Punjab election results
-
కమెడియన్ TO సీఎం
-
కాంగ్రెస్ ఘోర పరాజయం.. సోషల్ మీడియాలో రాహుల్, సిద్ధూపై సెటైర్లు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. పంజాబ్‌లో ఉన్న ప్రభుత్వాన్ని సైతం పోగొట్టుకుంది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాల ప్రచారం కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చలేకపోయిందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. కాంగ్రెస్‌పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ అని, అన్నా, చెల్లెళ్ల బ్రాండ్ విలువ కూడా తగ్గిపోయిందని విమర్శకులంటున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రియాంకాగాంధీ యూపీ ఎన్నికల్లో ఎవరూ చేయనంత ప్రచారం చేశారు. మొత్తం 209 ర్యాలీలు, రోడ్ షోలలో ప్రసంగించారు. యూపీ మీదే ఆమె ఎక్కువగా కేంద్రీకరించినా, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్‌ల్లోనూ తిరిగారు. మహిళా సమస్యలవంటి ప్రధాన అంశాలపై ఫోకస్ చేసినా, తన సభలకు పెద్ద ఎత్తున ప్రజలను రప్పించగలిగినా, వారిని ఓటు బ్యాంకుగా మలుచుకోలేకపోయారు. ఇక రాహుల్‌గాంధీ సైతం ఐదు రాష్ట్రాల్లో పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. అయినా ఆయన మ్యాజిక్కేమీ పనిచేయలేదు. రాహుల్, ప్రియాంకాగాంధీలు పార్టీలోనూ విశ్వసనీయత కోల్పోతున్నారని, వైఫల్యానికి బాధ్యులను చేస్తూ తొందరల్లోనే సొంత పార్టీ నేతలే వారి మీద కత్తులు దూయడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. పంజాబ్‌లో దళితుడిని ముఖ్యమంత్రిని చేశామని చూపించే ప్రయత్నం చేశారు కానీ అది బెడిసికొట్టింది. ప్రియాంకా గాంధీ కష్టపడ్డారనడంలో సందేహం లేదు. క్షేత్రస్థాయిలో ఆమె బాగా పనిచేశారు. ప్రధానమైన మహిళల సమస్యలను లేవనెత్తారు. అయినా రాజకీయాల్లో మ్యాజిక్కులంటూ ఉండవు, కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్‌కు అలాంటి టైమ్ నడుస్తోంది. రాజీకీయాలు ఒక్కరాడే ఆట కాదు, ఇది టీమ్గేమని గాంధీ కుటుంబం ఇప్పటికైనా తెలుసుకోవాలని, బలమైన నేతలను ఒక్కతాటి మీదకు తీసుకురావడంలో పార్టీ విఫలమైందని ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఓటమిపాలైన ప్రతిసారీ పార్టీలో అసమ్మతిరాగాలు పెరుగుతాయి. అలా గొంతెత్తిన వారిని తగ్గించే ప్రయత్నమూ జరుగుతుంది. అదే సమస్యకు అసలు కారణం. రాష్ట్రాల్లో స్థానిక నాయకులకు ప్రోత్సాహం పెరగాలి. జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, సచిన్ పైలట్వంటి నేతలను కొత్తనాయకత్వంగా చూపించే ప్రయత్నం చేయాలి. కానీ కాంగ్రెస్ అందులో విఫలమైంది. గతంలో కాంగ్రెస్‌కు రాష్ట్రాల్లో నమ్మినబంట్ల వంటి రాజకీయ నాయకులున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు నేతలే దేశం మొత్తాన్ని సమీకరించాలనుకున్నారు. ఇక్కడే అన్నాచెల్లెళ్లు విఫలమయ్యారంటున్నారు విశ్లేషకులు. మీమ్స్ అండ్ జోక్స్.. ఐదు రాష్ట్రాల్లో ఓటమితో కాంగ్రెస్‌పై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వైరలవుతున్నాయి. రాహుల్‌గాంధీ, నవజ్యోజోత్సింగ్సిద్ధూలపై జోకులు పేలుతున్నాయి. ‘కాంగ్రెస్‌కు మరో ఆప్షన్ లేదు. గాంధీ ఫ్యామిలీని వదిలేసి.. కొత్త నాయకత్వంతో ముందుకు రావాలి. లేదంటే పార్టీపనైపోయినట్టేనని ఈ ఎన్నికల ఫలితాలు సందేశమిస్తున్నాయి’ అని ఫిల్మ్ మేకర్ మనీష్ ముంద్రా ట్వీట్ చేశారు. ఇక రాహుల్‌గాంధీ విదేశాలకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందంటూ పలువురు ట్వీట్స్ చేశారు. ‘రాహుల్ గాంధీ బ్రేక్ తీసుకోవడానికి ఇది సరైన సమయం. ఇప్పుడు అంతర్జాతీయ విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి’ అంటూ ఒకరు ట్వీట్ చేశారు. ఇక కాలమిస్ట్, రచయిత ఆనంద్ రంగనాథన్ అయితే ఏకంగా ఫ్లైట్ అనౌన్స్‌మెంట్‌ను అనుకరిస్తూ ట్విట్టర్ వేదికగా విమర్శించాడు. పంజాబ్‌లో పార్టీ ఓటమికి కారణమయ్యారంటూ మాజీ క్రికెటర్ సిద్ధూపైనా నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. పంజాబ్ ఎగ్జిట్‌పోల్స్ చూడగానే సిద్ధూకి కపిల్ శర్మ ఫోన్ కాల్ వస్తుందని, తనకూ పోటీ వస్తున్నందున అర్చనా పురాణ్ శర్మ జాగ్రత్తగా ఉండాలంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. -
ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్ ఆశ్చర్యం
-
ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్ ఆశ్చర్యం
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అకాలీదళ్ పై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందని, ఆప్ స్వీప్ చేస్తుందన్న అంచనాలు తప్పడంపై అనుమానం వ్యక్తం చేశారు. అత్యధిక సీట్లు సాధిస్తుందనుకున్న తమ పార్టీకి 25 శాతం ఓట్లు వచ్చాయని, అకాలీదళ్ కు మాత్రం 31 శాతం ఓట్లు రావడం వచ్చాయని.. ఇదేలా సాధ్యమని ప్రశ్నించారు. తమ ఓట్లు అకాలీదళ్ కు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు. ఈవీఏంల పనితీరుపై ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని అన్నారు. వీవీపీఏటీ స్లిప్పులతో ఈవీఏంలోని ఫలితాలను పోల్చి చూస్తే గణాంకాలు సరిగా ఉన్నాయో, లేదో తెలుస్తుందన్నారు. ఈవీఏంల ట్యాంపరింగ్ కు అవకాశముందని సాక్షాత్తూ సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈవీఏంల వినియోగంపై పునరాలోచన చేస్తున్నాయని చెప్పారు. గోవాలో తమ పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
‘ఓటమిని ఒప్పుకున్నా రేపు రాజీనామా చేస్తా’
-
‘ఓటమిని ఒప్పుకున్నా.. రేపు రాజీనామా చేస్తా’
చండీగఢ్: పంజాబ్ లో అకాలీదళ్ శిరోమణి- బీజేపీ ఓటమిని ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ అంగీకరించారు. గవర్నర్ కు రేపు(ఆదివారం) రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. తమ కూటమి ఓటమికి కారణాలు విశ్లేషించుకుంటామన్నారు. అన్ని అంశాలపై కోర్ కమిటీ సమావేశంలో చర్చించుకుంటామని తెలిపారు. తమ కూటమి ఓడిపోయినా ఆయన మాత్రం గెలిచారు. లాంబిలో నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాదల్ తన సమీప ప్రత్యర్థి అమరీందర్ సింగ్ పై విజయం సాధించారు. -
‘డిప్యూటీ సీఎం ఎవరో ఆయన చెబుతారు’
చండీగఢ్: పంజాబ్ లో తమ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్ అమరీందర్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి ఎంపిక విషయాన్ని రాహుల్ గాంధీ చూసుకుంటారని చెప్పారు. గెలిచిన ఎమ్మెల్యేలతో రేపు(ఆదివారం) మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకోనున్నారు. సీఎల్పీ నాయకుడిగా అమరీందర్ సింగ్ ఎన్నికయ్యే అవకాశముంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తుందని అమరీందర్ సింగ్ చెప్పారు. నాలుగు వారాల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీయిచ్చారు. -
కెప్టెన్ కు భారీ మెజార్టీ
చండీగఢ్: పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్ అమరీందర్ సింగ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒక దాంట్లో విజయం సాధించారు. పాటియాలా(పట్టణ) నియోజకవర్గంలో విజయం సొంతం చేసుకున్నారు. 51 వేలకు పైగా ఓట్ల భారీ తేడాతో సమీప ప్రత్యర్ధి ఆర్మీ మాజీ చీఫ్ జేజే సింగ్ ను ఓడించారు. లాంబి నియోజకవర్గంలో మాత్రం ఆయనకు చుక్కెదురైంది. అకాలీదళ్ అధినాయకుడు, ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ చేతిలో ఓటమి చవిచూశారు. తమ పార్టీ ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు అమరీందర్ సింగ్ సన్నాహాలు చేసుకుంటున్నారు. -
సింగ్ ఈజ్ కింగ్!
చండీగఢ్: పంజాబ్ లో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. కాంగ్రెస్ సారథి కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలో హస్తం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అకాలీదళ్-బీజేపీ కూటమి మట్టికరిచింది. ఎన్నికల ఫలితాల సరళితో కాంగ్రెస్ ఘన విజయం ఖాయమైంది. ఈ రోజు 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న అమరీందర్ సింగ్ కు కాంగ్రెస్ విజయంతో అపురూపమైన కానుక దక్కినట్టైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గినట్టుగానే కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీ సాధించింది. చావోరేవో తేల్చుకునేందుకు బరిలోకి దిగిన అమరీందర్ కు అన్ని అంశాలు కలిసివచ్చాయి. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ చేతులు కలపడం, ప్రభుత్వంపై వ్యతిరేకత భారీ స్థాయిలో వ్యక్తం కావడంతో హస్తం పార్టీకి తిరుగులేకుండా పోయింది. తమ పార్టీ విజయం సాధించకుంటే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఎన్నికలకు ముందు అమరీందర్ ప్రకటించారు. అక్కడితో ఆగకుండా ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ పోటీ చేస్తున్న లాంబిలో నియోజకవర్గంలో బరిలోకి దిగి సవాల్ విసిరారు. పాటియాలా(పట్టణ) స్థానంలో ఆర్మీ మాజీ చీఫ్ జేజే సింగ్‌పైనా పోటీకి దిగారు.