
ముఖ్యమంత్రులకు ముచ్చెమటలు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ఏకంగా ముఖ్యమంత్రులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా ముఖ్యమంత్రులు ప్రకాశ్ సింగ్ బాదల్, హరీష్ రావత్, లక్ష్మీకాంత్ పర్సేకర్.. సొంత నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించలేకపోతున్నారు. గోవా సీఎం పర్సేకర్ ఓటమి చవిచూశారు.
పంజాబ్‌లోని లంబీ స్థానం నుంచి పోటీ చేసిన బాదల్ వెనుకంజలో ఉన్నారు. డిప్యూటి సీఎం సుఖ్‌బీర్ సింగ్ కూడా అదే దారిలో ఉన్నారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ రూరల్‌లో హరీష్ రావత్ వెనుకంజలో ఉన్నారు. కాగా మణిపూర్ సీఎం ఒక్రమ్ ఇబోబి సింగ్ విజయం సాధించారు. ఎమ్మెల్సీగా ఉన్న యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేయలేదు.