పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అకాలీదళ్ పై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందని, ఆప్ స్వీప్ చేస్తుందన్న అంచనాలు తప్పడంపై అనుమానం వ్యక్తం చేశారు. అత్యధిక సీట్లు సాధిస్తుందనుకున్న తమ పార్టీకి 25 శాతం ఓట్లు వచ్చాయని, అకాలీదళ్ కు మాత్రం 31 శాతం ఓట్లు రావడం వచ్చాయని.. ఇదేలా సాధ్యమని ప్రశ్నించారు.