అఖిలేష్ చేసిన పెద్దతప్పు అదే
అఖిలేష్ చేసిన పెద్దతప్పు అదే
Published Mon, Mar 13 2017 2:26 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
కోల్ కత్తా: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తిరుగులేని పార్టీగా బీజేపీ అవతరించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ దెబ్బకు ఎస్పీ-కాంగ్రెస్ ల కూటమి కోలుకోలేని దెబ్బతిన్నది. ఈ ఎన్నికల్లో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ తో జతకట్టి అతిపెద్ద తప్పు చేశారని బీజేపీ అంటోంది. ''సమాజ్ వాద్ పార్టీ అతిపెద్ద తప్పు కాంగ్రెస్ తో చేతులు కలుపడం. కాంగ్రెస్ తో చేతులు కలుపక పోయినప్పటికీ అఖిలేష్ ఈ ఎన్నికల్లో ఓడిపోయేవారు. కానీ ఇంత చిత్తుగా కాదు'' అని బీజేపీ నేత రాహుల్ సిన్హా అన్నారు. ప్రజలు నూతన భారత్ కు మద్దతుగా నిలిచారని, ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్ లో తాము ఘన విజయం సాధించామని చెప్పారు.
గోవా, మణిపూర్ లో కూడా తాము ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఇతర పార్టీలు, అభ్యర్థులు తమకు మద్దతిస్తారని నమ్ముతున్నట్టు తెలిపారు. 403 అసెంబ్లీ సీట్లలో యూపీలో బీజేపీ 312 సీట్లను గెలుచుకోగా.. పొత్తులతో మరో 13 సీట్లు బీజేపీకి దక్కబోతున్నాయి. ఉత్తరాఖాండ్ లో మొత్తం 70 సీట్లకు గాను 57 సీట్లు బీజేపీనే వరించాయి. గోవా, పంజాబ్ లో కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా సీట్లను దక్కించుకోగా.. ప్రాంతీయ పార్టీల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధమైంది. ఇక ఒక్క పంజాబ్ లోనే బీజేపీకి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది.
Advertisement