ఉత్తరప్రదేశ్‌లో...
బీజేపీదే గెలుపు!
టైమ్స్ నౌ–వీఎంఆర్ సర్వే
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 202 సీట్లు ౖకైవసం చేసుకోగలదని టైమ్స్ నౌ–వీఎంఆర్ సర్వేలో తేలింది. ఎన్నికల్లో 34% ఓట్లు బీజేపీకి దక్కుతాయని సర్వే పేర్కొంది. ఇక, ఎస్పీ–కాంగ్రెస్ కూటమి కేవలం 147 సీట్లు గెలుచుకోగలదని, కూటమికి 31శాతం ఓట్లుపడతాయని సర్వే వెల్లడించింది. ముస్లిం ఓట్లపై ఆశలుపెట్టుకున్న మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి కేవలం 47సీట్లు వస్తాయంది. బీఎస్పీకి 24శాతం ఓట్లు దక్కుతాయని పేర్కొంది. అజిత్‌సింగ్‌కు చెందిన రాష్ట్రీయ లోక్‌దళ్, ఇతర పార్టీలకు ఏడు సీట్లు దక్కుతాయని తెలిపింది. అత్యంత పాపులారిటీ ఉన్న సీఎంగా అఖిలేశ్ యాదవ్ తొలిస్థానంలో నిలిచారు. 39% మంది అఖిలేశ్‌కు మద్దతుపలికారు. 23% మంది మద్దతుతో మాయావతి రెండోస్థానం పొందారు.
ఎస్పీ కూటమిదే!
ది ఏబీఎన్–సీఎస్‌డీఎస్ సర్వే
న్యూఢిల్లీ: యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ–కాంగ్రెస్ కూటమి 187–197 సీట్లు సాధించగలదని ది ఏబీఎన్ న్యూస్–సీఎస్‌డీఎస్–లోక్‌నీతి తాజా ఒపీనియన్ పోల్ ఫలితాల్లో తేలింది. ఈ కూటమికి 35శాతం ఓట్లుపడతాయంది. ఈ సర్వే ఫలితాల ప్రకారం.. కాబోయే సీఎం అర్హత ఉన్న వ్యక్తిగా 26% మద్దతుతో అఖిలేశ్ మందునిలిచారు. ఇక 118–128సీట్లు బీజేపీకి దక్కే వీలుందని సర్వే చెబుతోంది. నోట్ల రద్దు అంశం రాష్ట్రంలో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వెల్లడైంది. నోట్లరద్దు నిర్ణయానికి మద్దతు గత నెలరోజుల్లో 35శాతం నుంచి 41శాతానికి చేరింది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 76–86సీట్లు రావచ్చు. బీజేపీకి మద్దతుపలికే 21శాతం మంది సంప్రదాయ ఓటర్లు సైతం ఈసారి ఎస్పీ–కాంగ్రెస్ కూటమికీ ఓట్లేసే వీలుంది.