ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. ప్రతిపక్షాలు ఎన్ని పొత్తులతో కలిసి వచ్చినా ప్రజలు మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉన్నామని సర్వేల్లో చెబుతున్నారు. ఏపీలో ఎన్నికలకు సంబంధించి తాజాగా మరో రెండు సర్వేలు కూడా వెల్లడించాయి. వీటిల్లో కూడా వైఎస్సార్‌సీపీదే ఘన విజయమని చెప్పుకొచ్చాయి.
పేదలకు ఆలంబనగా నిరంతరాయంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, జనాభాలో దాదాపు 90 శాతం మందికి నేరుగా అందుతున్న నగదు, అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన.. జనాదరణను మరింతగా పెంచాయని వైఎస్సార్సీపీ నమ్ముతోంది. అందుకే 175 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించడం అసాధ్యమేమీ కాదని ఆ పార్టీ ముందునుంచీ చెబుతోంది. తమకు క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసు కాబట్టే ‘వైనాట్ 175’ అంటున్నామని సీఎం జగన్, పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక, తాజాగా జీన్యూస్ మ్యాటరైజ్ పోల్ సర్వే ప్రకారం..
లోక్‌సభ స్థానాలు..
YSRCP-19
TDP-6
BJP-0
INC-0
Zee News-MATRIZE Lok Sabha Opinion Poll
— Voice of Andhra (@VoiceofAndhra3) February 29, 2024
The @YSRCParty is anticipated to secure 19 seats,
with the @JaiTDP projected to win 6 seats,
while the @BJP4Andhra and @INC_Andhra may not secure any seats in the state.
YSRCP leading in all the surveys - the FAN STORM is coming!… pic.twitter.com/4esxMZQZqR
జానాధార్ ఇండియా సర్వే ప్రకారం..
అసెంబ్లీ స్థానాలు..
YSRCP- 125(49.2%)
TDP+- 50(46.3%)
BJP-0(1.1%)
INC-0(1.3%)
లోక్‌సభ స్థానాలు..
YSRCP- 17
TDP+- 8
BJP-0
INC-0
►ఇదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనితీరుపై ప్రజలు ఎంతో విశ్వాసం ఉంచారు. సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల తాము సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ పనితీరు బాగుందని దాదాపు 62 శాతం ప్రజలు మద్దతిచ్చారు.
►అంతకుముందు.. ప్రముఖ వార్తా చానల్ టైమ్స్ నౌ సర్వే కూడా ఏపీలో ఫలితాలపై సర్వేను వెల్లడించింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే పార్టీ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమని పేర్కొంది. వైఎస్సార్‌సీపీ 24 నుంచి 25 స్థానాలు గెలుస్తుందని టౌమ్స్ నౌ–ఈటీజీ చేసిన సర్వే తేల్చింది. టీడీపీ ఒక్క స్థానంలో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నట్టే సర్వేలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment