
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ భారీ విరాళమిచ్చారు. తన వంతుగా కోటి రూపాయలు అందజేశారు. ఈ మేరకు.. ‘‘అద్భుతమైన రామ మందిర నిర్మాణం అనేది భారతీయుల అందరి కల. ఎట్టకేలకు అది నెరవేరబోతోంది. ప్రశాంతత, ఐకమత్యానికి ఇది బాటలు వేస్తుంది. ఈ నేపథ్యంలో నా వంతుగా నా కుటుంబం తరఫున చిన్న విరాళం’’ అని గౌతం గంభీర్ ప్రకటన విడుదల చేశారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో నిర్మించనున్న రామమందిర నిర్మాణానికై రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ విరాళాలను సేకరణను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఢిల్లీ బీజేపీ సైతం రూ. 10, 100, 1000 కూపన్ల రూపంలో విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టింది. అదే విధంగా వెయ్యి రూపాయలకు పైగా డొనేషన్ ఇవ్వాలనుకునే వారు చెక్కుల రూపంలో అందజేయవచ్చని పేర్కొంది. ఆరెస్సెస్, వీహెచ్‌పీ సహా ఇతర హిందుత్వ సంస్థలు ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నారు. ఇంటింటికి తిరుగుతూ విరాళాలు సేకరించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఢిల్లీలో దీనిని ఆరంభించనున్నట్లు బీజేపీ జనరల్ సెక్రటరీ కుల్జీత్ చాహల్ తెలిపారు. ఇక ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులు సహా ఇతర రంగాల సెలబ్రిటీలు రామమందిర నిర్మాణానికి విరాళాలు అందజేస్తున్నారు. (చదవండి: రామమందిర నిర్మాణానికి అక్షయ్ విరాళం)
Comments
Please login to add a commentAdd a comment