కాసేపట్లో అఖిలేష్ రాజీనామా
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీతో ఎస్పీ పొత్తుపెట్టుకోవడం పనిచేయలేదు. బీజేపీ అంచనాలను మించి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. యూపీలో ఓటమిని సమాజ్‌వాదీ పార్టీ అంగీకరించింది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కాసేపట్లో రాజీనామా చేయనున్నారు.
ఓటమిని అంగీకరిస్తున్నామని అఖిలేష్ బాబాయ్, ఎస్పీ సీనియర్ నేత శివపాల్ యాదవ్ అన్నారు. కాగా ఓటమికి అఖిలేషే కారణమని ములాయం సింగ్ యాదవ్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోవడాన్ని ములాయం తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే తండ్రి మాటలను వినని అఖిలేష్ కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. అయితే ఈ పొత్తు వికటించింది. యూపీలో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ కంచుకోట, రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథిలో బీజేపే ముందంజలో ఉంది.