పంజాబ్ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న సిక్కుల ఆందోళన నేపథ్యంలో అక్కడి పోలీసు బాస్ పై వేటుపడింది. డీజీపీ సుమేథ్ సింగ్ సైనీని ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించి ఆ స్థానంలో సురేశ్ అరోరాకు బాధ్యతలు అప్పగించారు.
చండీగఢ్: పంజాబ్ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న సిక్కుల ఆందోళన నేపథ్యంలో అక్కడి పోలీసు బాస్ పై వేటుపడింది. డీజీపీ సుమేథ్ సింగ్ సైనీని ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించి ఆ స్థానంలో సురేశ్ అరోరాకు బాధ్యతలు అప్పగించారు. ఈయన పంజాబ్ లో గత 1980 దశకంలో రాష్ట్రంలో తలెత్తిన ఉగ్రవాద సమస్యను పరిష్కరించడంలో సమర్థమైన పాత్రను పోషించారు.
కాగా, ఇప్పటి వరకు ఆ విధులు నిర్వర్తించిన సుమేథ్ సైనీని పోలీస్ హౌజ్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పంజాబ్ హోం సెక్రటరీ తెలిపారు. అరోరా 1982 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. తమ మత గురువును అవమానించారనే కారణంతో చాలా రోజులుగా ఫరీద్ కోట్ లో సిక్కుల్లో ఓ వర్గం ఆందోళన చేస్తుండగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లింది. వీటిని అదుపుచేయడంలో పోలీసులు, ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా అధికారాల మార్పిడి జరిగినట్లు తెలుస్తోంది.