న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఎన్‌డీఏ తరఫున ఉపరాష్ట్రపతిగా బరిలో ఉంటారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఆయన స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూడా త్వరలోనే బీజేపీలో విలీనమవుతుందని చెబుతున్నాయి. ప్రస్తుతం వైద్య చికిత్స కోసం లండన్‌లో ఉన్న అమరీందర్ రెండు వారాల్లో తిరిగి వచ్చాక ఈ పరిణామాలు చోటుచేసుకుంటాయంటున్నారు. అమరీందర్ కార్యాలయం కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది.
వచ్చే వారంలో ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అమరీందర్‌ను ప్రకటించాక.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలోకి విలీనం చేసే బాధ్యతను ఆయన భార్య, కేంద్ర మాజీ మంత్రి ప్రణీత్ కౌర్ తీసుకుంటారని సమాచారం. పటియాలా ఎంపీ అయిన ప్రణీత్ కౌర్ ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి పోలింగ్ ఆగస్ట్ 6వ తేదీన, అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది. 5న నోటిఫికేషన్ రానుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్ట్ 10వ తేదీతో ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment