న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు టైమ్స్ నౌ ఛానల్– ఈటీజీ రీసెర్చ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఒపీనియన్ పోల్‌లో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌కే ఆధిక్యం ఉన్నట్లు వెల్లడైంది. మధ్యప్రదేశ్‌లో పోటా పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు స్వల్ప మొగ్గు కనపడుతోంది. బీజేపీ 43.7 శాతం ఓట్లతో 107–115 స్థానాల్లో నెగ్గే అవకాశాలున్నాయని పేర్కొన్న సర్వే.. కాంగ్రెస్ 44.9 ఓట్లతో 112–122 సీట్లు సాధిస్తుందని తేలి్చంది.
ఇతరులు కేవలం 1–3 స్థానాలకే పరిమితమవుతారని పేర్కొంది. మరోవైపు రాజస్తాన్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉందని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. 43.8 శాతం ఓట్లతో బీజేపీ 114–124 స్థానాల్లో గెలవనుందని పేర్కొంది. కాంగ్రెస్ 41.9 శాతం ఓట్లతో 68 నుంచి 78 స్థానాలకు పరిమితం కానుందని తెలిపింది.
చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 51–59 స్థానాలతో స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుందని, బీజేపీ 27 నుంచి 35 స్థానాలకు పరిమితమవుతుందని సర్వే వెల్లడించింది. పైన పేర్కొన్న మూడు రాష్ట్రాల్లో ప్రస్తుతం రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక తెలంగాణ విషయానికి వస్తే సర్వే వివరాలు పూర్తిగా అందనప్పటికీ ప్రాథమిక సమాచారాన్ని బట్టి అధికార బీఆర్‌ఎస్‌కే మొగ్గు కనపడుతోందని టైమ్స్ నౌ సర్వే పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment