భాగోవాల్: తమ రాష్ట్రంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎటువంటి ప్రేమ లేదని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ అన్నారు. హర్యానాకు చెందిన కేజ్రీవాల్ తన సొంత రాష్ట్రంలో అధికారం కోసం పంజాబ్ పై కపట ప్రేమ నటిస్తున్నారని ఆరోపించారు. పంజాబ్ నుంచి నీటిని హర్యానాకు తరలించుకుపోతారని అన్నారు. ఎస్ వైఎల్ కెనాల్ వివాదంలో ఆయన హర్యానా పక్షాన నిలిచారని గుర్తు చేశారు.
'కేజ్రీవాల్ హర్యానాకు చెందిన వారు. సహజంగానే సొంత రాష్ట్రం ప్రయోజనాల కోసం ఆయన పనిచేస్తార'ని బాదల్ వ్యాఖ్యానించారు. భాగోవాల్ లో గురువారం జరిగిన సంగత్ దర్శన్ కార్యక్రమంలో బాదల్ పాల్గొన్నారు. అయితే ఎస్ వైఎల్ కెనాల్ నుంచి హర్యానాకు పంజాబ్ చుక్కనీరు కూడా ఇవ్వలేదని అంతకుముందు కేజ్రీవాల్ ఆరోపించారు.
'కేజ్రీవాల్ ది కపట ప్రేమ'
Published Thu, Jun 9 2016 7:18 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM
Advertisement
Advertisement