‌కు 49-55 సీట్లు, ఆప్‌కు 42-46 సీట్లు వస్తాయని, ఎస్‌ఏడీ-బీజేపీకి 17-21 సీట్లు వచ్చే అవకాశముందని పేర్కొంది. ఇక ఉత్తరాఖండ్‌లోని 70 స్థానాలలో బీజేపీ 35-45 స్థానాలతో అధికారంలోకి రావొచ్చునని, అధికార కాంగ్రెస్‌కు 22-30 సీట్లు వస్తాయని పేర్కొంది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement