
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలలో పొత్తులు, ఎన్నికల అనంతరం అప్పటి పరిస్థితులకు అనుగుణం గా సీఎం అభ్యర్థి ఎంపిక విషయాల్లో పార్టీ హైకమాండే నిర్ణయం తీసుకుంటుందని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. బుధవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్‌లో మార్పులుంటాయనే విషయం తనకు తెలియదని చెప్పారు. కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో క్రెడిబిలిటీ లేదని, ఆయనను జాతీయ నేతలు నమ్మడం లేదన్నారు. బీజేపీ కూడా ఆయనను అవసరం మేరకు ఉపయోగిం చుకుంటుందే తప్ప పూర్తిగా నమ్మడం లేదన్నా రు. తాను నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచే పోటీచేస్తానని తెలిపారు. డీఎస్ కాంగ్రెస్‌లోకి వస్తున్నారనడం అవాస్తవమన్నారు.