prohibits
-
సీబీఎస్ఈ 10, 12 పరీక్షల్లో చాట్‌జీపీటీపై నిషేధం
న్యూఢిల్లీ: 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్‌జీపీటీ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) అధికారులు మంగళవారం ప్రకటించారు. ఈ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొబైల్ ఫోన్లు, చాట్‌జీపీటీ యాక్సెస్ ఉన్న పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు చెప్పారు. పరీక్షల్లో చాట్‌జీపీటీ ఉపయోగించడం అంటే అనైతిక పద్ధతులు అనుసరించినట్లేనని అన్నారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలను నమ్మొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏఐ ఆధారంగా పనిచేసే చాట్‌జీపీటీ (చాట్ జనరేటివ్ ప్రి–ట్రెయిన్డ్ ట్రాన్స్ఫార్మర్) గత ఏడాది నవంబర్‌లో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌పై ఈసీ నిషేధం!
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్రం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో నేటి (నవంబర్ 12)నుంచి ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లో శనివారం ఉదయం 8 గంటలకు భారీ భద్రత నడుమ పోలింగ్ మొదలైంది. మరోవైపు.. గుజరాత్లో డిసెంబర్ 1, 5 వ తేదీల్లో ఓటింగ్ జరగనుంది. నవంబర్ 12, ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5, సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రచురణ, ప్రసారం చేయకూడదని నోటిఫికేషన్ జారీ చేసింది. పీపుల్స్ యాక్ట్ 1951లోని సెక్షన్ 126(1)(బీ)ప్రకారం.. అలాగే ఒపీనియన్ పోల్స్ ఫలితాలు, సర్వేలు సహా ఎలాంటి ఎన్నికల అంశాలను ఎన్నిక ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయరాదని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తమ ఆదేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని హిమాచల్, గుజరాత్ ఎన్నికల ప్రధానాధికారులకు సూచించింది. అలాగే.. మీడియా రంగాలకు సైతం తెలియజేయాలని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: హిమాచల్ ప్రదేశ్ పోలింగ్: ఈ పోలింగ్ బూత్ ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకం! 52 మంది ఓటర్లతో ఏకంగా.. -
కులాంతర వివాహమా? మొబైల్ వాడుతున్నారా?
ఆధునిక టెక్నాలజీ పరుగులు తీస్తోంది. మోడరన్ యుగం మానవజీవితాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఈ రోజుల్లో ఇంకా కులాల పట్టింపులేంటి? రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది. మనుషులంతా ఒక్కటే..అన్ని రంగాల్లోనూ మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ఈ వాక్యాలు చదవడానికి, వినడానికి బావుంటాయి. కానీ వాస్తవ జీవితంలో మహిళలు, బాలికల పరిస్థితి పెనంమీదినుంచి పొయ్యిలో పడ్డ చందంగానే తయారవుతోంది. గుజరాత్ ఠాకూర్లు తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకుంటే ఈ అభిప్రాయం కలగక మానదు. బనస్కాంత జిల్లా దంతేవాడ తాలూకాలోని 12 గ్రామాల్లోని ఠాకూర్ సంఘం మహిళలకు సంబంధించి ఆంక్షలను అమలు చేయనుంది. ఈ మేరకు నాయకులు ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించారు. 12 గ్రామాల ప్రతినిధులు, యువకులతో సహా దాదాపు 800 మంది ఠాకూర్ నాయకులు జూలై 14 న సమావేశమయ్యారు. ఇక్కడ తొమ్మిది పాయింట్ల తీర్మానం ఆమోదించారు. దీనికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఆదేశించారు. తొమ్మిది పాయింట్లలో ఏ ఒక్క పాయింటును ఉల్లంఘించినా, అపరాధిగా పరిగణించి, శిక్షను విధించాలని తీర్మానించు కున్నారు. ముఖ్యంగా పెళ్లికాని అమ్మాయిలు మొబైల్ ఫోన్లు వాడకూడదు. దీనికి అమ్మాయిల తల్లిదండ్రులే బాధ్యత వహించి, శిక్ష అనుభవించాలని తీర్మానించింది. అలాగే కులాంతర వివాహాల్ని ఎట్టిపరిస్థితుల్లోని అంగీకరించమని తేల్చి పారేశారు. కులాంతర వివాహాలు చేసుకున్నఆయా కుటుంబాలకు జరిమానాలు విధించాలని నిర్ణయించి, ఎంత విధించాలనేది కూడా ఖాయం చేశారు. జిల్లాలో ఇటీవల అనేక కులాల వివాహాలు జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఠాకూర్ అమ్మాయి ప్రేమలో పడి వేరే వర్గానికి చెందిన అబ్బాయిని వివాహం చేసుకుంటే, ఆ కుటుంబం రూ.1.5 లక్షల జరిమానా చెల్లించాలి. ఠాకూర్ కుర్రాడు వేరే కులానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకుంటే రూ.2 లక్షలు జరిమానా చెల్లించాల్సి వుంటుంది. కొసమెరుపు ఏమంటే..కట్నాలను తీసుకోకూడదని, పెళ్లితంతులో బాణాసంచా కాల్చకూడదని, అన్నదమ్ములు ఘర్షణ పడిన కుటుంబాన్నిబాయ్కాట్ చేయాలని, వివాహ తంతులో పెళ్లి కొడుకు గుర్రంపై ఊరేగే తతంగాన్ని కూడా నిషేధించడం. -
విధుల నుంచి ఇన్విజిలేటర్ల తొలగింపు
గుత్తి : గుత్తిలోని మోడల్ పాఠశాలలో శుక్రవారం పదోతరగతి తెలుగు-1 పరీక్షలో ఇద్దరు విద్యార్థులకు 01టీ బదులు 03టీ ప్రశ్నపత్రాలు అందజేసిన ఇన్విజిలేటర్లు పెద్దన్న, జోహార్‌బానును పరీక్ష విధుల నుంచి తొలగిస్తూ డీఈఓ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈఓ వేణుగోపాల్ శనివారం తెలిపారు. ఇన్విజిలేటర్లు 01టీకు బదులు 03 టీ ఇవ్వడం వల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఇద్దరు ఇన్విజిలేటర్లను శనివారం రిలీవ్ చేశారు. వారిపై పరీక్షల అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఎంఈఓ అన్నారు.