Punjab election
-
బర్త్ డే కానుకగా సీఎం పదవి!
ఇంతకుమించిన పుట్టినరోజు కానుక ప్రపంచంలో మరొకటి ఉండకపోవచ్చు. బర్త్ డే సందర్భంగా కెప్టెన్ అమరిందర్ సింగ్‌కు పంజాబ్ ఓటర్లు అరుదైన తీయని కానుకను ఇచ్చారు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌ను కానుకగా చుట్టి ఆయన చేతుల్లో పెట్టారు. శనివారం నాటి ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క పంజాబ్‌లో మాత్రమే ఊరట కలిగించే విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ మెజారిటీతో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసే దిశగా కదులుతోంది. విశేషమేమిటంటే పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించిన కెప్టెన్ అమరిందర్ సింగ్ పుట్టినరోజు కూడా శనివారమే. ఆయన ఈ రోజు 75వ వసంతంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి.. అమరిందర్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుండటంతో ఆయన పుట్టినరోజు సంబరాలు రెట్టింపయ్యాయి. -
ముఖ్యమంత్రి పదవిపై క్లారిటీ!
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుపొందితే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని తాను చేపట్టబోతున్నానని వస్తున్న ఊహాగానాలకు అరవింద్ కేజ్రీవాల్ తెరదించారు. పంజాబ్ సీఎం అభ్యర్థిగా తను బరిలోకి దిగడం లేదని ఆయన స్పష్టం చేశారు. 'నేను ఢిల్లీ సీఎంగానే కొనసాగుతాను. పంజాబ్ నుంచే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తాం' అని కేజ్రీవాల్ వెల్లడించారు. పటియాలలో బుధవారం జరిగిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. కేజ్రీవాల్‌ను చూసి ఆప్‌కు ఓటు వేయాలని ఆ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మంగళవారం ఓటర్లను అభ్యర్థించిన సంగతి తెలిసిందే. దీంతో చిన్న రాష్ట్రం అయిన ఢిల్లీ పీఠాన్ని వదిలేసి.. పెద్ద రాష్ట్రమైన పంజాబ్‌ను పాలించేందుకు కేజ్రీవాల్ ఆసక్తి చూపుతున్నారని, పంజాబ్‌లో ఆప్ గెలిస్తే.. కేజ్రీవాల్ సీఎం అవుతారని ఊహాగానాలు వచ్చాయి. మరోవైపు కేజ్రీవాల్ ఢిల్లీ కేంద్రంగా పంజాబ్ రాజకీయాలను నడిపించాలని చూస్తున్నారని, ఆయన మాటలను నమ్మి మోసపోవద్దని ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, అధికార అకాలీ దళ్ ఓటర్లను కోరుతున్నాయి. -
సిద్ధూ సంచలన నిర్ణయం
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆవాజ్-ఏ-పంజాబ్ వ్యవస్థాపకుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించారు. తమది రాజకీయ పార్టీ కాదని, ఓపెన్ ఫ్రంట్ మాత్రమే అని తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పంజాబ్ ను మెరుగు పరిచేందుకు తమ ఫ్రంట్ లో చేరాలని పార్టీలను ఆయన ఆహ్వానించారు. ఆవాజ్-ఏ-పంజాబ్ తో ఆమ్ ఆద్మీ పార్టీ సంప్రదింపులు జరుపుతోందని ఊహగానాలు వస్తున్న నేపథ్యంలో సిద్ధూ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడన్న ఉద్దేశంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు సిద్ధూ వెల్లడించారు. తాము పోటీకి దిగితే అధికార అకాలీదళ్ ప్రభుత్వం లాభపడే అవకాశముందని అభిప్రాయపడ్డారు. కొత్త పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే కనీసం రెండేళ్లు పడుతుందని, మూడు నెలలు చాలా తక్కువ సమయమని పేర్కొన్నారు. పంజాబ్ ఎన్నికల్లో తనను పోటీ చేయొద్దని ఢిల్లీ సీఎం కోరారని చెప్పారు. ఆప్ అధికారంలోకి వస్తే తన భార్య నవజ్యోత్ కౌర్ కు మంత్రి పదవి ఇస్తామని ఆశ పెట్టారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని వచ్చిన ఆహ్వానాన్ని కూడా తిరస్కరించినట్టు చెప్పారు. -
ఆప్ దళిత మేనిఫెస్టో!
న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్, గోవా, గుజరాత్‌ల్లో ‘దళిత మేనిఫెస్టో’లను విడుదల చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఆప్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ మేనిఫెస్టోల్లో బీజేపీ దళిత వ్యతిరేక వైఖరిని, దళితులను అభివృద్ధిలో భాగం చేయకుండా, సామాజికంగా అణచివేసే కుట్రను కూడా బయటపెడ్తామని ఆప్ వర్గాలు తెలిపాయి. పంజాబ్ లో అత్యధిక సంఖ్యలో దళితులు ఉన్నారని, వీరి కోసం సెప్టెంబర్ లో ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేస్తామని 'ఆప్' నాయకుడొకరు వెల్లడించారు. ఇదేవిధంగా గోవా, గుజరాత్ రాష్ట్రాల్లోనూ దళితుల కోసం విధానపత్రం విడుదల చేయనున్నట్టు చెప్పారు. గుజరాత్ లోని ఉనా ప్రాంతంలో కాషాయ దళాల దాడిలో గాయపడిన యువకులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలపై దాడులు పెరిగాయని ఆయన ఆరోపించారు. -
కమలానికి దళిత సెగ!
యూపీ, పంజాబ్ ఎన్నికలపై దయాశంకర్, ఉనా ఉదంతాల ప్రభావం! న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరిగే రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి దళిత నిరసనల సెగ తగిలేలా ఉంది. పంజాబ్ ఎన్నికల్లో భాగస్వామి శిరోమణి అకాలీదళ్‌తో కలసి మరో ఐదేళ్లు అధికారంలో కొనసాగడానికి, ఉత్తరప్రదేశ్‌లో అధికార పీఠం కైవసం చేసుకోవడానికి బీజేపీ వేసుకున్న అంచనాలు తలకిందులయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ నెల 11న గుజరాత్‌లోని గిర్‌సోమనాథ్ జిల్లా ఉనాలో ఆవు చర్మం ఒలిచారంటూ బాలు సర్వయా అనే దళితుడి కుటుంబ సభ్యులపై అగ్రవర్ణాలవారు దాడి చేయడం, దీనిపై దళితులు రాష్ట్రవ్యాప్తంగా భారీస్థాయిలో నిరసనకు దిగడం తెలిసిందే. యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతిని కించపరుస్తూ బీజేపీ నేత దయాశంకర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆ రాష్ట్రమంతటా దళితులను రోడ్డెక్కేలా చేశాయి. రెండేళ్లుగా కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న కాషాయదళానికి పంజాబ్, యూపీ ఎన్నికల్లో విజయావకాశాలను ఈ రెండు పరిణామాలు గందరగోళపరచినట్లు కనిపిస్తోంది. పంజాబ్‌లో అత్యధిక శాతం(32 శాతం)గా ఉన్న దళితులు అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలను నిర్ణయిస్తారనడంలో సందేహం లేదు. 2007, 2012 నాటి ఎన్నికల్లో అకాలీ-బీజేపీ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన వీరు పై రెండు పరిణామాలతో దూరమైతే ఈ సిక్కు-హిందూ కూటమికి వరుసగా మూడో విజయం దక్కే అవకాశం ఉండదు. దళిత ఓట్లు తగ్గితే కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీల్చే ఓట్లు అకాలీ-బీజేపీ కూటమి విజయావకాశాలను దెబ్బతీస్తా యి. 2012 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పరిణామాలు, సామాజిక పొత్తుల వల్ల చర్మకారులైన చమార్లు పెద్ద సంఖ్యలో పాలక కూటమికి ఓట్లేయడంతో ప్రకాశ్ సింగ్ బాదల్ రెండోసారి సీఎం అయ్యారు. యూపీలో మాయకు కొత్త బలం.. ఉత్తరప్రదేశ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)కి దళితులే పునాది. రాష్ట్ర జనాభాలో 21 శాతంగా ఉన్న వీరు ఎన్నికల్లో ‘బెహనీ’్జ మాయావతి ముఖ్యమంత్రి కావడానికి దోహదపడుతున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వీరు మిగిలిన హిందూ సమాజంలోని అత్యధికుల మాదిరిగానే బీజేపీకి ఓట్లేసి మోదీ ప్రధాని కావడానికి సాయపడ్డారు. మాయావతిపై బీజేపీ నేతలు చేస్తున్న అసభ్య వ్యాఖ్యలతో దళితులు మరోసారి ఆమెకు ద గ్గరైతే యూపీలో 15 ఏళ్ల విరామం తర్వాత అధికారంలోకి రావాలన్న బీజేపీ వ్యూహం, ఎత్తుగడలు ఫలించవు.