బర్త్‌ డే కానుకగా సీఎం పదవి! | the birthday gift is chief minister post | Sakshi
Sakshi News home page

బర్త్‌ డే కానుకగా సీఎం పదవి!

Published Sat, Mar 11 2017 4:54 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

బర్త్‌ డే కానుకగా సీఎం పదవి! - Sakshi

బర్త్‌ డే కానుకగా సీఎం పదవి!

ఇంతకుమించిన పుట్టినరోజు కానుక ప్రపంచంలో మరొకటి ఉండకపోవచ్చు. బర్త్‌ డే సందర్భంగా కెప్టెన్ అమరిందర్‌ సింగ్‌కు పంజాబ్‌ ఓటర్లు అరుదైన తీయని కానుకను ఇచ్చారు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌ను కానుకగా చుట్టి ఆయన చేతుల్లో పెట్టారు. శనివారం నాటి ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క పంజాబ్‌లో మాత్రమే ఊరట కలిగించే విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ మెజారిటీతో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసే దిశగా కదులుతోంది.

విశేషమేమిటంటే పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీని ముందుండి నడిపించిన కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ పుట్టినరోజు కూడా శనివారమే. ఆయన ఈ రోజు 75వ వసంతంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించి.. అమరిందర్‌ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుండటంతో ఆయన పుట్టినరోజు సంబరాలు రెట్టింపయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement