
‘ఓటమిని ఒప్పుకున్నా.. రేపు రాజీనామా చేస్తా’
చండీగఢ్: పంజాబ్ లో అకాలీదళ్ శిరోమణి- బీజేపీ ఓటమిని ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ అంగీకరించారు. గవర్నర్ కు రేపు(ఆదివారం) రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు.
తమ కూటమి ఓటమికి కారణాలు విశ్లేషించుకుంటామన్నారు. అన్ని అంశాలపై కోర్ కమిటీ సమావేశంలో చర్చించుకుంటామని తెలిపారు. తమ కూటమి ఓడిపోయినా ఆయన మాత్రం గెలిచారు. లాంబిలో నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాదల్ తన సమీప ప్రత్యర్థి అమరీందర్ సింగ్ పై విజయం సాధించారు.