Manpreet Singh Badal
-
మాజీ మంత్రికి గుండెపోటు
బీజేపీ నేత, పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ ఆదివారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే భటిండాలోని జిందాల్ హార్ట్ హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉంది. మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌కు రెండు స్టెంట్లు అమర్చామని, ఆయన త్వరలోనే కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. ఎస్ఏడీ చీఫ్ సుఖ్బీర్ బాదల్ కూడా ఆసుపత్రికి చేరుకుని మన్‌ప్రీత్ ఆరోగ్యంపై ఆరా తీశారు. బటిండా అర్బన్ నుండి ఎమ్మెల్యే అయిన బాదల్ 2023 జనవరిలో కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. కాంగ్రెస్, ఎస్ఏడీ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన ఆయన చాలాసార్లు పార్టీ మారారు. శిరోమణి అకాలీదళ్‌తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మన్‌ప్రీత్ సింగ్ బాదల్ 2011లో పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ అనే ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత 2016లో కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిపై ఓడిపోయిన తర్వాత 2023లో బీజేపీలో చేరారు. -
కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. బీజేపీలోకి కీలక నేత
న్యూఢిల్లీ: పంజాబ్‌లో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత, పంజాబ్ మాజీ రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ బుధవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ‘అంతర్గత కుమ్ములాటలు, ఫ్యాక్షనిజంతో నిండిన కాంగ్రెస్‌లో ఉండలేను. మోదీ సర్కార్ హయాంలో దేశం ప్రపంచంలో దౌత్యపరంగా, ఆర్థికంగా ఎంతో పురోగమించింది’ అని బీజేపీలో చేరాక బాదల్ వ్యాఖ్యానించారు. తన రాజీనామా లేఖను రాహుల్ గాంధీకి పంపించారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ తమ్ముడి కుమారుడైన మన్‌ప్రీత్ బాదల్ తన పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్‌ను కాంగ్రెస్‌లో కలిపేస్తూ ఏడేళ్ల క్రితం ఆ పార్టీలో చేరారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయన పార్టీని వీడటంపై కాంగ్రెస్ స్పందించింది. ‘పార్టీపై కమ్మిన మేఘాలు(బాదల్) తొలగిపోయాయి’ అంటూ వ్యాఖ్యానించింది. అధికార దాహంతోనే ఆయన బీజేపీలో చేరారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. చదవండి: బీజేపీది రెండు నాల్కల వైఖరి: మమత -
పంజాబ్ ఆర్థిక మంత్రికి పితృవియోగం
చండీగఢ్: పంజాబ్ మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బద్లా తండ్రి, మాజీ ఎంపీ గుర్దాస్ సింగ్ బదల్(90) గురువారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను మొహాలిలోని ఆసుపత్రిలో చేర్పించగా.. అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. కరోనా విజృంభణ కారణంగా ఆయన అంత్యక్రియలకు ఎవరూ హాజరు కావద్దని అతని కుమారుడు, ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బద్లా కోరారు. కాగా మార్చి 19న అతని తల్లి హర్మందీర్ మరణించారు. ఇంతలోనే తండ్రిని కోల్పోవడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. (పంజాబ్ సింగర్ సిద్ధూపై కేసు నమోదు) గుర్దాస్ సింగ్ సోదరుడు పర్కాశ్ సింగ్ గతంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారు. వీరిద్దరి ఐకమత్యాన్ని "పాశ్ తె దాస్ దీ జోడీ" అని పిలిచేవారు. ఇందులో పాశ్ అంటే పర్కాశ్, దాస్ అంటే గుర్దాస్ అని అర్థం. కాగా గురుదాస్ కుమారుడు మన్‌ప్రీత్ సింగ్ శిరోమణి అకాలీదళ్ పార్టీ(ఎస్ఏడా) నుంచి బయటకు వెళ్లి పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్‌ను స్థాపించారు. దీంతో సోదరులిద్దరి మధ్య రాజకీయ విబేధాలు తలెత్తాయి. కానీ వ్యక్తిగతంగా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. 2012లో లంబీ నియోజకవర్గం నుంచి సోదరుడిపై పోటీకి దిగిన గుర్దాస్ ఓటమిని చవిచూశారు. 1967 నుంచి 1969 వరకు ఎమ్మెల్సీగా పని చేయగా 1971లో ఎంపీగా ఎన్నికయ్యారు. అతని కుమారుడు మన్‌ప్రీత్ సింగ్ కాంగ్రెస్‌లో చేరగా పంజాబ్ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా స్థానం దక్కించుకున్నారు. -
జయ్షా అక్రమాలపై విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనయుడు జయ్షా అక్రమాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ నోరువిప్పాలన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, ప్రధాన కార్యదర్శులు దాసోజు శ్రవణ్, వినోద్‌రెడ్డి, నిరంజన్‌లతో కలసి విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ మూడున్నరేళ్ల పాలనలో దేశం నిండా స్కాములేనని, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ పేరిట చేసిన హడావుడి వల్ల దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, వేలాది కంపెనీలు కుప్పకూలి దేశం ఆర్థికంగా దివాలా తీసిందని పేర్కొన్నారు. దీనివల్ల బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు లాభపడ్డారని, దీనికి తాజా ఉదాహరణ జయ్ షా కంపెనీ వ్యవహారమేనని అన్నారు. -
‘కెప్టెన్’ పాదాలకు నమస్కరించిన సిద్ధూ
చండీగఢ్: పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వేదికపై ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పాదాలకు నమస్కరించారు. వయసులో, రాజకీయాల్లో తన కంటే సీనియర్ అయిన అమరీందర్ కు నమస్కరించి ఆయన పట్ల గౌరవం ప్రదర్శించారు. వ్యక్తిగత లక్ష్యాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమన్న సందేశాన్ని తన చర్య ద్వారా సిద్దూ అందించారు. కార్యక్రమానికి హాజరైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా సిద్ధూను అభినందన పూర్వకంగా చేశారు. కాగా, పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అమరీందర్ సింగ్ కు ట్విటర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పంజాబ్ ను అభివృద్ధి పథంలో నడపాలని ఆకాంక్షించారు. తన కేబినెట్ లో ప్రకాశ్ సింగ్ బాదల్ మేనల్లుడి మన్ ప్రీత్ సింగ్ బాదల్ కు అమరీందర్ చోటు కల్పించారు. అకాలీదళ్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్ ప్రీత్ తర్వాత ప్రకాశ్ సింగ్ తో విబేధించి బయటకు వచ్చారు. తర్వాత పంజాబ్ పీపుల్స్ పార్టీని స్థాపించారు. ఈ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో తాజాగా ఆయనకు మంత్రి పదవి దక్కింది.