‘డిప్యూటీ సీఎం ఎవరో ఆయన చెబుతారు’ | Issue of who will be deputy CM is up to Rahul Gandhi, says Amarinder Singh | Sakshi
Sakshi News home page

‘డిప్యూటీ సీఎం ఎవరో ఆయన చెబుతారు’

Published Sat, Mar 11 2017 1:14 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

‘డిప్యూటీ సీఎం ఎవరో ఆయన చెబుతారు’ - Sakshi

‘డిప్యూటీ సీఎం ఎవరో ఆయన చెబుతారు’

చండీగఢ్: పంజాబ్ లో తమ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్ అమరీందర్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి ఎంపిక విషయాన్ని రాహుల్ గాంధీ చూసుకుంటారని చెప్పారు. గెలిచిన ఎమ్మెల్యేలతో రేపు(ఆదివారం) మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకోనున్నారు. సీఎల్పీ నాయకుడిగా అమరీందర్ సింగ్ ఎన్నికయ్యే అవకాశముంది.

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తుందని అమరీందర్ సింగ్ చెప్పారు. నాలుగు వారాల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీయిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement