న్యూఢిల్లీ: ఒపీనియన్ పోల్స్‌పై పలు రాజకీయ పార్టీలు ఘర్షణాత్మక వైఖరిని అనుసరిస్తుండగా ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ మాత్రం అధిష్టానం బాటలోనే నడుస్తున్నారు. మంగళవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వాటిని నియంత్రించాల్సిందేనన్నారు. వాస్తవ పరిస్థితులను అవి ప్రతిబింబించబోవని, వాటికి పారదర్శకత ఉండదని అన్నారు. అసలు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదన్నారు. వాటిని పారదర్శకంగా జరపరని, తర చూ జరిపే ఈ అధ్యయనాల వల్ల ప్రజలకు తప్పుడు సందేశాలు వెళతాయన్నారు. కాగా గత నెలలో జరిపిన అనేక ఒపీనియన్ పోల్స్‌లో వచ్చే ఎన్నికల తర్వాత హంగ్ ఏర్పడుతుందని, అటు బీజేపీకిగానీ లేదా ఇటు కాంగ్రెస్ పార్టీకిగానీ తగినంత ఆధిక్యం రాదని వెల్లడైన సంగతి విదితమే.
కాంగ్రెస్ ఓటుబ్యాంకును ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కొల్లగొట్టే అవకాశముందని, మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీలో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ చెప్పుకోద గ్గ రీతిలో స్థానాలను కైవసం చేసుకుంటుందని మరికొన్ని పోల్స్ ఫలితాల్లో తేలింది. ఒపీనియన్ పోల్స్ వాస్తవికతపై ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది ఫలితాలను తల్లకిందులుగా చేసి చూపే అవకాశం కూడా లేకపోలేదన్నారు. ఈ సర్వేల వెనుక అనేక అంశాలు దాగి ఉంటాయని, అందువల్ల కేవలం వీటిపైనే ఆధారపడలేమన్నారు. అవి వాస్తవాలను ప్రతిబింబిస్తాయని తాననుకోవడం లేదన్నారు. అందువల్ల ఈ అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
ఒపీనియన్ పోల్స్‌ను నిషేధించడమో లేదా నియంత్రించడమో చేయాలని అధికార కాంగ్రెస్‌తోపాటు అనేక పార్టీలు కోరుతుం డగా, బీజేపీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలవుతామనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఒపీనియన్ పోల్స్‌ను నియంత్రించాలని కోరుకుం టోందని బీజేపీ ఇటీవల ఆరోపించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తన అభిప్రాయాన్ని వెల్లడించాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఉల్లి ధరలు తగ్గిపోయాయి: ఉల్లి ధరల విషయమై ప్రశ్నించగా బాగా తగ్గిపోయాయన్నారు. ఇంకా తగ్గిపోతాయనే విశ్వాసం తనకు ఉందన్నారు. వచ్చే ఎన్నికలపై ధరల పెరుగుదల ప్రభావం ఉంటుందా అని అడగ్గా తమ ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు.
నియంత్రించాల్సిందే
Published Wed, Nov 6 2013 1:09 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement