Opinion polls
-
Britain general elections: సునాక్ ఎదురీత!
బ్రిటన్‌లో పద్నాలుగేళ్ల కన్జర్వేటివ్ పాలనకు తెరపడనుందా? భారత మూలాలున్న తొలి ప్రధానిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్ గద్దె దిగాల్సి వస్తుందా? అవుననే అంటున్నాయి ఒపీనియన్ పోల్స్. షెడ్యూల్ ప్రకారం ఏడాది చివరిదాకా ఆగితే తన ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి తారస్థాయికి చేరి ఓటమి ఖాయమనే భావనతో రిషి అనూహ్యంగా జూలై 4న ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అయినా పెద్దగా ప్రయోజనమేమీ ఉండకపోవచ్చని సర్వేలంటున్నాయి. విపక్ష లేబర్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని పేర్కొంటున్నాయి. స్వయానా రిషీ కూడా ఎదురీదుతున్నారని, సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా కోల్పోవచ్చని సావంత పోల్ పేర్కొంది! అదే జరిగితే సొంత పార్లమెంటు స్థానంలో ఓడిన తొలి సిట్టింగ్ ప్రధానిగా బ్రిటన్ చరిత్రలో రిషి నిలిచిపోతారు...ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతోనే కన్జర్వేటివ్ పార్టీ ఓటమి సగం ఖాయమైందన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీది 190 ఏళ్ల చరిత్ర. ఇంత సుదీర్ఘ చరిత్రలో 1906లో వచి్చన 131 సీట్లే అత్యల్పం. ఈసారి ఆ రికార్డును అధిగమించవచ్చని సర్వేలంటున్నాయి. ‘‘సునాక్ ఉత్తర ఇంగ్లాండ్‌లోని కన్జర్వేటివ్‌ల కంచుకోటైన తన సొంత పార్లమెంటరీ స్థానాన్ని కూడా కోల్పోవచ్చు. ఆర్థిక మంత్రి జెరెమీ హంట్‌తో సహా పలువురు సీనియర్ మంత్రులకు ఓటమి తప్పదు’’ అని సావంత పోల్ పేర్కొంది. కన్జర్వేటివ్ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయం తప్పక పోవచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత సంతతికి చెందిన వారు ఈసారి కన్జర్వేటివ్ పారీ్టకి ఓటేయకపోవచ్చనేది పోల్స్టర్ల అంచనా. లేబర్ పారీ్టకి 425కు పైగా సీట్లు...! హౌజ్ ఆఫ్ కామన్స్‌లో 650 సీట్లకు గాను లేబర్ పార్టీ 425కు పైగా సాధించి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ 108 స్థానాలకు పరిమితమవుతుందని యూగవ్, కేవలం 53 స్థానాలకే పరిమితమవుతారని సావంత పోల్ పేర్కొన్నాయి. సావంత అయితే లేబర్ పార్టీకి దాని చరిత్రలోనే అత్యధికంగా 516 సీట్లు రావచ్చని అంచనా వేయడం విశేషం! కన్జర్వేటివ్‌లకు 72కు మించబోవని, లేబర్ పార్టీ 456 సీట్లు దాటుతుందని బెస్ట్ ఫర్ బ్రిటన్ సర్వే అంచనా వేసింది. 2019 ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ 43.6 శాతం ఓట్లతో 365 సీట్లు సాధించగా లేబర్ పార్టీకి 32.1 శాతం ఓట్లతో 202 స్థానాలు దక్కాయి. ఆకట్టుకుంటున్న కైర్ స్టార్మర్ ‘లెఫ్టీ లండన్ లాయర్’గా పేరు తెచ్చుకున్న కైర్ స్టార్మర్ లేబర్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. 14 ఏళ్లుగా విపక్షంలో ఉంటూ కుంగిపోయిన పారీ్టలో ఆయన జోష్ నింపుతున్నారు. ఇళ్ల సంక్షోభాన్ని పరిష్కరిస్తామని, పన్ను పెంపుదల లేకుండా మెరుగైన ప్రజా సేవలను అందిస్తామనే మామీలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీ ప్రధాన దాత అయిన బిలియనీర్ జాన్ కాడ్వెల్ కూడా ఈసారి లేబర్ పారీ్టకి మద్దతిస్తున్నారు. తాను లేబర్ పారీ్టకే ఓటేస్తానని బాహాటంగా చెబుతున్నారు. అందరూ అదే చేయాలని పిలుపునిస్తున్నారు.ప్రజల్లో వ్యతిరేకతకు కారణాలెన్నో... బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో డేవిడ్ కామెరాన్ రాజీనామా అనంతరం చీటికీమాటికీ ప్రధానులు మారడం కన్జర్వేటివ్ పార్టీకి చేటు చేసింది. థెరిసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి రూపంలో ఏకంగా నలుగురు ప్రధానులు మారారు. వీరిలో 45 రోజులే కొనసాగిన ట్రస్ పారీ్టకి గట్టి నష్టాన్ని కలిగించారని, దాన్ని సునాక్ పూడ్చలేకపోయారని అంటున్నారు.→ 2022 అక్టోబర్‌లో రిషి ప్రధాని అవుతూనే ద్రవ్యోల్బణాన్ని సగానికి తగ్గిస్తానని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని, రుణ భారాన్ని, నేషనల్ హెల్త్ సరీ్వస్ వెయిటింగ్ జాబితాను తగ్గిస్తానని, అక్రమ వలసలను అడ్డుకుంటానని హామీ ఇచ్చారు. ఇవేవీ చేయలేకపోగా సంప్రదాయ ఓటర్లనూ మెప్పించలేకపోయారని విమర్శ ఉంది.→ ఐదేళ్లలో బ్రిటన్ వాసుల జీవన ప్రమాణాలు బాగా పడిపోయాయి. వారిపై పన్ను భారమైతే గత 70 ఏళ్లలో అత్యధిక స్థాయిలో ఉంది. అక్రమ వలసలు పెరిగాయి. ప్రధానిగా సునాక్ నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలొచ్చాయి. → వీటికి తోడు 14 ఏళ్లుగా అధికారంలో ఉండటంతో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది.→ రిఫార్మ్ యూకే పార్టీ పుంజుకోవడం కూడా కన్జర్వేటివ్‌లను దెబ్బ తీయనుంది. ఈ పారీ్టకి 15 శాతం ఓట్ల వాటా ఉంది. ఈసారి చాలా స్థానాల్లో కన్జర్వేటివ్ ఓటు బ్యాంకుకు భారీగా గండి పెడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
బ్రిటన్ ఒపీనియన్ పోల్స్.. ప్రధాని రిషి సునాక్ ఓటమి?
బ్రిటన్‌లో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఒపీనియన్ పోల్స్‌లో ప్రస్తుత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఘోరంగా ఓడిపోతారని మరో సర్వే అంచనా వేసింది. జూలై 4న జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ ఈసారి తుడిచిపెట్టుకుపోతుందని ఇప్పటివరకూ మూడు సర్వేలు వెల్లడించాయి.తాజా సర్వేలో కైర్ స్టార్మర్స్ లేబర్ పార్టీకి 46 శాతం మద్దతు లభించగా, కన్జర్వేటివ్ పార్టీకి మద్దతు నాలుగు పాయింట్ల మేరకు తగ్గి 21 శాతానికి చేరుకుంది. జూన్ 12- జూన్ 14 మధ్య ఈ సర్వేను మార్కెట్ రీసెర్చ్ కంపెనీ సావంత ‘సండే టెలిగ్రాఫ్’ కోసం నిర్వహించింది. కొంతమేరకు ఎన్నికల ప్రచారం ముగిసిన తరుణంలో ఈ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. త్వరలో కన్జర్వేటివ్, లేబర్ పార్టీలు రెండూ తమ మ్యానిఫెస్టోలతో ప్రజల ముందుకు వెళ్లనున్నాయి.కాగా మే 22న ముందస్తు ఎన్నికలను ప్రకటించి రిషి సునాక్ అందరినీ ఆశ్చర్యపరిచారు. రాబోయే బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయానికి దూరమవుతుందని తాము నిర్వహించిన సర్వేలు చెబుతున్నాయని సావంత పొలిటికల్ రీసెర్చ్ డైరెక్టర్ క్రిస్ హాప్కిన్స్ తెలిపారు. ఈ సర్వేలో 650 మంది సభ్యుల హౌస్ ఆఫ్ కామన్స్‌లో కన్జర్వేటివ్ పార్టీ కేవలం 72 సీట్లకు పరిమితమవుతుందనే అంచనాలు వెలువడ్డాయి. ఇది 200 సంవత్సరాల బ్రిటన్ ఎన్నికల చరిత్రలో అతి స్వల్పం. లేబర్ పార్టీకి 456 సీట్లు వస్తాయని ఈ సర్వే తెలిపింది.బెస్ట్ ఫర్ బ్రిటన్ సర్వేలో ప్రధాని సునాక్ తన సీటును సైతం కాపాడుకోలేరని పేర్కొన్నారు. బెస్ట్ ఫర్ బ్రిటన్ 15,029 మంది నుంచి అభిప్రాయాన్ని సేకరించింది. దీని ఆధారంగా రూపొందించిన నివేదికలో ప్రతిపక్ష లేబర్ పార్టీ 45 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ పార్టీ ఈసారి 468 సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వే వెల్లడించింది. -
దక్షిణాఫ్రికా దక్కేదెవరికో?
సియాంకొబా. దక్షిణాఫ్రికాలో అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఊరూవాడా హోరెత్తించిన ఎన్నికల నినాదం. అంటే ‘మాదే ఘనవిజయం’ అని జులు భాషలో అర్థం. కానీ ఘనవిజయం దేవుడెరుగు, ఏఎన్సీ ఈసారి సాధారణ మెజారిటీ సాధించడం కూడా కష్టమేనని ఒపీనియన్ పోల్స్ అంటున్నాయి. వర్ణవివక్ష అంతమై తెల్లవారి పాలన ముగిశాక 1994లో ప్రజాస్వామిక పద్ధతిలో జరిగిన తొలి ఎన్నికల్లో గెలిచింది మొదలు 30 ఏళ్లుగా ఏఎన్‌సీయే అధికారంలో కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో దానికి తొలిసారి గట్టి పోటీ ఎదురవుతోంది... దక్షిణాఫ్రికాలో ఎన్నికలకు వేళైంది. 400 మందితో కూడిన నేషనల్ అసెంబ్లీతో పాటు 9 ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు కూడా బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా ఏడో విజయం కోసం ఏఎన్సీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. కానీ పెచ్చరిల్లుతున్న అవినీతి, నిరుద్యోగం, కరెంటు కోతలు, నీటి కొరత, మౌలిక సదుపాయాల లేమి వంటివి పారీ్టకి బాగా ప్రతికూలంగా మారాయి. వీటిపై ప్రజాగ్రహం ప్రచారం పొడవునా స్పష్టంగా కన్పించింది. శనివారం అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్వహించిన చివరి ప్రచార సభ కూడా అనుకున్నంతగా విజయవంతం కాలేదు. సభకు వేదికైన చారిత్రక సొవెటో టౌన్‌షిప్‌లోని 90వేల మంది సామర్థ్యమున్న ఫుట్‌బాల్ స్టేడియం పూర్తిగా నిండకపోవడం ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తికి అద్దం పడుతోందని పరిశీలకులు చెబుతున్నారు. 71 ఏళ్ల రామఫోసాపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలున్నాయి. విచ్చలవిడిగా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు విపక్షాలు ఆరోపించాయి. ఆయనను అభిశంసించాలని పార్లమెంట్ నియమించిన న్యాయ నిపుణుల కమిటీ కూడా సూచించింది. అయితే పార్లమెంట్లో ఉన్న మెజారిటీ సాయంతో ఆ ప్రక్రియను ఏఎన్సీ అడ్డుకుంది. రామఫోసాపై జరిగిన పోలీసు దర్యాప్తు వివరాలు బయటకు రాలేదు. వీటన్నింటి నేపథ్యంలో ఈసారి ఏఎన్సీ తన చరిత్రలో తొలిసారిగా 50 శాతం కంటే తక్కువ ఓట్లకు పరిమితమయ్యేలా కన్పిస్తోంది. అదే జరిగితే అతి పెద్ద పారీ్టగా నిలిచినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ దక్కదు. ఏఎన్సీ ఈసారి ఇతర పారీ్టల మద్దతుపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తుందని సర్వేలూ పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ ఆదివారం వెల్లడ య్యే ఫలితాలపైనే నెలకొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ జాకబ్ జుమా పంచ్... మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా గతేడాది రామఫోసాతో విభేదించి సొంత పార్టీ పెట్టుకోవడం ఏఎన్‌సీకి పెద్ద దెబ్బ! 82 ఏళ్ల జుమా ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరాడుతున్నారు. ఆయన పార్టీ ఉంకొంతో వెసీజ్వె (ఎంకే) 13 శాతం దాకా ఓట్లు రాబట్టవచ్చని సర్వేల్లో వెల్లడయ్యింది. అధికారంలోకి రాకపోయినా ఏఎన్సీ అవకాశాలను బాగా దెబ్బ తీయడం ఖాయమని పరిశీలకులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా జుమా సొంత ప్రావిన్స్ క్వాజులూ నాటాల్లో ఏఎన్సీ ఆధిపత్యానికి ఎంకే పూర్తిగా గండికొట్టనుందని అంటున్నారు. క్వాజులూ ప్రావిన్స్‌లోని ఎంకే నేతల్లో తెలుగు మూలాలున్న విశి్వన్ గోపాల్‌రెడ్డి ప్రముఖ స్థానంలో ఉండటం విశేషం.బరిలో 51 విపక్షాలు దక్షిణాఫ్రికాలో ప్రధాన ప్రతిపక్షం డెమొక్రటిక్ అలయెన్స్ (డీఏ). ఈ కూటమికి 22 నుంచి 27 శాతం ఓట్లు రావచ్చని ఏప్రిల్‌లో ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైంది. అయితే పలువురు నేతలు డీఏను వీడి సొంత పార్టీలు పెట్టుకున్నారు. ఇది విపక్ష కూటమికి ప్రతికూలంగా మారింది. ఈసారి 51 ప్రతిపక్షాలు పోటీలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఏఎన్‌సీకి కలిసొచ్చేలా కని్పస్తోంది.ముస్లిం ఓట్లపై వల... జనాభాలో ముస్లింలు 2 శాతం కంటే తక్కువే ఉంటారు గానీ వారి ప్రతి ఓటూ విలువైనదే. అందుకే ముస్లింల ఓట్లపై పారీ్టలు వల విసురుతున్నాయి. పాలస్తీనా ఉద్యమానికి పోటీలు పడి మరీ మద్దతు ప్రకటిస్తున్నాయి. గాజాలో దాడులు ఆపాలంటూ ఇజ్రాయెల్‌ను డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాన సమస్యలివీ... → తీవ్ర కరెంటు కోతలు → పెచ్చరిల్లిన అవినీతి → పేదరికం (50 శాతం దాటింది) → 32 శాతం దాటిన నిరుద్యోగం (ప్రపంచంలోనే అత్యధికం) → తీవ్ర నీటి కొరత → మౌలిక సదుపాయాల లేమి → మితిమీరిన నేరాలు, హింసాకాండ → రాజకీయ హత్యలుదక్షిణాఫ్రికా పార్లమెంటులో రెండు సభలుంటాయి. 90 మంది సభ్యులతో కూడిన నేషనల్ కౌన్సిల్, 400 మంది సభ్యులుండే నేషనల్ అసెంబ్లీ. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో దీని సభ్యులను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మెజారిటీ సాధించే పార్టీ సారథి అధ్యక్షుడవుతారు. దేశ జనాభా 6.2 కోట్లు కాగా ఓటర్లు 2.8 కోట్ల మంది. జనాభాలో 80 శాతానికి పైగా నల్లజాతీయులే. ఈ ఎన్నికల్లో తొలిసారిగా స్వతంత్రులకు కూడా పోటీ చేసే అవకాశం కలి్పంచారు.ఎన్నికల నేపథ్యంలో దక్షిణాఫ్రికావ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ హత్యలు కలకలం సృస్టిస్తున్నాయి. 2023 జనవరి నుంచి 40 మందికి పైగా విపక్ష నేతలు, నిజాయతీపరులైన అధికారులు, హక్కుల కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఇది అధ్యక్షుడు రామఫోసా పనేనంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రచారంలో దీన్ని ప్రధానాంశంగా కూడా మార్చుకున్నాయి. వీటిపై ప్రజల్లో కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నేషనల్ అసెంబ్లీలో బలాబలాలు (మొత్తం స్థానాలు 400) ఏఎన్సీ 230 డెమొక్రటిక్ అలయన్స్ 84 ఎకనమిక్ ఫ్రీడం ఫైటర్స్ 44 ఇతరులు 42 -
Centre for the Study of Developing Societies: ఒపీనియన్లు వేరువేరయా!
ఎన్నికలగానే ముందుగా ఒపీనియన్ పోల్స్ వెలువడుతుంటాయి. ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు వెల్లువెత్తుతుంటాయి. ఇవి ఓటర్ల అభిప్రాయాలపై ఎంతో కొంత ప్రభావం చూపుతాయి. ఇలాంటి ఒపీనియన్ పోల్స్ ఫలితాల్లో కచి్చతత్వం ఎంతంటే చెప్పడం కష్టమే. ఈసారి ఎన్డీఏ కూటమి 400 పైచిలుకు లోక్‌సభ స్థానాలు సాధిస్తామని చెబుతుండటం తెలిసిందే. ఎన్డీఏ కూటమికి 372 స్థానాలు రావచ్చని ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్స్ పోల్స్ సర్వే పేర్కొంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి 122 దాకా వస్తాయని అంచనా కట్టింది. కానీ, ఒపీనియన్ పోల్స్ ఫలితాలు కొన్నిసార్లు నిజమైనా, బెడిసికొట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) కూడా ఇదే చెబుతోంది. 1998 నుంచి 2009 ఎన్నికల దాకా వెలువడ్డ పలు ఒపీనియన్ పోల్స్‌ను సీఎస్డీఎస్ విశ్లేషించగా ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి... అంచనాలు ఇలా.. 1998 లోక్‌సభ ముందస్తు ఎన్నికల తరుణంలో వచ్చిన ఒపీనియన్ పోల్స్ ఫలితాలకు దగ్గరగానే ఉన్నాయి. కానీ 1999 లోక్‌సభ ఎన్నికలపై వచ్చిన అంచనాలు అంత కచి్చతంగా లేవు. నాడు బీజేపీ సాధించబోయే స్థానాలను ఒపీనియన్ పోల్స్ ఎక్కువ చేసి చూపాయి. అలాగే 2004 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఒపీనియన్ పోల్స్ జ్యోతిష్యం ఏమాత్రం పండలేదు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని పోల్స్ అసలే అంచనా వేయలేకపోయాయి. దాదాపు అన్ని ఒపీనియన్ పోల్స్ ఎన్డీఏ అధికారం నిలబెట్టుకుందనే చెప్పాయి. అలాగే 2009 లోక్‌సభ ఎన్నికల ముందు వేసిన అంచనాలు కూడా తప్పాయి. యూపీఏ అధికారాన్ని నిలుపుకుంటుందని మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అంచనా వేయలేకపోయాయి. కానీ యూపీఏ కూటమికి 2004లో 222 లోక్‌సభ స్థానాలు రాగా 2009 ఎన్నికల్లో 262కు పెరిగాయి! 2014 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఎన్డీఏ కూటమి 257 నుంచి 340 సీట్ల వరకు గెలుచుకోవచ్చని ఒపీనియన్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. ఎన్డీఏకు 336 స్థానాలొచ్చాయి. కాంగ్రెస్ బలం బాగా పడిపోతుందన్న అంచనాలకు అనుగుణంగా 44 స్థానాలకే పరిమితమైంది. మళ్లీ 2019 ఎన్నికల్లో ఒపీనియన్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఎన్డీఏకు 285 స్థానాలకు మించి రావని మెజారిటీ పోల్స్ పేర్కొనగా 353 స్థానాలు వచ్చాయి. బీజేపీ ఒంటరిగానే 303 స్థానాలు సాధించడం తెలిసిందే.ఎగ్జిట్ పోల్స్ కూడా అంతే! ప్రీ పోల్ సర్వేలకు, ఎగ్జిట్ పోల్ అంచనాలకు పెద్ద వ్యత్యాసం కనిపించదు. 2003 చివర్లో జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల ఫలితాలు రావడంతో ఇండియా షైనింగ్ నినాదంతో 2004 కేంద్రంలో బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి 240–250 నుంచి స్థానాలు సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించగా ఫలితాలు రివర్సయ్యాయి. ఎన్డీఏ 187కే పరిమితమైంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ సొంతంగా స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయలేకపోయాయి. 2016 చివర్లో మోదీ సర్కారు పెద్ద నోట్లను రద్దు చేశాక జరిగిన 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ తుస్సుమన్నాయి. హంగ్ వస్తుందన్న వాటి అంచనాలకు భిన్నంగా బీజేపీ ఏకంగా 300 సీట్లతో ఘన విజయం సాధించింది.నిబంధనలు ఇలా... ఎన్నికల్లో ఎవరికి ఓటేసే అవకాశం ఉందంటూ ఓటర్ల అభిప్రాయాలను తెలుసుకుని రూపొందించేవి ఒపీనియన్ పోల్స్. ఓటేసి పోలింగ్ బూత్‌ల నుంచి తిరిగి వెళ్లే ఓటర్లను ప్రశ్నించి వేసే అంచనాలే ఎగ్జిట్ పోల్స్. ఒపీనియన్ పోల్స్ ఫలితాలను ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు వరకు ప్రకటించవచ్చు. తుది దశ పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చు.తప్పడానికి కారణమేమిటి? ఒపీనియన్ పోల్స్ అంచనాలు చాలా వరకు తారుమారు కావడానికి ఎన్నో కారణాలున్నాయి. అంచనాల్లో తప్పులు ఎంత తక్కువగా ఉంటే ఫలితాలు కచి్చతత్వానికి అంత దగ్గరగా ఉంటాయి. → 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఒపీనియన్ పోల్స్ అంచనాలు, వాస్తవ ఫలితాల మధ్య 20 సీట్ల దాకా తేడా ఉంది. → 2009 ఎన్నికల్లో ఈ అంతరం 25–60 స్థానాలకు పెరిగింది. 2014లోనైతే ఏకంగా 50–100 స్థానాల తేడా వచి్చంది. → ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకుని తదనుగుణంగా ఈ సంస్థలు అంచనాలు వేస్తుంటాయి. అలా ఒక్కో పార్టీ/కూటమికి వచ్చే స్థానాలను లెక్కగడుతుంటాయి. → ఇది కాలం చెల్లిన పాత విధానమని నిపుణులు అంటున్నారు. → పోలింగ్ ఏజెన్సీలు సర్వేకు కావాల్సిన బలమైన వసతులు లేకపోవడం కూడా అంచనాల్లో తప్పులు పెరగడానికి కారణం. → ప్రతి నియోజకవర్గం నుంచి శాంపిల్ సైజు వీలైనంత ఎక్కువగా ఉండాలి. ఇందుకు భారీగా సిబ్బంది, నిధులు, సమయం కావాలి. → కానీ మన దగ్గర పోల్ ఏజెన్సీలకు ఈ వనరుల్లేవు. → పారీ్టల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, ఫలితాల అంచనాలు అంత కష్టమవుతాయని సీఎస్డీఎస్ సైతం చెబుతోంది. → 2014 ఎన్నికల్లో 464 రాజకీయ పారీ్టలు పోటీ చేశాయి. 1998తో పోలిస్తే ఇది రెట్టింపు! → పోలింగ్ ఏజెన్సీలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. దాంతో చాలా శాస్త్రీయంగా పోల్ సర్వేలు నిర్వహించకుండానే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. → సర్వే అంచనాలు ఎందుకు తప్పాయని చాలా పోలింగ్ ఏజెన్సీలు విశ్లేషణను చేసుకోవడం లేదు. → పైగా సర్వే ఫలితాలను ఎలా రూపొందించారో ఆధారాలను కూడా వెల్లడించడం లేదు. → ప్రీ పోల్ అంచనాలకు సంబంధించి జవాబుదారీ లేకపోవడం కూడా సమస్యకు కారణమే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వైఎస్సార్సీపీదే ఘన విజయం.. ఏపీలో ఎన్నికలపై సర్వేలు ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. ప్రతిపక్షాలు ఎన్ని పొత్తులతో కలిసి వచ్చినా ప్రజలు మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉన్నామని సర్వేల్లో చెబుతున్నారు. ఏపీలో ఎన్నికలకు సంబంధించి తాజాగా మరో రెండు సర్వేలు కూడా వెల్లడించాయి. వీటిల్లో కూడా వైఎస్సార్సీపీదే ఘన విజయమని చెప్పుకొచ్చాయి. పేదలకు ఆలంబనగా నిరంతరాయంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, జనాభాలో దాదాపు 90 శాతం మందికి నేరుగా అందుతున్న నగదు, అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన.. జనాదరణను మరింతగా పెంచాయని వైఎస్సార్సీపీ నమ్ముతోంది. అందుకే 175 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించడం అసాధ్యమేమీ కాదని ఆ పార్టీ ముందునుంచీ చెబుతోంది. తమకు క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసు కాబట్టే ‘వైనాట్ 175’ అంటున్నామని సీఎం జగన్, పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, తాజాగా జీన్యూస్ మ్యాటరైజ్ పోల్ సర్వే ప్రకారం.. లోక్‌సభ స్థానాలు.. YSRCP-19 TDP-6 BJP-0 INC-0 Zee News-MATRIZE Lok Sabha Opinion Poll The @YSRCParty is anticipated to secure 19 seats, with the @JaiTDP projected to win 6 seats, while the @BJP4Andhra and @INC_Andhra may not secure any seats in the state. YSRCP leading in all the surveys - the FAN STORM is coming!… pic.twitter.com/4esxMZQZqR — Voice of Andhra (@VoiceofAndhra3) February 29, 2024 జానాధార్ ఇండియా సర్వే ప్రకారం.. అసెంబ్లీ స్థానాలు.. YSRCP- 125(49.2%) TDP+- 50(46.3%) BJP-0(1.1%) INC-0(1.3%) లోక్‌సభ స్థానాలు.. YSRCP- 17 TDP+- 8 BJP-0 INC-0 ►ఇదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనితీరుపై ప్రజలు ఎంతో విశ్వాసం ఉంచారు. సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల తాము సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ పనితీరు బాగుందని దాదాపు 62 శాతం ప్రజలు మద్దతిచ్చారు. ►అంతకుముందు.. ప్రముఖ వార్తా చానల్ టైమ్స్ నౌ సర్వే కూడా ఏపీలో ఫలితాలపై సర్వేను వెల్లడించింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే పార్టీ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమని పేర్కొంది. వైఎస్సార్సీపీ 24 నుంచి 25 స్థానాలు గెలుస్తుందని టౌమ్స్ నౌ–ఈటీజీ చేసిన సర్వే తేల్చింది. టీడీపీ ఒక్క స్థానంలో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నట్టే సర్వేలో పేర్కొంది. -
రిషి సునాక్ పాపులారిటీ రేటింగ్ 25%
లండన్: యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్‌కు, అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఇదొక పెద్ద ఊరట. ఇటీవల మంత్రివర్గంలో మార్పుల తర్వాత సునాక్ ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. పార్టీలో అసమ్మతి మొదలైంది. అయితే, శీతాకాల బడ్జెట్లో కొన్నిరకాల పన్నులను తగ్గించనున్నట్లు ప్రకటించారు. దీంతో రిషి సునాక్‌తోపాటు ప్రభుత్వానికి ప్రజాదరణ స్వల్పంగా పెరిగినట్లు తాజాగా ‘ద టైమ్స్’ పత్రిక నిర్వహించిన ఓపీనియన్ పోల్స్‌లో వెల్లడయ్యింది. బడ్జెట్‌ను బుధవారం పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పన్ను మినహాయింపుల పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారు. సర్వేలో సునాక్ ప్రభుత్వ పాపులారిటీ రేటింగ్ 25 శాతానికి చేరినట్లు తేలింది. గత వారంతో పోలిస్తే ఇది 4 పాయింట్లు అధికం కావడం విశేషం. ఇటీవలి కాలంతో కన్జర్వేటివ్ పారీ్టకి దక్కిన అత్యధిక రేటింగ్ ఇదే. ఇదిలా ఉండగా, ప్రతిపక్ష లేబర్ పార్టీ రేటింగ్‌లో ఎలాంటి మార్పు జరగలేదు. ప్రజాదరణ 44 శాతంగానే ఉన్నట్లు సర్వే వెల్లడించింది. -
మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు టైమ్స్ నౌ ఛానల్– ఈటీజీ రీసెర్చ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఒపీనియన్ పోల్‌లో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌కే ఆధిక్యం ఉన్నట్లు వెల్లడైంది. మధ్యప్రదేశ్‌లో పోటా పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు స్వల్ప మొగ్గు కనపడుతోంది. బీజేపీ 43.7 శాతం ఓట్లతో 107–115 స్థానాల్లో నెగ్గే అవకాశాలున్నాయని పేర్కొన్న సర్వే.. కాంగ్రెస్ 44.9 ఓట్లతో 112–122 సీట్లు సాధిస్తుందని తేలి్చంది. ఇతరులు కేవలం 1–3 స్థానాలకే పరిమితమవుతారని పేర్కొంది. మరోవైపు రాజస్తాన్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉందని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. 43.8 శాతం ఓట్లతో బీజేపీ 114–124 స్థానాల్లో గెలవనుందని పేర్కొంది. కాంగ్రెస్ 41.9 శాతం ఓట్లతో 68 నుంచి 78 స్థానాలకు పరిమితం కానుందని తెలిపింది. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 51–59 స్థానాలతో స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుందని, బీజేపీ 27 నుంచి 35 స్థానాలకు పరిమితమవుతుందని సర్వే వెల్లడించింది. పైన పేర్కొన్న మూడు రాష్ట్రాల్లో ప్రస్తుతం రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక తెలంగాణ విషయానికి వస్తే సర్వే వివరాలు పూర్తిగా అందనప్పటికీ ప్రాథమిక సమాచారాన్ని బట్టి అధికార బీఆర్ఎస్కే మొగ్గు కనపడుతోందని టైమ్స్ నౌ సర్వే పేర్కొంది. -
ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌పై ఈసీ నిషేధం!
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్రం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో నేటి (నవంబర్ 12)నుంచి ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లో శనివారం ఉదయం 8 గంటలకు భారీ భద్రత నడుమ పోలింగ్ మొదలైంది. మరోవైపు.. గుజరాత్లో డిసెంబర్ 1, 5 వ తేదీల్లో ఓటింగ్ జరగనుంది. నవంబర్ 12, ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5, సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రచురణ, ప్రసారం చేయకూడదని నోటిఫికేషన్ జారీ చేసింది. పీపుల్స్ యాక్ట్ 1951లోని సెక్షన్ 126(1)(బీ)ప్రకారం.. అలాగే ఒపీనియన్ పోల్స్ ఫలితాలు, సర్వేలు సహా ఎలాంటి ఎన్నికల అంశాలను ఎన్నిక ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయరాదని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తమ ఆదేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని హిమాచల్, గుజరాత్ ఎన్నికల ప్రధానాధికారులకు సూచించింది. అలాగే.. మీడియా రంగాలకు సైతం తెలియజేయాలని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: హిమాచల్ ప్రదేశ్ పోలింగ్: ఈ పోలింగ్ బూత్ ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకం! 52 మంది ఓటర్లతో ఏకంగా.. -
ఒపినీయన్ పోల్: వచ్చే ఎన్నికల్లో వారిదే గెలుపు
న్యూఢిల్లీ: పంచతంత్రంగా పేర్కొన్నే ఐదు అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశం దేశవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. ఈ ఉత్కంఠ నేపథ్యంలో ఓ సర్వే చెబుతున్న ఫలితాలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది. మళ్లీ పశ్చిమబెంగాల్లో మమత, కేరళలో వామపక్షాలే, అస్సోలో బీజేపీ ప్రభుత్వాలే ఏర్పాటు చేస్తాయని.. ఇక తమిళనాడులో పదేళ్ల తర్వాత డీఎంకే కూటమి, ఇక పుదుచ్చేరిలో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని సర్వే చెప్పింది. ఈ అసెంబ్లీ ఎన్నికలు జాతీయ రాజకీయాలను తీవ్రంగా ప్రభావం చూపేవి కావడంతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనే అంశంపై ఏబీపీ-సీ ఓటర్ సంస్థ సర్వే చేసింది. అంటే ఒపీనియన్ పోల్ నిర్వహించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో చేసిన సర్వే ప్రకారం పై ఫలితాలు వెల్లడయ్యాయి. ఏ పార్టీ గెలుస్తుందనే దానితో పాటు ఏ పార్టీకి ఎన్ని శాతం ఓట్లు.. ఎన్నేసి సీట్లు వస్తాయో ఓ అంచనా రూపొందించింది. ఆ ఒపినీయన్ పోల్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సర్వే ఒక అంచనా మాత్రమే. ఏది ఏమున్నా ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఏప్రిల్ 2వ తేదీన తెలియనుంది. పశ్చిమ బెంగాల్ పదేళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకే మళ్లీ పట్టం కట్టే అవకాశం ఉంది. మళ్లీ మమత బెనర్జీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తారని అభిప్రాయాలు వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్: 148-164 సీట్లు (43 శాతం ఓట్లు) బీజేపీ: 92-108 సీట్లు (38 శాతం ఓట్లు) కాంగ్రెస్ + మిత్రపక్షాలు: 31-39 సీట్లు (13 శాతం ఓట్లు) కేరళ దేవభూమిగా ఉన్న కేరళలో మళ్లీ వామపక్ష కూటమికే అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయి. ఎల్డీఎఫ్: 83-91 సీట్లు యూడీఎఫ్: 47-55 సీట్లు బీజేపీ: 0-2 సీట్లు, ఇతరులు 0-2 సీట్లు తమిళనాడు ఈసారి తమిళనాడులో ప్రభుత్వం మారే అవకాశం ఉంది. పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న అన్నాడీఎంకేకు పరాభవం తప్పేటట్టు లేదు. మిత్రపక్షాలతో కలిసి డీఎంకే అధికారం చేపట్టేలా పరిస్థితులు ఉన్నాయి. డీఎంకే + మిత్రపక్షాలు: 154-162 సీట్లు అన్నాడీఎంకే: 58-66 సీట్లు ఇతరులు: 8-20 సీట్లు అసోం ఈశాన్య ప్రాంతం రాష్ట్రంగా ఉన్న అసోంలో మళ్లీ కమలం విరబూయనుంది. బీజేపీకి రెండోసారి అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ+ మిత్రపక్షాలు: 68-76 సీట్లు కాంగ్రెస్ + మిత్రపక్షాలు: 43-51 సీట్లు ఇతరులు: 5-10 సీట్లు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరిలో ఇటీవల పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. అయితే ఆ పరిణామాలు బీజేపీకి ప్లస్ అయ్యాయని తెలుస్తోంది. ఎందుకంటే జరగబోయే ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందనుందని ఈ సర్వే తెలిపింది. అధికారంలో బీజేపీకి దక్కేలా ఉంది. బీజేపీ+ మిత్రపక్షాలు: 17-21 సీట్లు కాంగ్రెస్+ మిత్రపక్షాలు: 8-12 సీట్లు ఇతరులు: 1-3 సీట్లు చదవండి: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే.. చదవండి: మూడో కూటమి.. నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి -
రెండు కీలక రాష్ట్రాల్లో ట్రంప్ వెనుకంజ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండు కీలక రాష్ట్రాల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉన్నారు. విస్కాన్సిన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాదాపు 6 పర్సంటేజ్ పాయింట్లు ఆధిక్యంలో ఉన్నారు. తాజాగా సీబీఎస్ న్యూస్ నిర్వహించిన ఒక ఒపీనియన్ పోల్‌లో ట్రంప్‌ను కలవరపరిచే ఈ విషయాలు వెల్లడయ్యాయి. గత ఎన్నికల్లో ట్రంప్ ఈ రెండు రాష్ట్రాల్లో మంచి మెజారిటీ సాధించడం గమనార్హం. కరోనాను అరికట్టే విషయంలో ట్రంప్ విఫలమయ్యారని, ఈ విషయంలో బైడెన్ సమర్ధవంతంగా వ్యవహరించేవాడని ఈ రాష్ట్రాల ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు ఆ సర్వేలో తేలింది. సీబీఎస్ న్యూస్ తరఫున బ్రిటన్ సంస్థ ‘యుగవ్’ ఈ సర్వే జరిపింది. ‘ఆర్థిక రంగానికి సంబంధించి ప్రజాభిప్రాయం ట్రంప్‌కే అనుకూలంగా ఉంటుంది. కరోనా విషయంలో విఫలమవ్వడం ఆ ఆధిపత్యాన్ని దెబ్బతీసింది’ అని సీబీఎస్ విశ్లేషించింది. బైడెన్‌కు ప్రస్తుతం ఆధిక్యం ఉన్నా.. అది మారవచ్చని పేర్కొంది. -
సర్వేలన్నీ ముక్తకంఠంతో చెప్తున్న మాట ఇదే!
సాక్షి, అమరావతి : తీవ్ర ఆసక్తి రేకిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నదనే అంశంపై ఇప్పటివరకు వెల్లడైన సర్వేలు.. స్పష్టమైన విషయాన్ని వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, స్పష్టమైన మెజారిటీతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఇప్పటీవరకు పలు జాతీయ చానెళ్లు, సర్వే సంస్థలు నిర్వహించిన అభిప్రాయ సేకరణలో వెల్లడైంది. అసెంబ్లీ ఎన్నికలోనే కాదు.. లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని చాటుతుందని, అసెంబ్లీ ఎన్నికల్లో 100కుపైగా సీట్లు సాధించనుండగా.. లోక్‌సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని 25 స్థానాల్లో 20కిపైగా స్థానాలు గెలువనుందని సర్వే సంస్థలు ముక్తకంఠంతో చాటుతున్నాయి. సర్వేల వారీగా ఆ వివరాలను ఒకసారి పరిశీలిస్తే..ఈ కిందివిధంగా ఉన్నాయి.. ఏపీ లోక్‌సభ ఎన్నికల సర్వే వివరాలు సర్వే సంస్థ వైఎస్సార్సీపీ టీడీపీ జనసేన టైమ్స్‌నౌ-వీఎంఆర్ 20 5 0 ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ 20 5 0 ఎన్డీటీవీ 20 5 0 సీపీఎస్ 21 4 0 *** ప్రముఖ సంస్థ లోక్‌నీతి-సీఎస్డీఎస్ తాజాగా నిర్వహించిన ప్రీ-పోల్ సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 46శాతం ఓట్లు రాగా.. టీడీపీకి కేవలం 36శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. రెండు పార్టీల మధ్య పదిశాతం ఓట్ల వ్యత్యాసం ఉంటుందని సర్వే పేర్కొంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సర్వే వివరాలు సర్వే సంస్థ వైఎస్సార్సీపీ టీడీపీ జనసేన వీడీపీఏ అసోసియేట్స్ 106 -118 54 - 68 1-2 సీపీఎస్ 121 - 130 45 - 54 1-2 జగన్ ప్రభంజనం సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని సోమవారం (ఏప్రిల్ 8వ తేదీన) వెల్లడైన మూడు తాజా ఒపీనియన్ పోల్స్ సుస్పష్టం చేశాయి. రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హవా కొనసాగుతోందని, ఆయన నేతృత్వంలోని వైఎస్సార్సీపీ.. ఈ ఎన్నికల్లో విజయ దుందుభి మోగిస్తుందని ఈ పోల్స్ వెల్లడించాయి. టైమ్స్‌నౌ-వీఎంఆర్‌తోపాటు ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లోనూ రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకుగాను 20 స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందని వెల్లడైంది. అధికార తెలుగుదేశం పార్టీ కేవలం ఐదు ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితమవు తుందని ఈ రెండు పోల్స్ స్పష్టం చేశాయి. అంతేగాక ఈ రెండు పార్టీలకు లభించే ఓట్లలో భారీగా తేడా ఉంటుందని వెల్లడించాయి. (చదవండి: జగన్ ప్రభంజనం) వీడీపీఏ అసోసియేట్స్ సర్వేలో వైసీపీకి 106-118 సీట్లు మరోవైపు వీడీపీఏ అసోసియేట్స్ రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని తేలింది. ఆ పార్టీ మొత్తం 43.85 ఓట్ల శాతంతో 106 నుంచి 118 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడైంది. 40 శాతం ఓట్లతో టీడీపీ 54 నుంచి 68 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ఈ సర్వే తెలిపింది. పవన్‌కల్యాణ్ నేతృత్వంలోని జనసేన 9.80 శాతం ఓట్లతో ఒకటి నుంచి మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలిచే అవకాశముందని పేర్కొంది. బీజేపీ 2.40 శాతం ఓట్లు, కాంగ్రెస్ 1.65 శాతం ఓట్లు సాధించినా సీట్లు రావని తేలింది. చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజాభిమానాన్ని కోల్పోయిందని, అదే సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమర్థ పరిపాలన అందించగలరన్న భరోసా ప్రజల్లో నెలకొందని ఈ ఒపీనియన్ పోల్స్ స్పష్టంగా సూచిస్తున్నాయి. గెలుపు జగన్‌దేనంటున్న టైమ్స్‌నౌ-వీఎంఆర్ పోల్.. టైమ్స్‌నౌ ఏపీలో నెల రోజుల వ్యవధిలో రెండోసారి నిర్వహించిన ఓపీనియన్ పోల్‌లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని తేల్చింది. 43.70 శాతం ఓట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 20 ఎంపీ సీట్లు, 35.10 శాతం ఓట్లతో టీడీపీకి ఐదు సీట్లు వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్‌కు 2.1 శాతం, బీజేపీకి 5.7 శాతం ఓట్లు వస్తాయని, ఇతరులకు 13.4 శాతం ఓట్లు వచ్చినప్పటికీ ఎంపీ సీట్లు రావని తేల్చింది. గత నెల మార్చి 22 నుంచి ఈ నెల నాలుగో తేదీ వరకూ దేశవ్యాప్తంగా 960 పోలింగ్‌బూత్‌లలో టైమ్స్ నౌ చానల్-వీఎంఆర్ సంస్థ ఈ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. దీనికి ముందు గత మార్చి నెలలో ఇదే టీవీ చానల్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో వైఎస్సార్సీపీ 48.80 శాతం ఓట్లతో 22 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని, 38.40 శాతం ఓట్లతో టీడీపీ మూడు సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించింది. అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించబోతున్నారని స్పష్టం చేసింది. ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ‘పోల్’లోనూ.. ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లోనూ వైఎస్సార్సీపీకి ఘన విజయం తథ్యమని స్పష్టమైంది. జగన్ సారథ్యంలోని వైఎస్సార్సీపీ 20 ఎంపీ సీట్లను సాధిస్తుందని, అదే సమయంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ఈ సర్వేలోనూ వెల్లడైంది. దేశవ్యాప్తంగా 305 ఎంపీ స్థానాల పరిధిలో ఏప్రిల్ 1 నుంచి ఆరో తేదీ వరకూ ఈ ఒపీనియన్ పోల్ నిర్వహించారు. మొత్తం 36,600 మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. అందులో 19,125 మంది పురుషులు, 17,475 మంది మహిళలు ఉన్నారు. సీపీఎస్ సర్వేలో వైఎస్సార్సీపీ హవా ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించనుందని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్(సీపీఎస్) సర్వే స్పష్టం చేసింది. ఆ పార్టీ ఏకంగా 121 నుంచి 130 ఎమ్మెల్యే సీట్లలో విజయభేరి మోగించి అధికారంలోకి రానుందని తేల్చిచెప్పింది. వైఎస్సార్సీపీ 21 ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధించనుందని పేర్కొంది. అధికార టీడీపీ కేవలం 45 నుంచి 54 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లకే పరిమితం కానుందని వెల్లడించింది. జనసేన పార్టీకి కేవలం ఒకట్రెండు ఎమ్మెల్యే సీట్లు దక్కే అవకాశం ఉందని ఆ సర్వే తేల్చిచెప్పింది. ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు డా.వేణుగోపాలరావు నేతృత్వంలో సీపీఎస్ సంస్థ ఎన్నికల సర్వేల నిర్వహణలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. (చదవండి: ఏపీలో వైఎస్సార్సీపీ హవా) ‘ఫ్యాన్’ ప్రభంజనం! కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని.. దేశవ్యాప్తంగా 106 ఎంపీ సీట్లలో విజయం సాధించడం ద్వారా ఢిల్లీ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నట్లు జాతీయ చానెల్ ఎన్డీటీవీ గత ఆదివారం అంచనా ఫలితాలను వెల్లడించింది. ఏపీలో 25 ఎంపీ సీట్లకుగానూ వైఎస్సార్సీపీ 20 పార్లమెంట్ స్థానాల్లో ఘన విజయం సాధించి ప్రాంతీయ పార్టీల్లో మూడో అతి పెద్ద పార్టీగా నిలుస్తుందని ఎన్డీటీవీ అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 30, తమిళనాడులో డీఎంకే 25 ఎంపీ సీట్లలో విజయబావుటా ఎగురవేస్తాయని తెలిపింది. ఒడిశాలో బిజూ జనతాదళ్ 16 సీట్లు, తెలంగాణలో టీఆర్ఎస్ 15 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో మొత్తం 106 ఎంపీ సీట్లతో ప్రాంతీయ పార్టీల మద్దతు కేంద్రానికి కీలకం కానుంది. (చదవండి : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రభంజనం) ఇతర సర్వేల్లోనూ అవే ఫలితాలు..! ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఎన్నికల అనంతరం ప్రబల శక్తిగా ఆవిర్భవించి దేశ రాజకీయాల్లో సైతం కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు పలు జాతీయ చానెళ్లు ఇప్పటికే తమ సర్వేల ద్వారా అంచనా వేయడం తెలిసిందే. ఏపీలో వైఎస్సార్సీపీ స్వీప్ చేస్తుందని, తిరుగులేని విజయం సాధించి లోక్‌సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఇండియా టీవీ సర్వేలో తేలింది. ప్రజలు స్పష్టంగా వైఎస్సార్సీపీ వైపే మొగ్గు చూపుతున్నారని పేర్కొంది. ఇతర జాతీయ ఛానళ్లు కూడా వైఎస్సార్సీపీ 20 - 22 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని తమ సర్వేల్లో వెల్లడైనట్లు ఇప్పటికే ప్రకటించాయి. టైమ్స్ నౌ, సీఎన్ఎన్ న్యూస్ 18, ఇండియా టుడే తదితర జాతీయ చానెళ్లు వైఎస్ జగన్‌పై ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేశాయి. ప్రముఖ జర్నలిస్టులు రాజ్‌దీప్ సర్దేశాయి, బర్కాదత్, నావికా కుమార్ తదితరులు వైఎస్ జగన్‌తో సంభాషించి ఏపీతోపాటు దేశ రాజకీయాల్లో ఆయన అనుసరించనున్న వైఖరిని తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. అతి త్వరలోనే వైఎస్ జగన్ దేశ రాజకీయాల్లో పోషించనున్న కీలక పాత్రకు ఇవన్నీ సంకేతాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశ రాజకీయాల్లో జగన్‌దే కీలక పాత్ర.. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అద్భుత ఫలితాలను సాధించడం ద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని రెండు జాతీయ చానళ్లు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేశాయి. టైమ్స్‌నౌ-వీఎంఆర్‌తోపాటు ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లోనూ ఏపీలో వైఎస్సార్సీపీ.. టీడీపీకి అందనంత స్థాయిలో సీట్లు కైవసం చేసుకోవడమేగాక దేశంలో బీజేపీ, కాంగ్రెస్, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీల తర్వాత ఎక్కువ స్థానాలు సాధిస్తుందని తేలింది. తద్వారా వైఎస్సార్సీపీ నాలుగో అతి పెద్ద పార్టీగా మారి జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారుతుందని ఈ రెండు సర్వేలు స్పష్టం చేశాయి. (చదవండి: జాతీయ శక్తిగా వైఎస్ జగన్) పచ్చ మీడియా డొల్లతనాన్ని బయటపెట్టిన లోక్‌నీతి ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని తేలడంతో.. బోగస్ సర్వేలతో ప్రజలను బురిడీ కొట్టించడానికి ఆ పార్టీ అనుకూల ఎల్లో మీడియా ప్రయత్నించింది. టీడీపీకి ఏకంగా 126 నుంచి 135 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని, 18 నుంచి 22 ఎంపీ సీట్లు గెలువబోతున్నదని ప్రముఖ సంస్థ లోక్‌నీతి-సీఎస్డీఎస్ సర్వేలో తేలినట్టు ఆంధ్రజ్యోతి పత్రిక బూటకపు సర్వే ప్రకటించడంతో.. ఆ పత్రిక నీతిమాలిన జర్నలిజంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ కథనాన్ని గతంలోనే ఖండించిన లోక్‌నీతి-సీఎస్డీఎస్ సంస్థ తాజాగా మంగళవారం వెల్లడించిన ప్రీ-ఫోల్ సర్వేలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వస్తుందని వెల్లడించింది. ఓట్లపరంగా చూసుకుంటే వైఎస్సార్సీపీకి 46శాతం ఓట్లు వస్తాయని, టీడీపీకి కేవలం 36శాతం ఓట్లే వస్తాయని, రెండు పార్టీల మధ్య 10శాతం ఓట్ల తేడా ఉంటుందని లోక్‌నీతి-సీఎస్డీఎస్ తాజా ప్రీ-పోల్ సర్వేలో స్పష్టం చేసింది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సర్వే చేసిన ఈ సంస్థ ఎన్డీయే మెజారిటీ మార్క్‌ను దాటడం కష్టమేనని, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 263 నుంచి 283 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 115-135 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతర ప్రాంతీయ పార్టీలకు 135 నుంచి 155 స్థానాలు సాధించి.. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించనున్నారని స్పష్టం చేసింది. (చదవండి: తోకపత్రిక దొంగ సర్వే) ప్రముఖ సంస్థ లోక్‌నీతి పేరుతో ప్రచురించిన దొంగసర్వే బెడిసికొట్టినా.. వెనుకకుతగ్గని ఆంధ్రజ్యోతి.. మరోసారి తన చానెల్ ఓ ఫేక్ సర్వేను వండివార్చింది. కార్పొరేట్ చాణక్య పేరుతో ఈసారి కొత్త సంస్థను తెరపైకి తెచ్చి.. టీడీపీ ఏకంగా 101 అసెంబ్లీ సీట్లు గెలుస్తుందని, ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి 71 సీట్లు.. జనసేన మూడు సీట్లు గెలుస్తుందని మరో బోగస్ కథనాన్ని వండివార్చింది. అయితే వారు పేర్కొన్న కార్పొరేట్ చాణక్య సంస్థ గురించి ఇంటర్నెట్లో ఆరా తీయగా.. ఎక్కడా ఎలాంటి వివరాలు లభించలేదు. మరోవైపు తమ పేరును పోలి ఉండేవిధంగా ‘కార్పొరేట్ చాణక్య’ అనే పేరుతో ఫేక్ సర్వేను చేయడంపై ప్రముఖ సర్వే సంస్థ మిషన్ చాణక్య మండిపడింది. తమ పేరును బద్నాం చేసి.. దొంగ సర్వేలను ప్రచురించమే కాకుండా.. తమ ట్రాక్ రికార్డును సైతం కాపీ కొట్టారని ఆ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రజ్యోతి పత్రికలో ఎవరీ చాణక్య అంటూ ప్రచురించిన ట్రాక్ రికార్డు వాస్తవానికి మిషన్ చాణక్యదని స్పష్టం చేసింది. ఆంధ్రజ్యోతి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. చదవండి : మళ్లీ అడ్డంగా బుక్కైన తోక చానల్ చదవండి : ఆంధ్రజ్యోతి ఫేక్ సర్వే.. మండిపడ్డ మిషన్ చాణక్య -
మే 19 వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ : తొలి విడత నుంచి చివరి విడత వరకు ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ఎగ్జిట్ పోల్స్ ప్రచురణ, ప్రసారాలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధించింది. ఈ మేరకు సోమవారం ప్రకటన జారీచేసింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11 ఉదయం 7 గంటల నుంచి మే 19వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధించింది. అలాగే ఒపినీయన్ పోల్స్ ఫలితాలు, సర్వేలు సహా ఎలాంటి ఎన్నికల అంశాలను ఎన్నిక ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయరాదని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. -
ప్చ్.. పల్స్ దొరకట్లేదు!
వేల మంది అభ్యర్థులు, వందలాది పార్టీలు, కూటములు, నామినేషన్‌కు ముందు రోజు కూడా పార్టీలు ఫిరాయించే జంప్ జిలానీలు.. ఇదే ఈసారి లోక్‌సభ ఎన్నికల దృశ్యం. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు నాడి పట్టుకోవడం కాకలు తీరిన ఎన్నికల విశ్లేషకులకి కూడా సాధ్యం కావడం లేదు. కేంద్రంలో ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారని చెప్పడం కత్తి మీద సామేనని ఒపీనియన్ పోల్స్ నిర్వహించే వివిధ సంస్థలు బహిరంగంగా అంగీకరిస్తున్నాయి. మార్పులూ..చేర్పులూ.. ఏడాది క్రితం వరకు మోదీ సర్కార్‌కు మరో చాన్స్ ఇస్తారనే అంచనాలుండేవి. కానీ గత ఏడాది 5 రాష్టాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి మారింది. మూడు హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. పెరిగిపోతున్న నిరుద్యోగం, గ్రామీణ రంగ సంక్షోభం, జీఎస్టీ ప్రభావం వంటివి మోదీ ప్రతిష్టను మసకబార్చాయి. దీంతో అంచనాలు మారాయి. ఇవి బలపడేలోగానే ఎన్నికలకు కాస్త ముందు పుల్వామాలో జవాన్లపై ఉగ్రవాదుల దాడి, దానికి ప్రతీకార దాడులు మోదీ నాయకత్వంపై మళ్లీ ఒక్కసారిగా నమ్మకాన్ని పెంచాయి. ఈ ప్రభావం ఏ మేరకు బీజేపీని విజయతీరాలకు చేరుస్తుందనేది తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు పొత్తులు ఖరారయ్యే వరకు ఎవరు ఎలాంటి గట్టి అంచనాలకు రాలేరన్న అభిప్రాయమైతే నెలకొంది. అందని ఓటరు నాడి.. తగ్గిన సర్వే వాడి ఎన్నికలకు ముందు వచ్చే ఒపీనియన్ పోల్స్, పోలింగ్ రోజు సాయంత్రం విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్‌కి ఈ మధ్య జనాదరణ పెరుగుతోంది. ఏ సంస్థ ఎలాంటి అంచనాలు వేసింది, ఆ సంస్థ చెప్పిన ప్రకారం పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా, ఆ సంస్థకున్న విశ్వసనీయత ఎంత మొదలైనవి చర్చనీయాంశంగా మారుతున్నాయి. భారత్‌లో 1990 తర్వాత ఆర్థిక సరళీకృత విధానాలతో మీడియా రంగానికి బూమ్ బాగా పెరిగింది. ప్రైవేటు పత్రికలు, న్యూస్ చానల్స్ రావడంతో సొంత సర్వేలు నిర్వహించడం మొదలుపెట్టాయి. 1998, తిరిగి 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రవీణ్ రాయ్ సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్)తో కలిసి ఎన్నికల సర్వేలు చేసి బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్ అధికారంలోకి వస్తుందని కచ్చితంగా చెప్పగలిగారు. గత పదిహేనేళ్లుగా ఆయన ఎన్నికల విశ్లేషణలు చేస్తున్నప్పటికీ అప్పటి మాదిరిగా ఇప్పుడు కచ్చితమైన ఫలితాల్ని చెప్పలేకపోతున్నారు. ఉత్తరప్రదేశ్ కాదు ఉల్టా ప్రదేశ్ ఢిల్లీ పీఠానికి దగ్గర దారిగా భావించే ఉత్తరప్రదేశ్‌కు ‘ఉల్టా ప్రదేశ్’ అనే నిక్‌నేమ్ కూడా ఉంది. ఫలితాల్ని ఉల్టాపల్టా చేసే శక్తి ఉన్న ఈ రాష్ట్రంలో ఈసారి హవా ఎవరిదన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. బీజేపీ, కాంగ్రెస్‌ను ఓడించాలన్న లక్ష్యంతో ప్రాంతీయ పార్టీలు ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపాయి. త్రిముఖ పోటీలో ఫలితాలు ఎలా ఉంటాయో అంచనా వేయలేకపోతున్నారు. మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పొత్తులు ఎలాంటి ఫలితాలనిస్తాయి? బీజేపీకి వ్యతిరేకంగా మహాగఠ్‌బంధన్ ఎంతవరకు నిలబడుతుం ది?.. ఇవన్నీ తేలడానికి కొద్ది రోజుల సమయం ఉంది. ఓడిపోతున్న ఒపీనియన్ పోల్స్ సర్వేలు అంత కచ్చితమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్పే దాఖలాల్లేవు. గత మూడు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించే సంస్థలు ప్రజా నాడిని పట్టుకోవడంలో విఫలమయ్యాయి. 2004 తిరిగి 2009 లోక్‌సభ ఎన్నికల్లో వివిధ సర్వే సంస్థలు కాంగ్రెస్‌ను తక్కువగా అంచనా వేశాయి. ఇక గత ఎన్నికల్లో టుడేస్ చాణక్య మినహా మిగతా అందరూ కాంగ్రెస్ మళ్లీ గెలుస్తుందని చెప్పి బోర్లా పడ్డారు. భిన్న మతాలు, విభిన్న కులాలు, ఆదివాసీలు, నిరక్షరాస్యులు అధికంగా ఉన్న భారతదేశంలో శాంపిల్స్ సేకరణ అత్యంత సంక్లిష్టమని ఒపీనియన్ పోల్స్ నిర్వహించే సీఎన్ఎక్స్ సంస్థ అంటోంది. అంతేకాదు డేటా పరిరక్షణ కోసం అమెరికా, యూరప్ వంటి దేశాల మాదిరిగా కఠినమైన చట్టాలు మన దగ్గర లేకపోవడంతో ప్రజలు తమ మనోగతాన్ని నిజాయతీగా చెప్పడానికి భయపడుతున్నారని సీఎన్ఎక్స్ వ్యవస్థాపకుడు భవేశ్ ఝా అన్నారు. -
మధ్యప్రదేశ్‌లో మళ్లీ బీజేపీనే..!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో బీజేపీ రికార్డు సృష్టించనుంది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రానుంది. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటూనే శివరాజ్‌సింగ్ చౌహాన్ మళ్లీ సీఎం కానున్నారు. ఈ నవంబర్ 28న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియాటీవీ–సీఎన్ఎక్స్ నిర్వహించిన ఒక ఒపీనియన్‌పోల్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 230 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీకి ఈసారి 128 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కాస్త పుంజుకుని 85 స్థానాల్లో గెలుస్తుందని సర్వే అంచనా వేసింది. అలాగే, బీఎస్పీ 8 సీట్లలో, ఇతరులు 9 సీట్లలో గెలుస్తారని పేర్కొంది. మాల్వానిమాఢ్ ప్రాంతంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని, అక్కడ 45 సీట్లు గెలుచుకున్నా.. 2013 కన్నా అది 16 స్థానాలు తక్కువేనని వెల్లడించింది. కాంగ్రెస్ అక్కడ గతంలోకన్నా 14 సీట్లు పెంచుకుని 24 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది. మళ్లీ ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగే కావాలని 41% కోరుకోగా, జ్యోతిరాదిత్య సింధియాను 22% మంది, కమల్‌నాథ్‌ను 18% మంది సీఎం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఒక శాతం మాత్రమే సీఎంగా దిగ్విజయ్‌సింగ్‌కు ఓటేయడం గమనార్హం. ముఖ్యమంత్రిగా శివరాజ్ పనితీరుకు 30 శాతం చాలా బాగుందని, 11% బావుందని, 16% పర్లేదని, 22% బాగా లేదని తీర్పిచ్చారు. నిరుద్యోగం, రైతు సంక్షోభం, మహిళల భద్రత.. మొదలైనవి ప్రధానంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ ఒపీనియన్ పోల్‌లో మొత్తం 10 వేల మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలను సేకరించారు. -
కర్ణాటకలో హంగ్ తప్పదన్న సర్వే
-
కాంగ్రెస్ 91.. బీజేపీ 89
కన్నడనాట ఎన్నికలు సమీపిస్తున్న పార్టీల మధ్య పోరు నువ్వా–నేనా అన్నట్లు ఆసక్తికరంగా సాగుతోంది. అధికారం తమదంటే తమదని కాంగ్రెస్, బీజేపీలు చెప్పుకుంటున్నప్పటికీ.. వివిధ సర్వే సంస్థలు సోమవారం ప్రకటించిన ఒపీనియన్ పోల్స్ మాత్రం హంగ్ తప్పదని స్పష్టం చేస్తున్నాయి. టైమ్స్ నౌ–వీఎంఆర్ చేసిన సర్వేలో అధికార కాంగ్రెస్ పార్టీ 91 స్థానాల్లో, బీజేపీ 89 చోట్ల విజయం సాధించే అవకాశాలున్నాయని వెల్లడైంది. గత ఎన్నికల్లో 40 సీట్లు గెలిచిన జేడీఎస్ ఈసారి కూడా అదే సంఖ్యలో సీట్లు గెలుచుకుని కీలకంగా మారనుంది. ఏబీపీ–సీఎస్డీఎస్ సర్వే బీజేపీకి 92, కాంగ్రెస్‌కు 88 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. మొత్తం 224 సీట్లలో అధికారం చేజిక్కించుకునేందుకు కనీసం 113 సీట్లు రావాల్సిందే. సీఎస్డీఎస్ సర్వేలో ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య 46.15%, యడ్యూరప్పకు 31.76%, కుమారస్వామికి 17.63% మంది మద్దతు లభించింది. టైమ్స్‌నౌ–వీఎంఆర్ సర్వేను ప్రాంతాల వారిగా గమనిస్తే.. బాంబే కర్ణాటకలో బీజేపీ ఓటుశాతం 2013 అసెంబ్లీ ఎన్నికల కంటే గణనీయంగా పెరగనుందని సర్వేల ద్వారా స్పష్టమైంది. బాంబే కర్ణాటక ప్రాంతంలో మొత్తం 50 సీట్లున్నాయి. బాగల్కోట్, ధార్వాడ్, బెళగావి, బీజాపూర్, గదగ్ తదితర జిల్లాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడున్న సీట్లలో 2013లో కాంగ్రెస్ 31 చోట్ల గెలవగా.. బీజేపీ 13, జేడీఎస్ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో బలంగా ఉన్న లింగాయత్‌లపై.. కాంగ్రెస్ ఇస్తామన్న ‘మతపరమైన మైనారిటీ హోదా’ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని సర్వే తెలిపింది. గతంలో 13 సీట్లున్న బీజేపీ ఈసారి 23 సీట్లు గెలుచుకునే అవకాశం ఉండగా.. కాంగ్రెస్ 10 స్థానాలు కోల్పోనుంది. కోస్తా కర్ణాటకలో..: ఈ ప్రాంతంలో మొత్తం 21 సీట్లున్నాయి. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపి తదితర జిల్లాలు ఈ ప్రాంతంలో ఉంటాయి. కర్ణాటకలో ముస్లింలు, క్రైస్తవుల సంఖ్య కూడా ఈ ప్రాంతంలో ఎక్కువే. అయితే ఈసారి మెజారిటీ సీట్లలో గెలవాలంటే మతపరమైన పోలరైజేషన్ తప్పనిసరని బీజేపీ భావిస్తోంది. అందుకే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. గ్రేటర్ బెంగళూరులో.. బెంగళూరు నగరంతోపాటు చుట్టుపక్కనున్న 32 నియోజకవర్గాలు గ్రేటర్ బెంగళూరు పరిధిలోకి వస్తాయి. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ 15 చోట్ల, బీజేపీ 12 చోట్ల గెలిచాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ సీట్లు గెలిచే పార్టీకే అధికారం అందే అవకాశాలుంటాయి. చదువుకున్న ఓటర్లు ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉండటం వల్ల పలు అభివృద్ధి అంశాలతోపాటుగా సిద్దరామయ్య లేవనెత్తిన ‘కన్నడ అస్మిత’, బీజేపీ అస్త్రమైన ‘హిందుత్వ’లు కీలకంగా పనిచేస్తాయని భావిస్తున్నారు. ఈసారి రెండు పార్టీలూ తమ సీట్లను మరో రెండు మూడు వరకు పెంచుకునే అవకాశం ఉందని సర్వే తెలిపింది. మధ్య కర్ణాటకలో.. దీన్నే మలెనాడు ప్రాంతం అనికూడా అంటారు. 35 స్థానాలున్న ఈ ప్రాంతంలో యడ్యూరప్ప ప్రభావం స్పష్టంగా ఉంటుంది. బీజేపీకి సానుకూలమైన సెంట్రల్ కర్ణాటకలో 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ 19 సీట్లు గెలుచుకుంది. ఈసారి బీజేపీ.. 22 సీట్లను గెలుచుకోవచ్చని టైమ్స్‌నౌ సర్వే పేర్కొంది. హైదరాబాద్ కర్ణాటక ఈ ప్రాంతంలో ముస్లింల జనాభా ఎక్కువ. కర్ణాటకలోని అత్యంత వెనుకబడిన ప్రాంతమైన హైదరాబాద్ కర్ణాటకలో మొత్తం 31 నియోజకవర్గాలున్నాయి. 2013లో కాంగ్రెస్ 19చోట్ల, బీజేపీ 4చోట్ల గెలిచాయి. బీదర్, గుల్బర్గా, బెళ్లారి, రాయ్‌చూర్ వంటి జిల్లాలు ప్రధానమైనవి. ఈ ప్రాంతంపై యడ్యూరప్పకు మంచి పట్టుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 15 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని సర్వే తెలిపింది. పాత మైసూరు తమిళం మాట్లాడేవాళ్లు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో జేడీ(ఎస్)కు మంచి పట్టుంది. మొత్తం 55 స్థానాల్లో మెజారిటీ చోట్ల ఇక్కడ ఒక్కళిగలు ఫలితాలను ప్రభావితం చేయగలరు. 2013లో కాంగ్రెస్ 25, జేడీఎస్ 23, బీజేపీ కేవలం రెండు స్థానాలు గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో జేడీఎస్ ప్రభావం బీజేపీ కంటే కాంగ్రెస్‌పైనే ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని సర్వేలో తేలింది. అందుకే బీజేపీ గతంలో కన్నా ఆరు సీట్లను, జేడీఎస్ రెండు సీట్లను అదనంగా గెలుచుకోవచ్చని తెలిపింది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కన్నా సిద్దరామయ్య ప్రభావమే ఎక్కువగా కనబడుతుంది. -
టీడీపీ నేతలకు ఈసీ వార్నింగ్!
- అక్రమాలకు పాల్పడితే ఎంతటివారిపైనైనా చర్యలు తప్పవు - టీడీపీ ఎంపీలకు స్పష్టం చేసిన భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ఎన్నికల సంఘంపైనే ఆరోపణలకు దిగిన అధికారపక్షానికి ఈసీ వద్ద గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే ఏస్థాయి వారిపైనైనా కఠిన చర్యలు తప్పవని టీడీపీ నేతలకు ఈసీ వార్నింగ్ ఇచ్చింది. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని, అనవసరంగా తమపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికింది. సర్వేలు, ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం ఎత్తివేయాలన్న టీడీపీ డిమాండ్‌ను తోసిపుచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నాని ఆదివారం ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కలిశారు. వైఎస్సార్ సీపీ నిబంధనలను అతిక్రమిస్తోందని, ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలని కోరారు. డబ్బులు తరలిస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ చేసిన ఫిర్యాదుపై గంటలోనే స్పందించారని, అందులో నిజం లేదని తేలినా ఆపార్టీపై చర్యలు తీసుకోలేదని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఈ వ్యాఖ్యలపై భన్వర్‌లాల్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల సంఘం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఏ ఆధారంతో ఆరోపిస్తున్నారని టీడీపీ ఎంపీలను భన్వర్‌లాల్ నిలదీసినట్టు తెలిసింది. సర్వేలపై దర్యాప్తునకు ఆదేశం: నంద్యాల ఉప ఎన్నికల్లో సర్వేలు, ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం కొనసాగుతుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందే ఎవరికి ఓటు వేస్తారని ఓటర్లను అడగడం చట్టవిరుద్ధమని ఈసీ చెప్పినట్లు తెలిసింది. సర్వే పేరుతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, భయపెట్టడం లాంటి చర్యలకు దిగుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందటంతోనే సర్వేలు, ఒపీనియన్ పోల్స్ నిషేధించామని టీడీపీ నేతలకు భన్వర్‌లాల్ వివరించారు. ఇప్పటివరకూ జరిగిన ఇలాంటి వాటిపై దర్యాప్తునకు ఆదేశించినట్టు ఆయన స్పష్టం చేశారు. నంద్యాల ఉప ఎన్నిక జరిగే ఈ నెల 23వ తేదీ సాయంత్రం వరకూ ఎలాంటి సర్వేలు, ఒపీనియన్ పోల్స్ నిర్వహించవద్దని, వాటిని ఏ చానల్ ప్రసారం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఢిల్లీలో బీజేపీకి బంపర్ మెజారిటీ!
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్లీ షాక్ తగలబోతుందా?... అవుననే అంటున్నాయి సర్వేలు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ మీడియా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఒపినియన్ పోల్స్ ఫలితాల్లో బీజేపీకి బంపర్ మెజారిటీ రానుందని తేలింది. టైమ్స్ నౌ, వీఎమ్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో 272 సీట్లకు గానూ బీజేపీ 195 సీట్లను కైవసం చేసుకోనున్నట్లు వెల్లడించింది. ఆప్‌కు 55 స్థానాలు దక్కుతాయని తెలిపింది. మూడు మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ సొంతం చేసుకోనున్నట్లు తెలిపింది. ఉత్తర, దక్షిణ, తూర్పు మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదివారం పోలింగ్ జరనున్న విషయం తెలిసిందే. అలాగే ఏబీపీ న్యూస్ నిర్వహించిన సర్వేలో కూడా ఫలితాలు బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. ఉత్తర కార్పోరేషన్‌లోని 104 స్థానాలకు గానూ 76, దక్షిణలో 104 సీట్లకు 60, తూర్పులో 64 స్థానాలకుగానూ 43 స్థానాలలో బీజేపీ గెలవనున్నట్లు సర్వే పేర్కొంది. అయితే ఈ ఎన్నికల్లో ఆప్ మాత్రం 45 సీట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోనుందట. మొత్తంగా బీజేపీ 41.9 శాతం ఓట్ షేర్ సాధిస్తోందని ఏబీపీ న్యూస్ వెల్లడించింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సాధించిన ఓట్ షేర్ సగానికి తగ్గుతుందని సర్వేలో తేలడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ, ఆప్‌ల తరువాత మూడో స్థానంలో నిలుస్తుందని సర్వేలు తెలిపాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి ఆప్‌ను గట్టి దెబ్బ కొట్టాలని కమలనాధులు భావిస్తున్నారు. పేరుకు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలే అయినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఎన్నికలను గమనిస్తున్నారు. ఇప్పటికే పంజాబ్, గోవా శాసనసభ ఎన్నికల్లో కంగుతిన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాగైనా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే ఎన్నికలు దగ్గరపడిన వేళ ఆప్ పార్టీ నేతలు చీపురును వదిలి కాషాయ కండువా కప్పుకోవడం మరోవైపు ఆప్‌కు ఎదురుదెబ్బగానే చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఎన్నికల ప్రచారంలో బీజేపీ చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోగా, ఆప్ మాత్రం ఆపసోపాలు పడింది. ఇక కాంగ్రెస్ మూడోస్థానంలోనే నిలిచింది. కాగా కాంగ్రెస్ చేయించిన అంతర్గత సర్వేలో ఆ పార్టీకి 208 స్థానాలు దక్కడం ఖాయమని తేలడం విశేషం. అలాగే తమ పార్టీల అంతర్గత సర్వేల్లో ఆప్‌తో పాటు బీజేపీ కూడా ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలలో విజయం తమదే అని ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ రాజకీయ విశ్లేషకులు మాత్రం ఢిల్లీవాసుల తీర్పు ఎవరి పక్షాన ఉంటుందనేది అంచనా వేయడానికి తర్జనభర్జనలు పడ్డారు. -
యూపీ, పంజాబ్‌లో హంగ్!
గోవాలోనూ అంతే... ► ఉత్తరాఖండ్ బీజేపీదే ► ఒపీనియన్ పోల్స్ వెల్లడి న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. దేశంలో ఎక్కువ అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్తోపాటుగా పంజాబ్, గోవాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాదని, ఉత్తరాఖండ్‌లో మాత్రం కమలదళానిదే అధికారమని ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ద వీక్–హంస రీసెర్చ్ సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. ‘మొత్తం 403 స్థానాల్లో బీజేపీకి 192–196 సీట్లు రావొచ్చు. సమాజ్‌వాదీ– కాంగ్రెస్ కూటమికి 178–182 సీట్లు, బీఎస్పీ అతి దారుణంగా 20–24 స్థానాలకు పరిమితం అవుతుందని తేలింది. ఇతరులు 5–9 సీట్లు గెలుచుకుంటారు’ అని సర్వే అంచనా వేసింది. అటు పంజాబ్‌లోనూ హంగ్ తప్పేట్లు కనిపించటం లేదంది. ‘పంజాబ్‌లోని 117 సీట్లలో కాంగ్రెస్ 49–51 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 33–35 స్థానాలతో రెండో స్థానంలో, అకాలీదళ్–బీజేపీ కూటమి 28–30 సీట్లతో మూడో స్థానంలో నిలవనుంది. ఇతరులకు 3–5 సీట్లు వస్తాయి’ అని సర్వే పేర్కొంది. 70సీట్లున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ 37–39 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకుం టుందని.. కాంగ్రెస్ 27–29 స్థానాల్లో, బీఎస్పీ 1–3 స్థానాల్లో గెలవొచ్చని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. గోవాలో 40 సీట్లకు గానూ అధికార బీజేపీ 17–19, కాంగ్రెస్ 11–13 స్థానా ల్లో గెలుపొందే అవకాశం ఉంది. ఆప్ 2–4 సీట్ల కు, మహారాష్ట్ర గోమంతక్ పార్టీ ఆధ్వర్యంలోని కూటమి 3–5 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. యూపీలో కాంగ్రెస్– ఎస్పీ జట్టుకట్టాక (వారం క్రితం) ఈ పోల్ నిర్వహించారు. యూపీలో అంచనా ఇలా.. బీజేపీ కూటమి 192–196 ఎస్పీ–కాంగ్రెస్ 178–182 బీఎస్పీ 20–24 ఇతరులు 5–9 మొత్తం స్థానాలు 403 -
యూపీలో బీజేపీ కాదు.. ఆ పార్టీకి మెజారిటీ?
భిన్నమైన ఫలితాలను ప్రకటించిన ఓపినియన్ పోల్స్ బీజేపీకి ఇండియా టుడే సర్వే.. ఎస్పీకి ఏబీపీ న్యూస్ సర్వే మెజారిటీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వెలువడిన ఒపీనియన్ పోల్స్ ఫలితాలు నిట్టనిలువునా చీలిపోయాయి. రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి సంపూర్ణమైన మెజారిటీ వస్తుందని ఇండియా టుడే-యాక్సిస్ సర్వే అంచనా వేయగా.. ఈ అంచనాతో ఏబీపీ న్యూస్-లోక్‌నీత్-సీఎస్డీఎస్ సర్వే విభేదించింది. యూపీలో పోటీ హోరాహోరీగా ఉంటుందని, ఎస్పీకి మెజారిటీ స్థానాలు రావొచ్చునని పేర్కొంది. ఫిబ్రవరి 11 నుంచి ఏడు దశలుగా ఎన్నికలు జరగనున్న యూపీ (403)లో బీజేపీ 206 నుంచి 216 అసెంబ్లీ స్థానాలు గెలుపొందుతుందని ఇండియా టుడే-యాక్సిస్ సర్వే అంచనా వేసింది. కుటుంబ పోరుతో సతమతమవుతున్న ఎస్పీకి 92-97 స్థానాలు, బీఎస్పీకి 79-85 స్థానాలు రావొచ్చునని పేర్కొంది. కాంగ్రెస్ 5-9 నుంచి స్థానాలతో సరిపెట్టుకుంటుందని తెలిపింది. పెద్దనోట్ల రద్దుకు ముందు బీజేపీకి యూపీలో 31శాతం ఓట్లు వచ్చే అవకాశముండగా.. నోట్లరద్దుతో మరింతగా కలిసివచ్చిందని, ఆ పార్టీకి వచ్చే ఓటుషేర్ డిసెంబర్లో 33శాతం పెరిగిందని ఈ సర్వే పేర్కొంది. ఇక ఏబీపీ న్యూస్-లోక్‌నీత్-సీఎస్డీఎస్ సర్వే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ- ఎస్పీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని అంచనా వేసింది. అయితే, అధికార పార్టీ ఎస్పీకి ఎక్కువ సీట్లు రావొచ్చునని పేర్కొంది. ఎస్పీకి 141-151 సీట్లు, బీజేపీకి 129-139 సీట్లు, బీఎస్పీకి 93-103 సీట్లు, కాంగ్రెస్‌కు 13-9 సీట్లు రావొచ్చునని పేర్కొంది. ఇక పంజాబ్ విషయంలోనూ సర్వేల ఫలితాల్లో పోలిక లేదు. ఏబీపీ న్యూస్-లోక్‌నీత్-సీఎస్డీఎస్ సర్వే పంజాబ్‌లో అధికార శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ)-బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహారీ ఉంటుందని, ఎస్ఏడీ-బీజేపీ మిత్రపక్షాలకు 50-58 సీట్లు, కాంగ్రెస్‌కు 41-49 సీట్లు రావొచ్చునని పేర్కొంది. ఆప్ 12-18 సీట్లు గెలుచుకోవచ్చునని పేర్కొంది. అయితే ఇండియా టుడే యాక్సిస్ సర్వే మాత్రం కాంగ్రెస్-ఆప్ మధ్య పోటీ ఉంటుందని, కాంగ్రెస్‌కు 49-55 సీట్లు, ఆప్‌కు 42-46 సీట్లు వస్తాయని, ఎస్ఏడీ-బీజేపీకి 17-21 సీట్లు వచ్చే అవకాశముందని పేర్కొంది. ఇక ఉత్తరాఖండ్‌లోని 70 స్థానాలలో బీజేపీ 35-45 స్థానాలతో అధికారంలోకి రావొచ్చునని, అధికార కాంగ్రెస్‌కు 22-30 సీట్లు వస్తాయని పేర్కొంది. -
‘గెలుపు లౌకిక కూటమిదే!’
న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన రోజే ఒపీనియన్ పోల్స్ ఫలితాల సందడి ప్రారంభమైంది. ‘ఇండియా టీవీ’కోసం ‘సీ-ఓటర్’ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల లౌకిక కూటమి గెలుస్తుందని తేలింది. మొత్తం 243 సీట్లకు గాను ఆ కూటమికి 116 నుంచి 132 రావొచ్చని ఆ చానెల్ బుధవారం ప్రకటించింది. బీజేపీ, ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్పీ, హెచ్‌ఏఎంల ఎన్డీయే కూటమికి 94 నుంచి 110 సీట్లు రావొచ్చని పేర్కొంది. ఆగస్ట్ చివరి వారం, సెప్టెంబర్ తొలి వారంలో మొత్తం నియోజకవర్గాల్లోని 10,683 మంది నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఈ ఫలితాలను క్రోడీకరించామని తెలిపింది. అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరు కాగలరనే విషయంలో జేడీయూ నేత నితీశ్ కుమార్‌కు 53% మంది మద్దతు తెలపగా, సుశీల్ మోదీ(బీజేపీ)కి 18% మంది మొగ్గు చూపారు. కేవలం 5% మందే లాలూను సీఎంగా కోరుకున్నారు. 2010 ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ కూటమి 206 స్థానాల్లో గెలిచింది. -
అసాధారణం మోదీ హ్యాట్రిక్
మోదీ వాగ్దానం చేసిన సుదూర గమ్యానికి చేరే దారి సునాయాసమైనదని ఆశించడం అత్యాశ. రాజకీయ వర్గంలోనూ, ప్రభుత్వ యంత్రాంగంలోనూ భారీ ఎత్తున జడత్వం ఉంది. అది అత్యుత్తమ లక్ష్యాలను సైతం నంగితనంగా మార్చేస్తుంది. స్వేచ్ఛ నిరంతర అప్రమత్తతను డిమాండు చేస్తుంది. ఎన్నికల వల్ల శిక్షకు గురవుతామనే భయం, ప్రతిఫలం దక్కుతుందనే ఆశా ఉండటం వల్ల రాజకీయాలు ఇంకా కచ్చితంగానే పనిచేస్తున్నాయి. దురదృష్టవశాత్తూ ప్రభుత్వంలోని ఇతర భాగాలకు ఎన్నికలను విస్తరింపజేయలేం. ప్రజలను నిర్ణేతలుగా వ్యవహరించడానికి అనుమతించలేనప్పుడు వారి తరఫున ప్రధాని ఆ పని చేయాల్సి ఉంటుంది. అభిప్రాయ సేకరణలు, ఎగ్జిట్ పోల్స్ తప్పు కాజాలవని కచ్చితంగా చెప్పగలమా? వాటి మధ్య వ్యక్తమయ్యే ఏకీభావం ఒక ధోరణిని ధ్రువపరుస్తుంది. కానీ అవి ఎందుకైనా మంచిదని తాము పేర్కొనే నిర్దిష్టమైన అంకెలకు 5 శాతం తేడా ఉండే అవకాశాన్ని బ్రాకెట్లలో ఉంచుకుంటాయి. దురదృష్టకరమైన ఆ పాత రోజుల్లో అది కేవలం 3 శాతంగా మాత్రమే ఉండేది. కానీ నేడు వ్యక్తిగత విచక్షణ సాహసానికి సమానార్థకంగా మారింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలు రెంటిలోనూ బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని పిలుస్తారనడం ఖాయం. అయితే అది తన సొంత బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? లేక ఇప్పటి లేదా భవిష్యత్ మిత్రులతో కలిసి ఏర్పాటు చేస్తుందా? అనేది వేరే సంగతి. భారత ఓటర్లు ఓటు చేసినప్పుడల్లా నిర్ణయాత్మకంగానే ఓటు చేస్తారనే విషయాన్ని ఇటీవలి ఎన్నికల చరిత్ర రుజువు చేస్తోంది. 2009 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ అదే జరిగింది. అనిశ్చితికి తావు లేని విధంగా లేదా ‘సంకీర్ణం నిర్బంధాల’వల్ల పరిపాలన కష్టమైందంటూ డాక్టర్ మన్మోహన్ చూపిన సుప్రసిద్ధమైన సాకుకు తావు లేకుండా చేయాలన్నట్టుగా ఓటర్ల తీర్పు ఉంటోంది. భారీ ఎత్తున అవినీతిని అనుమతించ డాన్ని మిత్రపక్షాలు అధికారానికి చెల్లించక తప్పని మూల్యాన్ని చేశాయంటూ డాక్టర్ మన్మోహన్ ఇచ్చిన సుప్రసిద్ధమైన వివరణ ప్రజలకు ఏ మాత్రం రుచించలేదు. రాబర్ట్ వాద్రాకు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేకూర్చిన మేళ్లను లేదా మిత్ర పక్షాల ప్రమేయమే లేని ఆగస్టా హెలికాప్టర్ల కొనుగోలు వంటి వ్యవహారాలలో కూడా ఆయన అనేకమార్లు ఇదే ప్రముఖ పద ప్రయోగాన్ని వాడారు. ఇక స్పష్టంగా కనిపిస్తున్న రెండవ అంశం రాజకీయంగా మరింత ప్రాధాన్యం కలిగిన విషయాన్ని వెల్లడించింది. బీజేపీ ఎంత మంచి ఫలితాలను సాధించిందనే దానితో సంబంధం లేకుండానే కాంగ్రెస్ ఓడిపోయిందనేది నిస్సందేహం. కాంగ్రెస్ తన కున్న రెండు కీలకమైన ప్రాంతీయ దుర్గాల్లో మూడు లేదా నాలుగో స్థానంలో మిగిలే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఓటమికి గురైందనడం బహుశా సుతి మెత్తటి పద ప్రయోగమే కావచ్చు. ఢిల్లీ గద్దె దిశగా తిరిగి సాగించాల్సిన సుదీర్ఘ యాత్రను ప్రారంభించడానికి కాంగ్రెస్‌కు ఉన్న చిట్టచివరి సరిహద్దు ప్రాంతం మహారాష్ట్రే. కాబట్టి ప్రత్యేకించి అక్కడి ఫలితాలు దానికి ముఖ్యమైనవి. ఓట్ల లెక్కింపు ఇంకా ముగియక ముందే ఆ పార్టీలో అంతర్గత యుద్ధాలు మొదలయ్యాయి. తనకు ముందటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, వారి లాబీలే ఈ ఓటమికి కారణమని పృధ్వీరాజ్ చవాన్ బహిరంగంగానే తప్పు పట్టడం ప్రారంభించారు. ఆయనపై వారి ఎదురు దాడులూ మొదలయ్యాయి. అత్యంత అసమర్థుడైన, చిత్రమైన క్విక్జోటిక్ నేత రాహుల్ గాంధీ. ఆయనకు అండదండగా ఉండి, ప్రోత్సహించినది ఆయన తల్లి సోనియా గాంధీ. ఓటమికి అసలు కారకులు వారిద్దరే. అయినా వారిని తప్పు పట్టే సాహసం మాత్రం ఎవరికీ లేదు. పార్టీ లేదా దేశ ప్రయోజనాలకంటే అత్యున్నత స్థానానికి కుమారుని ఎదుగుదల నిలిచిపోవడమే ముఖ్య సమస్యగా ఆ తల్లి భావిస్తుంది. ఇక హర్యానాకు వస్తే ఎన్నికల మధ్యలో ముఖ్యమంత్రి భూపిందర్ హుడా, వాద్రాకు మేలు చేకూర్చే మరో భూ ఒప్పందానికి ఆమోదం తెలిపినప్పుడే లాంఛనంగా కాంగ్రెస్ ఓటమిని అంగీకరించారు. రాజకీయంగా కుప్పకూలిన పార్టీ శిథిలాల నుండి కాంగ్రెస్ అధికార కుటుంబం మరోసారి వ్యక్తిగత ఆస్తులను ఏరుకోవడం ప్రారంభించింది. నాలుగు నెలల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ అసాధారణమైన మూడు విజయాలను సాధించారు. మేలో బీజేపీకి లోక్‌సభలో ఉన్న స్థానాలను రెట్టింపు చేయడమే కాదు, 1985 తదుపరి మొదటిసారిగా ఒక్క పార్టీకి ఆధిక్యతను కట్టబెట్టారు. భారత పార్లమెంటరీ చరిత్రలో మరెవరూ అలాంటి భారీ గంతును వేసింది లేదు. రెండు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి చారిత్రాత్మకమైన రీతిలో ఆయన ఆయా శాసనసభలలోని బీజేపీ స్థానాలు పెరిగేలా ఆ పెరుగుదల స్థాయి విస్మయం గొలిపేదిగా ఉంది. ఓటమి గాయాన్ని మిగులుస్తుంది. అయితే విజయం ఆందోళనను కూడా కలిగిస్తుంది. ఎందుకంటే విజయం ఎప్పుడూ ఆకాంక్షల అశ్వాన్ని అధిరోహించే వస్తుంది.శాసనసభలోని అంకెలు ఆవశ్యకమైన బలానికి కొలబద్దే. కానీ అవే సరిపోవు. విషాదకరమైన ఇందిరాగాంధీ హత్య కారణంగా రాజీవ్‌గాంధీకి బహూశా మరెవరూ గెలుచుకోలేనంత ఎక్కువ మంది ఎంపీలు లోక్‌సభలో ఉండేవారు. కానీ ఆ సంఖ్య అనుభవానికి పరిహారం కాలేకపోయింది. తరచుగా ఆయన అనవసరమైన జాగ్రత్తకు, అత్యధికమైన నిశ్చితత్వానికి మధ్య ఊగిసలాడేవారు. షాబానో మనోవర్తి కేసు విషయంలో ఆయన చేసినది మౌలికమైన తప్పు. మితవాద లాబీల ప్రేరణతో పూర్తిగా అనవసరమైన జాగ్రత్త వహించి ఆయన దేశం తనపై ఉంచిన నమ్మకాన్ని దెబ్బతీశారు. పైగా ఆ చర్య మార్పు చెందుతున్న మన ఓటరు మానసిక స్థితిని కూడా తప్పుగా అంచనా కట్టింది. శ్రీలంకలో భారత సైనిక జోక్యం ఆవశ్యకమని ఆయన నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఇవి రెండూ ఆయన నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులు చేయడానికి రెండు ఉదాహరణ లు. నరేంద్ర మోదీ ప్రధాని పీఠంపైకి పైనుంచి ఊడిపడ్డవారేమీ కాదు. జాతీయ స్థాయి గుర్తింపును పొందగలగడానికి తగినంత విజయవంతగా ఆయన గుజరాత్లో పరిపాలన సాగించారు. తనకు ఏమి కావాలి? అనే విషయంలో ఆయనకు సంతులన దృష్టి ఉంది. ఫలితాలైనా ప్రకటించక ముందే ఆయన రెండవ దశ అయిన ప్రభుత్వం ఏర్పాటును ప్రారంభించారు. అయితే అలా అని ఆయన వాగ్దానం చేసిన సుదూర గమ్యానికి చేరే దారి సునాయాసమైనదని ఆశించడం అత్యాశ. రాజకీయ వర్గంలోనూ, ప్రభుత్వ యంత్రాంగంలోనూ భారీ ఎత్తున జడత్వం ఉంది. అది అత్యుత్తమ లక్ష్యాలను సైతం నంగితనంగా మార్చేస్తుంది. స్వేచ్ఛ నిరంతర అప్రమత్తతను డిమాండు చేస్తుంది. మన దేశ స్వాతంత్య్రానికి సంబంధించి పెద్దగా అప్రమత్తత అవసరం లేదు. పరిపాలన విషయంలో మాత్రం అవసరం. మనలోని ఉన్నత వర్గ స్వభావం జవాబుదారీతనం పట్ల విముఖతను కలిగిస్తుంది. ఎన్నికల వల్ల శిక్షకు గురవుతామనే భయం, ప్రతిఫలం దక్కుతుందనే ఆశా ఉండటం వల్ల రాజకీయాలు ఇంకా కచ్చితంగానే పనిచేస్తున్నాయి. దురదృష్టవశాత్తూ ప్రభుత్వంలోని ఇతర భాగాలకు ఎన్నికలను విస్తరింపజేయలేం. ప్రజలను నిర్ణేతలుగా వ్యవహరించడానికి అనుమతించలేనప్పుడు వారి తరఫున ప్రధాని ఆ పని చేయాల్సి ఉంటుంది. ఎం.జె. అక్బర్ -
చరిత్రకు ఎవరైనా ఒక్కటే!
స్కాట్లాండ్ జాతీయవాదులు ఆధిక్యంలో ఉన్నారంటూ గత వారాంతంలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఫలితం వెల్లడించడంతో ఇంగ్లండ్ ఉలిక్కిపడింది. నెల క్రితం నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో స్కాట్లాండ్ జాతీయవాదులు ఇరవై శాతం పాయింట్లు వెనకబడి ఉన్నారు. ఎటూ తేల్చుకోని ఓటర్లలో సగం మంది ఇప్పుడు విభజనకే మొగ్గు చూపుతున్నారని తేలింది. దేశ విభజన అంటే బ్రిటిష్ వాడి కత్తితో మనకు మనం చేసుకున్న లోతైన గాయమని నమ్మే భారతీయుడికి ఆ దేశం గురించిన ఓ ఆలోచన ఎంతో కొంత సంతృప్తిని కలిగించకుండా ఉండదు. సెప్టెంబర్ 18న అక్కడ జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో బ్రిటన్ రెండు ముక్కలుగా చీలిపోవచ్చునన్న ఆలోచన అది. చరిత్రకు న్యాయం జరిగిందని అనిపించడం అరుదే అయినా, ప్రతీకారం లాంటిది ప్రతిధ్వనిస్తున్నప్పటికీ అన్నింటినీ పక్కనపెట్టి జరుగుతున్నది చూసి మనం సంతోషించగలం. ఇంగ్లండ్‌తో మూడు శతాబ్దాలుగా సాగిస్తున్న ఐక్యతను కొనసాగించే విషయం మీద సెప్టెంబర్ 18న ఓటుతో స్కాట్లాండ్ తన నిర్ణయాన్ని ప్రకటించబోతోంది. ఈ భూమండలం మీద ఎక్కడైనా ఇలాంటి ప్రజాభిప్రాయ సేకరణ ఆవిష్కృతమైందా? బ్రిటన్ ఆత్మాతిశయంతో కూడిన ఒక సమష్టి మనస్తత్వం కలిగిన ఊహాప్రపంచం. రెండుమూడు పార్టీల ఆ దేశ రాజకీయ వ్యవస్థ స్కాట్ ప్రాంత జాతీయవాదులకు ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు అవకాశం ఇవ్వడానికి అంగీకరించినందుకు చాలా ఆనందపడింది. స్కాట్లాండ్ వాసులు విభజనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని సంపూర్ణంగా విశ్వసించడమే ఇందుకు కారణం. ఇలాంటి ధోరణి లండన్ నగరంలో మరీ విపరీతంగా ఉంది. ఎప్పుడూ దిలాసాగా ఉండే లండన్ మేయర్ బోరిస్ జాన్సన్‌కు ఇతర విషయాల కంటె గ్లాస్గో పబ్‌లలో కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడడమే ఎక్కువ ఇష్టం. స్కాట్లాండ్లో తగినంత ప్రచారం చేయడం గురించి ప్రధాని డేవిడ్ కామెరూన్ కూడా ఒక వారం క్రితం వరకు పెద్దగా పట్టించుకోలేదు. సంప్రదాయ పంథాలో నడిచే ‘స్పెక్టేటర్’ పత్రిక (ఒకప్పుడు జాన్సన్ ఈ పత్రిక సంపాదకుడు) ప్రముఖ కాలమిస్టుల రచనల నుంచి కొన్ని భాగాలను తీసి ప్రచురించింది. ఆగస్టు మధ్యలో ప్రచురించిన ఈ భాగాలలో కేవలం ‘స్కాట్లాండ్ ముక్క’ అని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు స్కాట్లాండ్లో ఇంకా డోలాయమాన స్థితిలో ఉన్నవారికి విభజనకే ఓటు వేయండి, అంటే ‘ఎస్’ అని చెప్పండి అంటూ ఇంగ్లిష్ ప్రముఖులు సంతకాలు చేసిన లేఖలు కూడా ఇవ్వగలరు. మీ సొంత బీరు, సొంత విమానయానం ఉంటే తప్ప మీది అసలు సిసలు దేశం కాలేదంటూ హాస్య చతురత అతిశయించిన ఆంగ్లేయులు తీర్మానించేశారు. స్కాట్లు స్కాచ్ అంటే ఇష్టపడతారు. అయితే స్కాట్లాండ్ జాతీయవాదులు మొదటిసారి ఆధిక్యంలో ఉన్నా రంటూ గత వారాంతంలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఫలితం వెలు వడడంతో ఇంగ్లండ్ ఒక్కసారి ఉలిక్కిపడింది. కానీ, ఒక నెల క్రితం నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో స్కాట్లాండ్ జాతీయవాదులు ఇరవై శాతం పాయింట్లు వెనకబడి ఉన్నారు. విభజనకు ఓటు వేయాలో, ఐక్యత వైపు మొగ్గాలో ఇంతవరకు తేల్చుకోని ఓటర్లలో సగం మంది, ఇప్పుడు విభజన దిశగానే చూస్తున్నారని తేలింది. అమెరికా కాలనీ నుంచి తిరిగి వచ్చిన కారన్వాలిస్ యుద్ధంలో జార్జి వాషింగ్టన్ గెలిచాడని చెప్పిన క్షణంలో అంతకు ముందెన్నడూ అంత తీవ్రంగా లండన్ బెదిరి ఉండకపోవచ్చు. దృఢమైన వాదనే ఒప్పించ గలిగింది. స్కాట్లాండ్ ఇంగ్లండ్‌ను వీడిపోలేదు. అది ప్రపంచంలో ఒకటైంది. నిజానికి 18న జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో అత్యధికులు విభజనకు అనుకూలంగా ఓటు వేస్తారన్నది ఇప్పటికీ నిశ్చయమేమీ కాదు. కానీ ఒకటి మాత్రం నిజం. గెలుపును నిర్ణయించే మార్జిన్ ఓట్లు అతి స్వల్పంగానే ఉంటాయి. కాగా, గ్రేట్ బ్రిటన్ బతికి బట్టకట్టగలిగినా కూడా ఒకింత రాజకీయ ఐక్యతతో ఉంటుందే తప్ప, భౌగోళిక ఐక్యతకు నోచుకోదు. స్కాట్లాండ్కు ఎప్పుడూ తనదైన ఒక ఫుట్‌బాల్ ఆటగాళ్ల బృందం ఉంది. అయితే ఈ బృందం ఇంగ్లండ్ బృందం కంటే ఎప్పుడూ మెరుగ్గా లేదన్నది నిజం. అయినా ఆ క్రీడ ద్వారా ఉనికిని చాటుకోవడానికి వారికి ఉన్న హక్కుకు నీళ్లు వదులుకోవడం మంచిద ని స్కాట్లాండ్ను ఒప్పించడానికి ఇంగ్లండ్ ఏనాడూ ప్రయత్నించలేదు. ఫుట్‌బాల్ ఆట పురాతనత్వానికి ప్రతీక. దానిని పాలన కోసం చేసుకున్న ఆధునిక ఏర్పాట్లు తుడిచిపెట్టలేవు. తీర్పు మాటెలా ఉన్నా, ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఒక స్ఫూర్తిని పునరుజ్జీవింప చేయవచ్చునని అనిపిస్తుంది. పౌండ్ అనే కరెన్సీతో కొనడం సాధ్యం కాని స్ఫూర్తి అది. కలిపి ఉంచాలన్న తమ ప్రయత్నాలు విఫలమైతే బ్రిటన్ అనుకూల లాబీ గుండె చెదరవచ్చు. ఒకవేళ విజయం ఆ లాబీని వరిస్తే, ఆ విజయాన్ని ఇంకా గుర్తించవలసి ఉన్నప్పటికి కూడా దానికి చాలా మూల్యం చెల్లించి బ్రిటన్ కొనుగోలు చేయవలసి ఉంటుంది. అది బ్రిటన్ చిరకాలం పాటు భరించలేనంత మూల్యం. యాభై లక్షల సమూహంతో సాంస్కృతికంగా, ఆర్థికంగా బలంగా ఉండే ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకోగలిగిన సామర్థ్యం తాము కలిగి ఉన్నామని ఇప్పటికే ఎక్కువ మంది స్కాట్లు నమ్మకానికి వచ్చారు. ఈ రెండు కూడా యునెటైడ్ కింగ్డమ్లో సాధ్యమేనని లండన్ నిర్ధారించవలసి ఉంది. ఇలాంటి స్కాట్లాండ్కు కావలసిన ముద్రను ఎవరు ఎంపిక చేయగలరు? ఒకే పతాకం కింద ఉండాలని ముందు నుంచి చెప్పిన ఇంగ్లిష్ భాషే. ఇక సెప్టెంబర్ 18, 2024న ఇంగ్లండ్‌లో ఇంగ్లిష్ స్వాతంత్య్రం కోసం బ్రిటన్ ప్రజాభిప్రాయ సేకరణ జరపడానికి ఇక అడ్డం ఏమిటి? ఈ ఆలోచనను కొట్టి పారేయవద్దు. పడుగుపేకల వంటి ఈ దేశాలలో ఇంకా విచిత్రమనిపించే సంఘటనలే చోటు చేసుకున్నాయి. ఇంగ్లండ్, స్కాట్లాండ్ల వైవాహిక జీవితం ఇక ముగిసిన అధ్యాయం. విడాకుల తతంగం విఫలమైతే, అందుకు కారణం ఒక భాగస్వామి దీర్ఘకాలం పాటు మనలేని ఆర్థిక షరతులు విధించడానికి ప్రయత్నిస్తూ ఉండడమే. ఒకప్పుడు ఈ వైవాహిక జీవితం సజావుగా సాగిన మాట నిజమే. ఎందుకంటే ఇంగ్లండ్, స్కాట్లాండ్లు కలసి సంతానాన్ని సృష్టించాయి. ఆ సంతానాన్ని సాకాయి. ఆ సంతానం నుంచి ఆ రెండు ప్రాంతాలు కూడా విశేషంగా లబ్ధి పొందాయి. వాటినే కాలనీలు అని పిలిచారు. సంపద్వంతమైన భారత్ కూడా ఆ కుటుంబంలో ఒకటి. మిగిలిన సంతానం వలెనే భారత్ కూడా పెరిగి పెద్దదై, తన కాళ్ల మీద తాను నిలబడింది. ఈ సంతానం ఇప్పుడు చుట్టం చూపుగానే ఇంగ్లండ్‌ను చూస్తున్నది. అంత వరకే. ఇప్పుడు భారతీయులు ఎలిజబెత్ అనే పేరు గల అమ్మను చూడ్డం కంటే అంకుల్ని చూడ్డానికి ఎక్కువ తహతహలాడుతున్నారు. ఆయన పేరు శామ్. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరూ బాగానే స్థిరపడ్డారు. కానీ ఒకరికి ఒకరు ఏమీ కానట్టు వ్యవహరిస్తున్నారు. సెంటిమెంట్ అంటే పెద్దగా పట్టింపు లేని స్కాట్లాండ్ ఇప్పుడు మరింత వాస్తవికంగా వ్యవహరించదలిచింది. విభజనకు వేళయిందని భావిస్తోంది. ఇంగ్లండ్ ఇప్పుడు ఎలాంటి భరణం లేకుండానే కొత్త హనీమూన్ కోసం బెదిరిస్తోంది. ఏం జరుగుతుందో మనం చూస్తాం. ప్రాథమికంగా చెప్పాలంటే బంధపు శ్వాస మాత్రం ఆగిపోయింది. దానిని ఇప్పుడు ఖననం చేయకుంటే, తరువాతైనా ఆ పని చేయక తప్పదు. (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) - ఎం.జె. అక్బర్ -
దేవుని మాట వినబడనివ్వని సైరన్లు!
దైవికం మాల్థస్ అనుకున్నట్లు మనిషినిక్రియాశీలం చేయడానికి దేవుడు అప్పుడప్పుడూ కరువును సృష్టిస్తాడేమో కానీ, యుద్ధాల సృష్టికర్త మాత్రం ముమ్మాటికీ మనిషే. బిల్ వాటర్సన్ అమెరికన్ చిత్రకారుడు, కార్టూనిస్ట్. ఆయన కార్టూన్ స్ట్రిప్ ‘కాల్విన్ అండ్ హాబ్స్’ 1985 నుంచి 1995 వరకు పదేళ్ల పాటు ప్రతిరోజూ ప్రపంచ పత్రికల్ని అలరించింది. సున్నితమైన హాస్యం, సునిశితమైన సామాజిక స్పృహ కలగలిసిన సెటైర్లు అవి. రాజకీయాలు, ఒపీనియన్ పోల్స్, పర్యావరణం, ప్రజావిద్య, ఫిలాసఫీ... దేన్నీ వదిలిపెట్టకుండా అన్ని అంశాలపైనా కాల్విన్ (ఆరేళ్ల బాలుడు), హాబ్స్ (ఒళ్లంతా వెటకారం నిండిన పులి) అనే రెండు పాత్రలను అడ్డుపెట్టుకుని కార్టూన్లు గీశారాయన. వాటిల్లోని ఓ కార్టూన్లో ఒక పిల్లవాడు తన తండ్రిని ఇలా అడుగుతాడు: ‘‘డాడ్, సోల్జర్లు ఒకళ్లనొకళ్లని చంపుకోవడం ప్రపంచ సమస్యలకు పరిష్కారం ఎలా అవుతుంది?’’ అని! యుద్ధం మీద వాటర్సన్ ప్రయోగించిన క్షిపణి అది. ప్రస్తుతం ప్రపంచమంతా రెండు యుద్ధాల గురించి మాట్లాడుకుంటోంది. మొదటిది: పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న ఏకపక్ష యుద్ధం. రెండోది: నూరేళ్లు నిండిన మొదటి ప్రపంచ యుద్ధం. మొ.ప్ర. యుద్ధంలో ముప్పై దేశాలు పాల్గొన్నాయి. దాదాపు కోటి మంది మరణించారు. అయినా ఆ యుద్ధం నుంచిగానీ, ఇంకే యుద్ధం నుంచి కానీ మనిషి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. మూడో ప్రపంచ యుద్ధం గనుక వస్తే, తర్వాతి యుద్ధానికి (నాలుగో ప్రపంచ యుద్ధానికి) మనుషుల దగ్గర కర్రలు, రాళ్లు తప్ప వేరేమీ ఉండవు’’ అని ఐన్‌స్టీన్ అన్నారు. మనిషి మళ్లీ ఆదిమ కాలానికి వెళ్లిపోతాడని దీని అర్థం. అసలు మనుషులు యుద్ధాలు ఎందుకు చేసుకుంటారు? పొరపాటు. మనుషులు యుద్ధాలు చేసుకోరు. దేశాలు చేసుకుంటాయి. అమెరికన్లకు భౌగోళిక శాస్త్రాన్ని నేర్పించడానికి దేవుడు యుద్ధాన్ని సృష్టించాడని మార్క్ టై్వన్ అంటారు, సరదాగా. నేర్పించడానికి దేవుడి దగ్గర చిన్న చిన్నవి చాలానే ఉంటాయి. అంత పెద్ద యుద్ధమే అక్కర్లేదు. అయినా అన్ని మతాలూ శాంతినే ప్రవచించాయి కనుక దేవుడు యుద్ధ వ్యతిరేకి అనుకోవాలి. అయినప్పటికీ యుద్ధాలు జరుగుతున్నాయంటే దైవభీతిని మించిన దేశభక్తి ఏదో సోల్జర్ తలపైన కూర్చుని ఉండాలి. బ్రిటన్ తత్వరచయిత జి.కె.ఛెస్టర్టన్ ఏమంటారంటే, నిజమైన సిపాయి తన కళ్లెదుట కనిపించే వాటిపై ద్వేషం కారణంగా పోరాడడట, తన వెనుక ఉన్నదానిపై (దేశం) ప్రేమతో కదనరంగంలోకి దూకుతాడట! బహుశా ఇప్పుడు పాలస్తీనాపై కురుస్తున్న బాంబుల వర్షంలో చిన్నారులు, స్త్రీలు, అమాయకులు మరణించడం వెనుక అలాంటి దేశభక్త సైనికులే ఉండి ఉండాలి. మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడిందీ ఈ దేశభక్తులే కావచ్చు. ఏమైనా నాడు జరిగిన ఘోరాలు కానీ, నేడు జరుగుతున్న దారుణాలు గానీ దేవుడికి ప్రియమైనవని, దేవుని సంకల్పానుసారం జరుగుతున్నవనీ అనుకోలేం. అసలు దుష్టశక్తి అంశ ఉన్నది ఏదైనా దేవుడికి ఆమోదయోగ్యం ఎలా అవుతుంది? ప్రముఖ ఆర్థికవేత్త, జనాభా సిద్ధాంతకర్త థామస్ రాబర్ట్ మాల్థస్ ఒకచోట ఆలోచనలో పడతాడు. లోకంలోని ఈ పేదరికం, క్షుద్బాధ.. భగవంతుడి సంకల్పం ప్రకారమే జరుగుతున్నాయా? అన్న సందేహం ఆయనకు కలుగుతుంది. కష్టం తెలియడానికి, కష్టపడి బతకడం ఎలాగో నేర్పించడానికి దేవుడు ఇంతమందిని పుట్టించి, ఆహారాన్ని అతి ప్రయాస మీద మాత్రమే సంపాదించుకునే పరిస్థితుల్ని కల్పిస్తున్నాడా అనీ సందేహపడతాడు. కానీ... సర్వ శక్తి సంపన్నుడైన కారుణ్యమూర్తిలో ఇంతటి క్రౌర్యం ఉంటుందా? అనుకుంటాడు. అయినా క్రౌర్యమని, కాఠిన్యం అని ఎందుకనుకోవాలి? జీవన పోరాటంలో మానవజాతిని రాటు తేల్చడానికి అయివుండొచ్చు కదా అని తనకు తనే సమాధానం చెప్పుకుంటాడు. మాల్థస్ అనుకున్నట్లు మనిషిని క్రియాశీలం చేయడానికి దేవుడు అప్పుడప్పుడూ కరువును సృష్టిస్తాడేమో కానీ, యుద్ధాల సృష్టికర్త మాత్రం ముమ్మాటికీ మనిషే. 1995లో ‘కాల్విన్ అండ్ హాబ్స్’ని ఆపేసే ముందు దాని సృష్టికర్త బిల్ వాటర్సన్, వార్తాపత్రికల సంపాదకులకు, పాఠకులు చిన్న ప్రకటన విడుదల చేశారు ‘‘ఈ కార్టూన్ స్ట్రిప్’ని ఆపవలసిన తరుణం వచ్చేసింది. దీని ద్వారా నేను చెప్పదలచుకుంది చెప్పేశాను’’ అని. ఎక్కడ ఆపాలన్న స్పృహ మనుషులకు ఉంటుంది తప్ప ఎక్కడ ఆగిపోవాలన్న స్పృహ యుద్ధాలకు ఉండదు. స్పృహలేని యుద్ధాలు దేవుని మాట వినబడనివ్వని సైరన్లు. - మాధవ్ శింగరాజు -
ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేదం 12వరకే..