Ram temple construction
-
L.K Advani: గమ్యం చేరని రథ యాత్రికుడు
లాల్‌కృష్ణ అడ్వాణీ. 1990ల నుంచి రెండు దశాబ్దాల పాటు దేశమంతటా మారుమోగిపోయిన పేరు. ముఖ్యంగా జాతీయ స్థాయిలో రాజకీయ రథయాత్రలకు పర్యాయపదంగా మారిన పేరు. ఆయన చేపట్టిన ఆరు యాత్రల్లో అయోధ్య రథయాత్ర దేశ రాజకీయ ముఖచిత్రాన్నే శాశ్వతంగా మార్చేసింది. జాతీయ రాజకీయాల్లో బీజేపీపై ‘అంటరాని పార్టీ’ ముద్రను చెరిపేసింది. బీజేపీని కేవలం రెండు లోక్‌సభ సీట్ల స్థాయి నుంచి తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడంలో వాజ్‌పేయితో పాటు అడ్వాణీది కీలకపాత్ర. వాజ్‌పేయిని భారతరత్న వరించిన తొమ్మిదేళ్లకు తాజాగా ఆయనకూ ఆ గౌరవం దక్కింది. బీజేపీకి సుదీర్ఘ కాలం అధ్యక్షునిగా కొనసాగిన రికార్డు కూడా అడ్వాణీదే. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు నేషనల్ డెమొక్రటికల్ అలయన్స్ (ఎన్డీఏ)కు ఊపిరి పోసిందీ ఆయనే. కరాచీ నుంచి కరాచీ దాకా... అడ్వాణీ నేటి పాకిస్తాన్‌లోని కరాచీలో 1927 నవంబర్ 8న జన్మించారు. 14 ఏళ్లప్పుడే ఆరెస్సెస్‌లో చేరారు. అనంతరం జనసంఘ్ నేతగా ఎదిగారు. సహచర నేత వాజ్‌పేయితో పాటు దేశవ్యాప్త క్రేజ్ సంపాదించుకున్నారు. హిందూ హృదయ సమ్రాట్‌గా గుర్తింపు పొందారు. వాజ్‌పేయిది మితవాద ఇమేజీ కాగా అడ్వాణీ మాత్రం హిందూత్వకు పోస్టర్ బోయ్‌గా ముద్ర పడ్డారు. ఇద్దరూ కలిసి జోడెద్దులుగా బీజేపీ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించారు. 1983లో కేవలం రెండు లోక్‌సభ సీట్లకు పరిమితమైన కాలంలో అడ్వాణీ బీజేపీ అధ్యక్ష పగ్గాలను అందుకున్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదు స్థానంలో రామాలయం నిర్మించాలనే డిమాండ్‌తో దేశవ్యాప్త రామ రథయాత్ర తలపెట్టారు. 1990 సెపె్టంబర్లో గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి మొదలు పెట్టిన ఈ యాత్రకు బ్రహా్మండమైన స్పందన లభించింది. అరెస్టుతో యాత్ర మధ్యలోనే ఆగినా బీజేపీకి అదెంతగానో కలిసొచి్చంది. 1991 లోక్‌సభ ఎన్నికల్లో రెండో అతి పెద్ద పారీ్టగా అవతరించింది. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసానికి తోడు 1993 నుంచి అడ్వాణీ చేపట్టిన జనాదేశ్, స్వర్ణజయంతి, భారత్ ఉదయ్, భారత్ సురక్ష వంటి రథయాత్రలు బీజేపీని కేంద్రంలో అధికారానికి చేరువ చేశాయి. చివరికి 1996లో బీజేపీ తొలిసారిగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కానీ వాజ్‌పేయి ప్రధాని కావడంతో అడ్వాణీ కల నెరవేరలేదు. దాంతో మితవాద ముద్ర కోసం విఫలయత్నాలు చేశారు. ఆ క్రమంలో 2005లో కరాచీ వెళ్లి మరీ జిన్నాను లౌకికవాది అంటూ పొగడటం ఆయనకు మరింత చేటు చేయడమే గాక ఆరెస్సెస్ కన్నెర్రకూ కారణమైంది. ఆ దెబ్బకు సంఘ్‌తో అడ్వాణీ సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. 2009 ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రధాని అభ్యరి్థగా నిలిచినా పార్టీ పరాజయం పాలైంది. యూపీఏ ప్రభుత్వ అవినీతిపై 2011లో చివరిసారి చేసిన జనచేతన యాత్రా అడ్వాణీకి అంతగా లాభించలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
2023 చివరి నాటికి అయోధ్య రామాలయం పూర్తి!
పలంపూర్/అన్నీ(యూపీ): అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణ పనులు సగానికిపైగా పూర్తి అయ్యాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పారు. దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్య రామాలయ నిర్మాణ క్రతువు మొదలైందని పేర్కొన్నారు యోగి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన, నిర్ణయాత్మకమైన నాయకత్వంలో జరుగుతున్న చారిత్రక పనులుగా అభివర్ణించారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారసభలో యూపీ సీఎం యోగి పాల్గొని ప్రసంగించారు. ‘హిమాచల్ ప్రజల గుండె ధైర్యం గొప్పది. వందలాది మంది యువత భారత సైన్యంలో చేరుతోంది. మన శత్రువు ఇప్పుడు మనవైపు చూసేందుకు కూడా భయపడుతున్నాడు’ అని సభలో వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: 50వ సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణం -
కాంగ్రెస్ నిరసనలకు రామ మందిరానికి లింక్: అమిత్ షా
న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల, ఈడీ దాడులను నిరసిస్తున్నట్లు చెప్తూ.. శుక్రవారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో చేపట్టిన నిరసనల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు నేతలు, కార్యకర్తలు నల్ల దుస్తులు ధరించి పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నిరసనలను తిప్పికొట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ శంకుస్థాపనకు వ్యతిరేకంగానే నల్ల దుస్తులు ధరించారని ఆరోపించారు. ‘కోర్టులో కేసులు నమోదయ్యాయి. అయితే, ప్రతిరోజు ఎందుకు నిరసనలు చేస్తున్నారు? కాంగ్రెస్‌కు రహస్య ఎజెండా ఉందని నా భావన. వారు వారి బుజ్జగించు రాయకీయాలను మరో రూపంలో అమలు చేస్తున్నారు. ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరికీ సమన్లు జారీ చేయలేదు, ఎవరినీ ప్రశ్నించలేదు. ఎలాంటి రైడ్లు జరగలేదు. అయినప్పటికీ ఆకస్మికంగా ఈరోజు కాంగ్రెస్ నిరసనలకు దిగింది. ఈరోజే ఎందుకు నిరసనలు చేపట్టారనేది అర్థం కావట్లేదు. 550 ఏళ్ల సమస్యకు సామర్యంగా పరిష్కారం చూపి.. సరిగ్గా ఇదే రోజున అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అందుకే కాంగ్రెస్ నిరసనలు చేపట్టినట్లు తెలుస్తోంది. ’ అని పేర్కొన్నారు అమిత్ షా. ఈరోజు నల్ల దుస్తులు ధరించి నిరసనలు చేపట్టటం ద్వారా తాము రామ మందిర నిర్మాణ శంకుస్థాపనకు వ్యతిరేకమని కాంగ్రెస్ చెబుతోందన్నారు హోంమంత్రి అమిత్ షా. బుజ్జగింపు పాలసీని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తోందని ఆరోపించారు. ప్రస్తుత రోజుల్లో దేశంలో హింసాత్మక ఘటనలు, అల్లర్లు జరిగినట్లు కనిపిస్తోందా? అని ప్రశ్నించారు షా. ఇదీ చదవండి: హస్తినలో తీవ్ర ఉద్రిక్తతలు.. పోలీసుల అదుపులో ప్రియాంక, రాహుల్ -
నా వంతుగా కోటి రూపాయలు: గంభీర్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ భారీ విరాళమిచ్చారు. తన వంతుగా కోటి రూపాయలు అందజేశారు. ఈ మేరకు.. ‘‘అద్భుతమైన రామ మందిర నిర్మాణం అనేది భారతీయుల అందరి కల. ఎట్టకేలకు అది నెరవేరబోతోంది. ప్రశాంతత, ఐకమత్యానికి ఇది బాటలు వేస్తుంది. ఈ నేపథ్యంలో నా వంతుగా నా కుటుంబం తరఫున చిన్న విరాళం’’ అని గౌతం గంభీర్ ప్రకటన విడుదల చేశారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో నిర్మించనున్న రామమందిర నిర్మాణానికై రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ విరాళాలను సేకరణను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ బీజేపీ సైతం రూ. 10, 100, 1000 కూపన్ల రూపంలో విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టింది. అదే విధంగా వెయ్యి రూపాయలకు పైగా డొనేషన్ ఇవ్వాలనుకునే వారు చెక్కుల రూపంలో అందజేయవచ్చని పేర్కొంది. ఆరెస్సెస్, వీహెచ్‌పీ సహా ఇతర హిందుత్వ సంస్థలు ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నారు. ఇంటింటికి తిరుగుతూ విరాళాలు సేకరించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఢిల్లీలో దీనిని ఆరంభించనున్నట్లు బీజేపీ జనరల్ సెక్రటరీ కుల్జీత్ చాహల్ తెలిపారు. ఇక ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులు సహా ఇతర రంగాల సెలబ్రిటీలు రామమందిర నిర్మాణానికి విరాళాలు అందజేస్తున్నారు. (చదవండి: రామమందిర నిర్మాణానికి అక్షయ్ విరాళం) -
‘మందిర నిర్మాణం మరవద్దు’
ముంబై : కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి కొలువుతీరనున్న నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షం శివసేన అయోధ్య అంశాన్ని ముందుకు తెచ్చింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని మోదీ సర్కార్‌కు గుర్తుచేసింది. మందిర నిర్మాణం సత్వరమే చేపట్టాలని పార్టీ పత్రిక సామ్నాలో శివసేన కేంద్రాన్ని కోరింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల తీర్పు రామ రాజ్యానికి, మందిర నిర్మాణ ఆకాంక్షలకు అద్దం పట్టిందని సేన ఈ సంపాదకీయంలో పేర్కొంది. మందిర నిర్మాణం తప్పక జరిగి తీరుతుందని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలనూ శివసేన ప్రస్తావించింది. ఇక విపక్ష పార్టీల తీరును తప్పుపడుతూ వాటిని పురాణాల్లో రాక్షసులైన రావణ, విభీషణ, కంసులతో పోల్చింది. మరోవైపు సుప్రీం కోర్టు అనుమతితో చట్టబద్ధంగా అయోధ్యలో మందిర నిర్మాణం చేపడతామని ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం స్పష్టం చేసిన విషయాన్ని శివసేన గుర్తుచేసింది. -
మందిర నిర్మాణం తథ్యం
న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: అయోధ్యలో రామ మందిరం నిర్మించి తీరుతామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు కల్పిస్తోందని మండిపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు దేశ చరిత్రను మలుపు తిప్పిన మూడో పానిపట్ యుద్ధం వంటివన్నారు. ఈ ఎన్నికలు బీజేపీ సాంస్కృతిక జాతీయ వాదానికీ, ప్రతిపక్షాల అధికార దాహానికి మధ్యనే జరగనున్నాయని తెలిపారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో శుక్రవారం ఆయన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించి, ప్రసంగించారు. ‘అయోధ్యలో తొందరగా రామ మందిర నిర్మాణాన్ని చేపట్టాలని పార్టీ పట్టుదలతో ఉండగా కాంగ్రెస్ అడ్డంకులు కల్పిస్తోంది. అయితే, బీజేపీ రామ మందిరాన్ని నిర్మించి తీరుతుంది’ అని అన్నారు. మందిర నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరేంటో స్పష్టం చేయాలని అమిత్ షా డిమాండ్ చేశారు. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ, అద్భుతమైన, పారదర్శక, కష్టపడి పనిచేసే నేత బీజేపీకి ఉన్నారు. 1987 నుంచి ఆయన ఓటమి ఎరుగని నాయకుడు. ప్రతిపక్షంలో ఆయనకు సరితూగగల నేత లేరు. మోదీ మాదిరిగా మరెవ్వరూ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు’ అని పేర్కొన్నారు. వారంలో రెండు కీలక నిర్ణయాలు మోదీ ప్రభుత్వం ఈ వారంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకుందని అమిత్ చెప్పారు. ఒకటి.. జనరల్ కేటగిరీలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం. రెండోది జీఎస్టీ మినహాయింపు పరిమితిని పెంచడం. జనరల్ కేటగిరీలో రిజర్వేషన్ల ద్వారా కోట్లాది మంది యువత ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. దీంతోపాటు వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పరిమితిని రెట్టింపు చేస్తూ రూ.40 లక్షలకు పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. దీని ప్రకారం రూ.40 లక్షల వరకు టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులకు జీఎస్టీ నుంచి ప్రభుత్వం మినహాయింపు కల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా రూ.1.5 కోట్ల టర్నోవర్ ఉన్న వారు 1 శాతం పన్ను చెల్లించేలా జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని ప్రకటించారు. అక్రమాలకు పాల్పడిన నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీవంటి వారు కాంగ్రెస్ హయాంలో దేశం విడిచి ఎందుకు పారిపోలేదు? కాంగ్రెస్ దేశంలో అవినీతిని ఎలా పెంచి పోషించిందో దీన్నిబట్టి స్పష్టమవుతుంది అని వ్యాఖ్యానించారు. బీజేపీ హయాంలోనే ఈ ఆర్థిక నేరగాళ్లంతా ఎందుకు పారిపోయారు? ప్రధాని మోదీ చౌకీదార్ మాదిరిగా ఇలాంటి వారిని ఉపేక్షించబోరని అన్నారు.రైతులకు అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తున్న మోదీ సర్కారును ‘రైతు హిత’ ప్రభుత్వంగా పేర్కొంటూ బీజేపీ జాతీయ కౌన్సిల్ ఒక తీర్మానం ఆమోదించింది. దీంతోపాటు గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మరో తీర్మానం చేసింది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ప్రారంభమైన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లోని పార్టీ నేతలు కలిపి 14వేల మంది వరకు హాజరయ్యారు. మోదీకి, మిగతా వారికి మధ్యనే పోటీ ప్రధాని మోదీని ఓడించాలనే చౌకబారు ఎత్తుగడతోనే మహా కూటమి ఏర్పడుతోందనీ, ఈ కూటమికి ఒక విధానం కానీ, నాయకుడు గానీ లేరని అమిత్ అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేసిన మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ‘వచ్చే సాధారణ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరాటంగా సాగనున్నాయి. సాంస్కృతిక జాతీయ వాదం, పేదల అభ్యున్నతే బీజేపీ పార్టీ లక్ష్యం కాగా, ప్రతిపక్షాలు అధికారమే పరమావధిగా ఏకమవుతున్నాయి’ అని పేర్కొన్నారు. ‘కూటమిలోని పార్టీలన్నీ 2014 ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓటమి పాలైనవే. ఉత్తరప్రదేశ్‌లో ఈసారి బీజేపీ 2014 ఎన్నికల్లో కంటే ఎక్కువ స్థానాలు సాధించడం ఖాయం’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. -
ఏదేమైనా బీజేపీకి మద్దతివ్వం: జేడీయూ
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి బీజేపీ ఆర్డినెన్స్ తీసుకొస్తే మద్దతిచ్చేది లేదని బీజేపీ మిత్రపక్షం, బిహార్ అధికార పార్టీ జనతాదళ్(యూ) స్పష్టం చేసింది. మందిర నిర్మాణానికి తెచ్చే ఎటువంటి ఆర్డినెన్స్‌నైనా సమర్థించేది లేదని జేడీయూ సంస్థాగత జనరల్ సెక్రటరీ ఆర్సీపీ సింగ్, వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ఇదిలా ఉండగా.. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టి తీరుతామని బీజేపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జేడీయూ భిన్న వైఖరి చర్చనీయాంశమైంది. సామాజిక సంబంధాలు, మత సామరస్యానికే తమ పార్టీ కట్టుబడి ఉందని ఆర్సీపీ సింగ్ తెలిపారు. కాగా, అయోధ్యలో రామమందిర నిర్మాణంపై జేడీయూ నాయకత్వం మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి. ప్రశాంత్ కిషోర్ మాట్లాతుతూ.. ‘అయోధ్య అంశం లేవనెత్తకుండానే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించగలదు. 2014 ఎన్నికల సమయంలో ఉన్న పాపులారిటీ బీజేపీకి ఇప్పుడు లేదు. అయినా వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తుంద’ని ఆశాభావం వ్యక్తం చేశారు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉందని అన్నారు. ఇక 2014 సార్వత్రిక ఎన్నికల్లో అశేష ప్రజాదరణతో అధికారంలోకొచ్చిన కాషాయ పార్టీ ప్రతిష్ట రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. -
అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా
ఎమ్మెల్యే రాజాసింగ్ రామ మందిర నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు హైదరాబాద్: ‘అయోధ్యలో రామమందిరం నిర్మించి తీరుతాం.. ఎవరైనా అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా.. రామాలయ నిర్మాణంలో ప్రాణాలు అర్పించడానికైనా.. తీయడానికైనా ఏ మాత్రం వెనుకాడబోను’ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 5న శ్రీరామనవమి రోజు ఎమ్మెల్యే రామభక్తులను ఉద్దేశించి ధూల్‌పేట్ జుమ్మెరాత్‌బజార్‌లో ప్రసంగించిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేగాక పలు మీడియా చానెళ్లు ఈ వీడియోను ప్రసారం చేయడంతో రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై ‘సాక్షి’వివరణ కోరగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హయాంలో త్వరలోనే రామ మందిరం నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. ఎవరైనా అడ్డువస్తే వారి ప్రాణాలు తీసేందుకు వెనుకాడబోనన్నారు. రామమందిరం నిర్మాణం ఆపడం ఇక ఎవరితరం కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హిందుస్తాన్‌లో హిందువులకు వ్యతిరేకంగా ఉండేవారికి స్థానంలేదని స్పష్టం చేశారు. కాగా అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌పై డబీర్‌పురా పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లా ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ వెంకన్ననాయక్ తెలిపారు.