CM Yogi Adityantah
-
2023 చివరి నాటికి అయోధ్య రామాలయం పూర్తి!
పలంపూర్/అన్నీ(యూపీ): అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణ పనులు సగానికిపైగా పూర్తి అయ్యాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పారు. దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్య రామాలయ నిర్మాణ క్రతువు మొదలైందని పేర్కొన్నారు యోగి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన, నిర్ణయాత్మకమైన నాయకత్వంలో జరుగుతున్న చారిత్రక పనులుగా అభివర్ణించారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారసభలో యూపీ సీఎం యోగి పాల్గొని ప్రసంగించారు. ‘హిమాచల్ ప్రజల గుండె ధైర్యం గొప్పది. వందలాది మంది యువత భారత సైన్యంలో చేరుతోంది. మన శత్రువు ఇప్పుడు మనవైపు చూసేందుకు కూడా భయపడుతున్నాడు’ అని సభలో వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: 50వ సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణం -
అఖిలేష్ నోట అసభ్యకరమైన పదాలు.. సీఎం యోగి మందలింపు
లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం ఆసక్తికర పరిణామాలు.. అదీ వాడీవేడిగా కొనసాగాయి. ప్రతిపక్ష నేత, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ నోటి నుంచి అసభ్య పదజాలం వెలువడగా.. జోక్యం చేసుకున్న సీఎం యోగి ఆయన్ని తీవ్రంగా మందలించారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార-ప్రతిపక్ష నేతల మాటల యుద్ధంతో బుధవారం అట్టుడికిపోయింది. తన హయాంలో జరిగిన అభివృద్ధినే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు తమ ఘనతగా చూపించుకుంటోందని అఖిలేష్ పదే పదే ప్రకటించుకున్నారు. దీనికి కౌంటర్‌గా డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలతో చిర్రెత్తుకొచ్చిన అఖిలేష్ యాదవ్.. ఒకానొక టైంలో సభలోనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్ అధికారంలో ఉన్నప్పుడు.. తన పాలన గురించి గొప్పగా చెప్పుకునేవారు. అదే నిజమైతే ఆయన పార్టీని జనాలు.. ఎన్నికల్లో ఊడ్చిపడేసేవాళ్లు కాదు కదా! అని మౌర్య వ్యాఖ్యానించారు. అలాగే తన హయాంలో సంక్షేమ పథకాల గురించి అఖిలేష్ పదే పదే చెప్పుకుంటున్నారని, దీనికి ఆయనకు చికిత్స అవసరమంటూ వ్యాఖ్యానించారు. రోడ్లు, మెట్రో, ఎక్స్‌ప్రెస్‌వే.. ఇవన్నీ సైఫాయ్‌లోని మీ భూములు అమ్మి కట్టించారా? అంటూ మండిపడ్డారు మౌర్య. ఈ కామెంట్లతో చిర్రెత్తుకొచ్చిన అఖిలేష్ యాదవ్.. ఒక్కసారిగా అసభ్య పదజాలంతో మౌర్యపై విరుచుకుపడ్డాడు. దీంతో జోక్యం చేసుకున్న సీఎం యోగి ఆదిత్యానాథ్.. అఖిలేష్‌ను మందలించారు. तुमने राशन के लिए पैसे क्या अपने पिता जी से लेकर बाँटे …? फ्लावर समझा है क्या, फायर हैं फायर #AkhileshYadav #kpmaurya समाजवादी पार्टी #KeshavPrasadMaurya #BJP pic.twitter.com/kD8GJT2uFb — parasmudgal (@Spamudgal786) May 26, 2022 ‘‘సభలో అదీ గౌరవ సభ్యుడ్ని ఉద్దేశించి అలా మాట్లాడడం ఎంతమాత్రం సరికాదు. ఇక్కడ విషయం సైఫాయ్ గురించి కాదు. అభివృద్ధి పనులు చేయడం.. పర్యవేక్షించడం ప్రభుత్వంగా మా విధి. సంక్షేమ పనులను, అభివృద్ధిని ప్రకటించుకునే హక్కు మాకు కూడా ఉంది. డిప్యూటీ సీఎం ఇదే విషయాన్ని చెప్పదల్చుకున్నారు. ఆయన ఏం చెప్తున్నారో మీరు ముందుగా వినాల్సింది. ప్రతిపక్ష సభ్యులు చాలామంది చేసే తప్పు ఇదే. ఇది అంగీకరించాల్సి విషయం. అంతేగానీ.. అంతగా ఉద్రేకపడాల్సిన అవసరం లేదు. సభలో సభ్యతతో వ్యవహరిస్తే మంచిది అని మందలించారు. అంతేకాదు సభ రికార్డుల నుంచి అఖిలేష్ వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా స్పీకర్ సతీష్ మహానాకు సీఎం యోగి రిక్వెస్ట్ చేశారు. అంతకు ముందు రోజు(మంగళవారం) అసెంబ్లీలో ఎస్సీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చేసిన బాయ్స్ విల్ బాయ్స్ కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. అత్యాచారాలకు మరణశిక్ష విధించాలన్న వాదనను వ్యతిరేకిస్తూ.. అబ్బాయిలు అబ్బాయిలే.. కొన్నిసార్లు తప్పులు జరుగుతుంటాయి అంటూ ములాయం వ్యాఖ్యలు చేశారు. అయితే యూపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ అసెంబ్లీ సమావేశాల్లో అఖిలేష్ వ్యాఖ్యలకు.. సీఎం యోగి ‘ములాయం వ్యాఖ్యలను’ వ్యాఖ్యలను కౌంటర్‌గా తెరపైకి తెచ్చారు. -
యోగి ఆదిత్యనాథ్ వద్దే హోంశాఖ
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన మంత్రివర్గ సభ్యులకు సోమవారం శాఖలను కేటాయించారు. కీలకమైన హోం, విజిలెన్స్‌తో సహా 34 శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు గ్రామీణాభివృద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్‌తో పాటు మరో నాలుగు శాఖలు అప్పగించారు. మరో ఉప ముఖ్యమంత్రి బ్రిజేశ్ పాఠక్‌కు వైద్య విద్యాశాఖతో మరో రెండో ఫోర్ట్ పోలియోలు కేటాయించారు. కళ్యాణ్ సింగ్ మనవడికి చోటు సురేశ్ కుమార్ ఖన్నాకు ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, స్వతంత్రదేవ్ సింగ్‌కు జలశక్తి, బేబి రాణి మౌర్యకు మహిళా, శిశు సంక్షేమ శాఖ, జితిన్ ప్రసాదకు పీడబ్ల్యూడీ కట్టబెట్టారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మంత్రుల్లో మాజీ ఐపీఎస్ అధికారి అసిమ్ అరుణ్(సాంఘిక సంక్షేమం, ఎస్సీ/ఎస్టీ సంక్షేమం), దయా శంకర్ సింగ్(రవాణా శాఖ) కళ్యాణ్ సింగ్ మనవడు సందీప్ సింగ్(ప్రాథమిక విద్య) ఉన్నారు. యోగి కేబినెట్లో ఏకైక ముస్లిం మంత్రి డానిష్ ఆజాద్ అన్సారీ(స్వతంత్ర ప్రతిపత్తి)కి వక్ఫ్, హజ్ శాఖలతో పాటు మైనారిటీల సంక్షేమం అప్పగించారు. ఏకైక సిక్కు మంత్రి బల్దేవ్ సింగ్ ఔలాఖ్(స్వతంత్ర ప్రతిపత్తి) వ్యవసాయం, వ్యవసాయ విద్య శాఖ దక్కించుకున్నారు. 24 మందికి ఉద్వాసన సీఎం యోగి కేబినెట్లో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులతో పాటు 52 మంది మంత్రులు ఉన్నారు. మంతివర్గంలో 31 కొత్త ముఖాలకు స్థానం కల్పించగా, పాతవారిలో 24 మందికి ఉద్వాసన పలికారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దినేష్ శర్మకు ఈసారి మొండిచేయి చూపారు. మథుర బీజేపీ ఎమ్మెల్యేతో పాటు మొదటి టర్మ్‌లో ఇంధన శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మ, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన సతీష్ మహానాలకు కూడా తాజా కేబినెట్లో చోటు దక్కలేదు. -
భారత సైన్యం ‘మోదీ సేన’..!
ఘజియాబాద్/హౌరా: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దేశ సైనిక బలగాలను ఆయన ప్రధాని మోదీ సైన్యంగా పేర్కొనడంపై విపక్షాలు మండిపడ్డాయి. రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఘజియాబాద్‌లో కేంద్ర మంత్రి వీకే సింగ్ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడారు. ‘కాంగ్రెస్ నేతలు ఉగ్రవాదులకు బిర్యానీ తినిపించారు. ఉగ్రనేత మసూద్ అజార్‌ను జీ(గారు) అంటూ ప్రోత్సహిస్తున్నారు. కానీ, మోదీ సైన్యం (దేశ సైనిక బలగాలు) వారికి బుల్లెట్లు, బాంబులతో బదులిచ్చింది. ఉగ్ర శిబిరాలపై దాడులు జరిపి ముష్కరులతోపాటు పాక్ వెన్ను విరిచింది. కాంగ్రెస్ అసాధ్యమనుకున్నదాన్ని బీజేపీ సాధ్యం చేసి చూపింది. మోదీ ఉంటే అసాధ్యమైంది ప్రతిదీ సాధ్యమే’ అని అన్నారు. భద్రతా బలగాలకు అవమానం: మమతా యోగి తన వ్యాఖ్యలతో భద్రతా బలగాలను అవమానించారని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ‘యూపీ సీఎం వ్యాఖ్యలపై షాక్‌కు గురయ్యా. మన సైన్యాన్ని ఏ ఒక్క వ్యక్తికో సొంత అన్నట్లుగా మాట్లాడటం తీవ్ర అవమానకరం. సైన్యం ఏ ఒక్కరిదో కాదు, ప్రజలందరి సొత్తు. యూపీ సీఎం వ్యాఖ్యలను ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలి’ అని పిలుపునిచ్చారు. ‘యోగి వ్యాఖ్యలు సైన్యాన్ని అవమానించినట్లే. భారత సైన్యం ప్రచార మంత్రి(ప్రధాని) సైన్యం కాదు. యోగి క్షమాపణ చెప్పి తీరాలి’ కాంగ్రెస్ నేత ప్రియాంక చతుర్వేది అన్నారు. ‘సైనిక బలగాలు ఏ ఒక్కరి ప్రైవేట్ సైన్యం కాదనే ప్రాథమిక అంశాన్ని రాజకీయ నేతలు తెల్సుకోవాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకే సైన్యం పనిచేస్తుంది తప్ప, ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా కాదు’ అని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ శంకర్ రాయ్ చౌదరి అన్నారు. యోగిపై ఈసీ చర్య తీసుకోవాలి: సీపీఐ భద్రతా బలగాలను మోదీ సైన్యం అంటూ యూపీ సీఎం చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకే యోగి అలా మాట్లాడారంది. ‘ప్రజల్లో అభద్రతాభావం పెంచి, వారిని ప్రభావితం చేసేందుకే యోగి అలా మాట్లాడారు. రైతుల సమస్యలను మర్చిపోయిన బీజేపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో సాధించింది ఏమీ లేదు. అందుకే రాజకీయ ప్రయోజనం పొందేందుకు సైన్యాన్ని వాడుకోవాలని చూస్తోంది’ అని సీపీఐ నేత డి.రాజా పేర్కొన్నారు. నివేదిక కోరిన ఈసీ ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఘజియాబాద్ జిల్లా మేజిస్ట్రేట్‌ను ఈసీ ఆదేశించింది. ఈ నివేదికను యూపీ చీఫ్ ఎలక్టోరల్ అధికారికి సమర్పించాలని కోరింది. రాజకీయ నేతలు ఎన్నికల ప్రచారం సమయంలో సైన్యం ప్రస్తావన తేవడం, భద్రతా బలగాల ఫొటోలను వాడుకోవడం నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందని ఈసీ మార్చి 17వ తేదీన స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్ట్ దారుణ హత్య
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో మరో జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయారు. స్థానికంగా ఓ హిందీ దినపత్రికలో పనిచేస్తున్న నవీన్ గుప్తా అనే జర్నలిస్ట్‌ను గురువారం గుర్తుతెలియని దుండగులు తుపాకీతో దారుణంగా కాల్చిచంపారు. బిలహౌర్ నగరపాలిక సంస్థ మార్కెట్ సమీపంలోని పబ్లిక్ టాయిలెట్ నుంచి బయటకు వస్తున్న గుప్తాపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఘటనాస్థలికి చేరుకున్నారు. గుప్తా మృతిపై సంతాపం తెలిపిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. నిందితుల్ని పట్టుకునేందుకు విచారణను వేగవంతం చేయాలని రాష్ట్ర డీజీపీ సుల్ఖన్‌సింగ్‌ను ఆదేశించారు. హత్యకు పాతకక్షలే కారణమై ఉండొచ్చని పోలీసులు చెప్పారు. -
మోదీ, యోగిల సాయం కోరిన మహిళ
అమ్రోహ: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ముస్లిం మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల దృష్టికి తీసుకెళ్లి తనకు సాయం చేయాల్సిందిగా కోరింది. అమ్రోహ జిల్లాకు చెందిన ఈ బాధితురాలు 2014లో ఆరిఫ్ అలీని వివాహం చేసుకుంది. పెళ్లయిన తర్వాత అత్తమామలు, భర్త కట్నం కోసం వేధించేవారని, 2015లో తనను పుట్టింటికి పంపేశారని ఆమె వెల్లడించింది. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఇటీవల తనకు స్పీడ్ పోస్ట్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడని ఆమె ఆరోపించింది. బాధితురాలు ఈ విషయాన్ని ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిల దృష్టికి తీసుకెళ్లి తనకు న్యాయం చేయాలని విన్నవించింది. ట్రిపుల్ తలాక్‌పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తమకు అన్యాయం జరుగుతోందని కొందరు ముస్లిం మహిళలు పోరాడుతున్నారు. ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతోందని, దీన్ని రద్దు చేయాల్సిన అవసరముందని ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి అభిప్రాయపడ్డారు.