
పంజాబ్ రాజకీయ బాహుబలిగా పేరున్న అమరీందర్ సింగ్ ఓటమి పాలయ్యారు.
ఛండీగఢ్: ఆప్ దెబ్బకు పంజాబ్ రాజకీయమే మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని ఘన విజయం దిశగా దూసుకుపోతోంది Aam Aadmi Party. ఈ తరుణంలో పంజాబ్ రాజకీయ బాహుబలి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు ఘోర పరాభవం ఎదురైంది.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓటమి పాలయ్యారు. పాటియాలా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. ఆప్ అభ్యర్థి అజిత్ పాల్‌సింగ్ కోహ్లీ చేతిలో 19, 797 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. సిద్ధూతో గొడవ, కాంగ్రెస్ లుకలుకల కారణంగా ఆయన పార్టీని వీడిన సంగతి తెలిసిందే.
ఇక పాటియాలా అమరీందర్ సింగ్‌కు 12 ఏళ్లపాటు కంచుకోటగా ఉండింది. ఈ తరుణంలో ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారంతా. కానీ, ఫలితం ఊహించని రీతిలో రావడం.. కెప్టెన్‌తో పాటు ఆయన సన్నిహితులకు పెద్ద షాకే ఇచ్చింది.