చండీగఢ్/న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్ అగ్రనేత ప్రకాశ్‌సింగ్ బాదల్ (95) ఇక లేరు. చాలారోజులుగా మొహాలీలోని ఓ ఫోరి్టస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన ఏడాది జనవరిలో కరోనా బారినపడి కోలుకున్నారు. గ్యాస్రై్టటిస్, బ్రాంకియల్ ఆస్తా్మతో బాధపడుతూ గత ఏడాది జూన్‌లో మళ్లీ చికిత్స పొందారు.
బాదల్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగా నష్టమన్నారు. దేశ రాజకీయాల్లో ఆయన గొప్ప నాయకుడు, ఉన్నత రాజనీతిజ్ఞుడు అని కీర్తించారు. పంజాబ్ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని ప్రశంసించారు. ఎన్నో సంక్షోభాల నుంచి పంజాబ్‌ను గట్టెక్కించారంటూ మోదీ ట్వీట్ చేశారు. బాదల్ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు బాదల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
ఐదుసార్లు పంజాబ్ సీఎం
👉 బాదల్ 1927 డిసెంబర్ 8న పంజాబ్‌లోని అబుల్ ఖురానా గ్రామంలో జాట్ సిక్కు కుటుంబంలో జన్మించారు.
👉 లాహోర్‌లోని ఫార్మన్ క్రిస్టియన్ కాలేజీలో చదివారు. 1947లో రాజకీయాల్లో అడుగుపెట్టారు.
👉 గ్రామ సర్పంచ్‌గా, బ్లాక్ సమితి చైర్మన్‌గా మొదలై 1957లో కాంగ్రెస్ టికెట్‌పై ఎమ్మెల్యే అయ్యారు.
👉 1969లో శిరోమణి అకాలీ దళ్ టికెట్‌పై మళ్లీ గెలిచారు.
👉 1986లో శిరోమణి అకాలీ దళ్ (బాదల్) పార్టీని స్థాపించారు.
👉 1970–71, 1977–80, 1997–2002, 2007–2012, 2012–2017 ఇలా ఐదుసార్లు పంజాబ్ సీఎంగా చేశారు.
👉 గతేడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో 13వసారి పోటీ చేశారు. దేశంలోనే అత్యంత వృద్ధ అభ్యర్థిగా రికార్డుకెక్కినా.. ఓటమి పాలయ్యారు. ఏడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయనకిది రెండో ఓటమి.
👉ఎంపీగా కూడా నెగ్గిన ఆయన కేంద్ర వ్యవసాయ, సాగునీటి పారుదల మంత్రిగా పనిచేశారు.
👉 ఆయన భార్య సురీందర్ కౌర్ 2011లో మరణించారు. కుమారుడు సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా చేశారు.
(Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ రెండో ఛార్జ్‌షీట్.. మనీష్ సిసోడియా పేరు..)
Comments
Please login to add a commentAdd a comment