Parkash Singh Badal
-
ఆయన గొప్ప నాయకుడు: ప్రధాని మోదీ సంతాపం
చండీగఢ్/న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్ అగ్రనేత ప్రకాశ్‌సింగ్ బాదల్ (95) ఇక లేరు. చాలారోజులుగా మొహాలీలోని ఓ ఫోరి్టస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన ఏడాది జనవరిలో కరోనా బారినపడి కోలుకున్నారు. గ్యాస్రై్టటిస్, బ్రాంకియల్ ఆస్తా్మతో బాధపడుతూ గత ఏడాది జూన్‌లో మళ్లీ చికిత్స పొందారు. బాదల్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగా నష్టమన్నారు. దేశ రాజకీయాల్లో ఆయన గొప్ప నాయకుడు, ఉన్నత రాజనీతిజ్ఞుడు అని కీర్తించారు. పంజాబ్ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని ప్రశంసించారు. ఎన్నో సంక్షోభాల నుంచి పంజాబ్‌ను గట్టెక్కించారంటూ మోదీ ట్వీట్ చేశారు. బాదల్ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు బాదల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఐదుసార్లు పంజాబ్ సీఎం 👉 బాదల్ 1927 డిసెంబర్ 8న పంజాబ్‌లోని అబుల్ ఖురానా గ్రామంలో జాట్ సిక్కు కుటుంబంలో జన్మించారు. 👉 లాహోర్‌లోని ఫార్మన్ క్రిస్టియన్ కాలేజీలో చదివారు. 1947లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 👉 గ్రామ సర్పంచ్‌గా, బ్లాక్ సమితి చైర్మన్‌గా మొదలై 1957లో కాంగ్రెస్ టికెట్‌పై ఎమ్మెల్యే అయ్యారు. 👉 1969లో శిరోమణి అకాలీ దళ్ టికెట్‌పై మళ్లీ గెలిచారు. 👉 1986లో శిరోమణి అకాలీ దళ్ (బాదల్) పార్టీని స్థాపించారు. 👉 1970–71, 1977–80, 1997–2002, 2007–2012, 2012–2017 ఇలా ఐదుసార్లు పంజాబ్ సీఎంగా చేశారు. 👉 గతేడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో 13వసారి పోటీ చేశారు. దేశంలోనే అత్యంత వృద్ధ అభ్యర్థిగా రికార్డుకెక్కినా.. ఓటమి పాలయ్యారు. ఏడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయనకిది రెండో ఓటమి. 👉ఎంపీగా కూడా నెగ్గిన ఆయన కేంద్ర వ్యవసాయ, సాగునీటి పారుదల మంత్రిగా పనిచేశారు. 👉 ఆయన భార్య సురీందర్ కౌర్ 2011లో మరణించారు. కుమారుడు సుఖ్బీర్సింగ్ బాదల్ పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా చేశారు. (Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ రెండో ఛార్జ్‌షీట్.. మనీష్ సిసోడియా పేరు..) -
వామ్మో.. 94 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా పోటీ.. ఎవరో తెలుసా?
చండీగఢ్: శిరోమణి అకాలీదళ్ కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ అరుదైన ఘనత సాధించారు. మన దేశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత పెద్ద వయసు గల నాయకుడిగా ఆయన రికార్డుకెక్కారు. పంజాబ్ లోని లాంబి నియోజకవర్గం నుంచి ఆయన పోటీలో ఉన్నారు. ఐదు పర్యాయాలు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బాదల్ 94 ఏళ్ల వయసులో తాజాగా ఎన్నికల బరిలో నిలిచారు. అంతకుముందు ఈ రికార్డు కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ పేరిట ఉండేది. 2016 ఎన్నికల్లో 92 ఏళ్ల వయసులో ఆయన పోటీ చేశారు. 75 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ప్రకాశ్ సింగ్ బాదల్‌కు ఇవి 13వ అసెంబ్లీ ఎన్నికలు. చిన్న వయసులోనే రాజకీయ రంగంలోకి ప్రవేశించిన ఆయన అనేక ఘనతలు సాధించారు. 1947లో బాదల్ గ్రామం నుంచి ఎన్నికైనప్పుడు ఆయన అతి పిన్న వయస్కుడైన సర్పంచ్. అంతేకాకుండా 1970లో అత్యంత పిన్న వయస్కుడైన సీఎం అయ్యారు. 2012లో అత్యంత వయోవృద్ధుడైన సీఎం అయ్యారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత కూడా సొంతం. 1970-71, 1977-80, 1997-2002, 2007-12, 2012-17 మధ్య కాలంలో పంజాబ్ సీఎంగా సేవలు అందించారు. ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. (చదవండి: భగవంత్ మాన్.. ఆప్ బూస్టర్ షాట్) తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఒకసారి మాత్రమే స్వల్ప తేడాతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు బాదల్. 1967లో గిద్దర్‌బాహాలో హర్చరణ్ సింగ్ బ్రార్ చేతిలో కేవలం 57 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బాదల్ తొలిసారిగా 1957లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై మలౌట్ నియోజకవర్గం నుంచి గెలిచారు. తర్వాత వరుసగా ఐదుసార్లు గిద్దర్బాహా నుంచి విజయయాత్ర సాగించారు. అనంతరం లాంబి నియోజకవర్గం ఐదు పర్యాయాలు ప్రాతినిథ్యం వహించారు. తాజా ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి అతిపెద్ద అభ్యర్థిగా బరిలో నిలిచారు. (చదవండి: పంజాబ్ ఎన్నికల్లో అందరిదీ సేఫ్ గేమే!..) ప్రకాశ్ సింగ్ బాదల్ తన రాజకీయ జీవితంలో రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయలేదు. 1962లో ఒకసారి, ఆ తర్వాత 1992లో అకాలీదళ్ ఎన్నికల్ని బహిష్కరించినప్పుడు ఆయన పోటీలో లేరు. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన ముగ్గురు ఔత్సాహిక నాయకులతో ఈసారి బాదల్ ముఖాముఖి తలపడుతున్నారు. దివంగత మంత్రి గుర్నామ్‌సింగ్ అబుల్ఖురానా కుమారుడు జగ్పాల్ సింగ్ అబుల్ఖురానాను కాంగ్రెస్ బరిలోకి దింపింది. దివంగత ఎంపీ జగదేవ్ సింగ్ ఖుదియాన్ కుమారుడు గుర్మీత్ సింగ్ ఖుదియాన్ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీలో ఉన్నారు. బీజేపీ ముక్త్సర్ జిల్లా మాజీ చీఫ్ రాకేష్ ధింగ్రాను పోటీకి నిలబెట్టింది. ఇంత వయసులోనూ బాదల్ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కరోనా బారిన పడటంతో ఆయన ప్రచారానికి బ్రేక్ పడింది. ఒకటి రెండు రోజుల్లో ఆయన తన నియోజకవర్గానికి చేరుకోనున్నారు. బాదల్ తరపున బంధువులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. భటిండా ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ కూడా ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పర్యటించారు. కాగా, బాదల్ 2015లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. మోదీ సర్కారు తీసుకొచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020లో అవార్డును వెనక్కు ఇచ్చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి రైతుల మద్దతు తమకే ఉంటుందని అకాలీదళ్ భావిస్తోంది. (చదవండి: చన్నీ వర్సెస్ సిద్ధూల మధ్య వివాదం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు) -
పంజాబ్ ఆర్థిక మంత్రికి పితృవియోగం
చండీగఢ్: పంజాబ్ మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బద్లా తండ్రి, మాజీ ఎంపీ గుర్దాస్ సింగ్ బదల్(90) గురువారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను మొహాలిలోని ఆసుపత్రిలో చేర్పించగా.. అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. కరోనా విజృంభణ కారణంగా ఆయన అంత్యక్రియలకు ఎవరూ హాజరు కావద్దని అతని కుమారుడు, ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బద్లా కోరారు. కాగా మార్చి 19న అతని తల్లి హర్మందీర్ మరణించారు. ఇంతలోనే తండ్రిని కోల్పోవడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. (పంజాబ్ సింగర్ సిద్ధూపై కేసు నమోదు) గుర్దాస్ సింగ్ సోదరుడు పర్కాశ్ సింగ్ గతంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారు. వీరిద్దరి ఐకమత్యాన్ని "పాశ్ తె దాస్ దీ జోడీ" అని పిలిచేవారు. ఇందులో పాశ్ అంటే పర్కాశ్, దాస్ అంటే గుర్దాస్ అని అర్థం. కాగా గురుదాస్ కుమారుడు మన్‌ప్రీత్ సింగ్ శిరోమణి అకాలీదళ్ పార్టీ(ఎస్ఏడా) నుంచి బయటకు వెళ్లి పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్‌ను స్థాపించారు. దీంతో సోదరులిద్దరి మధ్య రాజకీయ విబేధాలు తలెత్తాయి. కానీ వ్యక్తిగతంగా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. 2012లో లంబీ నియోజకవర్గం నుంచి సోదరుడిపై పోటీకి దిగిన గుర్దాస్ ఓటమిని చవిచూశారు. 1967 నుంచి 1969 వరకు ఎమ్మెల్సీగా పని చేయగా 1971లో ఎంపీగా ఎన్నికయ్యారు. అతని కుమారుడు మన్‌ప్రీత్ సింగ్ కాంగ్రెస్‌లో చేరగా పంజాబ్ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా స్థానం దక్కించుకున్నారు. -
‘కనిష్క’ దారుణాన్ని మరచిపోయారా?
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఖలిస్థాన్ టెర్రరిస్ట్, 1986లో జరిగిన పంజాబ్ మంత్రి మలికియత్ సింగ్ సిద్ధూ హత్య కేసులో దోషి జస్పాల్ అత్వాల్ భారత్‌కు ఎలా వచ్చారు? భారత్‌లో పర్యటిస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ ట్రూడోతో ఈ నెల 20వ తేదీన ఎలా ఫొటో దిగారు? నగరంలోని కెనడా హైకమిషన్ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో దంపతుల గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు ఆయన్ని ఎందుకు ఆహ్వానించారు? అన్న ప్రశ్నలతో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఉరుకులు పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం బ్రిటిష్ కొలంబియాలో వ్యాపారస్థుడిగా స్థిరపడిన జస్పాల్ అత్వాల్తోపాటు మరో 225 మందిపై భారత్‌కు రావడంపైనున్న ఆంక్షలను 2015లో ప్రధాని కార్యాలయం తొలగించినట్లు 2016లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపిన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ సిఫార్సు మేరకు కెనడా పర్యటనను ముగించుకొని వచ్చిన నరేంద్ర మోదీ ‘ట్రావెల్ బ్లాక్‌లిస్ట్’ నుంచి వీరి పేర్లు తొలగించినట్లు పార్లమెంట్‌కు ఇచ్చిన వివరణలో ఉందని తెల్సింది. ఖలిస్థాన్‌కు మద్దతు ఇస్తున్నందున భారత్ పర్యటనకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ దంపతులను నరేంద్ర మోదీ పెద్దగా పట్టించుకోవడం లేదని ఇటు అధికార వర్గాలు, అటు బీజేపీ వర్గాలు చెబుతూ వచ్చాయి. కెనడా ప్రధాని పర్యటన సందర్భంగా గుర్తు రావాల్సిన మరో ముఖ్యమైన అంశాన్ని మర్చిపోయారు. 1985, జూన్ 23వ తేదీన కెనడా నుంచి భారత్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా ‘కనిష్క’ విమానాన్ని ఖలిస్థాన్ ఉగ్రవాదులు బాంబు పెట్టి పేల్చివేయగా 329 మంది మరణించిన విషయం. అంతర్జాతీయ సిక్కు యువజన సమాఖ్యకు చెందిన ఉగ్రవాదులే కెనడాలో ఆ విమానంలో బాంబు పెట్టారు. అదే యువజన సంఘానికి చెందిన వ్యక్తి ఇప్పటి జస్పాల్ అత్వాల్. మరణించిన 329 మందిలో 280 మంది కెనడా పౌరులు లేదా శాశ్వత కెనడా రెసిడెన్సీ కలిగిన పౌరులు మరణించినప్పటికీ కెనడాలో జరిగిన పెద్ద విమానం పేలుడు ప్రమాదంగాగానీ లేదా భారత్–కెనడా విమానం పేలుడు ప్రమాదంగాగానీ గుర్తించడానికి కెనడా ప్రభుత్వం నిరాకరిస్తూ వచ్చింది. చివరకు భారత్ అంతర్జాతీయ వేదికలపై విమానం పేల్చివేయడాన్ని ‘కెనడా 9–11’ గా వ్యవహరిస్తూ రావడం వల్ల దాన్ని పెద్ద దుర్ఘటనగా గుర్తించింది. ఖలిస్థాన్ ఉద్యమం పట్ల చూపిస్తున్న సానుకూల వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. -
అమరీందర్ ఆఫర్ కు నో చెప్పిన బాదల్
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయిన అకాలీదళ్ నాయకుడు ప్రకాశ్ సింగ్ బాదల్ కొత్త ఇల్లు చూసుకునే పనిలో పడ్డారు. రాష్ట్ర రాజధాని చండీగఢ్ లో ఉచితంగా ప్రభుత్వ నివాసం కేటాయిస్తామని నూతంగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కారు ప్రతిపాదించగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాదల్ కు సరైన బంగ్లా కేటాయిస్తామని అమరీందర్ సింగ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. 'ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మంచి మనసుకు కృతజ్ఞుడిని. ఆయన ప్రతిపాదన చాలా బాగుంది. కానీ నేను సొంతంగా నివాస ఏర్పాట్లు చేసుకుంటున్నాన'ని బాదల్ అన్నారు. ఇప్పటివరకు చండీగఢ్ టోనీ సెక్టార్ 8లో ముఖ్యమంత్రి బంగ్లాలో ఆయన నివాసం ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోవడంతో అధికారిక నివాసాన్ని ఆయన ఖాళీ చేశారు. సెక్టార్ 9లో బాదల్ కుటుంబానికి 1.5 ఎకరాల నివాస స్థలం ఉంది. -
పార్టీ ఓడినా.. సీఎం గెలిచారు!
చంఢీఘర్ : పంజాబ్ లో అకాలీదళ్ శిరోమణి కోలుకోలేని దెబ్బతినగా.. ఆ పార్టీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ మాత్రం గెలుపు కిరీటం ఎగురవేశారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అమరీందర్ సింగ్ పై లాంబీ నియోజకవర్గం నుంచి ప్రకాశ్ సింగ్ బాదల్ గెలిచారు. శనివారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో 22వేలకు పైగా ఓట్లతో ఆయన అమరీందర్ సింగ్ ను ఓడించారు. అయితే అమరీందర్ సింగ్ పటియాలా-అర్బన్ ను తన ఖాతాల్లో వేసుకుని, కంఫర్ట్ జోన్ లో ఉన్నారు. అమరీందర్ కు తన సంప్రదాయ అసెంబ్లీ నియోజకవర్గం పటియాలా నుంచి, లాంబి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. లాంబీలో అమరీందర్ ఓటిపోగా.. పటియాలాలో గెలుపొందారు. పటియాలాలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి బల్బీర్ సింగ్ పై అమరీందర్ 52,407 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మరోవైపు పంజాబ్ లో అకాలీదళ్ శిరోమణి ఓటమిని అంగీకరిస్తామని, ఓటమికి గల కారణాల ప్రతి అంశాన్ని పూర్తిగా విశ్లేషిస్తామని ప్రకాశ్ సింగ్ బాదల్ తెలిపారు. రేపు( ఆదివారం) పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్టు చెప్పారు. -
‘ఓటమిని ఒప్పుకున్నా రేపు రాజీనామా చేస్తా’
-
‘ఓటమిని ఒప్పుకున్నా.. రేపు రాజీనామా చేస్తా’
చండీగఢ్: పంజాబ్ లో అకాలీదళ్ శిరోమణి- బీజేపీ ఓటమిని ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ అంగీకరించారు. గవర్నర్ కు రేపు(ఆదివారం) రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. తమ కూటమి ఓటమికి కారణాలు విశ్లేషించుకుంటామన్నారు. అన్ని అంశాలపై కోర్ కమిటీ సమావేశంలో చర్చించుకుంటామని తెలిపారు. తమ కూటమి ఓడిపోయినా ఆయన మాత్రం గెలిచారు. లాంబిలో నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాదల్ తన సమీప ప్రత్యర్థి అమరీందర్ సింగ్ పై విజయం సాధించారు. -
పంజాబ్‌లో త్రిముఖ పోరు
డ్రగ్స్, రైతుల సమస్యలు, నోట్లరద్దు చుట్టూ ఎన్నికల ప్రచారం ► ‘చివరి’ చాన్స్ ఇవ్వాలంటున్న సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ ► కాంగ్రెస్ పునరుజ్జీవం కోసం శ్రమిస్తున్న కెప్టెన్ అమరీందర్ సాక్షి నాలెడ్జ్ సెంటర్ పంజాబ్‌లోని 117 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఫిబ్రవరి 4న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎన్డీఏ (అకాలీదళ్–బీజేపీ కూటమి), పదేళ్లుగా ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ మధ్య తీవ్రమైన పోటీ ఉండగా.. ఢిల్లీలో అధికారాన్నందుకున్న ఆప్.. పంజాబ్‌లోనూ మేమున్నామంటోంది. దీంతో మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ప్రస్తుత సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్‌తో అమరీందర్ సింగ్ (కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా నేడో, రేపో ప్రకటించనున్నారు) ముక్తసర్ జిల్లా లంబీ సీటులో ముఖాముఖి పోటీపడుతుండటంతో పంజాబ్ పోరు ఆసక్తికరంగా మారింది. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నవజోత్ సింగ్ తొలిసారిగా అసెంబ్లీ బరిలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వ్యతిరేకతనుంచి గట్టెక్కుతారా? ఈ ఎన్నికలు అకాలీదళ్ కంటే బీజేపీకే చాలా కీలకం. నోట్లరద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో ప్రభావం చూపకపోతే దేశవ్యాప్తంగా మోదీ ప్రభావం తిరోగమనంలో పడుతుందనే విశ్లేషణల నేపథ్యంలో అధికార పార్టీ తీవ్రంగా కృషిచేస్తోంది. దీనికితోడు పదేళ్లుగా అధికారంలో ఉన్న ఈ కూటమిపై సహజమైన వ్యతిరేకతతోపాటు.. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను అరికట్టలేకపోతున్నారనే విపక్షాల విమర్శల ప్రభావం కనిపిస్తోంది. అటు, రైతాంగ సమస్యలపట్ల బాదల్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. సీఎం బాదల్ వయసుమళ్లినా.. తను చివరిసారిగా సీఎం కావాలనుకుంటున్నట్లు ప్రచారంలో చెబుతున్నారు. అధికారం కోసం ఆప్ యత్నం ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పంజాబ్ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. ఢిల్లీ విజయంతో సంచలనం సృష్టించిన ఆప్ పక్కనే ఉన్న పంజాబ్‌లోనూ అవే ఫలితాలు సాధిస్తామని భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఎక్కువగా దృష్టిపెడుతున్న కేజ్రీవాల్.. డ్రగ్స్ మాఫియాతో బాదల్ కుటుంబం కుమ్మక్కై రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపిస్తున్నారు. ఆప్‌ను గెలిపిస్తే డ్రగ్స్‌ను రాష్ట్రం నుంచి తరిమేయటంతోపాటు ఉపాధి కల్పన మెరుగుపరుస్తామని ప్రకటించారు. డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై ఆప్ ఎంపీ భగవంత సింగ్ మాన్ పోటీ చేస్తున్నారు. కెనడాలో స్థిరపడిన దాదాపు 200 మంది పంజాబీలు.. సొంత రాష్ట్రానికి వచ్చి ఆప్ తరపున ప్రచారం చేస్తున్నారు. జనవరి 5న సీఎస్డీఎస్–ఏబీపీ సంస్థ విడుదల చేసిన సర్వేలో అకాలీ కూటమికి మెజారిటీ రాకు న్నా ఇతర పక్షాల కన్నా ఎక్కువసీట్లు గెలుచుకోవచ్చని తెలుస్తోంది. అయితే.. ఎన్డీఏ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని, ఆప్ పాత్ర పరిమితమేనని ఇండియాటుడే–యాక్సిస్ సర్వే అభిప్రాపడింది. కాంగ్రెస్‌కు చావో, రేవో! పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు కీలకం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఒక్కో రాష్ట్రాన్ని కోల్పో తూ వస్తున్న తరుణంలో పంజాబ్‌లో విజయం దక్కితే అది 2019 ఎన్నికలు సోనియా అండ్ టీమ్‌కు సంజీవనిలా మారుతుందనటంలో సందేహం లేదు. అందుకే కాంగ్రెస్ విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. మాజీ సీఎం, కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నీ తానై పార్టీని నడిపిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించే మార్చి11న ఆయనకు 75 ఏళ్లు నిండుతాయి. దీంతో ఫలితాలను కెప్టెన్ కు పుట్టినరోజు కానుకగా ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులు శ్రమిస్తున్నాయి. -
‘అమరీందర్ ను బతిమాలుకున్న బాదల్’
న్యూఢిల్లీ: పంజాబ్ ప్రజలకు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ వెన్నుపోటు పొడిచారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. సొంత నియోజకవర్గం పాటియాలాను వదిలిపెట్టి లాంబీ పోటీ చేయాలని ఆయన తీసుకున్న నిర్ణయం అధికార అకాలీదళ్ కు లాభిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, అమరీందర్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆయన ఆరోపించారు. అందుకే అమరీందర్ నియోజకవర్గం మారారని అన్నారు. ఈ నిర్ణయం బాదల్ కు మేలు చేస్తుందని, అకాలీదళ్ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని వివరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ ను లాంబీ నియోజకవర్గంలో పోటీకి దించింది. అమరీందర్ రెండు స్థానాల్లో ఎందుకు పోటీ చేస్తున్నారని, ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో చేయనివిధంగా బాదల్ ను నేరుగా ఎందుకు సవాల్ చేస్తున్నారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ‘ఎన్నికల ప్రచారంలో జర్నైల్ సింగ్ దూసుకుపోతుండడంతో బాదల్ కు దడ పట్టుకుంది. దీంతో లాంబీ నుంచి పోటీ చేయాలని అమరీందర్ ను బాదల్ బతిమాలుకున్నారు. అకాలీదళ్ వ్యతిరేక ఓట్లు చీలి తనకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఇలా చేశార’ని కేజ్రీవాల్ ఆరోపించారు. బాదల్-అమరీందర్ పోటీని ‘ఫ్రెండ్లీ మ్యాచ్’గా వర్ణించారు. ఎవరెన్ని చేసినా తమ పార్టీ అభ్యర్థే గెలుస్తారని కేజ్రీవాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
సీఎం తలుచుకుంటే.. మీరు ప్రాణాలతో మిగలరు!
శిరోమణి అకాలీ దళ్ నాయకురాలు, కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి బుధవారం ఘాటుగా హెచ్చరికలు చేశారు. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ప్రకాశ్ సంగ్ బాదల్ హింసాత్మక దాడులకు దిగాలని అకాలీ శ్రేణులకు పిలుపునిస్తే.. పంజాబ్ లో ఆప్ మద్దతుదారులు ఒక్కరూ కూడా ప్రాణాలతో మిగలబోరని ఆమె పేర్కొన్నారు. సీఎం బాదల్ పై ఒక నిరసనకారుడు చెప్పు విసిరిన నేపథ్యంలో బఠిండా ఎంపీ అయిన ఆమె అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ పరుషమైన వ్యాఖ్యలు చేశారు. బాదల్ కుటుంబం లక్ష్యంగా గత నాలుగురోజుల్లో రెండుసార్లు దాడులు జరిగాయి. కొన్నిరోజుల కిందట హర్సిమ్రత్ కౌర్ భర్త అయిన డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్ కాన్వాయ్ లక్ష్యంగా రాళ్ల దాడి జరిగింది. తాజాగా సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ పై సిక్కు రాడికల్ యువకుడు ఒకడు చెప్పుతో దాడి చేశాడు. అయితే, ఈ దాడులు ఆప్ కావాలనే చేయిస్తున్నదని, తాము తిరగబడితే ఆప్ నామరూపాలు లేకుండా పోతుందని హర్సిమ్రత్ కౌర్ హెచ్చరించారు. హర్యానా మూలాలు ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు పంజాబ్ సమస్యలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆమె విమర్శించారు. అయితే, ఈ దాడులకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పంజాబ్ ఆప్ ఎంపీ భగవంత్ సింగ్ మాన్ అంటున్నారు. -
ముఖ్యమంత్రికి చేదు అనుభవం!
పంజాబ్ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్ కురువృద్ధుడు ప్రకాశ్ సింగ్ బాదల్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. బఠిండాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల సభలో ఆయనపై ఓ వ్యక్తి షూ విసిరాడు. బూటు నేరుగా వచ్చి ప్రకాశ్ సింగ్ బాదల్‌ను తగిలింది. దీంతో ఆయన చేతిలోని గ్లాస్ పగిలిపోయింది. ఈ ఘటనలో ముఖ్యమంత్రి క్షేమంగా ఉన్నారని, ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని యథాతథంగా కొనసాగించారని భద్రతా అధికారులు తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని గురుబచన్ సింగ్‌గా గుర్తించి.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం బాదల్‌పై షూ దాడి జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2014లో కూడా ఇలాగే దాడి జరిగింది. ఖన్నా జిల్లా ఇస్సులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనపై ఓ వ్యక్తి గతంలో షూ విసిరాడు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన తాజా ఘటనపై బాదల్ తనయుడు, డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ మండిపడ్డారు. పంజాబ్‌ను మరో కశ్మీర్ మార్చాలని కుట్రపన్నుతున్నవారే.. సీనియర్ మోస్ట్ నాయకుడిపై ఈ హేయమైన చర్యకు పాల్పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సర్పంచి నుంచి ఐదోసారి సీఎంగా..
చండీగఢ్: ఆయన సామాన్య కుటుంబంలో జన్మించారు. చిన్న వ్యవసాయం వారి వృత్తి. అలాంటి కుటుంబంలో నుంచి తొలుత సర్పంచిగా తర్వాత ఎమ్మెల్యే.. అనతికాలంలోనే ముఖ్యమంత్రి.. ఒకసారి కాదు.. ఏకంగా ఐదు సార్లు.. ప్రస్తుతం ఆ హోదాలోనే ఉన్నారు. ఆయనే పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్(89). ఆయన ఇప్పుడు ఓ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. దేశంలో అతి పెద్ద వయసులో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తిగా రికార్డుల్లోకెక్కారు. నేడు (గురువారం) ఆయన 89వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ పుట్టిన రోజు సందర్భంగా ఆయన శుక్రవారం మోగా జిల్లాలో శిరోమణి అకాళీదల్ ఏర్పాటుచేసిన అతిపెద్ద బహిరంగ సభలో ప్రభుత్వం తరుపున మాట్లాడనున్నారు. పంజాబ్‌లోని మాలౌట్ సమీపంలోగల అబుల్ ఖురానా అనే గ్రామంలో 1927 డిసెంబర్ 8 బాదల్ జన్మించారు. 1970లో తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రస్తుతం సీఎంగా కొనసాగడం ఇది ఐదోసారి. 2007 నుంచి పంజాబ్‌లో అధికారం ఆయనదే. మోరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో 1977లో కొద్ది కాలం కేంద్ర మంత్రిగా పనిచేశారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన బాదల్ భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన 1947లోనే తొలిసారి సర్పంచిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పంజాబ్ అసెంబ్లీకి 1957లో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎంపికయ్యారు. ఈయనకు దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ కూడా మోదీ ప్రభుత్వం అందించింది. దాదాపు 70ఏళ్లుగా పంజాబ్ సిక్కు రాజకీయాల్లో బాదల్‌ది తిరుగులేని ప్రస్థానం. -
భారత పతకాలపై సీఎం అసంతృప్తి!
రియో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శన చూసిన తర్వాతనైనా మనం ఆత్మశోధన చేసుకోవాల్సిన అవసరం ఉందని పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ అభిప్రాయపడ్డారు. అకాలీదళ్ దివంగత అధ్యక్షుడు హరచంద్ సింగ్ లాంగోవాల్ వర్ధంతి కార్యక్రమంలో శనివారం పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. వందల కోట్ల జనాభా ఉన్న దేశమైనా భారత్‌కు పతకాలు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదన్నారు. గత ఒలింపిక్స్ తో పోల్చితే ఇప్పుడు పతకాల సంఖ్య తగ్గిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. కాంస్య పతకాన్ని అందించిన భారత రెజ్లర్ సాక్షి మాలిక్, రజతాన్ని సాధించిన పీవీ సింధులను అభినందించారు. ఈ ఇద్దరు మహిళా ప్లేయర్లు దేశం గర్వపడేలా చేశారని కొనియాడారు. ఏది ఏమైతేనేం వందల కోట్ల జనాభా ఉన్నా మనకు ఒలింపిక్స్ లో పతకాలు రావడం లేదన్న విషయాన్ని ఇప్పటికైనా గ్రహించాలని సూచించారు. ఆటల కోసం ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టి ఆటగాళ్లను ప్రోత్సహించాలన్నారు. చిన్న వయసు నుంచే ఆటపై మక్కువ చూపే వారికి కోచింగ్ ఇచ్చి ప్రపంచ స్థాయి ఆటగాళ్లను తయారుచేసే కార్యక్రమాలు చేపట్టాలని పంజాబ్ సీఎం బాదల్ పిలుపునిచ్చారు. -
సీఎంగారూ ఈ సినిమా తప్పక చూడండి
న్యూఢిల్లీ: బాలీవుడ్ సినిమా ఉడ్తా పంజాబ్ బాగుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసించారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన కుటుంబ సభ్యులు ఈ 'పవర్ఫుల్ సినిమా'ను తప్పకుండా చూడాలని కేజ్రీవాల్ అన్నారు. ఈ సినిమా చూస్తే పంజాబ్‌కు బాదల్ ఏం చేశారో తెలుస్తుందని చెప్పారు. డ్రగ్స్ రాకెట్ లో రాజకీయ నాయకుల ప్రమేయాన్ని ఉడ్తా పంజాబ్‌లో స్పష్టంగా చూపించారని కేజ్రీవాల్ అన్నారు. 'రాజకీయ నాయకులు డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నట్టు ఈ సినిమాలో చూపించారు. అంతేగాక ఎన్నికల సమయంలో ఉచితంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. పంజాబ్ పరిస్థితి బాధాకరం' అని కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్‌లో విచ్చలవిడి డ్రగ్స్ అమ్మకాలు, వాటి బారినపడి నాశనమవుతున్న యువకుల జీవితాలను కథాంశంగా తీసుకుని దర్శకుడు అభిషేక్ చాబే ఉడ్తా పంజాబ్ సినిమాను తెరకెక్కించారు. సెన్సార్ బోర్డు వివాదాలను దాటుకుని ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. -
'కేజ్రీవాల్ ది కపట ప్రేమ'
భాగోవాల్: తమ రాష్ట్రంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎటువంటి ప్రేమ లేదని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ అన్నారు. హర్యానాకు చెందిన కేజ్రీవాల్ తన సొంత రాష్ట్రంలో అధికారం కోసం పంజాబ్ పై కపట ప్రేమ నటిస్తున్నారని ఆరోపించారు. పంజాబ్ నుంచి నీటిని హర్యానాకు తరలించుకుపోతారని అన్నారు. ఎస్ వైఎల్ కెనాల్ వివాదంలో ఆయన హర్యానా పక్షాన నిలిచారని గుర్తు చేశారు. 'కేజ్రీవాల్ హర్యానాకు చెందిన వారు. సహజంగానే సొంత రాష్ట్రం ప్రయోజనాల కోసం ఆయన పనిచేస్తార'ని బాదల్ వ్యాఖ్యానించారు. భాగోవాల్ లో గురువారం జరిగిన సంగత్ దర్శన్ కార్యక్రమంలో బాదల్ పాల్గొన్నారు. అయితే ఎస్ వైఎల్ కెనాల్ నుంచి హర్యానాకు పంజాబ్ చుక్కనీరు కూడా ఇవ్వలేదని అంతకుముందు కేజ్రీవాల్ ఆరోపించారు. -
'రూ. 25 లక్షల సాయం, ప్రభుత్వ ఉద్యోగం'
గురుదాస్ పూర్: పఠాన్ కోట్ దాడిలో వీరమరణం పొందిన తమ ఇద్దరు పంజాబ్ సైనికుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ ఆర్థిక సహాయం ప్రకటించారు. అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీయిచ్చారు. పఠాన్ కోట్ వైమానిక స్థావరంలోకి చొరబడిన ఉగ్రవాదులతో పోరాడుతూ పంజాబ్ చెందిన హానరీ కెప్టెన్ ఫతే సింగ్, హవల్దార్ కుల్వంత్ సింగ్ నేలకొరిగారు. ఖదియన్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన సంగత్ దర్శన్ కార్యక్రమంలో బాదల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశం కోసం ప్రాణాలు వదిలిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. పఠాన్ కోట్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులందరినీ ఆదుకుంటామని హామీయిచ్చారు. అమరవీరుల కుటుంబాలను సంప్రదించి తగిన సాయం అందించాలని ప్రభుత్వ అధికారులను బాదల్ ఆదేశించారు. ఉగ్రవాదుల చొరబాటుకు ఆస్కారం లేకుండా సరిహద్దు వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. -
ఎయిర్‌బేస్‌లో కొనసాగుతున్న కాల్పులు
-
పటాన్ కోట్ లో 'ఉగ్ర' వేట
-
పటాన్ కోట్ లో 'ఉగ్ర' వేట
ఎయిర్ బేస్‌లో ముష్కరులపై కొనసాగుతున్న ఆర్మీ ఆపరేషన్ మరో ఉగ్రవాది హతం.. మొత్తం ఏడుగురు జవాన్ల మృతి పఠాన్‌కోట్ : పంజాబ్‌లో వైమానిక స్థావరంపై ఉగ్రదాడిని తిప్పికొట్టేందుకు భద్రతా దళాలు చేస్తున్న ఆపరేషన్ ఆదివారం రెండోరోజూ కొనసాగింది. ఉగ్రవాదుల బాంబుదాడులు, కాల్పులతోపాటు భద్రతా బలగాల ఎదురుదాడితో ఆ ప్రాంతం దద్దరిల్లింది. శనివారం దాడికి దిగిన ఉగ్రవాదుల్లో నలుగురిని హతమార్చగా.. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఎయిర్ బేస్ ప్రాంగంణం లోనే ఉన్నట్లు గుర్తించిన బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. ఆదివారం మధ్యాహ్నం ఉన్నట్టుండి కాల్పులు మొదలవటంతో అప్రమత్తమైన బలగాలు.. ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఎయిర్‌బేస్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు.. ఈ కేంద్రం వెనకవైపున్న అడవిలో దాక్కుని.. కాల్పులు జరుపుతున్నారు. దీంతో భద్రతా బలగాలకు సాయంగా మరో ఐదు కంపెనీల సైనిక దళాలను రంగంలోకి దించారు. దీనికి తోడు ఆపరేషన్‌ను వేగవంతం చేసేందుకు బుల్డోజర్లు, జేసీబీలనూ వినియోగిస్తున్నారు. సైనిక హెలికాప్టర్లు గగనతలం నుంచి ఈ అడవి ప్రాంతంలో గాలిస్తూ.. భద్రతా బలగాలకు సహాయం అందిస్తున్నాయి. ఆదివారం రాత్రికి ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని ఐఏఎఫ్ అధికారులు తెలిపారు. రాత్రి 9.30 గంటలకు చివరిసారిగా కాల్పులు జరిగాయని, వీలైనంత త్వరగా ఆపరేషన్ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అమరులైన మరో నలుగురు జవాన్లు శనివారం తెల్లవారుజామున భారత్-పాక్ సరిహద్దుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు గ్రనేడ్లు, తుపాకులతో దాడి చేయడం తెలిసిందే. గగనతల నిఘా ద్వారా వీరు లోపలకు వస్తుండటాన్ని గుర్తించిన ఎయిర్‌బేస్ రక్షణ సిబ్బంది.. అప్రమత్తమై ఎదురుదాడి ప్రారంభించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో శనివారం ముగ్గురు జవాన్లు చనిపోవడమూ తెలిసిందే. శనివారం గాయపడి చికిత్స పొందుతున్న భద్రతా సిబ్బందిలో ముగ్గురు (డిఫెన్స్ సెక్యూరిటీ కోర్) ఆదివారం మృతిచెందారు. బలగాల కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాది వద్దఉన్న గ్రనేడ్‌ను ఆదివారం ఉదయం నిర్వీర్యం చేస్తుండగా అది పేలటంతో.. ఎన్ఎస్జీ బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ మృతిచెందారు. దీంతో ఉగ్ర దాడిలో మరణించిన భద్రతా సిబ్బంది సంఖ్య ఏడుకు పెరిగింది. రెండు రోజుల్లో గాయపడిన జవాన్ల సంఖ్య 20కి పెరిగింది. ఎంతమంది ఉగ్రవాదులు? ఈ ఆపరేషన్‌లో..శనివారం నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో వారిని వేటాడేందుకు ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో మరొక ఉగ్రవాది హతమైనట్లు వార్తలు వచ్చాయి. ఐదుగురు ఉగ్రవాదులు హతమైనందున ఆపరేషన్ పూర్తయిందని శనివారం రాత్రి ట్వీట్ చేసిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్.. కాసేపటికే ఆ ట్వీట్‌ను తొలగించారు. ఐదో ఉగ్రవాది హతమైనట్లు అధికారికంగా వార్తలు కూడా రాలేదు. దీంతో.. దాడికి వచ్చిన ఉగ్రవాదులు ఎంతమంది అనేది నిర్దిష్టంగా తెలియలేదు. అయితే.. ఆదివారం ఉదయం ఎయిర్‌బేస్‌లో ఉగ్రవాదులు మళ్లీ కాల్పులకు దిగటం.. రెండు వైపుల నుంచి కాల్పులు రావటంతో ఇంకా ఇద్దరు, అంతకన్నా ఎక్కువ మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ‘ఆపరేషన్ తర్వాతే.. ఎంతమంది ఉగ్రవాదులు వచ్చారనేది తెలుస్తుంది’ అని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి తెలిపారు. మరింత మంది ఎన్ఎస్జీ కమాం డోలను పఠాన్‌కోట్ పంపిస్తున్నామని.. అప్పటివరకు ఆపరేషన్ పూర్తి కాదని పేర్కొన్నారు. ఒకటో తేదీనే స్థావరంలోకి చొరబాటు? ఉగ్రవాదులు జనవరి 1వ తేదీ మధ్యాహ్నమే ఎయిర్‌బేస్ క్యాంపస్‌లోకి ప్రవేశించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నాపైన ఎస్పీ మిత్రుడి సెల్‌ఫోన్‌తో పాకిస్తాన్‌లోని భవల్పూర్కు జరిపిన సంభాషణ కూడా ఎయిర్‌బేస్ సెల్‌టవర్ ద్వారానే జరిగినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ధ్రువీకరించాయి. దీని ఆధారంగానే ఉగ్రదాడి హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. జనవరి 1నే వారు ఎయిర్‌బేస్‌లోకి వచ్చినట్లయితే అది తీవ్ర భద్రతా వైఫల్యమే. ఎయిర్‌బేస్ భద్రతా వైఫల్యమే? నిఘా వర్గాలనుంచి ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ.. ఈ ఆపరేషన్‌ను పూర్తి చేయటంలో ఆలస్యం జరగటం కచ్చితంగా భద్రతా బలగాల నిఘా వైఫల్యమేనని.. రక్షణ రంగ మాజీ నిపుణులు విమర్శించారు. ఇంతకన్నా సమర్థవంతంగా వ్యవహరించేందుకు అవకాశం ఉందని ‘రా’ మాజీ చీఫ్ ఏఎస్ దౌలత్ తెలిపారు. ‘సరిహద్దు భద్రతా దళాల కన్నుగప్పి.. ఇంత పెద్దమొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు తీసుకుని దేశంలోకి ఎలా వచ్చుంటారు?’ అని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదులు తమ లక్ష్యానికి చేరుకోవటంలో విఫలమయ్యేలా ఎయిర్ బేస్ భద్రతా దళాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని.. దీనివల్ల పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం తప్పిందని.. ఈ కేంద్రం చీఫ్‌గా పనిచేసిన ఎయిర్ చీఫ్ మార్షల్ పీఎస్ అహ్లువాలియా అన్నారు. గత నెలలో ప్రధాని మోదీ పాక్ పర్యటన తర్వాతే ఇలాంటి ఘటనలు ఎదురవుతాయనే అనుమానం తనకు కలిగిందని.. రిటైర్డ్ మేజర్ జనరల్ గగన్‌దీప్ బక్షి ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు. కేసు ఎన్ఐఏ చేతికి.. ఉగ్రదాడి ఘటనపై సోమవారం ఎన్ఐఏ కేసు నమోదు చేయనుంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ సంస్థ పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు. ఉగ్రవాదులు ఎలా భారత్‌లోకి వచ్చారు?, ట్యాక్సీ డ్రైవర్‌ను చంపటం, ఎస్పీపై దాడి తదితర ఘటనల తర్వాత ఎయిర్ బేస్‌పై దాడి వంటి అంశాలను ఎన్ఐఏ విచారించనుంది. శనివారం మధ్యాహ్నమే ఘటనా ప్రాంతానికి చేరుకున్న ఎన్ఐఏ బృందం.. ప్రాథమిక సమాచారం సేకరించే పనిలో ఉంది. ఎయిర్‌బేస్‌లో ఏం జరిగింది? గురుదాస్‌పూర్ గుండా ఉగ్రవాదులు పంజాబ్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం అందిందని.. వారి లక్ష్యం పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడేనని సమాచారం అందటంతో.. ఎన్ఎస్జీ, ఆర్మీ, పోలీస్, వైమానిక సిబ్బంది అప్రమత్తమయ్యారని ఐఏఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లోపలకు వస్తున్న విషయాన్ని గుర్తించిన డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ దళ సభ్యులు కాల్పులు ప్రారంభించారని.. ఉగ్రవాదులు ప్రతిదాడి చేయటంతో.. ఓ డీఎస్సీ సభ్యుడు మరణించారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఉగ్రవాదులు డీఎస్సీ క్యాంటీన్ వైపుకు పారిపోగా.. అక్కడున్న వారు అప్రమత్తమై కాల్పులు జరిపారని.. ఇందులో ఓ ఉగ్రవాది చనిపోగా.. మరో డీఎస్సీ సభ్యుడిని మరో ఉగ్రవాది కాల్చి చంపాడని వివరించారు. ఆ తర్వాత శనివారం దినమంతా జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోగా.. మిగిలిన వారు ఎయిర్‌బేస్ వెనకనున్న అటవీ ప్రాంతం వైపుకు పారిపోయారన్నారు. పెళ్లై 45 రోజులే! పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో అమరుడైన గరుడ్ కమాండో గురుసేవక్ సింగ్ కుటుంబానికి హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. 45 రోజుల క్రితమే గురుసేవక్కు వివాహమైంది. దీంతో కుటుంబం షాక్‌లో ఉంది. కాగా, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కామన్వెల్త్ గేమ్స్ మెడలిస్టు ఫతేసింగ్కు కేంద్ర మంత్రి, షూటింగ్ ఒలింపిక్ మెడలిస్టు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ నివాళులర్పించారు. మోదీ ఉన్నత స్థాయి సమీక్ష... కర్ణాటక పర్యటన ముగించుకుని ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్, విదేశాంగ కార్యదర్శి ఎస్.జయశంకర్, ఇతర అధికారులతో పఠాన్‌కోట్ పరిస్థితిపై సమీక్షించారు. అంతకుముందు.. ప్రధానికి రక్షణమంత్రి పరీకర్ ఆపరేషన్ వివరాలు తెలిపారు. కాగా, పాకిస్తాన్ వ్యూహాలపై మాజీ విదేశాంగ కార్యదర్శులు, పాక్‌లో పనిచేసిన మాజీ రాయబారులతో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సమావేశమై చర్చించారు. భారత-పాక్ చర్చల ప్రక్రియపై ఈ దాడి చూపగల ప్రభావం గురించి సమీక్షించారు. పంజాబ్‌లో ఆరు నెలల్లో రెండుసార్లు ఉగ్రదాడులు జరగటంతో.. సరిహద్దుల్లో రెండంచెల భద్రతను ఏర్పాటు చేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్‌బాదల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సీఎంకి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
న్యూఢిల్లీ : పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ రాజకీయ నాయకుడు, సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్‌కి జన్మదిన శుభాకాంక్షలంటూ ప్రధాని మోదీ మంగళవారం ట్విట్ చేశారు. 1927, డిసెంబర్ 8వ తేదీన ప్రకాశ్ సింగ్ బాదల్ జన్మించారు. 2007 నుంచి ప్రకాశ్ సింగ్ బాదల్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంతకు ముందు 1970 -71, ఆ తర్వాత 1977 నుంచి1980 వరకు, 1997 నుంచి 2002 వరకు ప్రకాశ్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. -
'మా 88 ఏళ్ల సీఎంకు చేవ తగ్గలే'
చండీగఢ్: తమ ముఖ్యమంత్రిపై వయోభారం పడినా అది ఏమాత్రం ప్రభావం చూపలేదని, ఇప్పటికీ తమ ముఖ్యమంత్రి క్రియాశీలకంగానే పనిచేస్తున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కీలక సన్నిహితులు చెప్తున్నారు. మంగళవారం ప్రకాశ్ సింగ్ బాదల్ 88వ పడిలోకి అడుగుపెడుతున్నారు. పంజాబ్ లోని అబుల్ ఖురానా అనే గ్రామంలో డిసెంబర్ 8, 1927లో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ప్రకాశ్ సింగ్ బాదల్.. 1957లో పంజాబ్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున బరిలో దిగి విజయం సాధించారు. అప్పటి నుంచి భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూనే ఉన్నారు. భారత రాజకీయాల్లోనే అత్యంత కురువృద్ధుడైన ముఖ్యమంత్రిగా పేరుగాంచారు. ఇప్పుడు ఐదోసారి పంజాబ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 1977లో ఓసారి కేంద్రమంత్రిగా కూడా బాదల్ పనిచేశారు. ఆయన భార్య సురీందర్ కౌర్ 2011లో క్యాన్సర్ కారణంగా కన్నుమూసింది. మంగళవారం ఆయన 88 ఏళ్లలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆయన కీలక అనుచరులు కొన్ని అంశాలు పంచుకున్నారు. 'బాదల్ సాబ్ పై వయోభారం పడినా ఆయన ఏమాత్రం అలసిపోలేదు. రాజకీయాల నుంచి విరమణ పొందాలన్న ఆలోచన కూడా ఆయనకు లేదు. ఇప్పటికీ చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ప్రతిరోజు అధికారులతో మంత్రులతో, పలువురు ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆయన చుట్టూ ఉన్న యువకులందరికంటే కూడా బాదల్ ఎక్కువగా పనిచేస్తున్నారు. ఆయన తన వయసును గెలిచారు. నిజమైన ప్రజానాయకుడు' అంటూ తమ ముఖ్యమంత్రిని కొనియాడారు. శిరోమణి అకాలీదళ్ పార్టీ అధినేత అయిన బాదల్ ప్రస్తుతం పార్టీ చీఫ్ బాధ్యతలు కుమారుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ కు అప్పగించడంతోపాటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా ఇచ్చారు. అయితే, తండ్రికి తగిన స్థాయిలో అతడు రాణించలేకపోతుండటంతో భవిష్యత్తులో ఆ పార్టీకి కష్టాలు తప్పేలా లేవని తెలుస్తోంది. -
పంజాబ్ డీజీపీపై వేటు
చండీగఢ్: పంజాబ్ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న సిక్కుల ఆందోళన నేపథ్యంలో అక్కడి పోలీసు బాస్ పై వేటుపడింది. డీజీపీ సుమేథ్ సింగ్ సైనీని ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించి ఆ స్థానంలో సురేశ్ అరోరాకు బాధ్యతలు అప్పగించారు. ఈయన పంజాబ్ లో గత 1980 దశకంలో రాష్ట్రంలో తలెత్తిన ఉగ్రవాద సమస్యను పరిష్కరించడంలో సమర్థమైన పాత్రను పోషించారు. కాగా, ఇప్పటి వరకు ఆ విధులు నిర్వర్తించిన సుమేథ్ సైనీని పోలీస్ హౌజ్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పంజాబ్ హోం సెక్రటరీ తెలిపారు. అరోరా 1982 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. తమ మత గురువును అవమానించారనే కారణంతో చాలా రోజులుగా ఫరీద్ కోట్ లో సిక్కుల్లో ఓ వర్గం ఆందోళన చేస్తుండగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లింది. వీటిని అదుపుచేయడంలో పోలీసులు, ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా అధికారాల మార్పిడి జరిగినట్లు తెలుస్తోంది. -
పంజాబ్‌లో టెన్షన్.. టెన్షన్
ఫరిద్కోట్: పంజాబ్‌లోని ఫరిద్ కోట్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు వ్యక్తులు తమ దైవాన్ని దూషించారటూ, దానికి వ్యతిరేకంగా కొందరు సిక్కులు నిర్వహించిన ర్యాలీ టెన్షన్ వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. వీరిని అడ్డుకుని, శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు భారీ సంఖ్యలో పోలీసులు అక్కడి చేరుకోగా ఘర్షణలు మరింత మించిపోయాయి. పరస్పర దాడులు జరగడంతో మొత్తం 17మందికిపైగా గాయాలపాలయ్యారు. వారిలో పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు లాఠీఛార్జి జరపి, భాష్పవాయుగోళాలను, జలఫిరంగులను ప్రయోగించి చివరకు రెండు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉన్నా అక్కడి వాతావరణం మాత్రం గంభీరంగా తయారైంది. ప్రజలంతా శాంతితో సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ విజ్ఞప్తి చేశారు. -
కాలం చెల్లిన తుపాకులే ఉన్నాయి వాటితోనే...
కపూర్తలా : పంజాబ్ లోని పోలీసుల వద్ద కాలం చెల్లిన తుపాకీలే ఉన్నాయి. వాటితోనే తమ పోలీసులు తీవ్రవాదులతో పోరాడతున్నారు... గత ఎన్నో ఏళ్ల నుంచి ఇలాగే కొనసాగుతుంది. బుల్లెట్ ఫ్రూప్ దుస్తులు లేవు... యుద్ధ సమయంలో ధరించే హెల్మెట్లు లేవు... ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్. బుధవారం గురుదాస్‌పూర్‌లో పాక్ ముష్కర మూకల కాల్పులో ప్రాణాలు కోల్పోయిన ఎస్పీ బల్జీత్ సింగ్ నివాసంలో బల్జీజ్ మృతదేహాన్ని సందర్శించారు. ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రకాశ్ సింగ్ బాదల్ మాట్లాడారు. బల్జీత్ సింగ్‌ను చూసి దేశం గర్విస్తుందన్నారు. రాష్ట్రంలో కాలం చెల్లిన ఆయుధాలపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు మంగళవారం న్యూఢిల్లీలో కలసి ఫిర్యాదు చేసినట్లు ప్రకాశ్ సింగ్ తెలిపారు. సోమవారం పంజాబ్ జిల్లాలోని గురుదాస్‌పూర్ పోలీసు స్టేషన్‌పై పాక్ తీవ్రవాదులు కాల్పులు జరిపారు. దాంతో అప్రమత్తమైన పంజాబ్ పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. దాదాపు 12 గంటల పాటు సాగిన ఈ ఎన్కౌంటర్లో నలుగురు పోలీసులతోపాటు ముగ్గురు పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులో స్థానిక డిటెక్టివ్ బ్రాంచ్‌లో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న బల్జీత్ సింగ్ మరణించారు. అలాగే పోలీసుల ఎదురు కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు మరణించారు.