చండీగఢ్: పంజాబ్ మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బద్లా తండ్రి, మాజీ ఎంపీ గుర్‌దాస్ సింగ్ బదల్(90) గురువారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను మొహాలిలోని ఆసుపత్రిలో చేర్పించగా.. అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. కరోనా విజృంభణ కారణంగా ఆయన అంత్యక్రియలకు ఎవరూ హాజరు కావద్దని అతని కుమారుడు, ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బద్లా కోరారు. కాగా మార్చి 19న అతని తల్లి హర్మందీర్ మరణించారు. ఇంతలోనే తండ్రిని కోల్పోవడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. (పంజాబ్ సింగర్ సిద్ధూపై కేసు నమోదు)
గుర్‌దాస్ సింగ్ సోదరుడు పర్కాశ్ సింగ్ గతంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారు. వీరిద్దరి ఐకమత్యాన్ని "పాశ్ తె దాస్ దీ జోడీ" అని పిలిచేవారు. ఇందులో పాశ్ అంటే పర్కాశ్, దాస్ అంటే గుర్దాస్ అని అర్థం. కాగా గురుదాస్ కుమారుడు మన్‌ప్రీత్ సింగ్ శిరోమణి అకాలీదళ్ పార్టీ(ఎస్ఏడా) నుంచి బయటకు వెళ్లి పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్‌ను స్థాపించారు. దీంతో సోదరులిద్దరి మధ్య రాజకీయ విబేధాలు తలెత్తాయి. కానీ వ్యక్తిగతంగా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. 2012లో లంబీ నియోజకవర్గం నుంచి సోదరుడిపై పోటీకి దిగిన గుర్‌దాస్ ఓటమిని చవిచూశారు. 1967 నుంచి 1969 వరకు ఎమ్మెల్సీగా పని చేయగా 1971లో ఎంపీగా ఎన్నికయ్యారు. అతని కుమారుడు మన్‌ప్రీత్ సింగ్ కాంగ్రెస్‌లో చేరగా పంజాబ్ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా స్థానం దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment