
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్రం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో నేటి (నవంబర్ 12)నుంచి ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లో శనివారం ఉదయం 8 గంటలకు భారీ భద్రత నడుమ పోలింగ్ మొదలైంది. మరోవైపు.. గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 వ తేదీల్లో ఓటింగ్ జరగనుంది.
నవంబర్ 12, ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5, సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రచురణ, ప్రసారం చేయకూడదని నోటిఫికేషన్ జారీ చేసింది. పీపుల్స్ యాక్ట్ 1951లోని సెక్షన్ 126(1)(బీ)ప్రకారం.. అలాగే ఒపీనియన్ పోల్స్ ఫలితాలు, సర్వేలు సహా ఎలాంటి ఎన్నికల అంశాలను ఎన్నిక ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయరాదని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తమ ఆదేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని హిమాచల్, గుజరాత్ ఎన్నికల ప్రధానాధికారులకు సూచించింది. అలాగే.. మీడియా రంగాలకు సైతం తెలియజేయాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: హిమాచల్ ప్రదేశ్ పోలింగ్: ఈ పోలింగ్ బూత్ ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకం! 52 మంది ఓటర్లతో ఏకంగా..
Comments
Please login to add a commentAdd a comment