లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలనాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో బీజేపీ హవా కనిపిస్తోంది. ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ మరదలు అయిన అపర్ణా యాదవ్ వెనుకంజలో ఉన్నారు. లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అపర్ణపై బీజేపీ నేత రీటా బహుగుణ ముందంజలో ఉన్నారు.
లక్నోలో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 5 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన, రాహుల్ గాంధీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథిలోనూ బీజేపీ ముందంజలో ఉంది. రేప్ కేసులో పరారీలో ఉన్న యూపీ మంత్రి గాయత్రి ప్రజాపతి ముందంజలో ఉన్నారు.