Five states Election results
-
ఎన్నికల ఫలితాలు చెబుతున్నదేమిటి?
హిందీ ప్రాంతంలో ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొందిన ఘోర పరాజయం, తెలంగాణలో దాని అద్భుతమైన విజయాన్ని మరుగున పడేసింది. 2018లో తాను గెలిచిన మూడు రాష్ట్రాలలో (మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్) కాంగ్రెస్‌కు ప్రస్తుతం అతిపెద్ద దెబ్బ తగిలింది. బీజేపీ సమగ్ర విజయానికి కారణం, ఈ మూడు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో మద్దతు లభించడం. అయితే కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ తన ఓట్ల వాటాను మాత్రం నిలుపుకోగలిగింది. బరిలో నిలిచిన ఇతరుల కారణంగా బీజేపీ అధికంగా ప్రయోజనం పొందింది. ఏదేమైనా, ఈ విజయాలతో 2024లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు, అత్యంత కీలక ప్రాంతంలో బీజేపీ తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించుకోగలిగింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొందిన ఘోర పరాజయం, తెలంగాణలో దాని అద్భుతమైన విజయాన్ని మరుగున పడేసింది. అయితే కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ మధ్య ప్రదేశ్‌లో 40.4 శాతం, రాజస్థాన్‌లో 39.5 శాతం, చత్తీస్‌గఢ్‌లో 42.23 శాతం ఓట్ల వాటాను నిలుపుకోగలిగింది. ఫలితం ఎలా ఉన్నప్పటికీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు కాగ్రెస్‌కు లభించిన ఓట్ల శాతానికి గుర్తించదగిన ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా రాష్ట్రాల ఎన్నికల్లో స్థానికంగానూ, సార్వత్రిక ఎన్ని కల్లో జాతీయంగానూ ఓటర్లకు విజ్ఞప్తి చేయాలనే ఆశతో నిరుద్యోగం, కులవివక్ష వంటి అంశాలను ఎత్తిచూపడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయ త్నించింది. అయితే, హిందూ జాతీయ వాదం, మతతత్వ రాజకీ యాల సమ్మేళనం అనేవి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం అనేవాటికంటే ఎక్కువ ఆదరణ పొందాయి. హిందూ జాతీయవాద ఏకీకరణతో బీజేపీ సాధించిన విజయాలు, కీలకమైన రాష్ట్రాల్లో అది అస్వాదిస్తున్న గొప్ప ప్రతిధ్వనిని ఎత్తి చూపుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని, పుష్కలమైన ఆర్థిక వనరులను ఉపయోగించడం, ఆరెస్సెస్ కేడర్ శక్తిమంతమైన పునాదిగా ఉండటంతో బలమైన దేశం, అభివృద్ధి, సంక్షేమవాదాన్ని కోరుకునే పార్టీగా, హిందూమత ఛాంపియన్‌గా తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి బీజేపీకి అవకాశం దొరికింది. బీజేపీ ఎన్నికల ప్రచారం బలమైన రాష్ట్ర నాయకులను పక్కకు నెట్టివేసి, మొదటి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైనే దృష్టి పెట్టింది. ఎన్నికలకు వెళ్లిన ఏ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రతిపాదించకూడదని ఆ పార్టీ నిర్ణయించింది. దీనర్థం ఏమిటంటే, అశోక్ గెహ్లోత్, భూపేష్ బఘేల్ వంటి కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ రాష్ట్ర నాయకులు తమ స్థానిక బీజేపీ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా కాకుండా మోదీకి వ్యతిరేకంగా పోటీ పడ్డట్టయింది. ఉత్తర, మధ్య భారతదేశంలో ప్రధానికి ఉన్న భారీస్థాయి ప్రజాదరణ, ఈ నాయకుల పట్ల ప్రజామోదాన్ని తటస్థింపజేసింది. కర్ణాటకలో స్థానిక నాయకుల ప్రాచుర్యం, ప్రాముఖ్యత తెచ్చిన ఫలితాల అనుభవాన్ని ప్రాతిపదికగా తీసుకొన్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం, ఆ రాష్ట్ర నాయకులపై స్థిరమైన అంచనా వేసుకుంది. వారికి స్వేచ్ఛా హస్తాన్ని అందించింది. అయితే, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్‌లలో వారి నాయకుల అంతర్గత పోరు, మితిమీరిన ఆకాంక్షలు ఈ వ్యూహానికి చెల్లుచీటి పలికాయి. రాష్ట్ర నాయకత్వంలో చీలికలు అనేవి ఈ రెండు రాష్ట్రాల్లోనూ దీర్ఘకాలంగా ప్రదర్శితమవుతూ వచ్చాయి. ఎన్నికలకు కొన్ని నెలల ముందు వరకు కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఇది ఇంటినే సక్రమంగా ఉంచుకోలేని పార్టీ అని ఓటర్లకు సందేశం పంపింది. రెండు రాష్ట్రాలలో పోరాడుతున్న నాయకుల మధ్య ఎట్టకేలకు ఒక ఒప్పందం కుదిరింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ముఠాతత్వానికి తోడుగా రాష్ట్ర నాయకత్వానికీ, అధిష్ఠానానికీ మధ్య సఖ్యత, ఏకాభిప్రాయం కనబడలేదు. దాంతో కాంగ్రెస్ ప్రచా రానికి పొంతన లేకుండా పోయింది. వారి గడ్డపై ఎలాంటి జోక్యాన్నీ శక్తిమంతమైన రాష్ట్ర నాయకులు ఇష్టపడలేదు. దీనికి విరుద్ధంగా, బీజేపీ ప్రచారం తీవ్రంగా సాగింది. తన దృష్టినంతా కేంద్రీకరించింది. పైగా ఆ పార్టీ ఒకే స్వరంలో మాట్లాడింది. ఇది ఆశ్చర్యకరం కాదు, ఎందుకంటే సమకాలీన బీజేపీ అత్యంత కేంద్రీకృతమైన పార్టీగా ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ తన గతం నుండి బయటపడటంలో భాగంగా సాపేక్షంగా వికేంద్రీకరణకు గురైంది. పరిస్థితిని మరింత దిగజార్చుతూ, రాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాల మధ్య ఎటువంటి ఒప్పందం జరగలేదు. బీజేపీతో పోరాడటానికి కలిసి వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని 28 పార్టీలతో కూడిన ఇండియా గ్రూప్ పార్టీల మధ్య సఖ్యత రాష్ట్ర ఎన్నికలలో కనిపించలేదు. ప్రతిపక్షాలు ఇచ్చిపుచ్చుకునే స్ఫూర్తితో రాష్ట్ర ప్రత్యేక పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపి ఉండాలి. చేయడం కంటే చెప్పడానికి ఇది సులభంగా ఉంటుంది. ఏమైనా, సీట్ల పంపకం జరగలేదు. ఇది కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమిని కూడా దెబ్బతీసింది. దీన్ని ఓటర్లు విభజించబడిన ఇల్లుగా భావించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఇతర పార్టీల భవితవ్యం... బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా ఉన్నప్పుడే దాన్ని ఎదుర్కోగలవని స్పష్టం చేస్తోంది. ఓబీసీలలో బీజేపీకి ఉన్న మద్దతును తగ్గించడానికి కాంగ్రెస్ చేసిన పెద్ద పోరాటమే, కుల ఆధారిత జనాభా గణన. కానీ అది ‘నో–బాల్’గా మారింది. ఇదేమీ ప్రయోజనం ఇవ్వలేదు. ఈ పిలుపునకు క్షేత్రస్థాయిలో పెద్దగా ప్రభావం లేకుండా పోయింది. ఓబీసీ ఓట్లలో బీజేపీ వాటా పెరగడమే దీనికి నిదర్శనం. ఏమైన ప్పటికీ, కుల గణన కోసం డిమాండ్ అనేది, హిందూ గుర్తింపు రాజకీ యాలకు స్ఫూర్తిదాయకమైన లేదా ప్రభావవంతమైన ప్రతిఘటనా అంటే సందేహాస్పదంగా ఉంది. స్పష్టమైన రాజకీయ పార్శ్వం, లేదా దాని సందేశాన్ని తెలియజేయడానికి సమర్థవంతమైన ప్రచారం, సైద్ధాంతిక స్పష్టత, సంస్థాగత సమన్వయం లేకుండా... ఈ రాష్ట్రాలలో బీజేపీ రాజకీయాలకు వ్యతిరేకంగా పనిచేయడానికి కుల రాజకీ యాలు, సామాజిక న్యాయ ఆలోచనలు సరిపోవు. రాష్ట్ర, జాతీయ ఎన్నికల మధ్య సంబంధం ఉంటుందనే దానికి పరిమితమైన రుజువు మాత్రమే ఉంది. అయినప్పటికీ, వరుస పోటీలలో బీజేపీ చేతిలో కాంగ్రెస్ నిర్ణయాత్మక ఓటమి దాని విశ్వసనీయతను దెబ్బతీసిందనడంలో సందేహం లేదు. పైగా లోక్‌సభ ఎన్నికలు కేవలం ఐదు నెలల దూరంలో ఉన్న కీలక సమయంలో ఈ ఓటమి ఆ పార్టీని నిరుత్సాహపరుస్తుంది కూడా. అయితే, ఈ క్లిష్టమైన రాష్ట్రాల్లో మెజారిటీ ఓటర్లు బీజేపీయేతర పార్టీలను ఎంచుకున్నందున మొత్తంగా ఆశ పోలేదని కూడా చెప్పవచ్చు. కాంగ్రెస్ ఈ ప్రాతిపదికన నిర్మాణం కావాలి. ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలంటే, అది స్పష్టమైన సైద్ధాంతిక కథనాన్ని ప్రదర్శించాలి. అలాగే దాని సొంత రాజకీయాలను వ్యక్తీకరించాలి. మొదటగా, అది బీజేపీని ‘మరింత హిందూ’ పార్టీగా అధిగమించడానికి ప్రయత్నించకూడదు. దానికోసమే అయితే, ఓటర్లు బీజేపీనే ఎంచుకునే అవకాశం ఉంది. సైద్ధాంతిక ప్రతిఘటన అనేది తప్పని సరిగా హక్కుల ఆధారిత సంక్షేమం, ప్రత్యేకించి సామాజిక సామ రస్యంతో ముడిపడి ఉన్న ఉపాధి హామీలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధికి సంబంధించి విభిన్న నమూనాను ప్రతిబింబించాలి. మొత్తానికి, కాంగ్రెస్ తన రాజకీయ చర్చను పున:ప్రారంభించాలి. పాలకపక్ష పాలనలోని ప్రతికూల అంశాలు, వాటినుండి గ్రహించిన తప్పులు, వారు ప్రచారం చేసిన రాజకీయాలపై దృష్టి పెట్టడం కంటే... ఓటర్లను ఉత్తేజపరిచే సానుకూల ఎజెండాను సమర్థించడం ద్వారా మేలు జరుగుతుంది. -వ్యాసకర్త ప్రొఫెసర్ ఎమెరిటా, సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్, జేఎన్‌యూ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
జయాపజయాలు
మినీ జనరల్ ఎన్నికలుగా భావించిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటర్లు వెలువరించిన విస్పష్టమైన తీర్పు భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న ‘ఇండియా’ కూటమి, దాని ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్ తలరాతలను తలకిందులు చేసింది. తెలంగాణలో దక్కిన బొటాబొటీ విజయం ఒక్కటే కాంగ్రెస్‌కు ఊరటనిచ్చింది. ప్రధాన రాష్ట్రాలైన రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లతోపాటు ఛత్తీస్‌గఢ్‌ను కూడా గెల్చుకుని మరో ఆర్నెల్లల్లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమే ముచ్చటగా మూడో సారి కూడా అధికారంలోకొస్తుందని బీజేపీ చాటింది. ఈ మూడుచోట్లనుంచీ 65 లోక్‌సభ స్థానాలున్నాయి. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో 36 యేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్)– కాంగ్రెస్ కూటమి కొత్తగా ఆవిర్భవించిన జోరమ్ పీపుల్స్ మూవ్మెంట్ (జడ్పీఎం) చేతుల్లో మట్టికరిచింది. అక్కడ ముఖ్యమంత్రి – ఎంఎన్ఎఫ్ సారథి జోరంతంగాతో పాటు 11 మంది మంత్రులు చిత్తుగా ఓడిపోయారు. ఒకటి రెండు రోజుల్లో ఈ అయిదు రాష్ట్రాల్లోనూ కొత్త సారథులు కొలువుదీరబోతున్నారు. మూడు రాష్ట్రాలు గెలుచుకున్న బీజేపీ గానీ, తెలంగాణ గెల్చుకున్న కాంగ్రెస్ గానీ తమ సీఎం అభ్యర్థులను ప్రకటించాల్సివుంది. ఈలోగా ఊహాగానాలే షికారు చేస్తాయి. ఒక్క మిజోరంలో మాత్రం జడ్పీఎం చీఫ్ లాల్దుహోమా ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ ముందే ప్రకటించింది. ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే ‘ఇండియా’ కూటమిలో రుసరుసలు వినిపించాయి. హిందీ బెల్ట్‌లో బీజేపీ ప్రభంజనానికి కాంగ్రెస్ చేతగానితనమే కారణమని తృణమూల్ కాంగ్రెస్ అనటం, తమ పార్టీ అధినేత మమతాబెనర్జీని, కూటమిలోని ఇతర నేతలనూ కలుపుకొని వెళ్లటంలో ఆ పార్టీ విఫలమైందని ఆరోపించటం... జేడీ(యూ), ఆర్జేడీలు సైతం అదే తరహాలో మాట్లాడటం త్వరలో జరగబోయే కూటమి సమావేశం ఎలా ఉంటుందో చెబుతున్నాయి. మొన్న మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచీ ఊహలపల్లకీలో ఊరేగుతున్న కాంగ్రెస్‌ను తాజా ఫలితాలు కిందకు దించాయి. ఈ పంచతంత్రం గట్టెక్కటం ఎలాగోనని సంశయిస్తూ బరిలోకి దిగిన బీజేపీ... తమ నేతలంతా ఒక్కతాటిపై నిలిచారన్న అభిప్రాయాన్ని కలిగించటంలో విజయం సాధించింది. రణరంగానికి తరలే శ్రేణులపై సైన్యాధిపతికి పట్టుండాలి. అతని ఆదేశాలకు అనుగుణంగా ముందుకురికేందుకు చతురంగ బలాలు సర్వసన్నద్ధంగా వుండాలి. విజయమో, వీరస్వర్గమో అన్నంతగా చెలరేగిపోవాలి. కాంగ్రెస్‌కు సంబంధించి జరిగిందంతా అందుకు విరుద్ధం. అధిష్ఠానం సూచనలు పాటించటానికి రాజస్తాన్‌లో గహ్లోత్, మధ్యప్రదేశ్‌లో కమలనాథ్ ససేమిరా అన్నారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో ఈడీ దాడులతో ఎజెండాలోకొచ్చిన మహదేవ్ యాప్ కొంపముంచింది. కనుకనే ఈ మూడుచోట్లా పార్టీ ఆశలు ఆడియాసలయ్యాయి. ‘ఇండియా’ కూటమిలో దాని స్థానాన్ని మరింత బలహీనపరిచాయి. అధికారంలో ఉన్నవారిని సాగనంపే సంప్రదాయం వున్న రాజస్తాన్‌పై కాంగ్రెస్‌కు ఎటూ పెద్దగా ఆశలు లేవు. అయినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ గత ఏడాదిగా ప్రకటిస్తున్న జనాకర్షక పథకాలు ఈ సరళిని మారుస్తాయేమోనన్న భయం బీజేపీలో లేకపోలేదు. కానీ మధ్యప్రదేశ్‌లో అలా కాదు. అక్కడ కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నంతగా ప్రచారం జరిగింది. ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించి అత్తెసరు మెజారిటీతో పాలన ప్రారంభించిన కాంగ్రెస్‌కు రెండేళ్లు తిరగకుండానే పొగబెట్టి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది. సగటు ఓటరుకు ఆ విషయంలో సానుభూతి ఉన్నదని అందరూ అంటూ వచ్చారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంక్షేమ పథకాల జోరు కనబడుతున్నా బీజేపీ సంశయిస్తూనే అడుగులు వేసింది. జాగ్రత్తగా పావులు కదిపింది. సునాయాసంగా అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక కాంగ్రెసే మళ్లీ అధికారంలోకి రావటం ఖాయమని అందరూ అనుకున్న ఛత్తీస్‌గఢ్‌లో సైతం ఆ పార్టీకి పరాజయం తప్పలేదు. రాజస్తాన్‌లో గహ్లోత్, యువ నాయకుడు సచిన్ పైలెట్ల మధ్య నాలుగేళ్లుగా హోరాహోరీ పోరు సాగుతోంది. వారిద్దరిలో ఎవరు నిష్క్రమిస్తే పార్టీకి ఎక్కువ నష్టమో అధిష్ఠానం తేల్చుకోలేక, ఇద్దరి మధ్యా సంధి కుదిర్చేందుకు తంటాలూ పడింది. ఈ అంతర్గత పోరు ఎంత నష్టపరిచిందంటే స్వతంత్రంగా ఉంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసుకునే గిగ్ వర్కర్స్ సంక్షేమానికి దేశంలోనే తొలిసారి చట్టం తెచ్చిన ఘనతను సైతం ప్రచారం చేసుకోలేకపోయింది. ఇతర సంక్షేమ పథకాలు సరేసరి. ఇక మధ్యప్రదేశ్‌లో దాదాపు 30 స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని ఎందరు మొత్తుకున్నా కమలనాథ్ ససేమిరా అన్నారు. పైగా తాను ఓ వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతిని మరిచి ‘జై జై కమలనాథ్’ నినాదాన్ని రుద్దారు. ఛత్తీస్‌గఢ్‌లో మహదేవ్ యాప్ కుంభకోణం తర్వాత సీఎం బఘేల్‌తో వేదిక పంచుకోవటానికి రాహుల్, ప్రియాంక సిద్ధపడలేదు. సంక్షేమ పథకాలతో ఊదరగొడితే చాలదు... నాయకత్వ పటిమపై విశ్వసనీయత కలిగించాలి. ఆ విషయంలో వైఫల్యమే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ముంచింది. అటు బీజేపీలో మూడు రాష్ట్రాల్లోనూ స్థానిక నేతలనూ పక్కనబెట్టి అభ్యర్థుల నిర్ణయంలోనూ, ప్రచారవ్యూహంలోనూ అగ్ర నాయకత్వం తనదే పైచేయి అన్నట్టు వ్యవహరించింది. మోదీ సర్వం తానైనట్టు వ్యవహరించారు. అది విజయానికి దోహద పడింది. దాంతోపాటు కాంగ్రెస్ వైఫల్యాలు కూడా బీజేపీకి కలిసొచ్చాయి. జనం భావోద్వేగాలపైకాక సంక్షేమం, అభివృద్ధి అంశాలపై దృష్టి సారించటం కూడా ఆ పార్టీకి పనికొచ్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే తోడ్పడుతుందని భావిస్తే అది బీజేపీకే మేలు. -
నాలుగు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరం ముగిసింది. ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన నేతల భవితవ్యం ఆదివారం వెల్లడి కానుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యాయి. నెలన్నరకు పైగా ప్రచారంలో నిరంతరాయంగా చెమటోడ్చి విశ్రాంతి తీసుకుంటున్న అభ్యర్థులు, నేతల్లో ఫలితాలపై చెప్పలేనంత ఉత్కంఠ నెలకొంది. ఐదో రాష్ట్రమైన మిజోరంలో ఓట్ల లెక్కింపు సోమవారానికి వాయిదా పడింది. వీటిని కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న నేపథ్యంలో ఫలితాలపై దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మూడుచోట్ల ముఖాముఖి మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోరు సాగింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, మిగతా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. గత మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని మట్టికరిపించిన కాంగ్రెస్, అదే ఊపులో తాజా ఎన్నికల్లో మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తానని ఆశాభావంతో ఉంది. ఈసారి రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లు తమ వశమవుతాయని బీజేపీ భావిస్తోంది. ఈసారి మధ్యప్రదేశ్‌లో బీజేపీకి బాగా మొగ్గుందని, రాజస్తాన్‌లో ఆ పార్టీ ముందంజలో ఉందని గురువారం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పేర్కొన్నాయి. ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణలో కాంగ్రెస్‌కే విజయావకాశాలున్నట్టు తేల్చాయి. హోరాహోరీ పోటీ నేపథ్యంలో హంగ్ వచ్చే చోట ఎమ్మెల్యేలను శిబిరాలకు తరలించేందుకు రెండు పారీ్టలూ ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం. ఉదయం ఎనిమిదికి షురూ ► నాలుగు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ► తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ► అనంతరం 8.30గంటలకు నుంచి ఓటింగ్ యంత్రాల్లోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 52 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ సాగుతోంది. ఇక్కడ 2,533 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. గురువారం నాటి ఎగ్జిట్ పోల్స్‌లో మూడు బీజేపీకి ఘనవిజయం ఖాయమని పేర్కొన్నాయి. 2018 మాదిరిగా రెండు పార్టీలూ విజయానికి దగ్గరగా వస్తాయని మరికొన్ని అంచనా వేశాయి. ఒకట్రెండు కాంగ్రెస్ విజయాన్ని సూచించాయి. భారీ మెజారిటీతో బీజేపీ అధికారాన్ని నిలుపుకుని తీరుతుందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం ధీమా వ్యక్తంచేశారు. ప్రజలు ఈసారి మార్పుకే ఓటేశారని పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ చెప్పుకొచ్చారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు సాధించగా బీజేపీ 109 స్థానాలతో సరిపెట్టుకుంది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 230 మెజారిటీ మార్కు: 116 రాజస్తాన్ ఈ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చేయడం రాజస్తాన్ ప్రజల అలవాటు. ఈ ఆనవాయితీ ఈసారీ కొనసాగుతుందని, మోదీ మేనియా తోడై తమకు అధికారం కట్టబెడుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. సీఎం గెహ్లోత్ మాత్రం ఈసారి ఆనవాయితీ మారుతుందని నమ్మకం పెట్టుకున్నారు. తన సంక్షేమ పథకాలు కచ్చితంగా గట్టెక్కిస్తాయని చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచి్చన నాటినుంచీ గెహ్లోత్‌పై కారాలూ మిరియాలూ నూరుతూ వస్తున్న కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్ ప్రచార పర్వంలో మాత్రం సంయమనం పాటించారు. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 200 మెజారిటీ మార్కు: 101 ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 33 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ సాగుతోంది. లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా చూసేందుకు 90 మంది రిటర్నింగ్ అధికారులు, 416 మంది సహాయ రిటరి్నంగ్ అధికారులు, 1,698 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. రాష్ట్రంలో మొత్తం 1,181 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి సీఎం భూపేశ్ బఘెల్, ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్‌దేవ్, బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ తదితర ప్రముఖులున్నారు. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 90 మెజారిటీ మార్కు:46 -
మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు టైమ్స్ నౌ ఛానల్– ఈటీజీ రీసెర్చ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఒపీనియన్ పోల్‌లో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌కే ఆధిక్యం ఉన్నట్లు వెల్లడైంది. మధ్యప్రదేశ్‌లో పోటా పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు స్వల్ప మొగ్గు కనపడుతోంది. బీజేపీ 43.7 శాతం ఓట్లతో 107–115 స్థానాల్లో నెగ్గే అవకాశాలున్నాయని పేర్కొన్న సర్వే.. కాంగ్రెస్ 44.9 ఓట్లతో 112–122 సీట్లు సాధిస్తుందని తేలి్చంది. ఇతరులు కేవలం 1–3 స్థానాలకే పరిమితమవుతారని పేర్కొంది. మరోవైపు రాజస్తాన్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉందని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. 43.8 శాతం ఓట్లతో బీజేపీ 114–124 స్థానాల్లో గెలవనుందని పేర్కొంది. కాంగ్రెస్ 41.9 శాతం ఓట్లతో 68 నుంచి 78 స్థానాలకు పరిమితం కానుందని తెలిపింది. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 51–59 స్థానాలతో స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుందని, బీజేపీ 27 నుంచి 35 స్థానాలకు పరిమితమవుతుందని సర్వే వెల్లడించింది. పైన పేర్కొన్న మూడు రాష్ట్రాల్లో ప్రస్తుతం రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక తెలంగాణ విషయానికి వస్తే సర్వే వివరాలు పూర్తిగా అందనప్పటికీ ప్రాథమిక సమాచారాన్ని బట్టి అధికార బీఆర్ఎస్కే మొగ్గు కనపడుతోందని టైమ్స్ నౌ సర్వే పేర్కొంది. -
కాంగ్రెస్ ముందు కఠిన సవాళ్లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ముందు మునుపెన్నడూ లేని సవాళ్లున్నాయని ఆ పార్టీ చీఫ్ సోనియాగాంధీ అన్నారు. క్లిష్టమైన ఈ పరీక్షా సమయంలో పార్టీ శ్రేణులు అన్ని స్థాయిల్లోనూ ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) సమావేశంలో సోనియాగాంధీ ప్రసంగించారు. ‘అధికార బీజేపీ అన్ని రాష్ట్రాల్లో విభజన ఎజెండాను అమలు చేస్తోంది. ఎజెండాను బలపరిచేందుకు చరిత్రను వక్రీకరిస్తోంది’అంటూ మండిపడ్డారు. ఆకాశన్నంటుతున్న ధరలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దీనిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై ఆమె స్పందిస్తూ.. ‘అనూహ్యమైన, బాధాకరమైన ఈ ఫలితాలను చూసి మీరెంత నిరుత్సాహానికి గురైందీ నాకు తెలుసు. ఈ ఫలితాల అనంతరం ఏర్పాటైన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే విషయమై పలువురు కీలక సూచనలు చేశారు. వీటిని ప్రస్తుతం పరిశీలిస్తున్నాం. పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎలా అధిగమించాలనే విషయంలో రోడ్ మ్యాప్‌ను రూపొందించేందుకు ‘చింతన్ శిబిర్’ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’అని సోనియా అన్నారు. ‘పార్టీ శ్రేణులు అన్ని స్థాయిల్లోనూ ఐకమత్యంగా మెలగడం అత్యంత అవసరం. ఇందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటాం’అని చెప్పారు. ‘కాంగ్రెస్ పార్టీ బలోపేతం కేవలం మనకే మాత్రమే కాదు, దేశంలో ప్రజాస్వామ్యానికి, సమాజానికి ప్రస్తుతం అత్యంత కీలకం’అని తెలిపారు. దేశంలో పరిణామాలపై సోనియా గాంధీ మాట్లాడుతూ..‘పారిశ్రామిక రంగం అత్యంత ప్రమాదకరంగా ఉంది. ప్రభుత్వం రైతులకిచ్చిన వాగ్దానాలను అమలు చేస్తుందనేందుకు ఎటువంటి సూచనలు కనిపించడం లేదు. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ భరించలేనంతగా పెరుగుతున్నాయి. ఎరువులు, ఇంధన ధరలు ఆకాశాన్నంటున్నాయి. వీటి నుంచి ప్రజలను కాపాడేందుకు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉద్యమించాలి’అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ ఆహార భద్రతా చట్టం, గ్రామీణ ఉపాధి హామీ చట్టాలను ప్రధాని సహా ఇప్పటి ప్రభుత్వ నేతలు విమర్శించినా ఈ పథకాలు గడిచిన రెండేళ్లలో దేశంలోని కోట్లాది మంది ప్రజలను కాపాడాయన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ తీవ్ర వైఫల్యం తర్వాత జరిగిన ఈ భేటీలో పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. చదవండి: శివసేన ఎంపీకి ఈడీ షాక్.. ‘కాల్చండి, జైలుకు పంపండి, భయపడేది లేదు’ -
బీజేపీ సొంతంగా సాధించిన సీట్లు ఎన్నో తెలుసా?
సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సవ్యంగా ముగిశాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించగా, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయ దుందుభి మోగించింది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండో పర్యాయం విజయం సాధించిన బీజేపీ 2017 ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని స్వల్పంగా మెరుగు పరుచుకుంది. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీ అసెంబ్లీలో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ 273 సీట్లలో విజయం సాధించింది. బీజేపీకి మైనస్.. ఎస్పీకి ప్లస్ తాజా ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగినా 57 సీట్లు తగ్గాయి. కమలం పార్టీ సొంతంగా 255 స్థానాల్లో విజయం సాధించింది. 2017 ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే. ఈసారి బీజేపీ మిత్రపక్షాలు అప్నా దల్ (సోనీలాల్) 12, నిర్బల్ ఇండియన్ శోషిత్ హమారా ఆమ్ దల్ 6 సీట్లు దక్కించుకున్నాయి. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ గతంతో పోలిస్తే అదనంగా 64 సీట్లను సాధించింది. గత ఎన్నికల్లో 47 సీట్లకే పరిమితమైన అఖిలేశ్ పార్టీ ఇప్పుడు 111 స్థానాలు గెలిచింది. సమాజ్‌వాదీ మిత్రపక్షాలు రాష్ట్రీయ లోక్ దళ్ 8, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 6 స్థానాలు గెలిచాయి. బీఎస్పీ, కాంగ్రెస్ ఫట్! బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు దారుణమైన ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికల్లో 19 స్థానాలు సాధించిన బీఎస్పీ ఏకంగా 18 సీట్లు కోల్పోయి సింగిల్ సీట్‌కే పరిమితమైంది. 2017 ఎన్నికల్లో ఏడు చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్ 5 సీట్లు కోల్పోయి రెండు స్థానాలను మాత్రమే గెలుకోగలిగింది. 10 శాతం పెరిగిన ఎస్పీ ఓట్లు తాజా ఎన్నికల్లో బీజేపీ 41.3 శాతం ఓట్లు సాధించింది. 2017 ఎన్నికలతో(39.67) పోలిస్తే ఇది 1.7 శాతం ఎక్కువ. సమాజ్‌వాదీ పార్టీ గతంతో పోలిస్తే ఏకంగా 10.3 శాతం ఓటింగ్ షేర్ అదనంగా సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో 32.1 శాతం ఓట్లు సాధించగా.. 2017లో 21.82 శాతం ఓట్లు దక్కించుకుంది. బీఎస్పీ 9.38, కాంగ్రెస్ 3.92 శాతం ఓట్ షేర్ కోల్పోయాయి. ఈ ఎన్నికల్లో బీఎస్పీకి 12.88, కాంగ్రెస్‌కు 2.33 శాతం ఓట్లు వచ్చాయి. ఇతరులు 6.74 శాతం, రాష్ట్రీయ లోక్ దళ్ 2.85 శాతం ఓట్లు తెచ్చుకున్నాయి. (క్లిక్: తెలంగాణలో జోరందుకున్న పాదయాత్రలు) బీజేపీకి 3, ఎస్పీకి 2, బీఎస్పీకి 1 అత్యధిక సీట్లు సాధించిన బీజేపీకి మొత్తంగా 3 కోట్ల 80 లక్షల 51 వేల 721 ఓట్లు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ 2 కోట్ల 95 లక్షల 43 వేల 934 ఓట్లు దక్కించుకుంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి కోటి 18 లక్షల 73 వేల 137 ఓట్లు దక్కాయి. ఇతరులు 62 లక్షల 13 వేల 262 ఓట్లు తెచ్చుకున్నారు. (క్లిక్: యూపీ ఫలితాలు: 2024 ఎన్నికలకు బీజేపీకి బిగ్ బూస్ట్) ‘నోటా’నే బెటర్! యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పార్టీల కంటే ‘నోటా’కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈసారి నోటాకు 0.69 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎఐఎం 0.49, ఆప్ 0.38, జేడీ(యూ) 0.11, సీపీఐ 0.07, ఎన్సీపీ 0.05, ఎస్హెచ్ఎస్ 0.02, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్), ఎల్జేపీఆర్వీ 0.01 శాతం చొప్పున ఓట్లు దక్కించుకున్నాయి. (క్లిక్: మూడు జంటలు.. ముచ్చటైన విజయాలు) -
గోవా పీఠంపై మళ్లీ బీజేపీ!
చిన్న రాష్ట్రం గోవాలో ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని మరీ అధికార బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. మొత్తం 40 సీట్లకు గాను 20 సీట్లు గెలుచుకుంది. శాసనసభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్‌కు అడుగు దూరంలో ఆగిపోయింది. జీఎఫ్‌పీతో కూడిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూటమి 12 స్థానాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 2, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూటమికి 3 సీట్లు వచ్చాయి. తృణమూల్ కూటమిలో ఉన్న ఎంజీపీ రెండు సీట్లు సాధించింది. ముగ్గురు స్వతంత్రులు నెగ్గారు. ఎంజీపీకి చెందిన ఇద్దరు సభ్యులతోపాటు ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. దీంతో బీజేపీ బలం 25కు చేరింది. గోవాలో మరోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరడం ఇక లాంఛనమే. ఎంజీపీ తమకు బేషరతుగా మద్దతునిచ్చేందుకు అంగీకరించిందని ముఖ్యమంత్రి, బీజేపీ నేత ప్రమోద్ సావంత్ చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్లు బీజేపీ గోవా ఎన్నికల ఇన్చార్జి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ప్రభుత్వ నూతన సారథి ఎవరన్నది పార్టీ నాయకత్వమే నిర్ధారిస్తుందని ప్రమోద్ సావంత్ అన్నారు. కొత్త ప్రభుత్వంపై మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ)కి ప్రాతినిధ్యం కల్పించాలా, లేదా ఇంకా నిర్ణయించలేదని వెల్లడించారు. శుక్రవారం జరగబోయే బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో దానిపై స్పష్టత వస్తుందన్నారు. గోవా ఎన్నికల్లో ఓటమిపై రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు గిరీష్ చోడాంకర్ స్పందించారు. నాన్–బీజేపీ ఓట్లు చీలిపోవడం వల్లే కమలం పార్టీ గెలిచిందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 33.31 శాతం, కాంగ్రెస్ 23.46 శాతం ఓట్లు సాధించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అమిత్ పాలేకర్ ఓటమి చెందడం గమనార్హం. -
కాంగ్రెస్... ఖేల్ ఖతం!
దశాబ్దాల పాటు దేశాన్ని అప్రతిహతంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ నానాటికీ తీసికట్టుగా మారుతూ వస్తోంది. ముఖ్యంగా 2014 నుంచి ఒకటీ అరా తప్పిస్తే ప్రతి ఎన్నికల్లోనూ ఘోర పరాభవాలే చవిచూస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నోట పదేపదే విన్పించే ‘కాంగ్రెస్ ముక్త భారత్’నినాదం త్వరలో నిజమయ్యే పరిస్థితి కన్పిస్తోంది... 2004 నుంచి యూపీఏ కూటమి సారథిగా పదేళ్ల పాటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చలాయించింది. నిజానికి 1999 నుంచి 2004 దాకా అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ వాజ్‌పేయి నాయకత్వంలో మంచి పనితీరే కనబరిచినా గుజరాత్ మత ఘర్షణలు పెద్ద మైనస్‌గా మారాయి. 2004 ఎన్నికల సమయంలో ఓవైపు నిరుద్యోగ సమస్య వేధిస్తుంటే ఇండియా షైనింగ్ అంటూ ఊదరగొట్టడం జనానికి నచ్చలేదు. దాంతో ఎన్డీఏను తిరస్కరించారు. సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ 145 సీట్లు నెగ్గగలిగింది. యూపీఏ1 పాలన ఫర్వాలేదనిపించినా యూపీఏ2 హయాంలో వెలుగు చూసిన లెక్కకు మించిన కుంభకోణాలు కాంగ్రెస్‌ను కుదిపేశాయి. దీనికి తోడు ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై సోనియా, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ కర్ర పెత్తనం కాంగ్రెస్ ప్రతిష్టను బాగా మసకబార్చాయి. ఈ పరిస్థితిని నరేంద్ర మోదీ రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకుని సుడిగాలిలా దేశమంతటినీ చుట్టేశారు. అమిత్ షాతో కలిసి అద్భుతమే చేసి చూపించారు. కాంగ్రెస్‌ను మట్టి కరిపిస్తూ సొంతంగానే 282 సీట్లతో అఖండ విజయం అందుకున్నారు. మిత్రపక్షాలతో కలిపి ఏకంగా 336 స్థానాలు కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ తన చరిత్రలోనే అత్యల్పంగా 44 స్థానాలకు పడిపోయి కుదేలైంది. పార్టీ ఓటు షేరు కూడా ఎన్నడూ లేనంతగా 19 శాతానికి పడిపోయింది. అప్పటినుంచి ఇక పార్టీ కోలుకోనే లేదు. పైగా నానాటికీ దిగజారుతూనే వస్తోంది. వరుస ఎన్నికల్లో పరాజయాల పరంపర కొనసాగుతూనే వస్తోంది. ఈ ఎనిమిదేళ్లలో జరిగిన పలు అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఘోర పరాభవాలే మూటగట్టుకుంది. 2017లో మణిపూర్, గోవాల్లో ఏకైక అతి పెద్ద పార్టీగా నిలిచినా చిన్నాచితకా పార్టీలతో సరైన సంప్రదింపులు చేయలేక రెండుచోట్లా అధికారానికి దూరమైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 52 సీట్లకు పరిమితమై మరోసారి చతికిలపడింది. ఓటు షేరు కూడా 19 శాతానికే పరిమితమైంది. రాష్ట్రాలవారీగా చూసినా రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్ మాత్రమే కాంగ్రెస్ చేతిలో మిగిలాయి. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లోనూ ఘోర పరాజయం మూటగట్టుకుంది. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనూ ఒకట్రెండు స్థానాలకు పరిమితమై మరోసారి దారుణ పరాభవాన్నే చవిచూసింది. ఆ రాష్ట్రంలో సమీప భవిష్యత్తులో కోలుకునే పరిస్థితే కన్పించడం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ల్లో మాత్రమే! జార్ఖండ్, మహారాష్ట్రల్లో పాలక సంకీర్ణంలో భాగస్వామిగా కొనసాగుతోంది. దేశ రాజకీయ చరిత్రలో కాంగ్రెస్‌కు ఇంతటి హీన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. స్వయంకృతమే... కాంగ్రెస్ ప్రస్తుత దుర్దశ చాలావరకు స్వయంకృతమనే చెప్పాలి. యూపీఏ హయాంలో ప్రధానిగా మన్మోహన్‌ను నామమాత్రం చేసి అసలు అధికారమంతా సోనియా, రాహుల్ చలాయించిన తీరుతోనే దిగజారుడు మొదలైంది. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్‌గాంధీ అయిష్టత పరిస్థితిని మరింత దిగజార్చింది. ఆయన నాన్చుడు ధోరణి, స్పష్టత లేని వ్యవహారశైలి కూడా కాంగ్రెస్‌కు మైనస్‌గానే మారుతూ వచ్చాయి. వీటికి తోడు సీనియర్లు, జూనియర్ల అంతర్గత కలహాలు రచ్చకెక్కి పార్టీని మరింత భ్రష్టుపట్టించాయి. జ్యోతిరాదిత్య సింధియా వంటి యువ నాయకుల నిష్క్రమణతో కాంగ్రెస్ మరింత డీలాపడింది. 20 మందికి పైగా సీనియర్ లీడర్లు పార్టీ నాయకత్వం తీరును తప్పుబడుతూ లేఖలు రాయడం వంటివి ఇంకింత అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. నాయకత్వ లేమికి ఇవన్నీ తోడై కాలూ చేయీ కూడదీసుకోలేక అసలే కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌కు తాజా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రోకటిపోటుగా పరిణమించాయి. -
Sakshi Cartoon: ఈసారయినా డిపాజిట్ దక్కుతుందా సార్.. గెలుస్తామా?
ఈసారయినా డిపాజిట్ దక్కుతుందా సార్.. గెలుస్తామా? -
మూడు జంటలు.. ముచ్చటైన విజయాలు
పణజి: గోవా శాసనసభ ఎన్నికల బరిలోకి దిగిన ఐదు జంటలకు మిశ్ర ఫలితాలు వచ్చాయి. మూడు జంటలు విజయాన్ని అందుకోగా, రెండు జంటలు ఓటమిపాలయ్యాయి. బీజేపీ తరపున పోటీ చేసిన రెండు జంటలు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక జంట విజయాన్ని సాధించాయి. ప్రతిష్టాత్మక పణజి నియోజకవర్గం నుంచి 716 ఓట్ల స్వల్ప మెజారిటీతో అటానాసియో మోన్సెరెట్టే గెలిచారు. ఆయన భార్య జెన్నీఫర్.. తలైగావ్ స్థానం నుంచి విజయాన్ని నమోదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి టోనీ ఆల్ఫ్రెడో రోడ్రిగ్స్ పై 2041 ఓట్ల ఆధిక్యంతో జెన్నీఫర్ విజయం సాధించారు. రాణే జంట విన్ బీజేపీ నేత, వైద్యశాఖ మంత్రి విశ్వజిత్ ప్రతాప్‌సింగ్ రాణే.. వాల్పోయి నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన సతీమణి దేవీయ విశ్వజిత్ రాణే.. పోరియం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. దేవీయ 13 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం విశేషం. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇదే నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న దేవీయ మామగారు రంజిత్ జయసింగ్రావు రాణే కూడా కాంగ్రెస్ పార్టీ తరపున ఇక్కడి నుంచి పోటీ చేశారు. అయితే ఆయన ఐదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసిన విశ్వజిత్ రాణే రెండో స్థానంలో నిలిచారు. లోబో కపుల్స్ విక్టరీ కాంగ్రెస్ అభ్యర్థి మైఖేల్ విన్సెంట్ లోబో.. కలన్గుట్ స్థానం నుంచి గెలుపొందగా, ఆయన భార్య డెలిలా మైఖేల్ లోబో.. సియోలిమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1727 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి దయానంద్ రాయు మాంద్రేకర్ను డెలిలా ఓడించారు. మైఖేల్.. 4979 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి జోసెఫ్ రాబర్ట్ సెక్వేరాపై గెలిచారు. కవ్లేకర్ దంపతుల పరాజయం ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కవ్లేకర్, ఆయన సతీమణి సావిత్రి కవ్లేకర్ కూడా పోటీలో ఉన్నారు. క్యూపెమ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన చంద్రకాంత్ 3 వేల పైచిలుకు ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్టన్ డికోస్టా చేతిలో ఓడిపోయారు. సంగెం అసెంబ్లీ సీటు భంగపడిన సావిత్రి.. ఇండింపెండెంట్‌గా పోటీ స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. (క్లిక్: గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే?) తృణమూల్ జంట ఓటమి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అల్డోనా నియోజకవర్గం నుండి కిరణ్ కండోల్కర్కు టికెట్ ఇవ్వగా, అతని భార్య కవిత.. థివిమ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే వీరిద్దరూ ఓటమిపాలయ్యారు. (క్లిక్: గెలిచినా సంతోషం లేదంటున్న బీజేపీ అభ్యర్థి) -
మార్కెట్‌కు బీజేపీ విన్నింగ్ కిక్
ముంబై: ఎగ్జిట్స్ పోల్స్ అంచనాలకు తగ్గట్టు ఎన్నికల ఫలితాలు బీజేపీకే అనుకూలంగా వెలువడటంతో స్టాక్ మార్కెట్ మూడోరోజూ ముందుకే కదిలింది. ఉక్రెయిన్ – రష్యా యుద్ధ భయాలు తగ్గుముఖం పట్టడం, చమురు ధరలు దిగిరావడం, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలపడటం తదితర అంశాలు కలిసొచ్చాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 817 పాయింట్లు పెరిగి 55,464 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 250 పాయింట్లు ఎగసి 16,595 వద్ద నిలిచింది. రూపాయి ర్యాలీతో ఐటీ షేర్లకు తప్ప అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ సూచీలో టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్ షేర్లు మాత్రమే నష్టపోయాయి. ‘‘అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌తో సహా నాలుగు రాష్ట్రాల్లో మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దీంతో కేంద్రం తలపెట్టదలిచిన ఆర్థిక సంస్కరణల వేగం మరింత పుంజుకోవచ్చని ఇన్వెస్టర్లు భావించారు. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధ సంధికి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు టర్కీలో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఇరాక్, యూఏఈలతో పాటు ఒపెక్ దేశాల నుంచి అదనపు చమురు అందుబాటులోకి వస్తుందనే వార్తలతో క్రూడ్ ధరలు చల్లబడ్డాయి. ఇప్పుడు సాంకేతికంగా నిఫ్టీ 16,800 స్థాయి వద్ద నిరోధాన్ని కలిగి ఉంది. బలమైన ఈ స్థాయిని ఛేదిస్తేనే మార్కెట్ మూమెంటమ్ కొనసాగుతుంది’’ శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యశ్ షా తెలిపారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 19 పైసలు బలపడి 76.43 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,981 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీ ఇన్వెస్టర్లు రూ.946 కోట్ల షేర్లను కొన్నారు. దాదాపు సగం లాభాలు మాయం ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం భారీ లాభంతో మొదలైంది. సెన్సెక్స్ ఏకంగా 1,595 పాయింట్ల లాభంతో 56,242 వద్ద, నిఫ్టీ 412 పాయింట్లు పెరిగి 16,757 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వెలువడుతుండటంతో సూచీలు ఆరంభ లాభాల్ని నిలుపుకోగలిగాయి. అయితే యూరప్ యూనియన్ బ్యాంక్ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశం, యూఎస్ సీపీఐ డేటా గణాంకాల వెల్లడి నేపథ్యంలో యూరప్ మార్కెట్ల బలహీన ప్రారంభంతో సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇన్వెస్టర్లు మిడ్‌సెషన్ నుంచి లాభాల స్వీకరణకు పూనుకోవడంతో సూచీలు సగం లాభాలు మాయమయ్యాయి. మూడు రోజుల్లో రూ.10.83 లక్షల కోట్లు మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 2,621 పాయింట్లు లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(మార్కెట్ క్యాప్) రూ.10.83 లక్షల కోట్లు పెరిగింది. తద్వారా బీఎస్ఈ ఎక్సే్చంజీ మార్కెట్ క్యాప్ రూ.251 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► ట్రేడింగ్ సమయంలో రూ.2,689 కోట్ల షేర్లు చేతులు మారడంతో కోపోర్జ్ షేరు ఏడు శాతం క్షీణించి రూ.4,234 వద్ద స్థిరపడింది. ► పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంక్(ఎస్ఎఫ్బీ)లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకుంటుందనే వార్తలతో పేటీఎం షేరు మూడుశాతం పెరిగి రూ.774 వద్ద నిలిచింది. గత రెండురోజుల్లో ఈ షేరు 9% ర్యాలీ చేసింది. ► క్రూడ్ ధరలు తగ్గడంతో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా షేర్లు వరుసగా అరశాతం, 3% చొప్పున బలపడ్డాయి. ► ఎఫ్ఎంసీజీ షేర్లకు నెలకొన్న డిమాండ్‌తో హెచ్‌యూఎల్ షేరు ఐదు శాతం బలపడి రూ.2,101 వద్ద ముగిసింది. సూచీల్లో అత్యధికంగా బలపడిన షేరు ఇదే. (చదవండి: బంగారం కొనేవారికి అదిరిపోయే శుభవార్త..!) -
కెప్టెన్‌కి ఘోర పరాభవం
ఛండీగఢ్: ఆప్ దెబ్బకు పంజాబ్ రాజకీయమే మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని ఘన విజయం దిశగా దూసుకుపోతోంది Aam Aadmi Party. ఈ తరుణంలో పంజాబ్ రాజకీయ బాహుబలి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు ఘోర పరాభవం ఎదురైంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓటమి పాలయ్యారు. పాటియాలా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. ఆప్ అభ్యర్థి అజిత్ పాల్‌సింగ్ కోహ్లీ చేతిలో 19, 797 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. సిద్ధూతో గొడవ, కాంగ్రెస్ లుకలుకల కారణంగా ఆయన పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఇక పాటియాలా అమరీందర్ సింగ్‌కు 12 ఏళ్లపాటు కంచుకోటగా ఉండింది. ఈ తరుణంలో ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారంతా. కానీ, ఫలితం ఊహించని రీతిలో రావడం.. కెప్టెన్‌తో పాటు ఆయన సన్నిహితులకు పెద్ద షాకే ఇచ్చింది. -
సెమీస్ విజేత కాంగ్రెస్
నాలుగురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పలేదు. అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో ఓటమిపాలైంది. మూడుసార్లు బీజేపీకే పట్టంగట్టిన ఛత్తీస్‌గఢ్ ప్రజలు ఈసారి రమణ్‌సింగ్ సర్కారును గద్దెదించారు. దీంతో 90 స్థానాల్లో బీజేపీ కేవలం 15 స్థానాలకే పరిమితమైంది. అటు రాజస్తాన్‌లోనూ సీఎం వసుంధరా రాజేపై ఉన్న వ్యతిరేకత కారణంగా కమలం పార్టీ 70 స్థానాలకే పరిమితమయ్యింది. ఇక్కడ కాంగ్రెస్ 100 స్థానాల్లో గెలుపొంది అధికారానికి అడుగుదూరంలో నిలిచింది. అయితే 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీ (109), కాంగ్రెస్ (113) మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ నెలకొంది. హంగ్ వచ్చే సంకేతాలుండటంతో.. ఎస్పీ, బీఎస్పీ, ఇతరుల ఓట్లను పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అటు 40 స్థానాలున్న మిజోరంలో కాంగ్రెస్ అధికారం కోల్పోగా.. ప్రాంతీయ పార్టీ ఎంఎన్ఎఫ్ 26 స్థానాలతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. న్యూఢిల్లీ: రాజకీయ సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కట్టబెట్టి కాంగ్రెస్‌కు మోదాన్ని, మూడు ప్రధాన రాష్ట్రాల్లో తీవ్రంగా నష్టపరిచి బీజేపీకి ఖేదాన్ని ఈ ఎన్నికలు మిగిల్చాయి. తెలంగాణలో టీఆర్ఎస్కు, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్‌కు ఘన విజయం అందించాయి. ఈ అసెంబ్లీ ఫలితాలతో రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్, వ్యూహాల్లో మార్పులతో బీజేపీ లోక్‌సభ ఎన్నికల రణరంగంలో దూకనున్నాయి. ఇప్పటివరకు రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల్లో బీజేపీ అధికారంలో ఉండగా, తాజాగా రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌ల్లో పరాజయం పాలైంది. రాజస్తాన్‌లో మొత్తం 200 స్థానాలకు గానూ 199 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 73, బీఎస్పీ 6, సీపీఎం 2, భారతీయ ట్రైబల్ పార్టీ 2, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ 3, ఇండిపెండెంట్లు 13 స్థానాల్లో గెలుపొందారు. విజయం సాధించిన ఇండిపెండెంట్లలో అత్యధికులు కాంగ్రెస్ రెబెల్సే కావడం విశేషం. దాంతో మేజిక్ నెంబరైన 100ను సాధించడం కాంగ్రెస్‌కు కష్టమేం కాదు. అలాగే, చత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 68 సీట్లు సాధించి కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఇక్కడ బీజేపీ 15 స్థానాలకే పరిమితమయింది. అజిత్ జోగి, మాయవతి కూటమికి 6 సీట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో మాత్రం కౌంటింగ్ సందర్భంగా మొదటి రౌండ్ నుంచి ఉత్కంఠభరిత పోరు నెలకొంది. రౌండ్, రౌండ్‌కీ కాంగ్రెస్, బీజేపీల మధ్య ఆధిక్యతలో హెచ్చుతగ్గులు వస్తూ, పార్టీ నేతలకు, అభ్యర్థులకు చెమటలు పట్టించాయి. మొత్తం 230 స్థానాల అసెంబ్లీలో ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు అర్ధరాత్రి వరకు చెరి 78 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ 36, బీజేపీ 31 సీట్లలో ఆధిక్యతలో ఉన్నాయి. బీఎస్పీ 2, ఎస్పీ 1, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలుపొందారు. హంగ్ తప్పని ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు మంగళవారం రాత్రి గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈశాన్య రాష్ట్రం మిజోరంను కూడా కాంగ్రెస్ తమ ఖాతా నుంచి చేజార్చుకుంది. ఇక్కడ మిజో నేషనల్ ఫ్రంట్ 26 సీట్లతో ఘనవిజయం సాధించింది. మొత్తం 40 సీట్లలో కేవలం 5 స్థానాల్లోనే కాంగ్రెస్ గెలుపొందింది. థాంక్యూ భారత్ రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు కాంగ్రెస్ పార్టీ మంగళవారం తన అధికారిక ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపింది. మీరు ద్వేషానికి బదులు ప్రేమను ఎన్నుకున్నారని ఆనందం వ్యక్తం చేసింది. ‘ప్రజాస్వామ్యం గెలిచింది! భారత ప్రజానీకానికి కృతజ్ఞతలు. ప్రజలు ద్వేషానికి బదులు ప్రేమను, హింసకు బదులు అహింసను, అబద్ధానికి బదులు నిజాన్ని ఎంచుకున్నారని’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. మోదీ నుంచి ఎంతో నేర్చుకున్నా! ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. గెలిచిన నేతలకు అభినందనలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో, ఆ తరువాత తానెంతో నేర్చుకున్నానని, అలాగే, ఎలా ఉండకూడదో, ఏం చేయకూడదో ప్రధాని మోదీ నుంచి నేర్చుకున్నానని వ్యాఖ్యానించారు. ప్రజలు నిరుద్యోగానికి, అవినీతికి, రైతాంగ సంక్షోభానికి వ్యతిరేకంగా ఓటేశారన్నారు. గెలుపోటములు సహజం ఈ ఎన్నికల్లో విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ప్రజా తీర్పును వినమ్రంగా స్వీకరిస్తామన్నారు. జీవితంలో గెలుపు, ఓటమి సహజమని, వాటికి అతీతంగా దేశాభివృద్ధి కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. -
మోదీకి ఖేదం– కేసీఆర్‌కు మోదం
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్‌గా జరిగిన అయిదు రాష్ట్రాలు–మధ్యప్రదేశ్, రాజ స్తాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజో రాం ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ హవాకు అడ్డుకట్ట వేశాయని చెప్పవచ్చు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ ఏక పక్షంగా సాధించిన విజయాలు చరిత్రాత్మకమైనవి. ఈ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోదీకి ఖేదం, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మోదాన్ని కలిగించాయి. అలాగే దేశంలో ఇప్పటి వరకూ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఏ రాజ కీయ పార్టీ విజయం సాధించిన దాఖలాలు లేవు. కాబట్టి ఆ రికార్డును టీఆర్ఎస్ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా టీఆర్ఎస్ కారు వేగానికి కాంగ్రెస్‌లోని హేమాహేమీలు అడ్డుకట్ట వేయలేక ఓడిపోవడం గమనార్హం. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ పథకాలే టీఆర్ఎస్ భారీ విజయానికి దోహదపడ్డాయి. ఇక ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలన్న బీజేపీ కలలు కల్లలైనాయి. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఈ ఎన్నికలు మంచి గుణపాఠం నేర్పిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మైనారిటీ వ్యతిరేక రాజకీయాలు, మతం పేరిట ఓటర్లలో విభజన తెచ్చే వ్యూహాలు బీజేపీకి బెడిసికొడుతున్నాయని గ్రహించాలి. కేంద్రంలో అధికారంలోకొస్తే నల్లధనాన్ని వెనక్కి తెస్తామని, ప్రతీ నిరుపేద కుటుంబానికి పదిహేను లక్షలు వారి ఖాతాలలో జమ చేస్తామన్న హామీలు నీటి మూటలయ్యాయి. నోట్ల రద్దుతో సామాన్యులకు నరకం చూపించారు. బ్యాంకుల దివాలాకు కారణమయ్యారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకరణ, ఆర్థిక విధానాల వల్ల నిత్యావసరాల ధరలు, పెట్రోలు డీజిల్ రేట్లు అమాంతం పెరిగిపోయి సామాన్యుడు బతకలేని దుస్థితి దాపురించింది. మరోవైపు సంఘ్ పరివార్ వివాదాలు, విధ్వం సక పోకడలు బీజేపీ ప్రతిష్ఠను, మోదీ హవాను lతగ్గించివేస్తున్నాయి.అందువల్ల ఎన్నికలకు ముందు దేశ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కేంద్రం ఇకనైనా చిత్తశుద్ధితో కృషిచేయాలి. బట్టా రామకృష్ణ దేవాంగ, సౌత్ మోపూరు, నెల్లూరుజిల్లా -
తెలంగాణ ప్రజలకు జేజేలు!
తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు నవంబర్ 12తో మొదలై ఈనెల 7వరకూ వివిధ దశల్లో జరిగిన ఎన్నికల్లో మంగళవారం ప్రజాభిప్రాయం వెల్లడైంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ గెలుపు ఖాయమవుతుండగా... మిజోరంలో మిజోరం నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) గెలుపొందింది. హోరాహోరీగా జరిగిన తెలంగాణ పోరులో జనం టీఆర్ఎస్కు పట్టంగట్టారు. అయిదేళ్లకోసారి పాలకుల్ని మార్చే అలవాటున్న రాజస్తాన్‌లో నైనా... మూడు దఫాలనుంచి వరసగా బీజేపీవైపే మొగ్గుచూపుతూ వస్తున్న మధ్యప్రదేశ్లోనైనా విజేతలకూ, పరాజితులకూ మధ్య సీట్ల సంఖ్యలో పెద్దగా వ్యత్యాసం లేకపోవడం గమనించదగ్గది. బీజేపీకి గత మూడు దఫాలు పట్టంగట్టిన ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం కాంగ్రెస్ మంచి మెజారిటీ దిశగా సాగిపోతోంది. మరో ఆర్నెల్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా అభివర్ణిస్తున్న ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజల నాడి ఎలా ఉందో అర్ధమైంది గనుక జాతీయ పార్టీలూ, ప్రాంతీయ పార్టీలూ కూడా తమ తమ ఆచరణలనూ, ఎత్తుగడలనూ సవరించుకుంటాయి. భవి ష్యత్తు వ్యూహాలకు పదును పెట్టుకుంటాయి. ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని సిద్ధాంతాలు వల్లించినా ప్రజాప్రయోజనాలు ఇరుసుగా చేసుకుని పనిచేయని పార్టీలకు–అవి అధికారంలో ఉన్నా, ప్రతి పక్షంలో ఉన్నా జనం గట్టిగా గుణపాఠం చెప్పారు. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి, అవకాశవాద పొత్తులతో అందలం ఎక్కుదామనుకున్నవారిని చాచికొట్టారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు అక్షరాలా ఒంటరి పోరాటం చేశారు. పొలోమంటూ తరలివచ్చిన జాతీయపార్టీల అతిరథమహారథులను ఎదుర్కొన్నారు. ‘నే తగుదు నమ్మా...’ అంటూ పొరుగు రాష్ట్రమన్న స్పృహ కూడా లేకుండా తెలంగాణలో కాళ్లూ చేతులూ పెట్ట బోయిన ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరిచిపోలేని గుణపాఠం నేర్పారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, పలువురు బీజేపీ సీఎంలు, కేంద్రమంత్రులు ఇక్కడ ప్రచారం చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో ఏనాడూ, ఎక్కడా బహిరంగసభల్లో పాల్గొనని కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ హైదరాబాద్ నగరంలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. తెలంగాణ స్థితిని చూసి తల్లిగా తల్లడిల్లుతున్నానని జనంలో సెంటిమెంటు పండించేందుకు ప్రయ త్నించారు. ప్రచారం ముగిసేరోజు సైతం వీడియో సందేశమిచ్చారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటించారు. చంద్రబాబుతో కలిసి సభల్లో, విలేకరుల సమావేశాల్లో పాల్గొ న్నారు. కానీ విషాదమేమంటే సోనియాగాంధీ అయినా, రాహుల్ అయినా చంద్రబాబు స్క్రిప్టును మించి మరేమీ చెప్పలేకపోయారు. సొంత రాష్ట్రంలో అన్నిటా విఫలమైన బాబు ఇక్కడికొచ్చి కేసీ ఆర్‌ను విమర్శించడాన్ని చూసి జనం నవ్వుకున్నారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవని అంటారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎవరూ హత్య చేయలేదు. అదే ఆత్మహత్య చేసుకుంది. తన మరణశాసనాన్ని తానే లిఖించుకుంది. ఒంటరిగా పోటీ చేస్తే మెజారిటీ రాకపోయినా, ఆ పార్టీకి గౌరవనీయమైన సంఖ్యలో సీట్లు లభిం చేవి. దురాశకు పోకుండా టీజేఎస్, సీపీఐలతోపాటు సీపీఎంని కూడా ఒప్పించి వాటితో కూటమికి సిద్ధపడితే పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేది. కానీ కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా ‘టీఆర్ఎస్ పొమ్మన్నది గనుక మీతో చెలిమి చేస్తాన’ంటూ వచ్చిన చంద్రబాబును వెనకా ముందూ చూడ కుండా వాటేసుకుంది. వచ్చింది మనవాడా... మనకు పరాయివాడా అన్న సోయి లేకుండా పోయింది. కూటమి కట్టేముందు ఏ పార్టీ అయినా దానికి అర్ధం, పరమార్ధం ఏమిటో గ్రహించగల గాలి. తమ సిద్ధాంతాలేమిటో, లక్ష్యాలేమిటో, ప్రయోజనాలేమిటో... వాటిని సాధించడానికి కూటమి దోహదపడుతుందో, గండికొడుతుందో చూసుకోవాలి. చంద్రబాబుకు ఈ బాదరబందీ ఉండదు. అవకాశవాదమే ఆయన వేదం. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి నిరంత రాయంగా సాగిస్తున్న ఉద్యమ ఫలితంగా ‘ప్రత్యేకహోదా’ అంశం ఆంధ్రప్రదేశ్‌లో సజీవంగా ఉన్న దని, అది వచ్చే ఎన్నికల్లో తనకు శరాఘాతం కాబోతున్నదని బాబు గ్రహించారు. అందువల్ల ఏదో ఒకసాకు చూపించి ఎన్డీఏ గోడ దూకి బయటికొచ్చారు. జాతీయ స్థాయిలో హడావుడి చేసి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను మభ్యపెట్టాలంటే అర్జెంటుగా ఒక వేదిక అవసరమని భావించారు. అందుకోసం ఆయన తొలుత టీఆర్ఎస్ను కదిపి చూశారు. ‘తెలుగువాళ్లం ఏకమవుదాం’ అని కబురంపారు. కానీ టీఆర్ఎస్ తిరస్కరించడంతో గత్యంతరం లేక కాంగ్రెస్ తలుపుతట్టారు. తన అవకాశవాదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ‘జాతీయప్రయోజనాలు, ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ’ వంటి అమూ ర్తమైన పడికట్టు పదాలను అరువు తెచ్చుకున్నారు. ఆయన వందలకోట్లు నిధులు పారిస్తానని చెప్పి ఉండొచ్చు. కొమ్ములు తిరిగిన మీడియా సంస్థలతో హోరెత్తిస్తానని హామీ ఇచ్చి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ విజ్ఞత ఏమైంది? ఎంత చెడ్డా బాబు సీనియారిటీతో పోలిస్తే ఆ పార్టీ అనుభవం ఎంతో ఎక్కువ. కానీ అదంతా బూడిదలో పోసినట్టయింది. తొమ్మిదేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో ఒంటరిగా బరిలోకి దిగి సునాయాసంగా గెలిచిన ప్రముఖులంతా ఇప్పుడు బోర్లాపడ్డారు. తమ చరిత్రను తామే మరిచి పోయి, అలవాటులేని రాజకీయాల్లో తలదూర్చి టీజేఎస్ అధినేత కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్ చేతులు కాల్చుకున్నారు. తెలంగాణ ప్రజలు డబ్బుకూ, ఇతర వ్యామోహాలకూ లొంగలేదు. తమకు మేలు చేసేదెవరో, ఆషాఢభూతులెవరో సులభంగా గ్రహించారు. అనైతిక రాజకీయాలనూ, అవకాశవాదాన్నీ తిరస్కరించారు. దొంగ సర్వేలతో మభ్యపెట్టబోయినవారిని బేఖాతరు చేశారు. తమ ఓటుతో జాతీయ రాజకీయాలకు ఎగబాకాలనుకున్నవారికి గుణపాఠం నేర్పిన తెలంగాణ ప్రజలు శతథా అభినందనీయులు! -
రాహుల్‌కే కీలకం!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ తొలగిపోయే సమయం వచ్చేసింది. అయితే, తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం ఫలితాలు ప్రధాని మోదీ కంటే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌కే అత్యంత కీలకమనే భావన అంతటా వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలంటే కనీసం మూడు రాష్ట్రాల్లోనైనా నెగ్గాల్సి ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మోదీకి వచ్చేదీ లేదు.. పోయేదీ లేదు.. 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అధికారం చేపట్టాక జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బాధ్యతను మోదీనే తీసుకున్నారు. కానీ, ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పరిస్థితులు ఇందుకు భిన్నం. తెలంగాణ, మిజోరంలలో బీజేపీకి పట్టులేదు. ఇక మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీకి బలమైన ముఖ్యమంత్రులున్నారు. శివరాజ్‌సింగ్ చౌహాన్, రమణ్ సింగ్‌ల పాలనా సామర్థ్యానికే ఈ ఎన్నికలు గీటురాయిగా మారాయి తప్ప మోదీ చరిష్మా ఎన్నికల్లో ఎక్కడా ప్రధాన అంశం కాలేదు. ఇక, రాజస్తాన్‌లో బీజేపీని ముంచినా తేల్చి నా దానికి ముఖ్యమంత్రి వసుంధరా రాజేదే బాధ్యత. పైగా, అయిదేళ్లకోసారి అధికార పగ్గాలు చేతులు మారడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఈ ఎన్నికల ఫలితాలు మోదీ ఇమేజ్‌పై ఏమంత ప్రభావం చూపించవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ రెండు అంశాలే ప్రధానం అగస్టా కుంభకోణం వర్సెస్ రఫేల్ ఒప్పందం ప్రధానాంశాలుగా ఈసారి లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోట్ల రద్దు, నిరుద్యోగం, వ్యవసాయ రంగ సంక్షోభం, ఆర్థిక రంగం, అమలు కాని హామీలు, పెట్రో ధరలు కూడా ప్రభావం చూపించనున్నాయి. అందుకే, అయిదు రాష్ట్రాల ఫలితాలతో సంబంధం లేకుండా బీజేపీ లోక్‌సభ ఎన్నికలకు అప్పుడే సన్నాహాలు మొదలు పెట్టింది. ప్రస్తుత లోక్‌సభలో బీజేపీకి ఉన్న స్థానాల్లో 75 శాతం కేవలం ఎనిమిది రాష్ట్రాల నుంచే వచ్చాయి. ఈసారి అంతగా ఆ పార్టీ క్లీన్‌స్వీప్ చేసే అవకాశం లేదు. అందుకే, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. మిగతా రాష్ట్రాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలవాలన్న పట్టుదలతో మోదీ–షా ద్వయం ఉన్నట్టు తెలుస్తోంది. గెలిస్తే ప్రాంతీయ పార్టీలకు నమ్మకం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు గత ఏడాదే తీసుకున్న రాహుల్‌గాంధీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడినా రాహుల్ గెలిచారన్న పేరు తెచ్చుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కకుండా తెరవెనుక వ్యూహాలను పకడ్బందీగానే రచించారు. ఇప్పుడు అయిదు రాష్ట్రాల్లో మెజార్టీ రాష్ట్రాలను కైవసం చేసుకుంటే రాహుల్ సమర్థుడనే పేరు వస్తుంది. ప్రాంతీయ పార్టీలకు కూడా రాహుల్ నాయకత్వంపై నమ్మకం కుదిరి బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. కాంగ్రెస్ ఓటమిపాలైతే రాహుల్‌ది ఐరన్ లెగ్ అన్న ముద్ర అలాగే ఉండిపోతుంది. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు కష్టంగా మారుతుంది. -
ఈ ఫలితాలే ‘రోడ్ మ్యాప్’!
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల పోరుకు సెమీ ఫైనల్స్‌గా పరిగణిస్తున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ఈవీఎంలలో నిక్షిప్తమైంది పోటీలో నిలిచిన అభ్యర్థుల భవిష్యత్తే కాదు.. ప్రధాన రాజకీయ పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ల భవితవ్యం కూడా. 2019 లోక్‌సభ ఎన్నికలపై ఈ ఫలితాలు గణనీయ ప్రభావం చూపనున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ల్లో కమలం పార్టీ అధికారంలో ఉంది. ఈశాన్యంలో కాంగ్రెస్‌కు మిగిలిన ఏకైక రాష్ట్రం మిజోరం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే.. రాజస్తాన్‌లో ఈ సారి కాంగ్రెస్ అధికార పీఠాన్ని అధిరోహించనుంది. అలాగే, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్దే విజయమని, మిజోరం కాంగ్రెస్ చేజారనుందని అవి తేల్చాయి. రెండు పక్షాలకు గెలుపు అవసరమే! రాజస్తాన్‌తో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో కనీసం ఒక్క రాష్ట్రాన్నైనా కాంగ్రెస్ చేజిక్కించుకోగలిగితే.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు గట్టి బలం చేకూరుతుంది. కాంగ్రెస్ చీఫ్‌గా, జాతీయ స్థాయి నేతగా రాహుల్ గాంధీ స్థానం బలోపేతమవుతుంది. బీజేపీయేతర పక్షాల కూటమికి కాంగ్రెస్ పక్షాన రాహుల్ నేతృత్వం వహించగల అవకాశాలు మెరుగవుతాయి. లేని పక్షంలో, ఎన్నికల పొత్తులు, సీట్ల పంపకాల చర్చల్లో ఎన్డీఏయేతర ప్రాంతీయ పార్టీల నుంచి వచ్చే అనేకానేక డిమాండ్లకు తలొగ్గాల్సి వస్తుంది. కనీసం రెండు రాష్ట్రాల్లోనైనా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. బీజేపీ వ్యతిరేక విపక్ష కూటమికి నేతగా రాహుల్ ఆమోదనీయత పెరుగుతుంది. ఇతర పక్షాలు కాంగ్రెస్ మాట వినక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా, కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు రాకుంటే, రాహుల్ ఇమేజ్‌తో పాటు కాంగ్రెస్ ప్రతిష్ట భారీగా దెబ్బతింటాయి. ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ఏన్డీయేయేతర ప్రాంతీయ పార్టీల నేతలు ‘ప్రత్యామ్నాయాలు’గా ఎదుగుతారు. మిజోరంలో అధికారం కోల్పోతే మొత్తంగా ఈశాన్యం నుంచి కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యమే ఉండదు. మరోవైపు, కనీసం రెండు రాష్ట్రాల్లోనైనా విజయం సాధించడం బీజేపీకి అవసరం. ఇన్నాళ్లూ కొనసాగిన విజయపరంపరను ఈ ఎన్నికల్లోనూ కొనసాగించడం ద్వారానే ఆ పార్టీ ఆత్మవిశ్వాసంతో లోక్‌సభ ఎన్నికల బరిలో దిగగలదు. ఎన్డీయే పక్షాలతో పొత్తు చర్చల్లోనూ ఆధిక్యత కనపర్చగలదు. ఓటమి ఎదురైతే మాత్రం పార్టీలో, పార్టీ అగ్రనేతల్లో ఆత్మవిశ్వాసం భారీగా దెబ్బతింటుంది. పార్టీ లో అసహన స్వరాల జోరు పెరుగుతుంది. కూటముల్లోనూ మార్పులు ఈ ఫలితాల అనంతరం జాతీయ స్థాయిలో ప్రధాన కూటములైన ఎన్డీయే, యూపీఏల్లోని పార్టీల్లో కూడా మార్పుచేర్పులు చోటు చేసుకునే అవకాశముంది. ఎంతగా విమర్శించినా, బీజేపీ మిత్రపక్షంగానే శివసేన కొనసాగుతుంది. కానీ, బిహార్‌కు చెందిన రాష్ట్రీయ లోక్‌సమత పార్టీల్లాంటివి మాత్రం ఇప్పటికే ఎన్డీయేకు దూరమయ్యే దిశగా సంకేతాలిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే మిత్రపక్షాలపై పట్టును పెంచుకోగలదు. పక్క చూపులు చూస్తున్న ఎన్డీయే పార్టీల ఆలోచనల్లో మార్పు రాగలదు. మొత్తానికి, ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలంతా ప్రచారం చేయడాన్ని బట్టే ఈ ఎన్నికలను ఆయా పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అర్థమవుతుంది. - నేషనల్ డెస్క్ -
బీజేపీకి అనుకూలంగా పెద్దల సభ!
తాజా ఫలితాలతో రాజ్యసభలో మారనున్న సమీకరణాలు న్యూఢిల్లీ: తాజాగా వెల్లడైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో రాజ్యసభలో సమీకరణాలు మారనున్నాయి. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి, మరో రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల గెలుపు.. పెద్దల సభను బీజేపీకి అనుకూలంగా మార్చనున్నాయి. ఇప్పటివరకూ రాజ్యసభలో సంఖ్యాబలం అధికంగా గల కాంగ్రెస్.. బీజేపీ ప్రభుత్వ కీలక బిల్లులకు మోకాలడ్డుతోంది. దీంతో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో బీజేపీ కొట్టుమిట్టాడుతోంది. అయితే తాజాగా వెల్లడైన ఎన్నికల ఫలితాలతో పరిస్థితి మారనుంది. జూన్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం తగ్గనుంది. ఆ మేరకు ఎస్పీ, ఏఐఏడీఎంకే తదితర పార్టీల బలం పెరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల మద్దతుతో కీలక బిల్లులకు మోక్షం కలుగుతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) బిల్లు 2015లోనే లోక్‌సభలో ఆమోదం పొంది, సంఖ్యాబలం లేకపోవడంతో రాజ్యసభ ఆమోదానికి నోచుకోక అలా ఉండిపోయింది. ఇలాంటి పెండింగ్ బిల్లుల విషయంలో ప్రాంతీయ పార్టీల సహకారంతో రాజ్యసభలో గట్టెక్కవచ్చని బీజేపీ భావిస్తోంది. సీట్లు తగ్గినా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్సే! మొత్తం 57 రాజ్యసభ సీట్లకు వచ్చే నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ బలం 64. గత రెండేళ్లుగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో ఆ పార్టీ 4 నుంచి 5 స్థానాలు కోల్పోనుంది. అయినప్పటికీ కాంగ్రెస్ బలం 60 వరకు ఉండటంతో 245 సభ్యులున్న రాజ్యసభలో అదే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కొనసాగవచ్చు. అయితే త్వరలో జరగనున్న ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిపి బీజేపీ 22 సీట్లును పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ బలం 49. దీనికితోడు ప్రాంతీయ పార్టీలు మరిన్ని సీట్లు సాధించనున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీకి అనుకూల పరిస్థితి నెలకొనే అవ కాశాలు ఎక్కువగా ఉన్నాయి.