ముంబై : కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి కొలువుతీరనున్న నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షం శివసేన అయోధ్య అంశాన్ని ముందుకు తెచ్చింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని మోదీ సర్కార్‌కు గుర్తుచేసింది. మందిర నిర్మాణం సత్వరమే చేపట్టాలని పార్టీ పత్రిక సామ్నాలో శివసేన కేంద్రాన్ని కోరింది.
లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల తీర్పు రామ రాజ్యానికి, మందిర నిర్మాణ ఆకాంక్షలకు అద్దం పట్టిందని సేన ఈ సంపాదకీయంలో పేర్కొంది. మందిర నిర్మాణం తప్పక జరిగి తీరుతుందని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలనూ శివసేన ప్రస్తావించింది. ఇక విపక్ష పార్టీల తీరును తప్పుపడుతూ వాటిని పురాణాల్లో రాక్షసులైన రావణ, విభీషణ, కంసులతో పోల్చింది. మరోవైపు సుప్రీం కోర్టు అనుమతితో చట్టబద్ధంగా అయోధ్యలో మందిర నిర్మాణం చేపడతామని ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం స్పష్టం చేసిన విషయాన్ని శివసేన గుర్తుచేసింది.
Comments
Please login to add a commentAdd a comment