Himachal Election 2022
-
మోదీని ఎదుర్కొనే నేత కేజ్రీవాలా? రాహులా?
ఒక రాష్ట్రంలో మోదీ మేనియాతో ఊగిపోయే ప్రజలు, మరో రాష్ట్రంలో స్థానిక సమస్యలే ముఖ్యమని ఎలుగెత్తి చాటిన ఓటర్లు .. ఒకే రోజు రెండు రాష్ట్రాల్లో రెండు విభిన్నమైన తీర్పులు. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్ని ఎలా ప్రభావితం చేస్తాయి ? ప్రధాని మోదీ బ్రాండ్ ఇమేజ్ చెక్కు చెదరకుండా ఉంటుందా ? మోదీని ఢీ కొట్టే నాయకుడు కేజ్రీవాలా ? రాహులా ? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు చెబుతున్నదేంటి ? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయన్న చర్చ మొదలైంది. విపక్షాలను నిరీ్వర్యం చేసి అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని, హిందుత్వ–జాతీయవాదాన్ని జనంలోకి బాగా తీసుకువెళ్లాలని, ఉచితాలకు బదులుగా అభివృద్ధి బాట పడితేనే దేశానికి మేలు జరుగుతుందన్న బీజేపీ ఎజెండాకు గుజరాత్ ఫలితాలు ఆమోద ముద్ర వేశాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములా పని చేస్తుందన్న ధీమాను నింపాయి. అదే సమయంలో స్థానిక సమస్యలపై గట్టి పోరాటం చేస్తే బీజేపీని, మోదీ బ్రాండ్ ఇమేజ్ను ఎదుర్కోవడం కష్టం కాదన్న ఆశ కూడా ప్రతిపక్ష పారీ్టల్లో చిగురించింది. బ్రాండ్ మోదీ ప్రభావం మోదీ ఇమేజ్ చెక్కు చెదరకపోయినప్పటికీ బలమైన స్థానికాంశాలుంటే రాష్ట్రాల్లో గెలుపుకు విపక్షాలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈ ఫలితాలు చెబుతున్నాయి. హిమాచల్‌లో పాత పెన్షన్ పునరుద్ధరిస్తామన్న ఒకే ఒక్క హామీ కాంగ్రెస్‌ని అధికార పీఠానికి చేర్చింది. సోలన్ ప్రాంతంలో మోదీ ర్యాలీలకు జనం పోటెత్తినా అక్కడి 5 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒక్కటీ నెగ్గలేకపోయింది! కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హిందూత్వ, జాతీయవాదమే కీలకపాత్ర పోషించేలా కనిపిస్తున్నాయి. హిమాచల్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్ల శాతంలో తేడా ఒక్క శాతమే! ‘‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టడం సులభం కాదు. హిమాచల్‌లో మాదిరిగా స్థానికాంశాలు లోక్‌సభ ఎన్నికల్లో పని చేయవు’’ అని జేఎన్‌యూ పొలిటికల్ సైన్స్ ప్రొఫసర్ మణీంద్రనాథ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. హిమాచల్ ఓటమితో ఇమేజ్‌కు వచి్చన ఢోకా ఏమీలేదన్నారు. కాంగ్రెస్ పక్కలో బల్లెం ఆప్ బీజేపీతో తలపడడానికి, హిందూత్వ ఎజెండాతో ఓటర్లను ఏకీకృతం చేస్తున్న కమలనాథుల కు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌కు ఆప్ రూపంలో కొత్త శత్రువు ఎదురైంది. గుజరాత్లో ఆప్ ప్రధానంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకునే కొల్లగొట్టడంతో 17 స్థానాలకే పరిమితమవాల్సి వచి్చంది. కాంగ్రెస్ ఓట్లు 41% నుంచి 27శాతానికి పడిపోతే, ఆప్ 13% ఓట్లు సాధించిందంటే కాంగ్రెస్ ఓట్లకు గంటికొట్టినట్టయింది. ‘‘వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్‌కు అసలు సిసలు శత్రువు ఆప్ అంటే అతిశయోక్తి కాదు. విపక్షాల మధ్య ఓట్లు చీలిపోతుంటే బీజేపీ సేఫ్ గేమ్ ఆడుతోంది. ఆప్‌ను ఎదుర్కొనే బలమైన వ్యూహాన్ని కాంగ్రెస్ తక్షణమే రచించాలి.’’ అని ఎన్నికల విశ్లేషకుడు ఠాకూర్ హెచ్చరించారు. హిమాచల్ ప్రదేశ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా దృష్టి కేంద్రీకరించకపోవడం వల్ల కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే సాధించింది. అది కాంగ్రెస్‌కి కలిసొచ్చింది. అదే ఆప్ కూడా విస్తృతంగా ప్రచారం చేసి ఉంటే కాంగ్రెస్ పని అయిపోయి ఉండేదని ఆ పార్టీ మాజీ నాయకుడు సంజయ్ ఝా అన్నారు. అయితే హిమాచల్‌లో విజయం సాధించడం వల్ల కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మూడుకి చేరడంతో పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని పెంచినట్టయింది. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సెమీ ఫైనల్స్ ఫలితాలే కీలకం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు ఉందా లేదా అనేది వచ్చే ఏడాది నాలుగు రాష్ట్రాల్లో జరిగే సెమీఫైనల్స్ వంటి ఎన్నికల ఫలితాలే కీలకం కానున్నాయి. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. జాతీయ పార్టీ హోదా లభించిన ఉత్సాహంలో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. దీంతో కాంగ్రెస్ అటు బీజేపీ, ఇటు ఆప్‌ను సమర్థంగా ఎదుర్కోవాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాలతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఎదుర్కొనే నాయకుడు కేజ్రివాలా? రాహులా? అన్నది తేలిపోతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సాక్షి కార్టూన్ 10-12- 2022
కానీ...హిమాచల్‌ప్రదేశ్ ప్రజలు ఆమోదించార్రార్! -
హిమాచల్ సీఎం ఎంపిక.. భారమంతా ప్రియాంకపైనే!
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది కాంగ్రెస్ పార్టీ. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం భేటీ అయినా సీఎం పేరు ఖరారు కాలేదు. దీంతో అభ్యర్థి ఎంపిక బాధ్యతను అధిష్టానానికి కట్టబెడుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు ఎమ్మెల్యేలు. హిమాచల్‌లో తదుపరి ముఖ్యమంత్రి రేసులో ప్రతిభా సింగ్, ముకేశ్ సింగ్ అగ్నిహోత్రి, సుఖ్విందర్ సింగ్ సుఖు ముందంజలో ఉన్నారు. ప్రియాంక గాంధీకే క్రెడిట్.. హిమాచల్‌లో పార్టీ విజయం సాధించటంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తుది నిర్ణయం తీసుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. శనివారం మధ్యాహ్నం కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రియాంక ప్రకటించనున్నారని పేర్కొన్నాయి. హిమాచల్ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పార్టీని ముందుండి నడిపించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. ఎన్నికల వ్యూహంలో కీలక భూమిక పోషించారు. బీజేపీనీ ఓడించి పార్టీని గెలిపించటంలో ప్రియాంక పాత్ర కీలకమైందని పలువురు నేతలు ప్రశంసలు కురిపించారు. ఈక్రమంలోనే కొత్త ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యత ఆమెకే అప్పగించినట్లు తెలుస్తోంది. సీఎంగా ముకేశ్.. విక్రమాదిత్యకు డిప్యూటీ..! ముఖ్యమంత్రి పదవి రేసులో ప్రతిభా సింగ్, ముకేశ్ అగ్నిహోత్రి, సుఖ్విందర్ సింగ్ సుఖుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే, ముకేశ్ అగ్నిహోత్రికి ముఖ్యమంత్రి పదవి, విక్రమాదిత్యకు డిప్యూటీ సీఎం ఇచ్చే యోచనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, చివరకు ఎవరికి ఆ పదవి దక్కుతుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇదీ చదవండి: ‘సీఎం పీఠం మా నేతకే..’ హిమాచల్‌లో ఆశావహుల మద్దతుదారుల డిమాండ్ -
Himachal Pradesh: సీఎం పీఠం మా నేతకే...
సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం సమావేశమయ్యారు. సీఎం అభ్యర్థి ఎంపిక చేసే బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడికి కట్టబెడుతూ ఈ భేటీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పార్టీ కేంద్ర పరిశీలకులుగా చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, హరియాణా మాజీ సీఎం భూపీందర్‌సింగ్ హుడా వచ్చారు. హిమాచల్‌లో తదుపరి ముఖ్యమంత్రి రేసులో ప్రతిభా సింగ్, ముకేశ్‌సింగ్ అగ్నిహోత్రి, సుఖ్వీందర్ సింగ్ సుఖు ముందంజలో ఉన్నారు. సీఎల్పీ సమావేశంలో పాల్గొనేందుకు వారు తమ మద్దతుదారులతో కలిసి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు కేంద్ర పరిశీలకులు రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాబితాను అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు గడువు కోరారు. ఇదీ చదవండి: హిమాచల్‌లో బీజేపీ ఓటమి.. అనురాగ్ ఠాకూర్‌పై విమర్శల వెల్లువ -
హిమాచల్‌లో బీజేపీ ఓటమి.. అనురాగ్ ఠాకూర్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు!
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ పరాజయం పాలైంది. ప్రతి ఐదేళ్లకోసారి అధికార మార్పు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్‌కు పట్టంకట్టారు హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు. అయితే, అధికారంలో ఉండి కూడా బీజేపీ ఓడిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కాషాయ దళం పరాజయం చెందడానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కారణమంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన క్రమంలో అనురాగ్ ఠాకూర్‌పై ట్రోల్స్‌తో ఆయన ట్రెండింగ్‌లోకి వచ్చారు. రాష్ట్ర బీజేపీలో ఠాకూర్ అంతర్యుద్ధానికి తెరలేపారంటూ కొందరు కాషాయ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. I am presuming C. R. PATIL new BJP president on card. Great leader with thumping majority in Gujarat. Anurag Thakur should be sacked from BJP for family politics over and above party lines. — 🇮🇳🌞 GIREESH JUYAL 🇮🇳🌞जय श्री राम, (@juyal3405) December 8, 2022 బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వరాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో ఈసారి రెబల్ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైంది. మొత్తం 68 స్థానాల్లో 21 ప్రాంతాల్లో బీజేపీ రెబల్ అభ్యర్థులు పోటీ చేశారు. రెండు చోట్ల మాత్రమే విజయం సాధించినప్పటికీ.. బీజేపీ అనుకూల ఓట్లు చీలిపోయాయని స్పష్టంగా తెలుస్తోంది. అదే కాంగ్రెస్ విజయానికి సాయపడింది. మరోవైపు.. ఈ ఎన్నికల్లో బీజేపీలో మూడు వర్గాలు ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. అనురాగ్ ఠాకూర్, జేపీ నడ్డా, సీఎం జైరాం ఠాకూర్ వర్గం. దీంతో అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రెబల్స్ బరిలోకి దిగారు. ఎవరి వర్గం వారిని వారు గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేయటం పార్టీ ఓటమికి కారణమైంది. మరోవైపు.. బీజేపీలో కీలక నేత, మాజీ సీఎం ప్రేమ్‌కుమార్ థుమాల్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనకు ఈసారి టికెట్ ఇవ్వలేదు అధిష్ఠానం. దీంతో ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. అనురాగ్ ఠాకూర్ సొంత జిల్లాలోనే ఐదు సీట్లలో బీజేపీ ఓడిపోవడం విమర్శలకు తావిచ్చింది. బీజేపీలో కీలక నేతలు ఉన్నప్పటికీ.. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఒక్కరే ప్రచారం చేసి హస్తం పార్టీకి ఘన విజయం సాధించిపెట్టారని ఓ నెజిటన్ కామెంట్ చేశారు. In a head to head contest, in Nadda's state, in Anurag Thakur's state, against the might of the BJP's money, media and institutions, Priyanka Gandhi has defeated Modi. — Dushyant A (@atti_cus) December 8, 2022 Choice of candidates by JP Nadia & Anurag Thakur is questionable If a rebel is winning means the rebel was right candidate Also the home state of BJP Chief Nadda? Any effects of that? Look at the effect of Narendra Modi on his Home State Gujarat If BJP means business then act — Flt Lt Anoop Verma (Retd.) 🇮🇳 (@FltLtAnoopVerma) December 8, 2022 ఇదీ చదవండి: ఛండీగఢ్ కాదు.. షిమ్లాలోనే! కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు?.. ఉత్కంఠ -
హిమాచల్ కాంగ్రెస్‌లో ‘ఆపరేషన్ లోటస్’ గుబులు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. శాసనసభ ఫలితాల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరోహోరీ పోటీ నెలకొంది. స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్న హస్తం పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు మొదలు పెట్టింది. బీజేపీ ఆపరేషన్ కమలం ప్రయత్నాలను అడ్డుకుని, విజయం సాధించే తమ అభ్యర్థులను చేజారి పోకుండా కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలను రాజస్థాన్‌కు తరలించాలని యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని పరిస్థితులపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యవేక్షిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం సాయంత్రానికి ఆమె సిమ్లా చేరుకోనున్నారని సమాచారం. మరోవైపు.. కొత్త ఎమ్మెల్యేల తరలింపు బాధ్యతను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భఘేల్, పార్టీ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాకు అప్పగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గురువారం సాయంత్రం ఎమ్మెల్యేలను బస్సుల ద్వారా రాజస్థాన్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. ఇదీ చదవండి: మోదీ అడ్డాగా గుజరాత్.. రికార్డులు బద్దలుకొట్టిన బీజేపీ! -
హిమాచల్‌లో పోలింగ్.. దృష్టి మాత్రం ‘కాంగ్రా’పైనే
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమంతా పోలింగ్ జరుగుతోన్నా.. అందరి చూపు మాత్రం ఒక్క జిల్లాలో ఏ పార్టీకి ఓట్లు పడుతున్నాయన్నదానిపైనే ఉంది. హిమాచల్ రాజకీయాల్లో ఆ జిల్లా అత్యంత కీలకమని ఇప్పటికి ఎన్నో సార్లు నిరూపితమయింది. అక్కడ పాగా వేస్తే అధికారం దాదాపు ఖరారైనట్టే. మూడు దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. అందుకే ఈసారి పార్టీలు అదే రిపీట్ అవుతుందా..? అని వేచి చూస్తున్నాయి. ఈ జిల్లా చుట్టే బీజేపీ డబుల్ డ్రీమ్స్, కాంగ్రెస్ అగ్నిపథ్ స్కీమ్ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నాయి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాంగ్రా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో అత్యధిక సీట్లున్న జిల్లా కాంగ్రా. 15మంది ఎమ్మెల్యేలు శాసనసభకు నేతృత్వం వహిస్తున్నారు. 1993 నుంచీ కాంగ్రా జిల్లాలో అధిక సీట్లు గెల్చుకుంటున్న పార్టీయే రాష్ట్రంలో పగ్గాలు చేపడుతోంది. 15 సీట్లలో కనీసం 9 వచ్చినవారు హిమాచల్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. 2017 ఎన్నికల్లో బీజేపీ 11 సీట్లు గెల్చుకుంది. అగ్నిపథ్ బీజేపీకి అగ్ని పరీక్ష కాంగ్రా జిల్లాలో రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఎక్కువ. ఓబీసీలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఏదో ఒకపార్టీ వైపు సూటిగా నిలవటం ఈ జిల్లా ప్రత్యేకత. ప్రధాని మోదీపై రాష్ట్రంలో ఆదరణ ఉన్నా.. స్థానిక బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా పెరిగిన ధరలు కమలదళాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం కనిపిస్తోంది. సైన్యంలో ప్రవేశాలకు కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం కూడా హిమాచల్ ఎన్నికల్లో ప్రధానాంశం అవుతోంది. కాంగ్రాతోపాటు పక్కనున్న హమీర్పుర్, ఉనా, మండి జిల్లాల నుంచి వేల సంఖ్యలో యువత సైన్యంలో చేరుతుంటారు. ఈ నాలుగు జిల్లాలు కలిపి మొత్తం 35 అసెంబ్లీ సీట్లున్నాయి. అగ్నిపథ్ స్కీమ్‌తో సైన్యంలో ప్రవేశం తగ్గిపోతుందనే ఆందోళన హిమాచల్ వాసులకు ఉంది. విపక్షాలకిది బలమైన అస్త్రంగా మారింది. పక్కలో తిరుగుబాటు బళ్లెం కాంగ్రాలోని 15 స్థానాలకు 91 మంది పోటీలో ఉన్నారు. అన్ని పార్టీలకూ ఇక్కడ తిరుగుబాటు అభ్యర్థులు సమస్యగా తయారయ్యారు. ఫతేపుర్, ధర్మశాల, ఇందోరా, కాంగ్రా, దెహ్రా స్థానాల్లో బీజేపీకి తిరుగుబాటు అభ్యర్థులు తలనొప్పిగా మారారు. పార్టీ అధ్యకుడు నడ్డా, అధిష్ఠానం ఎంతగా నచ్చజెప్పినా రెబెల్స్ వెనక్కి తగ్గలేదు. మొత్తానికి 1993 నుంచీ ఒకసారి కాంగ్రెస్, మరోసారి బీజేపీకి అధిక సీట్లు ఇస్తూ వస్తోంది కాంగ్రా జిల్లా. అలాగే రాష్ట్రంలో అధికారం మారుతూ వస్తోంది. మరి ఈసారి కాంగ్రా ఎటువైపు మొగ్గుతుందో అని పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఇదీ చదవండి: హిమాచల్ ప్రదేశ్ పోలింగ్: ఈ పోలింగ్ బూత్ ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకం! 52 మంది ఓటర్లతో ఏకంగా.. -
ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌పై ఈసీ నిషేధం!
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్రం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో నేటి (నవంబర్ 12)నుంచి ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లో శనివారం ఉదయం 8 గంటలకు భారీ భద్రత నడుమ పోలింగ్ మొదలైంది. మరోవైపు.. గుజరాత్లో డిసెంబర్ 1, 5 వ తేదీల్లో ఓటింగ్ జరగనుంది. నవంబర్ 12, ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5, సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రచురణ, ప్రసారం చేయకూడదని నోటిఫికేషన్ జారీ చేసింది. పీపుల్స్ యాక్ట్ 1951లోని సెక్షన్ 126(1)(బీ)ప్రకారం.. అలాగే ఒపీనియన్ పోల్స్ ఫలితాలు, సర్వేలు సహా ఎలాంటి ఎన్నికల అంశాలను ఎన్నిక ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయరాదని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తమ ఆదేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని హిమాచల్, గుజరాత్ ఎన్నికల ప్రధానాధికారులకు సూచించింది. అలాగే.. మీడియా రంగాలకు సైతం తెలియజేయాలని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: హిమాచల్ ప్రదేశ్ పోలింగ్: ఈ పోలింగ్ బూత్ ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకం! 52 మంది ఓటర్లతో ఏకంగా.. -
ఈ పోలింగ్ బూత్ ప్రపంచంలోనే ఎంతో స్పెషల్! ఎందుకంటే..
సిమ్లా: కాంగ్రెస్-బీజేపీలకు చెరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తున్న హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు.. ఈసారి ఎవరికి పట్టం కడతారనే చర్చ జోరుందుకుంది. శనివారం హిమాచల్ ప్రదేశ్ పోలింగ్ నేపథ్యంలో.. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో.. ప్రధాని మోదీ, అమిత్ షా సహా కీలక నేతలంతా ఓటేయాలంటూ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. హిమాచల్ ప్రదేశ్ పోలింగ్ వేళ.. ఓ బూత్ ఆసక్తికర చర్చకు దారి తీసింది. కేవలం 52 మంది ఓటర్ల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారక్కడ. అందుకు ఓ ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. తషిగ్యాంగ్.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోలింగ్ కేంద్రం. అందుకే ఎన్నికల సంఘం అక్కడ ప్రత్యేక దృష్టి సారించింది. లాహౌల్ & స్పితి పరిధిలోని తషిగ్యాంగ్‌లో దాదాపు 15, 256 ఫీట్ల ఎత్తులో ఉండే ఇక్కడ ప్రత్యేక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. వృద్ధులకు, దివ్యాంగుల కోసం మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారిక్కడ. వందకు వంద శాతం ఓటింగ్ నమోదు చేయాలని భావిస్తున్నారు ఇక్కడ. Tashigang (Lahaul&Spiti ), has world’s highest polling station at 15,256 ft & 52 registered voters, is set to retain its record of 100% voter turnout in the Nov 12 assembly election. It has been made Model Polling station to make voting easy for senior citizens & disabled voters. pic.twitter.com/SJcw86Z3lL — CEO Himachal (@hpelection) November 12, 2022 ఇక హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 55 లక్షల ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7,884 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. మొత్తం 412 మంది అభ్యర్థులు.. 68 నిజయోకవర్గాల్లో పోటీ పడుతున్నారు. ఒకవైపు తిరిగి అధికారం కైవసం చేసుకునేందుకు బీజేపీ, మరోవైపు మనుగడ కోసం కాంగ్రెస్ పార్టీలో హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఇక ఈ మధ్యలో ఆప్ వచ్చి చేరింది. డిసెంబర్ 8వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. -
2023 చివరి నాటికి అయోధ్య రామాలయం పూర్తి!
పలంపూర్/అన్నీ(యూపీ): అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణ పనులు సగానికిపైగా పూర్తి అయ్యాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పారు. దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్య రామాలయ నిర్మాణ క్రతువు మొదలైందని పేర్కొన్నారు యోగి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన, నిర్ణయాత్మకమైన నాయకత్వంలో జరుగుతున్న చారిత్రక పనులుగా అభివర్ణించారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారసభలో యూపీ సీఎం యోగి పాల్గొని ప్రసంగించారు. ‘హిమాచల్ ప్రజల గుండె ధైర్యం గొప్పది. వందలాది మంది యువత భారత సైన్యంలో చేరుతోంది. మన శత్రువు ఇప్పుడు మనవైపు చూసేందుకు కూడా భయపడుతున్నాడు’ అని సభలో వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: 50వ సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణం -
Viral Video: కేంద్ర మంత్రి చేసిన పనికి అంతా షాక్!
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బిలాస్పూర్ నియోజకవర్గం పరిధిలో ఆయన పర్యటిస్తుండగా.. ఆసక్తికర సంఘటన జరిగింది. నడి రోడ్డుపై బస్సు బ్రేక్‌డౌన్ అయ్యింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేంద్ర మంత్రి ఠాకూర్ కాన్వాయ్ సైతం నిలిచిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. విషయం తెలుసుకున్న ఆయన కారు దిగి అక్కడున్న వారితో కలిసి బస్సును వెనక్కి తోశారు. అనంతరం బస్సు డ్రైవర్, ప్రయాణికులతో కాసేపు మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ట్రాఫిక్ సర్దుకున్నాక అక్కడి నుంచి ప్రచారానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అంతకుముందు బిలాస్పూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఠాకూర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరోసారి భాజపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని పర్యటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ‘ప్రాజెక్ట్ శక్తి’ పేరిట వచ్చే 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇదీ చదవండి: షాకింగ్ రిపోర్ట్: కరోనాను మించిన వైరస్ తయారీలో పాక్-చైనా! -
‘డబుల్ ఇంజిన్’ ఉంటే లాభమేంటి.. ఇంధనం నింపాలి కదా!
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఆ రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో గత ఐదేళ్లుగా భాజపా డబుల్ ఇంజిన్ ప్రభుత్వమే ఉందని.. కానీ, ఇంజిన్‌లో బహుశా ఇంధనం నింపటం మరిచిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగం, పాత పింఛను విధానం వంటి సమస్యలను ప్రస్తావిస్తూ అధికార పార్టీపై విమర్శలు చేశారు. రాష్ట్రంలోని ‘ఉనా’ ప్రాంతంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమం వేదికగా.. బీజేపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు ప్రియాంక గాంధీ.‘ బీజేపీ నేతలు వచ్చి మాకు ఓటు వేయండి.. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని చెబుతుంటారు. గత ఐదేళ్లుగా వారు ఎక్కడున్నారు. గత ఐదేళ్లుగా డబుల్ ఇంజిన్ ఉంది కదా.. బహుశా వారు అందులో ఇంధనం నింపడం మరిచిపోయారేమో!’ అని విమర్శలు గుప్పించారు ప్రియాంక. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పాత పింఛను విధానం అమలు జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు కాదో ఒక్కసారి ఆలోచించాలన్నారు ప్రియాంక. హిమాచల్‌లో ప్రస్తుతం 63వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిని ఎందుకు భర్తీ చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. తాము లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెబుతుంటే భాజపా సాధ్యం కాదంటోందని.. మరి ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేయగలిగిందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో నిరుద్యోగ రేటు తక్కువగా ఉందని.. అక్కడ తమ ప్రభుత్వం మూడేళ్లలోనే ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు. అలాగే, మహిళలకు నెలకు రూ.1500ల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. అప్రూవర్‌గా దినేష్ అరోరా.. సీబీఐ చేతికి కీలక ఆధారాలు! -
అవినీతిమయ పార్టీలు: ఆప్, కాంగ్రెస్‌లపై మోదీ విసుర్లు
సోలన్ (హిమాచల్‌ప్రదేశ్): ‘‘కరడుగట్టిన నిజాయతీపరుమని చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీ నిజానికి అత్యంత అవినీతిమయం. ఇకకాంగ్రెసైతే అవినీతికి, స్వార్థ రాజకీయాలకు, ఆశ్రిత పక్షపాతానికి తిరుగులేని గ్యారెంటీ’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ రెండు పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కపెట్టారు. శనివారం హిమాచల్‌ప్రదేశ్‌లోని సుందర్ నగర్లో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. స్థిరత్వానికి, అభివృద్ధికే ఓటేయాల్సిందిగా ప్రజలను కోరారు. ఈ హిమాలయ రాష్ట్రంతో తనకు సుదీర్ఘ అనుబంధముందని చెప్పారు. అధికార బీజేపీకి వేసే ప్రతి ఓటూ తనకు ఆశీర్వాదమని భావిస్తానన్నారు. ‘‘మీరు వేసే ప్రతి ఓటూ వచ్చే పాతికేళ్ల కాలానికి రాష్ట్ర భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. నేను కమలం పువ్వు గుర్తు చేపట్టి మీ ముందుకొచ్చాను. మా అభ్యర్థులను చూడకండి. కమలం గుర్తును చూసి ఓటేయండి’’ అని విజ్ఞప్తి చేశారు. ‘‘కాంగ్రెస్ హయాంలో స్థిరత్వం లేని పాలన వల్ల చిన్న రాష్ట్రాలు ఎంతగానో నష్టపోయాయి. చిన్న రాష్ట్రమని హిమాచల్‌ను కాంగ్రెస్ ఏళ్ల తరబడి చిన్నచూపు చూసింది. అందుకే 21వ శతాబ్దంలో మనకు కావాల్సింది స్థిరమైన, బలమైన ప్రభుత్వాలు. అది బీజేపీకి మాత్రమే సాధ్యం’’ అన్నారు. ‘‘మందులను మాటిమాటికీ మారిస్తే రోగం తగ్గదు. ఎవరికీ మేలు జరగదు. అందుకే అధికార బీజేపీని మళ్లీ గెలిపించండి’’ అని కోరారు. హిమాచల్‌లో ప్రతిసారీ అధికార పార్టీ ఓడటం ఆనవాయితీగా వస్తోంది. 68 స్థానాలున్న అసెంబ్లీకి నవంబర్ 12న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు గుజరాత్‌తో పాటుగా డిసెంబర్ 8న జరుగుతుంది. -
లక్ష ఉద్యోగాలు.. మహిళలకు నెలకి రూ.1,500: కాంగ్రెస్ హామీల వర్షం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ప్రచార జోరు పెంచాయి రాజకీయ పార్టీలు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్‌కు భారీగా ఆఫర్లు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. తాము అధికారంలోకి వస్తే.. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ.680 కోట్లతో స్టార్టప్ ఫండ్, లక్ష ఉద్యోగాలు, ఓపీఎస్ పునరుద్ధరణ 18-60 ఏళ్ల మహిళలకు నెలకి రూ.1,500 వంటివి వాటితో మేనిఫెస్టో విడుదల చేసింది హస్తం పార్టీ. నవంబర్ 12న జరగనున్న ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేస్తామని, ఎన్నికైన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తారని ప్రకటించింది. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ పోల్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ధాని రామ్ శైండిల్. ప్రజల అంచనాలను అందుకోవడంలో బీజేపీ విఫలమైందన్నారు. ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. ‘ఇది కేవలం మెనిఫెస్టో కాదు, హిమాచల్ ప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రూపొందించిన పత్రం.’ అని పేర్కొన్నారు. రాష్ట్ర ఏఐసీసీ ఇంఛార్జి రాజీవ్ శుక్లా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ సహా పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఎన్నికల హామీ పత్రాన్ని విడుదల చేసేంది కంగ్రెస్. కేంద్రంపై విమర్శలు గుప్పించారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. పాత పింఛన్ విధానాన్ని పునరుద్దరించి ప్రజల సొమ్మును తిరిగి ఇచ్చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశామని, అందుకు వారు తిరస్కరించారని గుర్తు చేశారు. మరోమారు కేంద్రానికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. పాత పింఛన్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: Gujarat Election 2022: ఎన్నికల ముందు బీజేపీకి మాజీ మంత్రి షాక్..! -
స్వతంత్ర భారత్ తొలి ఓటర్ కన్నుమూత..