లండన్: యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్‌కు, అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఇదొక పెద్ద ఊరట. ఇటీవల మంత్రివర్గంలో మార్పుల తర్వాత సునాక్ ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. పార్టీలో అసమ్మతి మొదలైంది. అయితే, శీతాకాల బడ్జెట్‌లో కొన్నిరకాల పన్నులను తగ్గించనున్నట్లు ప్రకటించారు. దీంతో రిషి సునాక్‌తోపాటు ప్రభుత్వానికి ప్రజాదరణ స్వల్పంగా పెరిగినట్లు తాజాగా ‘ద టైమ్స్’ పత్రిక నిర్వహించిన ఓపీనియన్ పోల్స్‌లో వెల్లడయ్యింది.
బడ్జెట్‌ను బుధవారం పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పన్ను మినహాయింపుల పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారు. సర్వేలో సునాక్ ప్రభుత్వ పాపులారిటీ రేటింగ్ 25 శాతానికి చేరినట్లు తేలింది. గత వారంతో పోలిస్తే ఇది 4 పాయింట్లు అధికం కావడం విశేషం. ఇటీవలి కాలంతో కన్జర్వేటివ్ పారీ్టకి దక్కిన అత్యధిక రేటింగ్ ఇదే. ఇదిలా ఉండగా, ప్రతిపక్ష లేబర్ పార్టీ రేటింగ్‌లో ఎలాంటి మార్పు జరగలేదు. ప్రజాదరణ 44 శాతంగానే ఉన్నట్లు సర్వే వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment