
దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్య రామాలయ నిర్మాణ క్రతువు మొదలైందని పేర్కొన్నారు యోగి...
పలంపూర్/అన్నీ(యూపీ): అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణ పనులు సగానికిపైగా పూర్తి అయ్యాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పారు. దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్య రామాలయ నిర్మాణ క్రతువు మొదలైందని పేర్కొన్నారు యోగి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన, నిర్ణయాత్మకమైన నాయకత్వంలో జరుగుతున్న చారిత్రక పనులుగా అభివర్ణించారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారసభలో యూపీ సీఎం యోగి పాల్గొని ప్రసంగించారు. ‘హిమాచల్ ప్రజల గుండె ధైర్యం గొప్పది. వందలాది మంది యువత భారత సైన్యంలో చేరుతోంది. మన శత్రువు ఇప్పుడు మనవైపు చూసేందుకు కూడా భయపడుతున్నాడు’ అని సభలో వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: 50వ సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణం