నేను సీఎం అభ్యర్థిగా తప్పుకుంటా! | Ready to withdraw as CM candidate if Congress, Samajwadi Party form alliance | Sakshi
Sakshi News home page

నేను సీఎం అభ్యర్థిగా తప్పుకుంటా!

Published Wed, Jan 4 2017 2:51 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Ready to withdraw as CM candidate if Congress, Samajwadi Party form alliance

లక్నో: సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమని ఆ పార్టీ సీఎం అభ్యర్థి షీలా దీక్షిత్‌ స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగిన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌-ఎస్పీల మధ్య ఎన్నికల పొత్తు కుదిరితే.. పార్టీ సీఎం అభ్యర్థిగా తాను తప్పుకొనేందుకు సిద్ధమని అన్నారు. హిందుత్వ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కొనేందుకు లౌకికవాద భావసారూప్యమున్న పార్టీలు ఏకం కావాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌- ఎస్పీ మధ్య పొత్తు కుదుర్చుకునేందుకు ఇప్పటికే తెరవెనుక మంతనాలు కొనసాగుతున్నట్టు సమాచారం. అయితే, అధికార సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరడంతో ఈ పొత్తు చర్చలు ఒక కొలిక్కి రాలేదని సమాచారం. ఉత్తరప్రదేశ్‌లో పెద్దగా రాజకీయ అవకాశాలు లేని కాంగ్రెస్‌ పార్టీ ఎస్పీతో పొత్తు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ పొత్తు ద్వారా కనీసం వంద సీట్లైనా అడుగాలని ఆ పార్టీ కోరుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement