
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో మరో జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయారు. స్థానికంగా ఓ హిందీ దినపత్రికలో పనిచేస్తున్న నవీన్ గుప్తా అనే జర్నలిస్ట్‌ను గురువారం గుర్తుతెలియని దుండగులు తుపాకీతో దారుణంగా కాల్చిచంపారు. బిలహౌర్ నగరపాలిక సంస్థ మార్కెట్ సమీపంలోని పబ్లిక్ టాయిలెట్ నుంచి బయటకు వస్తున్న గుప్తాపై బుల్లెట్ల వర్షం కురిపించారు.
దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఘటనాస్థలికి చేరుకున్నారు. గుప్తా మృతిపై సంతాపం తెలిపిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. నిందితుల్ని పట్టుకునేందుకు విచారణను వేగవంతం చేయాలని రాష్ట్ర డీజీపీ సుల్ఖన్‌సింగ్‌ను ఆదేశించారు. హత్యకు పాతకక్షలే కారణమై ఉండొచ్చని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment